జీఎస్టీ ఎఫెక్ట్‌ | Disagreements over GST | Sakshi
Sakshi News home page

జీఎస్టీ ఎఫెక్ట్‌

Published Sat, Jul 1 2017 12:03 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

జీఎస్టీ ఎఫెక్ట్‌ - Sakshi

జీఎస్టీ ఎఫెక్ట్‌

కొనుగోళ్లతో కిటకిటలాడిన నగల షాపులు  రెడీమేడ్‌ దుస్తుల దుకాణాలు వెలవెలఆఫర్లు ప్రకటించినా కొనుగోళ్లు నిల్‌  అనూహ్యంగా పెరిగిన రిజిస్ట్రేషన్లు మందులపై 3 శాతం ఎక్కువే.. వ్యాపారులు  రేట్లు పెంచేందుకు థియేటర్లు వెనుకడుగు  జీఎస్టీపై భిన్నాభిప్రాయాలు.. జీఎస్టీకి వ్యతిరేకంగా వివిధ సంఘాల ఆందోళన ఏసీ రైల్వే ఛార్జీలపై 5 శాతం  జూన్‌ 30 వరకు తీసుకున్న టిక్కెట్లకు మినహాయింపు

నేటి నుంచి అమలుకానున్న ‘వస్తు,సేవల పన్ను’ అంశం గ్రేటర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణ పౌరులు, చిరు వ్యాపారులు, ట్రేడర్స్, డీలర్లు పన్ను స్వరూపంపై పలు అనుమానాలు వెలిబుచ్చారు. కాగా పన్ను భారం పెరుగుతుందనుకున్న ఎలక్ట్రానిక్, బంగారు ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ధరలు తగ్గుతాయంటున్న నిత్యావసరాలు, నాన్‌ బ్రాండెడ్‌  దుస్తుల దుకాణాలు వెలవెలబోయాయి. డిస్కౌంట్లు ప్రకటించినా కొనేవారు కరువయ్యారు. ప్లా్ల్లట్ల విక్రయంపై సర్వీస్‌ ట్యాక్స్‌ పడుతున్నందున సిటీలో నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకూ అనూహ్య రీతిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
               
సాక్షి నెట్‌వర్క్‌: జీఎస్టీ అమలు నేపథ్యంలో శుక్రవారం నగరంలో పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం జనం బారులుదీరారు. ఈ పన్నుతో కొనుగోలుదారులకు ఎలాంటి బాదుడు లేకపోయినా అమ్మకందారులకు మాత్రం ప్రస్తుతం ఉన్న సర్వీస్‌ట్యాక్స్‌ 4.5 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పెరగనుంది. దీంతో ఆభారం తమపై పడుతుందని భావించిన పలువురు బిల్డర్లు  రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కొనుగోలుదారులను ఒత్తిడి చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. రోజుకు 40 రిజిస్ట్రేషన్లు జరిగే నార్సింగిలోని గండిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నాలుగు రోజులుగా రోజూ వందకు పైగా పెరిగాయి. శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సాధారణ రోజులలో 30 నుంచి 35 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లోనూ బుధవారం, గురువారాల్లో సగటున దాదాపు 160 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ చేసినట్లు సమాచారం. ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు సగటున  50 నుంచి 60 వరకు రిజిస్ట్రేషన్లు కాగా శుక్రవారం ఒక్కరోజే 120కి పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో దాదాపు రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కాప్రా సబ్‌ రిజిస్ట్రాస్టార్‌ కార్యాలయంలో రోజూ 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు జరిగేవి. శుక్రవారం 42 పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

థియేటర్లలో యధాతథం..
జీఎస్టీ నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరలు భారీగా పెరుగుతాయనున్నకున్న సినీ ప్రేక్షకులకు ఊరట లభించింది. కానీ గ్రేటర్‌ పరిధిలోని పలు మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టిక్కెట్‌ ధరను రూ.200కు మించి పెంచడం గమనార్హం. కాగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పలు సినిమా థియేటర్ల నిర్వాహకులు టిక్కెట్‌ ధరలను పెంచడంలేదన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందన్న ఉద్దేశంతో టిక్కెట్‌ ధరలను పెంచడంలేదని స్పష్టం చేశారు.

మందుల రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి
ప్రజలకు అందుబాటులో ఉండేలా మందుల రేట్లను తగ్గించాలని, ఆ దిశగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా గాయకుడు గద్దర్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ రిటైల్‌ మెడికల్‌ షాప్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పన్నులు పెంచడం వల్ల ప్రజలపై భారం పడుతుందన్నారు. మెడికల్‌ షాప్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ ఈ పన్ను అమలుతో అదనంగా 3 శాతం భారం పడుతుందని, మందులపైన పన్ను తీసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ నిపుణుడు, చార్టర్‌ అకౌంటెంట్‌ రితీష్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. ఈ పన్ను అమలుతో 5 శాతం ఉన్న పన్ను రేటు 12 శాతానికి పెరిగిందన్నారు. 20 లక్షల వరకు వార్షిక టర్నోవర్‌ ఉన్నవారికి ఏ లైసెన్స్‌ అవసరం లేదని, పన్ను కట్టే అవసరం ఉండదన్నారు. 75 లక్షల వార్షిక వ్యాపారం చేసినా 1 శాతం పన్నే పడుతుందన్నారు.    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement