డబ్బు కోసమే కిడ్నాప్‌ | Businessman Kidnapped In Ibrahimpatnam, Five Accused Have Been Arrested And Remanded In The Case | Sakshi
Sakshi News home page

డబ్బు కోసమే కిడ్నాప్‌

Published Sat, Nov 30 2024 8:38 AM | Last Updated on Sat, Nov 30 2024 9:54 AM

Businessman kidnapped in Ibrahimpatnam

వ్యాపారిని హనీ ట్రాప్‌ చేసిన నిందితులు 

రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ 

రూ.20 లక్షలకు ఒప్పందం 

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన

 పోలీసులు ఐదుగురు నిందితులకు రిమాండ్‌  

వివరాలు వెల్లడించిన డీసీపీ సునీతారెడ్డి  

ఇబ్రహీంపట్నం రూరల్‌: వ్యాపారిని కిడ్నాప్‌ చేసి..కణతకు గన్‌ గురిపెట్టి బెదిరించిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం జోన్‌ డీసీపీ సునీతారెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం చెందిన రచ్చ నారాయణ (71) వివిధ వ్యాపారాలు చేస్తుంటాడు. ఇతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని గుర్తించిన చర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన కొరవి ధన్‌రాజ్‌ అలియాస్‌ అర్జున్‌..నారాయణ వద్ద డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా నారాయణ పేరుతో హయత్‌నగర్‌లో రెండు రూ.100 బాండ్‌ పేపర్లు కొనుగోలు చేశాడు. అనంతరం కిడ్నాప్, బెదిరింపు స్కెచ్‌ వేశాడు. ఈ విషయాన్ని తన మేనల్లుడు శివకుమార్, స్నేహితులు శ్రీకాంత్, శేఖర్‌కు విషయం చెప్పాడు. వారు అంగీకరించడంతో ప్లాన్‌ అమలు చేశారు.   

మహిళతో ఫోన్‌ చేయించి.. 
నారాయణను కిడ్నాప్‌ చేసే వ్యూహంలో భాగంగా..నగరంలోని మౌలాలికి చెందిన మక్కల భవానీకి డబ్బు ఆశ చూపారు. నారాయణకు ఫోన్‌ చేయించి మాయమాటలతో హనీ ట్రాప్‌ చేశారు. ఈ నెల 21న బొంగ్లూర్‌ వద్దకు పిలిపించారు. అప్పటికే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన పోలీస్‌ యూనిఫామ్‌ ధరించిన ధన్‌రాజ్‌ తాను ఎస్‌ఐ అని చెప్పి శివకుమార్, శ్రీకాంత్, శేఖర్‌ తనకు గన్‌మెన్లు అని చెప్పాడు. అనంతరం నారాయణతో పాటు అతని డ్రైవర్‌ ముజీబ్‌ను కారులో ఎక్కించి, ముఖాలకు నల్లటి ముసుగు వేసి కిడ్నాప్‌ చేశారు. వీరిని ఆదిబట్ల మున్సిపాలిటీ సమీపంలోని జేబీ గ్రీన్‌ వెంచర్‌ వద్దకు తీసుకెళ్లి గదిలో పెట్టారు. 

నీవు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫొటోలు మా వద్ద ఉన్నాయని బెదిరించారు. పోలీస్‌ డ్రస్సులో ఉన్న ధన్‌రాజ్‌ డమ్మీ గన్‌ తీసి నారాయణ కణతకు పెట్టి రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. అంత డబ్బు లేదని చెప్పడంతో రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు రెండు రోజుల్లో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని..ముందుగానే తెచి్చన 100 రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకాలు, వేలిముద్రలు పెట్టించుకున్నారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని కత్తులతో హెచ్చరించారు. అనంతరం ఏవీసీ టౌన్‌ షిప్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.   

ఐదుగురు నిందితుల రిమాండ్‌.. 
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి డమ్మీ పిస్టల్, పోలీసు యూనిఫామ్, బూట్లు, కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో «ఏ–1 నిందితుడు ధన్‌రాజ్‌ ఎంబీబీఎస్‌ మధ్యలో ఆపేశాడు. అనంతరం పలు ప్రైవేటు అస్పత్రుల్లో పనిచేశాడు. విలువిద్యలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. వలవోజు శివకుమార్, డేరంగుల శ్రీకాంత్, సుర్వి శేఖర్, మక్కల భవానీని సైతం రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కేపీవీ రాజు పర్యవేక్షణలో చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు రాజు, వెంకటేశ్, హెడ్‌ కానిస్టేబుల్‌ గిరి, రవీందర్, ఉపేందర్‌రెడ్డి, సందీప్, కృష్ణ, సంతోష్, శివచంద్ర, బి.రాజును డీసీపీ సునీతారెడ్డి అభినందించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement