breaking news
Girl Sexual assault
-
విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
-
లైంగిక వేధింపులు.. భవనంపై నుంచి దూకిన బాలిక
-
బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు
-
నాలుగేళ్ల బాలికపై బాలుడి లైంగిక దాడి
లబ్బీపేట/ఇబ్రహీంపట్నం: నాలుగేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎదురింట్లో నివసించే బాలుడు నమ్మకంగా ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బాలుడు ఇబ్రహీంపట్నం పోలీసుల అదుపులో ఉన్నాడు. వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం వీధిలో నివసించే తమ్మిశెట్టి సిద్ధయ్య కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటుంది. అతడికి 7వ తరగతి చదివే 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. సిద్ధయ్య, అతని భార్య బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లగా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో బాలిక ఇంటి వద్ద రోడ్డుపై ఆడుకుంటుండగా బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతుండగా ఆమె ఏడవడంతో పక్కింటి వారికి అనుమానం వచ్చింది. తలుపులు వేసి ఉన్న ఇంట్లో బాలిక ఏడుపు వినపడడంతో కిటికీలో నుంచి చూడగా బాలుడి నిర్వాకం వెల్లడైంది. తలుపులు కొట్టడంతో కొద్దిసేపటికి దుస్తులు వేసుకుంటూ బయటికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, బాలుడిని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ‘రోజూ బాలికతో ఆడు కుంటున్నాడు..అలాగే తీసుకెళ్లాడనుకున్నాం .. కానీ, ఇంత దారుణానికి పాల్పడతాడని భావించలేదం’టూ బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో బాలిక బంధువులు, కాలనీకి చెందిన వారు ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. కేసులేనిదే వైద్యం చేయబోమన్న వైద్యులు.. లైంగికదాడికి గురైన బాలికను వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తే, పోలీసులు కేసునమోదు చేయనిదే వైద్యం చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో బాలిక బంధువులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించగా, సీఐ చవాన్ ఆస్పత్రికి చేరుకుని స్టేట్మెంట్ రికార్డు చేసి శోధన వెహికల్‌ను రప్పించి అక్కడే ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్యులు పాపను అడ్మిట్ చేసుకున్నారు. విచారణ జరుపుతున్నాం: చవాన్, ఇబ్రహీంపట్నం సీఐ నాలుగేళ్ల బాలికపై ఎదురింటిలో నివసించే బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు నిర్వహిస్తాం. -
బాలిక హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం...
వినుకొండ : ముక్కుపచ్చలారని బాలికపై అతి కిరాతంగా లైంగికదాడి జరిపి, హత్య చేసిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని సీబీసీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వినుకొండ పట్టణ శివారు రాజీవ్ రజక కాలనీకి చెందిన మైనర్ బాలిక లక్ష్మీతిరుపతమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా అపహరణకు గురైన బాలిక 14వ తేదీన శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామ సమీపంలోని నక్కలగండివాగు వద్ద మృతదేహమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విధితమే. ఈ ఘటనపై స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తక్షణమే విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో సీబీసీఐడి అడిషన్ డీజీ తిరుమలరావు సిబ్బందితో కలిసి శావల్యాపురం మండలం కనుమర్లపూడి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాజీవ్ రజక కాలనీలోని బాలిక పెంపుడు తల్లి లింగమ్మను విచారించారు. సంఘటనకు ముందుగా జరిగిన విషయాలను అడిగి తెల్సుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంకటేశ్వర్లును పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విచారించారు. అదేవిధంగా బాలిక శవాన్ని పోస్టు మార్టం నిర్వహించిన డాక్టర్ లక్ష్మణరావును వివరాలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు సంబంధించి జిల్లా రూరల్ ఎస్పీకి పలు సూచనలు చేశామని, ఆ దిశగా విచారణ చేయాలని సూచించినట్లు చెప్పారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్‌తో మాట్లాడామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్పీ సత్యనారాయణ, ఐజీ రామకృష్ణ, సీఐడీ డిఎస్పీ రఘు, నర్సరావుపేట డిఎస్పీ డి ప్రసాదు, సీఐడీ సీఐ శివప్రసాదు, లీగల్ అడ్వైజర్ తదితరులు ఉన్నారు.