నాలుగేళ్ల బాలికపై బాలుడి లైంగిక దాడి | boy's sexual assault on a four-year-old girl | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల బాలికపై బాలుడి లైంగిక దాడి

Published Thu, Jul 23 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

boy's sexual assault on a four-year-old girl

లబ్బీపేట/ఇబ్రహీంపట్నం: నాలుగేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎదురింట్లో నివసించే బాలుడు నమ్మకంగా ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బాలుడు ఇబ్రహీంపట్నం పోలీసుల అదుపులో ఉన్నాడు. వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం వీధిలో నివసించే తమ్మిశెట్టి సిద్ధయ్య కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటుంది. అతడికి  7వ తరగతి చదివే 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. సిద్ధయ్య, అతని భార్య బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లగా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు.

సాయంత్రం 4 గంటల సమయంలో బాలిక ఇంటి వద్ద రోడ్డుపై ఆడుకుంటుండగా   బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతుండగా ఆమె ఏడవడంతో పక్కింటి వారికి అనుమానం వచ్చింది. తలుపులు వేసి ఉన్న ఇంట్లో బాలిక ఏడుపు వినపడడంతో కిటికీలో నుంచి చూడగా బాలుడి నిర్వాకం వెల్లడైంది. తలుపులు కొట్టడంతో కొద్దిసేపటికి దుస్తులు వేసుకుంటూ బయటికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, బాలుడిని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ‘రోజూ బాలికతో ఆడు కుంటున్నాడు..అలాగే తీసుకెళ్లాడనుకున్నాం .. కానీ, ఇంత దారుణానికి పాల్పడతాడని భావించలేదం’టూ బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పెద్ద సంఖ్యలో బాలిక బంధువులు, కాలనీకి చెందిన వారు ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది.

కేసులేనిదే వైద్యం చేయబోమన్న వైద్యులు..
లైంగికదాడికి గురైన బాలికను వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తే, పోలీసులు కేసునమోదు చేయనిదే వైద్యం చేయలేమని తేల్చి చెప్పారు.   దీంతో బాలిక బంధువులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించగా, సీఐ చవాన్ ఆస్పత్రికి చేరుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేసి శోధన వెహికల్‌ను రప్పించి అక్కడే ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్యులు పాపను అడ్మిట్ చేసుకున్నారు.

 విచారణ జరుపుతున్నాం: చవాన్, ఇబ్రహీంపట్నం సీఐ
 నాలుగేళ్ల బాలికపై ఎదురింటిలో నివసించే బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు నిర్వహిస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement