
కోఠీ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి
రాష్ట్ర రాజధానిలోని కోఠీ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమితో వైద్యం కోసం వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు
- హైకోర్టుకు అడ్వొకేట్ కమిషన్ నివేదిక
- కానరాని వెంటిలేటర్‌లు.. అధ్వానంగా అంబులెన్‌సలు
- ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని
- సర్కారుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని కోఠీ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమితో వైద్యం కోసం వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమి షన్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ఆస్ప త్రిలో వెంటిలేటర్ సౌకర్యంలేదని, అవసరం వచ్చినప్పుడు రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపుతున్నారని కమిషన్ తెలి పింది. ఆస్పత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోం దని వివ రించింది. రోగులకు సరిపడా సిబ్బంది లేరని, ఉన్న 2 అంబులెన్‌సలు అధ్వాన స్థితిలో ఉన్నాయని, ఖాళీల భర్తీకి సర్కారు చర్యలు తీసుకోవడంలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు...ఇందులో లేవనెత్తిన లోటుపాట్లపై ఏం చర్యలు తీసుకుం టున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. విచారణను ఈ నెల 15కు వారుుదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల్లేక చెట్ల కింద గర్భిణులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో కథనాలు వచ్చారుు. ఈ కథనాలపై స్పందించిన హైకోర్టు వాటిని సుమోటోగా పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని మహిళా న్యాయ వాదులు పద్మజ, జయంతి లతో అడ్వొకేట్ కమిషన్‌ను నియమించింది. ఆస్పత్రిని సందర్శించి అక్కడి లోటుపాట్లపై హైకోర్టుకు వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. ఆస్పత్రిలో రక్త నమూనాల కోసం నిరీక్షించాల్సి వస్తోందని పద్మజ తన నివేదికలో పేర్కొన్నారు. వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని, రోజుకు 40-50 వరకు ప్రసవాలు చేయాల్సి వస్తున్నందున శుభ్రం చేసే సమయం సిబ్బందికి దొరకడం లేదని తెలిపారు. పోస్టులు 154 మంజూరు కాగా, 109 భర్తీ అయ్యాయన్నారు.