Tissue
-
సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ అత్యంత కీలకం!
శరీర పనితీరుకు అవసరమైన కీలక మూలకం బీ12. అలాంటి బీ12తో జన్యు ఉత్ఫరివర్తనాలను రక్షించే డీఎన్ఏని సంశ్లేషించగలదని, దీంతో ఎన్నో రకాలా దీర్ఘకాలిక వ్యాధులతో సులభంగా పోరాడగలుగుతామని పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడించారు. అలాగే కణజాల పునరుత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. ఈ బీ12 ఉపయోగాలు, ఎంతెంత మోతాదులో మానవులకు అవసరమో తదితర విశేషాల గురించే ఈ కథనం!. ఐఆర్బీ బార్సిలోనా పరిశోధకులు సెల్యులర్ రీ ప్రోగ్రామింగ్‌కి బీ12 ఎలా అవసరమో తమ అధ్యయనంలో వెల్లడించారు. అందుకోసం పెద్దప్రేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఆ ఎలుకలకు విటమిన్ బీ12 సప్లిమెంట్స్ ఇవ్వగా.. అది ఎలుకల కడుపులోని పొరను సరిచేసేలా పేగు కణాలు సెల్యులార్ని రీప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు గుర్తించారు. అసలు ఈ సెల్యులర్ రీప్రోగామింగ్కి ఎలా విటమిన్ సరిపొతుందనే దిశగా మరింత లోతుగా అధ్యయనం చేయగా..బీ12 మిథైలేషన్ జీవక్రియను సులభతం చేయగలదని తెలుసుకున్నారు. నిజానికి కణజాల మరమత్తుకి మెదడు పనిచేసే కణాల డీఎన్ఏకి అధిక మొత్తంలో మిథైలేషన్ అవసరం. ఆ లోటును బీ12 భర్తి చేస్తుందని కనుగొన్నారు. అందువల్ల ఈ విటమిన్‌ని ఏదోరూపంలో శరీరానికి అందిస్తే దెబ్బతిన్న కణాజాల త్వరితగతిన రీప్రోగ్రామింగ్ చేయబడుతుందన్నారు. చెప్పాలంటే ముందుగా ఇది జన్యు పనితీరును మెరుగుపరిచడంతో చాలా సులభంగా కణజాలం రీప్రోగ్రామింగ్ చేయబడుతుందని తమ పరిశోధనల్లో వెల్లడించారు. ఇది చేతుల వాపులను కూడా తగ్గిస్తుందన్నారు. ఈ విటమిన్ దీర్ఘకాలిక వ్యాధులు, వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు. వయసు పైబడిన ఎలుకలకు అధిక విటమిన్ B12 ఇవ్వగా వాటి రక్తప్రవాహంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ IL-6, సీఆర్పీ స్థాయిలపై విలోమ ప్రభావాన్ని చూపుతునట్లు కనుగొన్నారు. అందువల్ల ఇది వయసు రీత్యా వచ్చే వ్యాధులను ఎదుర్కొవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. దీన్ని ఆహారం నుంచి మాత్రమే తీసుకోగలం. పరిమిత మోతాదులో తీసుకోవడమే మంచిదన్నారు. వయసు రీత్యా పురుషులు, స్త్రీలు ఎంతెంత మోతాదుల్లో తీసుకోవాలి, అలాగే గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా వివరించారు. నిజానికి ఈ బీ12 విటమిన్ చేపలు, కాలేయం, ఎర్ర మాంసం, గుడ్లు, పాలు, చీజ్ వంటి ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఇవేగాక ఈస్ట్ ఉత్పత్తులైన పట్టగొడుగులు, కొన్ని రకాల మొక్కలు, తృణధాన్యాల్లో కూడా ఉంటుందని అన్నారు. బలహీనమైన కండరాలు, వికారం, అలసట, అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరిగిపోవడం, ఎర్రరక్త కణాలు తక్కువగా ఉండటం తదితర సమస్యలను సులభంగా చెక్కుపెడుతుంది ఈ విటమిన్ బీ12. తద్వారా అనే రకాల దీర్ఘకాలిక రుగ్మతలు బారిన పడకుండా సురక్షితం ఉండగలుగుతామని నేచర్ మెటబాలిజం జర్నల్ వెల్లడించారు పరిశోధకులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
మనకు ఏదైనా గాయం కాగానే... శరీరం తనను తాను రిపేరు చేసుకునే తీరు అద్భుతం. ప్రతివారి జీవితంలో ఏదో ఓ సందర్భంలో గాయం కాగానే... (అది మరీ పెద్దది కాకపోతే) కొద్దిరోజుల్లోనే దాని ఆనవాలు కూడా తెలియకుండా పోతుంది. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోవడం... అవే కండరాలు మళ్లీ పునరుజ్జీవం పొందకపోవడం వల్లనే చాలామందిలో మరణం సంభవిస్తుంది. కానీ చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్‌లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదెలా జరుగుతుందో తెలుసుకుంటే... స్వాభావికంగా జరిగే ఇదే ప్రక్రియను... వైద్య చికిత్సగా ఇవ్వడం ద్వారా గుండెను రిపేరు చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. తమ పరిశోధనల ద్వారా అదెలా జరుగుతుందో... రిపేరుకు కారణమయ్యే ప్రోటీన్ ఏమిటో తెలుసుకున్నారు. దాని గురించి తెలిపేదే ఈ కథనం. మన దేహంలో ఏదైనా భాగం గాయపడగానే... వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ‘లింఫాటిక్ సిస్టమ్’ అనే వ్యవస్థ ఇందుకు తోడ్పడుతుంది. ఇది మన వ్యాధినిరోధక వ్యవస్థలో ఒక కీలక అంశం. దేహంలో అన్నిచోట్ల కండరాలకు రిపేరు జరిగినట్లే... దెబ్బతిన్న గుండె కండరాన్నీ రిపేరు చేయడానికి పూనుకుంటుందీ వ్యవస్థ. రిపేరు ప్రక్రియలో ఏం జరుగుతుంది...? ఎలా జరుగుతుంది? ఏదైనా భాగంలో దెబ్బతగలగానే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ‘మ్యాక్రోఫేజెస్’ అనే కణాలు ఎక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. నిజానికి అవి మన వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా... అవి తెల్లరక్తకణాలపై ఉండే అనుబంధ కణాలే. ‘మ్యాక్రో’ అంటే పెద్దవి... ‘ఫేజెస్’ అంటే హరించేవి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అవి హానికరమైన కణాలనూ/అంశాలనూ, బ్యాక్టీరియాను, అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తినేయడం/హరించడం చేస్తాయి. అలాగే మన రోజువారీ జీవక్రియల్లో భాగంగా మనలో ప్రతిరోజూ 200 నుంచి 1000 వరకు క్యాన్సర్ కణాలూ వెలువడుతుంటాయి. వాటిని కూడా ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించేస్తాయి. (మన వ్యాధినిరోధక శక్తి తగినంత లేని సందర్భాలోనూ, లేదా అక్కడ పుట్టిన మొత్తం క్యాన్సర్ కణాలను ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించలేని సందర్భాల్లోనే క్యాన్సర్ వస్తుందన్నమాట). హానిచేసే కణాలను మాత్రమేగాకుండా... ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) కలిగించే కారకాలనూ, దెబ్బతిన్న తర్వాత శిథిలమైపోయి పోగుబడ్డ కణాల గుట్టలనూ ఇవి నిర్మూలిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే వాటినీ తొలగిస్తాయి. అంతేకాదు... బయటి పదార్థాలనూ (ఫారిన్బాడీస్నూ) ఎదుర్కొంటాయి. ఇలా ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే... ఇవి పెద్దసంఖ్యలో పుట్టి... ఇలా క్లీన్ చేసే ప్రక్రియను ‘ఫ్యాగోసైటోసిస్’ అని అంటారు. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి? ఇంతటి కీలకమైన భూమిక నిర్వహించే ఈ ‘మ్యాక్రోఫేజెస్’ ఎలా ఈ పని చేస్తాయన్నది శాస్త్రవేత్తలు ఇటీవలి తమ అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ‘నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయీ’కి చెందిన ప్రముఖ పాథాలజిస్ట్ ఎడ్వర్డ్ థోర్ప్ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించారు. ‘‘గుండెపోటు రాగానే ఇమ్యూన్ సెల్స్... సరిగ్గా చెప్పాలంటే ‘మ్యాక్రోఫేజెస్’ గుండెకండరం దెబ్బతిన్న చోటికి వెంటనే చేరుకుంటాయి. అక్కడ దెబ్బతిన్న కండరాలనూ, చచ్చుబడ్డ కణజాలాన్నీ (డెడ్ టిష్యూను) తినేయడం ప్రారంభిస్తాయి. ఇందుకోసం ఈ మ్యాక్రోఫేజెస్ ‘వీఈజీఎఫ్–సీ’ అనే ప్రోటీన్‌ను తయారు చేసి వెలువరిస్తాయి. ‘వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్–సి’ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘వీఈజీఎఫ్–సీ’. ‘డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్’ నవలోలాగా... ఈ మ్యాక్రోఫేజెస్ ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. మంచి మ్యాక్రోఫేజెస్... ‘వీఈజీఎఫ్–సి’ని ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ అదే సమయంలో కొన్ని చెడు మ్యాక్రోఫేజెస్ ఇన్ఫ్లమేటరీ (మంట, వాపు) కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి... అప్పటికే దెబ్బతిన్న గుండె కండరానికీ, ఆ పొరుగున ఉన్న కణజాలాలకు మరింత హాని చేసే అవకాశం ఉంది. ఇలా జరిగే సమయంలో అక్కడ దెబ్బతిని, నశించుకుపోయాక లేదా చచ్చుబడిపోయాక పోగుబడ్డ మృతకణజాలం అంతా తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఆ మృతకణజాలమంతా పూర్తిగా తొలగిపోయి, పరిశుభ్రమైపోయే ప్రక్రియను ‘ఎఫరోసైటోసిస్’ అంటారు. ఈ ప్రక్రియలోనే ‘మ్యాక్రోఫేజెస్’ కీలక భూమిక పోషిస్తాయి. ఈ ప్రక్రియ ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్‌తో ఎలా జరుగుతుందనే అంశాన్ని ల్యాబ్‌లో ఎలుకల సహాయంతో మేము కనుగొన్నాం’’ అంటున్నారు ఎడ్వర్డ్ థోర్ప్. ఈ అంశాల ఆధారంగా గుండెకు మేలు జరిగేదెలాగంటే...? ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా... ఈ మ్యాక్రోఫేజెస్నూ, ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్నూ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. వాటి సహాయంతో హార్ట్ ఎటాక్‌లో దెబ్బతిన్న గుండె కండరాల రిపేరు వేగంగా జరిగేలా చేయాలన్నది ఇప్పుడు పరిశోధకుల ముందున్న లక్ష్యం. అంతేకాదు... గుండెపోటు వచ్చినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల (బయొలాజికల్) తీనుతెన్నులేమిటో తెలుసుకుని, దానికి విరుగుడుగా ‘ఎఫరోసైటోసిస్’ ద్వారా గుండెకండరాన్ని వేగంగా కోలుకునేలా చేయాలని కూడా పరిశోధకులు సంకల్పిస్తున్నారు. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుంది? -
ఆకు మొక్కలు!
నాణ్యమైన పూలు, పండ్ల మొక్కల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నర్సరీలపై ఆధారపడే పరిస్థితికి స్వస్తి చెప్పే రోజులు వస్తున్నాయా? అంటు కట్టకుండానే, టిష్యూ కల్చర్‌తో పని లేకుండానే రైతులే, 9–10 వారాల్లో అత్యంత సులువుగా జన్యుస్వచ్ఛతతో కూడిన నాణ్యమైన మొక్కల్ని తయారు చేసుకోవచ్చా?? రాజరత్నం అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ‘‘అవును’ అనే సమాధానం వస్తుంది. ఇంతకీ ఆ ఆవిష్కరణ ఏమిటంటారా.. ‘ఆకును నాటి మొక్కను తయారు చేసుకోవడం (లీఫ్ కల్చర్)’! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. రాజరత్నం ఎవరో.. ‘ఆకు మొక్కల’ కథా కమామిషు ఏమిటో చదవండి మరి.. రాజరత్నం స్వస్థలం తమిళనాడు కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయం. వ్యవసాయ కుటుంబంలో పుట్టి అప్లయిడ్ సైన్సెస్‌లో డిగ్రీ చదివిన రాజరత్నం మక్కువతో 6 ఎకరాల భూమిలో నర్సరీని ఏర్పాటు చేశారు. 1989 నుంచి ఈడెన్ నర్సరీ గార్డెన్స్‌ను నిర్వహిస్తున్నారు. షూట్ టిప్ కల్చర్‌లో నైపుణ్యం సాధించారు. ఏటా 10 లక్షల మొక్కల్ని విక్రయిస్తూ రూ. కోటిన్నర టర్నోవర్ సాధించారు. ఈ పూర్వరంగంలో సులభమైన రీతిలో మొక్కల ఉత్పత్తి పద్ధతులు అన్వేషిస్తూ ఈ నర్సరీ రైతు వినూత్నమైన ‘లీఫ్ కల్చర్’ పద్ధతిని ఆవిష్కరించారు. పచ్చి ఆకును నాటి, వేర్లు మొలిపించడం ద్వారా అత్యంత నాణ్యమైన మొక్కను తయారు చేయడం(లీఫ్ కల్చర్) అనే అద్భుత ఆవిష్కరణతో ఆయన నర్సరీ రంగంలో సంచలనం రేపుతున్నారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక చిన్నికృష్ణన్ ఇన్నోవేషన్ అవార్డు పొందారు.లీఫ్ కల్చర్‌పై పేటెంట్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. నర్సరీ కార్యకలాపాల్లో నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్న దృష్టితో 2010లో తమిళనాడు వ్యవసాయ వర్సిటీలో 4 వారాల టిష్యూ కల్చర్ కోర్సు చేశారు. టిష్యూకల్చర్ పద్ధతిలో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయడానికి రూ. లక్షల ఖరీదైన ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, అతి తక్కువ ఖర్చుతో మొక్కలను ఉత్పత్తి చేసే మార్గమే లేదా? విత్తనాలతో, షూట్ టిప్ కటింగ్స్‌తో, ఇతరత్రా కణజాలాలతో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయగలుగుతున్నప్పుడు.. పచ్చి ఆకును నాటి ఎందుకు మొక్కను ఉత్పత్తి చేయకూడదు? అన్న మెరుపు వంటి ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ప్రయోగాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఎదురైన వైఫల్యాలను అధిగమిస్తూ ఎట్టకేలకు 2013 నాటికి పచ్చి ఆకులు నాటి కొద్ది వారాల్లోనే చక్కని మొక్కలను ఉత్పత్తి చేయగలిగాడు. దేశంలోనే తొలి సేంద్రియ నర్సరీ రాజరత్నం నర్సరీలో ప్రధానంగా షూట్ టిప్ కటింగ్స్ ద్వారా గుండు మల్లి, బొడ్డు మల్లె, సన్నజాజి, కనకాంబరం, ఐక్సోరా వంటి పూల జాతులతోపాటు నిమ్మ, జామ, దానిమ్మ, నేరేడు, నోని, బొప్పాయి తదితర పండ్ల జాతుల మొక్కలు, తమలపాకు మొక్కలను ఏటా లక్షల సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంటారు. మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ, దేశంలోనే తొలి సేంద్రియ నర్సరీగా రాజరత్నం నర్సరీ గుర్తింపు పొందింది కూడా. నర్సరీ మొక్కల పెంపకానికి ఎటువంటి సేంద్రియ ఎరువులు కూడా వాడటంలేదు, రిజర్వాయర్ ఒండ్రు మట్టినే వాడుతున్నారు. గుండు మల్లితో లీఫ్ కల్చర్ ప్రారంభం తమిళనాడులో రైతులు ఎక్కువగా సాగు చేసే ‘గుండు మల్లి’ రకంతో ‘లీఫ్ కల్చర్’ను రాజరత్నం విజయవంతంగా ప్రారంభించారు. ప్రస్తుతం గుండుమల్లితోపాటు నూరు వరహాల(ఐక్సోరా) రకం పూల జాతి మొక్కలను ఆకుల ద్వారా ఉత్పత్తి చేసి ఆయన విక్రయిస్తున్నాడు. గుండుమల్లి, నూరువరహాల పూల మొక్కల విషయంలో అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. ఆకుతో ఉత్పత్తి చేసిన గుండుమల్లి మొక్కల ద్వారా దిగుబడి 20% పెరిగింది. అధిక నీటిని తట్టుకునే శక్తి పెరిగింది. ఒక గుత్తిలో పూల సంఖ్య దాదాపుగా రెట్టింపైంది. కొమ్మల కత్తిరింపు అవసరం ఏడాదికి 3 నుంచి ఒకసారికి తగ్గిందన్నారు. పూర్తి ఫలితాలకు 3–5 ఏళ్ల సమయం నేరేడు, జామ, నోని, తమలపాకు, మిరియాలు పనస తదితర పది పంట జాతుల ఆకుల నుంచి తయారు చేసిన మొక్కలను రైతులకిచ్చి ప్రయోగాత్మకంగా సాగుచేయిస్తున్నామన్నారు. ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో రావటానికి మరో 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుందని రాజరత్నం వివరించారు. దీర్ఘకాలిక పంటలు కావడంతో పండ్ల మొక్కల విషయంలో అనేక కోణాల్లో ఫలితాలను నిర్థారించుకున్న తర్వాతే రైతులకు అందించాల్సి ఉంటుందన్నారు. ‘లీఫ్ కల్చర్’పై ఏ విశ్వవిద్యాలయమూ ఇంతవరకూ పరిశోధనలు ప్రారంభించలేదన్నారు. ఏ విశ్వవిద్యాలయమైనా ఆసక్తి చూపితే సంతోషంగా కలిసి పనిచేస్తానని రాజరత్నం ఫోన్ ఇంటర్వ్యూలో ‘సాగుబడి’తో చెప్పారు. ఆకుకు వేర్లు మొలిపించేది ఇలా.. 1. తొలుత ఎంపిక చేసుకున్న ఆకులు నాటడానికి మట్టి మిశ్రమం నింపిన చిన్న పాలిథిన్ గ్రోబ్యాగ్‌లు సిద్ధం చేసుకోవాలి. వీటిని తొలి రోజుల్లో పెట్టడానికి షేడ్ నెట్ హౌస్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 2. షేడ్ నెట్ హౌస్ లోపల అవసరం మేరకు టన్నెల్ మిస్ట్ ఛాంబర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఛాంబర్‌ను 8 ఎం.ఎం. ఇనుప ఫ్రేమ్‌తో రూపొందించుకోవాలి. ఇది 2.5 అడుగుల ఎత్తు ఉండాలి. అవసరాన్ని బట్టి కావల్సినంత పొడవు పెట్టుకోవాలి. ఒక టన్నెల్ మిస్ట్ ఛాంబర్లో రాజరత్నం 3 వేల పాలిథిన్ గ్రోబ్యాగ్‌లు ఏర్పాటు చేసుకొని, వాటిలో ఆకులు పెడుతున్నారు. 3. తొలుత, మీకు అవసరమైన చెట్టు/మొక్క నుంచి పచ్చి ఆకును తొడిమతో పాటు తుంచాలి. 4. ఆ ఆకును లేత కొబ్బరి నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. కొబ్బరి నీటిలో సీజన్‌ను బట్టి, ప్రాంతాన్ని బట్టి పోషకాల హెచ్చు తగ్గులుంటాయి. దీన్ని బట్టి లీఫ్ కల్చర్‌లో ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 5. కాబట్టి, కొత్తగా ఆకుతో మొక్కను ఉత్పత్తి చేసుకునే రైతులు ఖచ్చితమైన ఫలితాలను పొందేందుకు ఐ.బి.ఎ.(ఇండోల్ బటైరిక్ యాసిడ్) అనే రూటింగ్ హార్మోన్‌ను ఉపయోగించడం ఉత్తమం. 6. పాలిథిన్ బ్యాగ్‌లలోని మట్టిలోకి తొడిమె పూర్తిగా వెళ్లేలా ఆకును పెట్టాలి. ఆకుకు వేర్లు పుట్టడానికి మట్టిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. తర్వాత టన్నెల్ మిస్ట్ ఛాంబర్లోకి అసలు గాలి చొరబడకుండా పాలిథిన్ షీట్‌ను బిగించి, అన్నివైపులా మట్టికప్పాలి. 7.పాలిథిన్ గ్రోబ్యాగ్లోని మట్టిలో తేమ చాలినంత ఉందో లేదో ప్రతి 5 రోజులకోసారి సరిచూసుకోవాలి. అవసరం మేరకు ఈ గ్రోబాగ్లపై నీటిని తగుమాత్రంగా పిచికారీ చేయాలి. 8. 4–5 వారాల్లో ఆకుకు వేర్లు మొలుస్తాయి. మరో 4–5 వారాల్లో ఆకు పక్కనే మొక్క పెరుగుతుంది. మూడు, నాలుగు ఆకులు వస్తాయి. ఆ దశలో టన్నెల్ మిస్ట్ ఛాంబర్‌పైన పాలిథిన్ షీట్‌ను తొలగించాలి. మొక్కలను షేడ్‌నెట్ హౌస్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత.. ఆరుబయట ఎండలోకి మార్చాలి. 9. ఆరుబయట మొక్కలు బాగా ఎదిగిన తర్వాత పొలంలో నాటుకోవచ్చు. 10. నాటిన ఆకు ఎండిపోకుండా ఉండటానికి, చక్కగా వేరు పోసుకోవడానికి 30 డిగ్రీల ఉష్ణోగ్రత (2 డిగ్రీలు అటూ ఇటుగా), గాలిలో తేమ 70% ఉంటే అనువుగా ఉంటుందని రాజరత్నం అంటున్నారు. లీఫ్ కల్చర్‌పై రైతులకు ఉచిత శిక్షణ! ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేయడం చాలా సులువు. రైతులెవరైనా సులువుగా నేర్చుకోగలరు. స్కూలు పిల్లలు కూడా ఇది నేర్చుకోగలుగుతారు. యంత్రాలు, ప్రయోగశాలలు అవసరం లేదు. విద్యుత్తు అవసరం లేదు. పెద్దగా పెట్టుబడి ఏమీ అవసరం లేదు. రూ. 20 వేల నుంచి 30 వేలు చాలు. షేడ్‌నెట్ హౌస్, మిస్ట్ ఛాంబర్ ఉంటే చాలు. రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు అనుదినం మా నర్సరీని సందర్శిస్తూనే ఉంటారు. ఇప్పటికే సుమారు వంద మందికి ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేసే పద్ధతిపై శిక్షణ ఇచ్చాను. రూపాయి కూడా ఫీజు చెల్లించనక్కరలేదు. రైతులంతా ఈ పద్ధతి నేర్చుకోవాలని, మొక్కల్ని కొనకుండా తామే ఉత్పత్తి చేసుకునేలా తోడ్పడాలనేదే నా అభిమతం. శిక్షణ పొందాలనుకునే వారు ఎవరైనా మా ఊరు బయలుదేరే ముందు సమాచారం కోసం నాకు ఒకసారి ఫోన్ చేస్తే చాలు. రైతులు ఎక్కువగా సాగు చేసే పూలు, పండ్ల జాతులతోపాటు అంతరించిపోతున్న చెట్ల జాతులు, ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్నాను. నర్సరీపై వచ్చే 25% ఆదాయంలో లీఫ్ కల్చర్‌పై పరిశోధనలకు వెచ్చిస్తున్నాను. – ఎస్. రాజరత్నం, (94860 94670) నర్సరీ రైతు, కురుప్పాయమ్మల్ తొట్టం, వెల్లియపాళయం రోడ్డు, మెట్టుపాళయం, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు www.edennurserygardens.com ఆకులు నాటితే 10 వారాల్లో సిద్ధమైన మొక్కలు -
క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!
శరీరంలోని ఏ కణంగానైనా, అవయవంగానైనా మారిపోగల సామర్థ్యం మూలకణాల సొంతం. అయితే ఒకరి మూలకణాలు ఇంకొకరికి సరిపోవు. అందరికీ సరిపోయేలా మూలకణాలను తీర్చిదిద్దగలిగితే.. ఎన్నో వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించడం వీలవుతుంది. ఈ అద్భుతాన్ని సాధించారు కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ సార్వత్రిక మూలకణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి పనిచేయడం ఇంకో విశేషం. పెద్దల్లోని మూలకణాలను పిండ మూల కణాల లక్షణాలు కనపరిచేలా చేయగలరని దశాబ్దం క్రితం ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి వాటిని సమర్థంగా వాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే నాణ్యత.. పునరుత్పత్తి విషయంలో కొన్ని సమస్యలు రావడంతో విస్తృత వినియోగంలోకి రాలేకపోయాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ను ఉపయోగించి ఏ మూలకణాన్నైనా పిండ మూల కణాల లక్షణాలు కనిపించేలా మార్చగలిగారు. ఇందుకోసం రెండు జన్యువులను పనిచేయకుండా చేశామని, సీడీ47 అనే జన్యువు ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్లను ఉత్పత్తి చేయించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డ్యూస్ తెలిపారు. జంతువులపై జరిగిన పరిశోధనలు సంతప్తికరంగా ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా.. ఈ కొత్త సార్వత్రిక మూలకణాలతో తాము గుండె కండర కణాలను తయారు చేశామని.. ఎలుకల్లోకి వీటిని జొప్పించి పరిశీలించామని వివరించారు. -
బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనేందుకు కొత్త అస్త్రం
అంచనాలు తల్లకిందులవడం సైన్స్‌లో కొత్తేమీ కాదు. ఒకప్పుడు పనికిరావు, విసర్జితాలు అనుకున్న చెడు యాంటీబాడీల విషయంలో ఇప్పుడు అదే రుజువైంది. బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఈ చెడు యాంటీబాడీలే మెరుగైన అస్త్రాలుగా మారతాయని గార్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా రుజువు చేశారు. శరీరంలోని కణజాలం పైనే దాడి చేయడం మొదలుపెడుతున్న కారణంగా మన శరీరంలోని కొన్ని యాంటీబాడీలు చెడు చేసేవని.. కొంతకాలం తరువాత ఇవి వాటంతట అవే నిర్వీర్యమైపోతాయని ఇంతకాలంగా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితి కొంతకాలమే అని ప్రొఫెసర్ డేనియల్ క్రైస్ట్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ చెడు యాంటీబాడీలు కొంతకాలం తరువాత.. శరీరానికి సూక్ష్మజీవుల ద్వారా ముప్పు ఉందని స్పష్టమైనప్పుడు ఇవే వాటిపై పోరాడేందుకు సిద్ధమైపోతాయి అని తాము గుర్తించామని క్రైస్ట్ చెప్పారు. రోగ నిరోధక వ్యవస్థ కళ్లు కప్పే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఇవి మరింత మెరుగ్గా పనిచేస్తాయని తాజా అంచనాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ మొదలుకొని అనేక ఇతర వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని క్రైస్ట్ తెలిపారు. -
ఇంటిప్స్
స్టవ్ మీద పడిన మరకలు ఓ పట్టాన పోవు. అలాంటప్పుడు టొమాటోను మధ్యకు కోసి, ఓ ముక్కను ఉప్పులో ముంచి స్టవ్ తుడవండి. మరకలు పోయి తళతళలాడుతుంది!సోఫా మీద నూనె మరకలు పడితే... నిమ్మరసం చల్లి, ఓ నిమిషం నాననిచ్చి, దూదితో తుడవాలి. మరకలు పోతాయి. ఒకవేళ నిమ్మరసంలోని తేమ ఇంకా అలాగే ఉంటే... ఓ టిష్యూ పేపర్ని వేసి కాసేపు ఉంచితే తడిని పీల్చేసుకుంటుంది. పచ్చికొబ్బరిని త్వరగా బయటకు తీయడానికి ఆ చిప్పను పావుగంట సేపు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే కొబ్బరి ముక్కలు సులువుగా వస్తాయి. కూరగాయలు తరిగే చాకులు, కటింగ్బోర్డు వంటివి దుర్వాసన వాసన వేస్తుంటే ... ఒకసారి కాఫీపొడితో రుద్ది కడగండి. దుర్వాసన వదిలిపోతుంది! కిటికీల అద్దాల మీద పడిన మరకలు ఎంతకీ వదలకపోతే... బియ్యపుగంజిని కాస్త వేడి చేసి, అందులో ముంచిన గుడ్డతో తుడవాలి. ఒక నిమిషం ఆగి మంచినీటిలో ముంచిన గుడ్డతో మళ్లీ తుడవాలి. ఇలా చేస్తే మరకలు పోయి అద్దాలు శుభ్రంగా ఉంటాయి! బాత్రూములో క్రిములు చేరి విసిగిస్తుంటే... ఓ కప్పు నీటిలో చెంచాడు వేపనూనె కలిపి బాత్రూములో చల్లితే సరి... క్రిములు పారిపోతాయి.