రంగారెడ్డి: బావమరిదిని చంపిన బావకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఒడిసా రాష్ట్రం బానర్ డివిజన్ కలహండి జిల్లాకు చెందిన సంజుక్త మాఝీ, ఆమె భర్త విశ్వప్రధాన్ మన్నెగూడ సమీపంలోని హరీస్ ప్రణవ్ విల్లాస్‌లో కాంట్రాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వద్ద సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించేవారు.
వారితో పాటు సంజుక్త మాఝీ సోదరుడు బానామాఝీ అదే కాంట్రక్టర్ వద్దే పనిచేసేవాడు. విశ్వప్రధాన్ నిత్యం మద్యం సేవించి సంజుక్త మాఝీతో గొడవపడేవాడు. 2021 అక్టోబర్ 11న దంపతులు ఇద్దరు గొడవపడుతుండగా పక్కగదివారు గమనించి బానామాఝీ చెప్పడంతో అక్కడి చేరకుని బావను నిలదీశాడు. దీంతో కక్ష పెంచుకున్న విశ్వప్రధాన్ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో బావమరిది తలపై బండరాయి వేశాడు. దీంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు.
మాకుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నందునే హతమార్చినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ఎల్బీనగర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి(ఏడీజే) నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పువెల్లడించారు. విశ్వప్రదాన్ ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment