Clothing stores
-
వ్యాపారంపై ‘సెకండ్’ దెబ్బ
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నుంచి మెల్లగా కోలుకుంటున్న రిటైల్ వాణిజ్య రంగంపై సెకండ్ వేవ్ గట్టి దెబ్బకొట్టింది. గత వారం రోజులుగా షాపులకు వచ్చే వారి సంఖ్య 50 శాతం వరకు పడిపోయిందని రిటైలర్లు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ షోరూంలకు రోజుకు సగటున 50 నుంచి 60 మంది వరకు వినియోగదారులు వచ్చే వారని.. ఇప్పుడు ఆ సంఖ్య 30 దాటడం లేదని విజయ్ సేల్స్ (పాత టీఎంసీ) ప్రతినిధి చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. వేసవిలో ఎలక్ట్రానిక్స్ షాపులు కళకళలాడుతుంటాయని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని సోనోవిజన్ అధినేత భాస్కరమూర్తి పేర్కొన్నారు. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల కోసం కొద్ది మంది వినియోగదారులు వస్తున్నారని.. టీవీలు, వాషింగ్ మిషన్లు తదితర గృహోపకరణ వస్తువుల అమ్మకాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని చెప్పారు. గతేడాది లాక్డౌన్ వల్ల వేసవి అమ్మకాలు తుడిచిపెట్టుకుపోయాయని వివరించారు. ఇప్పుడు ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగలు వచ్చినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. మార్చి చివరి వారంతో పోలిస్తే వ్యాపారం విలువ 30 శాతం పడిపోయిందని తెలిపారు. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వీరు చెబుతున్నారు. షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుండటంతో.. రిటైల్ సంస్థలు ఆన్లైన్ అమ్మకాలపై దృష్టి సారిస్తున్నాయి. దుస్తుల దుకాణాలు వెలవెల.. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మహిళలు షాపింగ్‌కు రావడం తగ్గించారని.. దీంతో దుస్తుల దుకాణాలు వెలవెలబోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 10 వరకు బాగానే ఉన్న వ్యాపారం.. ఆ తర్వాత 40 శాతం పడిపోయిందని కళానికేతన్ ఎండీ నాగభూషణం తెలిపారు. సెకండ్ వేవ్ వల్ల షాపింగ్‌కు రావడానికే వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారని.. నష్టమైనా కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, జనవరి నుంచి బంగారం ధరలు దిగొస్తుండటంతో కొంతకాలంగా ఆభరణాల షాపులు కళకళలాడుతున్నాయి. రూ.52,000 దాటిన పది గ్రాముల బంగారం ధర.. పది వేల రూపాయల వరకు దిగి రావడంతో ప్రజలు కొనుగోళ్లకు ముందుకు వచ్చారని ఎంబీఎస్ జువెల్లరీ పార్టనర్ ప్రశాంత్ జైన్ తెలిపారు. గత వారం రోజులుగా కస్టమర్ల సంఖ్య తగ్గిందని వివరించారు. కేసుల ఉధృతి తగ్గే వరకు తమకు కష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. -
జీఎస్టీ ఎఫెక్ట్
కొనుగోళ్లతో కిటకిటలాడిన నగల షాపులు రెడీమేడ్ దుస్తుల దుకాణాలు వెలవెలఆఫర్లు ప్రకటించినా కొనుగోళ్లు నిల్ అనూహ్యంగా పెరిగిన రిజిస్ట్రేషన్లు మందులపై 3 శాతం ఎక్కువే.. వ్యాపారులు రేట్లు పెంచేందుకు థియేటర్లు వెనుకడుగు జీఎస్టీపై భిన్నాభిప్రాయాలు.. జీఎస్టీకి వ్యతిరేకంగా వివిధ సంఘాల ఆందోళన ఏసీ రైల్వే ఛార్జీలపై 5 శాతం జూన్ 30 వరకు తీసుకున్న టిక్కెట్లకు మినహాయింపు నేటి నుంచి అమలుకానున్న ‘వస్తు,సేవల పన్ను’ అంశం గ్రేటర్లో హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణ పౌరులు, చిరు వ్యాపారులు, ట్రేడర్స్, డీలర్లు పన్ను స్వరూపంపై పలు అనుమానాలు వెలిబుచ్చారు. కాగా పన్ను భారం పెరుగుతుందనుకున్న ఎలక్ట్రానిక్, బంగారు ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ధరలు తగ్గుతాయంటున్న నిత్యావసరాలు, నాన్ బ్రాండెడ్ దుస్తుల దుకాణాలు వెలవెలబోయాయి. డిస్కౌంట్లు ప్రకటించినా కొనేవారు కరువయ్యారు. ప్లా్ల్లట్ల విక్రయంపై సర్వీస్ ట్యాక్స్ పడుతున్నందున సిటీలో నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకూ అనూహ్య రీతిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాక్షి నెట్వర్క్: జీఎస్టీ అమలు నేపథ్యంలో శుక్రవారం నగరంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం జనం బారులుదీరారు. ఈ పన్నుతో కొనుగోలుదారులకు ఎలాంటి బాదుడు లేకపోయినా అమ్మకందారులకు మాత్రం ప్రస్తుతం ఉన్న సర్వీస్‌ట్యాక్స్ 4.5 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పెరగనుంది. దీంతో ఆభారం తమపై పడుతుందని భావించిన పలువురు బిల్డర్లు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కొనుగోలుదారులను ఒత్తిడి చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. రోజుకు 40 రిజిస్ట్రేషన్లు జరిగే నార్సింగిలోని గండిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు రోజులుగా రోజూ వందకు పైగా పెరిగాయి. శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సాధారణ రోజులలో 30 నుంచి 35 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లోనూ బుధవారం, గురువారాల్లో సగటున దాదాపు 160 డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సగటున 50 నుంచి 60 వరకు రిజిస్ట్రేషన్లు కాగా శుక్రవారం ఒక్కరోజే 120కి పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో దాదాపు రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కాప్రా సబ్ రిజిస్ట్రాస్టార్ కార్యాలయంలో రోజూ 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు జరిగేవి. శుక్రవారం 42 పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. థియేటర్లలో యధాతథం.. జీఎస్టీ నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరలు భారీగా పెరుగుతాయనున్నకున్న సినీ ప్రేక్షకులకు ఊరట లభించింది. కానీ గ్రేటర్ పరిధిలోని పలు మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టిక్కెట్ ధరను రూ.200కు మించి పెంచడం గమనార్హం. కాగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పలు సినిమా థియేటర్ల నిర్వాహకులు టిక్కెట్ ధరలను పెంచడంలేదన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందన్న ఉద్దేశంతో టిక్కెట్ ధరలను పెంచడంలేదని స్పష్టం చేశారు. మందుల రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండేలా మందుల రేట్లను తగ్గించాలని, ఆ దిశగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా గాయకుడు గద్దర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పన్నులు పెంచడం వల్ల ప్రజలపై భారం పడుతుందన్నారు. మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్తా మాట్లాడుతూ ఈ పన్ను అమలుతో అదనంగా 3 శాతం భారం పడుతుందని, మందులపైన పన్ను తీసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఎస్టీ నిపుణుడు, చార్టర్ అకౌంటెంట్ రితీష్ మిట్టల్ మాట్లాడుతూ.. ఈ పన్ను అమలుతో 5 శాతం ఉన్న పన్ను రేటు 12 శాతానికి పెరిగిందన్నారు. 20 లక్షల వరకు వార్షిక టర్నోవర్ ఉన్నవారికి ఏ లైసెన్స్ అవసరం లేదని, పన్ను కట్టే అవసరం ఉండదన్నారు. 75 లక్షల వార్షిక వ్యాపారం చేసినా 1 శాతం పన్నే పడుతుందన్నారు. -
‘హెల్త్’ బిజినెస్
వైద్యం.. వ్యాపారం నగరంలో పెరుగుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు హోర్డింగులతో రోగులకు వల సీఐ నిబంధనలు గాలికి అక్రమార్జన కోసం అర్రులు చాస్తున్న పలువురు డాక్టర్లు ఎంజీఎం : బట్టల దుకాణాల్లో డిస్కౌంట్లతో ప్రజలను ఆకర్షించే ప్రకటనలు మనం ఇప్పటి వరకు చూశాం.. వన్‌ప్లస్ వన్ స్కీమ్‌తో వినియోగదారులను తమవైపునకు తిప్పుకునే షాపింగ్‌మాల్స్‌ను కూడా గమనిస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ ప్రస్తుతం వైద్య రంగానికి కూడా ఎగబాకింది. లండన్‌లో ప్రముఖ వైద్యుడు.. అమెరికాలో పేరుగాంచిన గొప్ప డాక్టర్.. మా ఆస్పత్రికి వస్తున్నారు.. మేము చేయబోయే శస్త్రచికిత్సల్లో ఆయన కూడా పాల్గొంటారు.. మా ఆస్పత్రిలో మెరుగైనా వైద్యం అందిస్తాం.. ఫలానా శస్త్ర చికిత్సలు అవసరమున్న వారు ఈ సెల్‌నంబర్ ద్వారా తమ పేరు రిజిస్టర్ చేసుకోండి.. అంటూ నగరంలోని పలు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఇప్పుడు కొత్తరకం వైద్య వ్యాపారానికి తెరతీస్తున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను తుంగలో తొక్కుతూ తమ నర్సింగ్ హోమ్ వైపునకు రోగులు తరలివచ్చేలా పత్రికల్లో ప్రకటనలు వేరుుస్తూ.. ప్రధానకూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేరుుస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారుు. జోరుగా ప్రచారం.. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు రోగులను ఆకర్షించుకునేందుకు ప్రచారమే ప్రధాన అస్త్రంగా భావిస్తున్నాయి. నగరంలో ప్రధాన హోర్డింగుల నుంచి మొదలుపెడితే ప్రజలు వెళ్లే ఆటో రిక్షాలను వరకు దేనిని వదిలిపెట్టడం లేదు. వీటితోపాటు ఎఫ్ఎం రేడియోలు, వైద్య సంఘాలైన ఐఎంఏ, తానా వంటి సంఘాలు చేసే కార్యక్రమాల్లో సైతం తమ నర్సింగ్ హోమ్‌ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ప్రధాన అకర్షణగా ప్రదర్శిస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. అసలు ప్రచారాల్లో ఆయా నర్సింగ్ హోమ్‌ల వైద్యులు పేర్లు ఉండకూడదనేది ఎంసీఐ స్పష్టం చేస్తుంది. కానీ.. వైద్యుడు ఇంటి పేరుతో కానీ.. ఆయన పేరుతో ఆస్పత్రి నెలకొల్పిన కొంత మంది వైద్యులు తెలివిగా ఐఎంఎలో కీలకంగా వ్యవహరిస్తూ తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చడం వైద్యవర్గాల్లో సైతం విస్మయాన్ని కలిగిస్తుంది. నాన్ మెడికల్ వ్యాపారుల హవా... పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నస్టిక్స్ కేంద్రాలు, మెడికల్ కళాశాలలు నెలకొల్పి ప్రచారాన్ని అస్త్రంగా చేసుకుని వైద్య రంగాన్ని పూర్తి వ్యాపార రంగంగా మార్చుకుంటూ అడుగులు వేస్తున్నారుు. ఈ క్రమంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య స్థితిగతులను పక్కకు నెట్టి వైద్య మాఫియాగా మారి ధనదోపిడే లక్ష్యంగా కార్పొరేట్ ముసుగులో యథేచ్ఛగా వైద్య వ్యాపారం సాగిస్తున్నారు. కాగా, కొందరు డాక్టర్లు చేస్తున్న ఈ వ్యాపారానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల అండదండలు పుష్కలంగా ఉండడం గమనార్హం. అమెరికా వైద్యుడి రాక పేరుతో వ్యాపారం.. నగరంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో ఈనెల 13న జరిగే కీలు మార్పిడి శస్త్రచికిత్సకు అమెరికా కు చెందిన వైద్యు నిపుణులు వస్తున్నారని నిర్వాహకులు ఏకంగా ఓ పత్రికలో ప్రకటన చేయడం వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతే కాకుండా సదరు వైద్యుడు శస్త్ర చికిత్సలో పాల్గొనడంతోపాటు ఏకంగా అతడి వద్ద వైద్య సలహాలు తీసుకునేందుకు రోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నంబర్‌ను సైతం వ్యాపార ప్రకటనలా ఇవ్వడం చర్చనీయూంశంగా మారింది. ఇలాంటి ప్రకటనలు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎంసీఐని లెక్క చేయడం లేదని తెలుస్తుంది. ప్రకటనలు నిబంధనలకు విరుద్ధం.. డాక్టర్లు తమ పేరుతో ప్రకటనలు చేసుకోవడం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం. నగరంలో ఆస్పత్రులు ప్రారంభించే వైద్యులు విదేశాల్లో ఏదైనా కోర్సు పూర్తి చేసి పునః ప్రారంభ సమయంలో మాత్రమే ప్రకటనలు చేసుకోవాలి. అంతేకాకుండా భారీ హోర్డింగులతో, కరపత్రాలతో ప్రచారం చేసుకోవడం ఎంసీఐ నిబంధనలకు విరు ద్ధం. ఇలాంటి ప్రకటనలపై చర్యలు తీసుకునేందుకు నాలుగు రోజులు క్రితం హైదరాబాద్‌లో ఎంసీఐ సమావేశం నిర్వహించాం. నగరంలో ఇటీవల జరిగిన కార్యక్రమంపై విచారణ చేసి చర్యలు చేపడుతాం. -రాజ్సిద్ధార్థ్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడు విదేశీ వైద్యుల రాక ప్రకటన సరికాదు విదేశీ వైద్యులు మా నర్సింగ్ హోమ్‌కు వస్తున్నారు.. రోగులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ప్రకటనలు చేసుకోవడం ఎంసీఐ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఎవరైనా విదేశీ వైద్యులు ఎంసీఐ తాత్కాలిక అనుమతితోనే కాన్ఫరెన్స్ శస్త్ర చికిత్సల్లో మాత్రమే పాల్గొనాలి. వ్యక్తిగత నర్సింగ్ హోమ్‌లలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం. -డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, ఐఎంఏ క్రమశిక్షణ సంఘం చైర్మన్ -
భారీ అగ్ని ప్రమాదం
చందన బ్రదర్స్‌లో మంటలు వస్త్రాలు, నగలు దగ్ధం రూ.10 కోట్ల వరకు నష్టం గాంధీరోడ్డులో కలకలం నగరంలోని గాంధీ రోడ్డు సమీపంలోని తీర్థకట్ట వీధిలోని చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూం గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం, మిగిలిన రెండు అంతస్తుల్లో దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోజువారీ దినచర్యలో భాగంగా బుధవారం రాత్రి 10.10 గంటలకు షోరూంను మూత వేసి నిర్వాహకులు, సిబ్బంది వెళ్లిపోయారు. కొద్ది నిమిషాల్లోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. షాపు ముందే ఉన్న సెక్యూరిటీ గార్డు మంటలు అదుపు చేయలేకపోయాడు. ఈ రోడ్డుపై సమీపంలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే షోరూంలోని మూడు అంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలతో చుట్టుపక్కల జనం బెంబేలెత్తిపోయారు. విషయం తెలియగానే చుట్టు పక్కల జనం షాపు వద్ద గుమికూడారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి పంపించి వేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తిరుమల, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు ప్రాంతాల నుంచి ఆరు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. దుకాణం షట్టర్ తెరుచుకోకపోవడంతో మంటలను అదుపు చేయడానికి చాలా కష్టమైంది. దీంతో జేసీబీతో షట్టర్‌ను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దుకాణం మేనేజర్లు విశ్వేశ్వరరావు, శ్యామ్ మాట్లాడుతూ పండుగలు రానుండడంతో 200 బేళ్లు వస్త్రాలు తెచ్చి ఉంచినట్లు తెలిపారు. బంగారం సుమారు 20 నుంచి 30 కేజీల వరకు ఉంటుందని తెలిపారు. దాదాపు 10 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొన్నారు. -
వెలుగు జిలుగుల దీపావళి
మహబూబ్‌నగర్ కల్చరల్:దీపావళి పండుగను ఆనందంగా జరుపుకునేం దుకు ప్రజలు అంతా సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగం, ఉపాధికోసం పట్టణాలకు వలస వెళ్లిన వారు సైతం సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో పల్లెలన్నీ బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. పండుగ కొనుగోళ్లతో కిరాణ, బట్టల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆనందంగా కాల్చే టపాసులు అమ్మేందుకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. అయితే, ఈ సారి టపాసుల ధరలు భారీగా పెరగడంతో వాటిని కొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజుల పండుగ... దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తారు. అందులో భాగంగా త్రయోదశి నాటి రాత్రి ‘అపమృత్యు’ నివారణ కోసం దీపాలు వెలిగిస్తారు. తర్వాత రోజైన నరక చతుర్దశి రోజు ‘అలక్ష్మీ’ పరిహారానికై శరీరానికి నూనె రా సుకుని అభ్యంగన స్నానం చేస్తా రు. కొందరు ఇదే రోజు పితృ తర్పణాలు కూడా విడుస్తారు. దీపావళి నాడు దేవతా మూర్తులకు అర్చనలు నిర్వహించి పంచభక్ష్య పరమాన్నాలు, పిండివంటలు సమర్పిస్తారు. దీపావళి రోజు లక్ష్మీ పూజ, కేదారేశ్వర గౌరీ నోములు నిర్వహిస్తారు. వ్యాపారులు లక్ష్మీపూజను ఘనంగా నిర్వహిస్తారు. పెరిగిన టపాసుల ధరలు ఈ యేడాది టపాసుల ధరలు సామాన్యుడికి అందుబాటలో లేకుండా పోయాయి. బాణాసంచా తయారీకి వాడే భాస్వరం, గంధకం వంటి పదార్థాల ధరలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ సారి 40శాతం దాకా ధరలు పెరిగాయి. తమిళనాడు ప్రభుత్వం బాణాసంచా తయారీ కేంద్రాలపై నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో ఉత్పత్తి తగ్గిందని చెబుతున్నారు. టౌన్‌హాలు, బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లలో... జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు ఆలస్యంగా లభించడంతో ఈ సారి మహబూబ్‌నగర్ పట్టణంలో బాణాసంచా వ్యాపారం ఆలస్యంగా ప్రారంభ మైంది. గతంలో వారం, పది రోజుల ముందుగానే టపాసుల వ్యాపారాలు మొదలయ్యేవి. స్థానిక మున్సిపల్ టౌన్‌హాలు ఆవరణలో, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంతోపాటు న్యూటౌన్ ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించటానికి మున్సిపల్ అధికారులు అనుమతినిచ్చారు. మొత్తం దాదాపు 40వరకు తాత్కాలిక విక్రయ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు పట్టణ బాణాసంచా వ్యాపారుల సంఘం సభ్యులు తెలిపారు.