Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపాన్ని చాలా ప్రమాదకారిగా పరిగణించాలని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తహీనత, నాడీ సంబంధిత సమస్యలు, అతిసారం, గ్లోసిటిస్ (స్మూత్ టంగ్), కండరాల బలహీనత వంటి సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ బి12 లోపం ఉంటే.. మొదట్లో మైకం కమ్మినట్లుగా, మగతగా, శ్వాసతీసుకోవడం భారంగా ఉంటుందని.. ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పైన పేర్కొన్న రుగ్మతలతో పాటు బాబిన్‌స్కీ రిఫ్లెక్స్ సంభవిస్తుందని డాక్టర్లు అంటున్నారు.
బాబిన్‌స్కీ రిఫ్లెక్స్ అంటే..
అరికాళ్లపై కొట్టినప్పుడు పాదానికి ఉన్న అన్నివేళ్లు కిందికి వంగుతుంటే బొటనవేలు మాత్రం పైకి లేస్తుంది. రెండేళ్లలోపు పిల్లల్లో ఈ రిఫ్లెక్షన్ సాధారణమే అయినప్పటికీ.. పెద్దవారిలో ఈ రిఫ్లెక్షన్ కనిపిస్తే అది కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతకు సంకేతమని నేషనల్ లైబ్రెరీ ఆఫ్ మెడిసిన్ నిపుణులు అంటున్నారు.
విటమిన్ బి12 లోపం ఉందా..? ఇలా చేయండి
అరికాళ్లపై తట్టి చూసుకోవడం ద్వారా విటమిన్ బి12 స్థాయిలు పడిపోయిన విషయాన్ని అంచనా వేయవచ్చు. అరికాళ్లపై కొట్టినప్పుడు పాదానికి ఉన్న అన్నివేళ్లు కిందికి వంగిపోతూ, బొటనవేలు మాత్రం పైకి లేస్తుంటే అది బి12 లోపానికి సంకేతంగా పరిగణించవచ్చు. అయితే సమగ్ర రక్త పరీక్షల ద్వారా మాత్రమే ఈ లోపాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. విటమిన్ బి12 స్థాయిలు 150ng/l కంటే తక్కువగా ఉంటే దాన్ని లోపంగా చెప్పవచ్చు.
చదవండి: Jhilam Chattaraj: నాన్న మరణిస్తే కూతురి.. తల వెంట్రుకలు కూడా ఏడుస్తాయి!
Comments
Please login to add a commentAdd a comment