koti maternity hospital
-
‘కోఠి హాస్పిటల్’లో సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించేందుకు న్యాయవాది కిరణ్మయిని అడ్వొకేట్ కమిషన్‌గా హైకోర్టు నియమించింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కోఠి ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని కిరణ్మయిని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక గర్భిణీ లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను 2016లో హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: సమీప బంధువు లైంగిక దాడితో గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక గర్భస్థ పిండాన్ని, 48 గంటల్లో తొలగించాలని కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. బాలిక జీవించే హక్కు దృష్ట్యా పిండాన్ని తొలగించాలని ఆదేశించే అధికారం తమకుందని తేల్చిచెప్పింది. సీనియర్ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికల్ పద్ధతి లేదా శస్త్రచికిత్స ద్వారా ఈ పిండాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. డీఎన్ఏ పరీక్ష చేసేందుకు వీలుగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను భద్రపర్చాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. బాలికపై లైంగిక దాడికి సంబంధించి నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను డీఎన్ఏ, ఇతర పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని, ఈ కేసు తుది విచారణ కోసం డీఎన్ఏ, ఇతర పరీక్షల రిపోర్టులను భద్రపర్చాలని దర్యాప్తు అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అధికారులు సహకరించి న్యాయబద్ధంగా అందాల్సిన పరిహారాన్ని ఇప్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. ‘లైంగిక దాడితో బాలిక గర్భం దాల్చింది. బాలిక సమ్మతి లేకుండా వచ్చిన ఈ గర్భాన్ని కొనసాగించాలా, తొలగించుకోవాలా అన్న స్వేచ్ఛ సదరు బాలికకు ఉంది. 25 వారాల గర్భంతో ఉంది కాబట్టి గర్భాన్ని తొలగించలేమనడం సరికాదు. గర్భం తొలగించకపోతే భవిష్యత్తులో అనేక తీవ్రమైన మానసిక, శారీరక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు ఇది విఘాతం’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. చదవండి: Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.100కే వెయ్యి చైల్డ్ పోర్న్ వీడియోలతో.. కాగా హైదరాబాద్‌కు చెందిన బాలికపై సమీప బంధువు బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చూపించగా, 25 వారాల గర్భంతో ఉందని డాక్టర్లు నిర్ధారించారు. 24 వారాల గర్భం దాటితే గర్భస్థ పిండాన్ని తొలగించడానికి చట్టప్రకారం హైకోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. -
ఏసీబీ చేతనతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
పిల్లలు పుట్టక పోవడంతోనే కిడ్నాప్
-
భర్త వదిలేస్తాడనే కిడ్నాప్ చేసింది..!
సాక్షి, హైదరాబాద్: కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం (జూలై 2) నవజాత శిశువు కిడ్నాప్‌కు గురైంది. ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. సీసీ కెమెరాల సాయంతోనే ఇప్పటివరకు చాలా కేసులను ఛేదించగలిగామని చెప్పారు. అందరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇదివరకే రెండు సార్లు పిల్లలు పుట్టి చనిపోవడంతో నిందితురాలు తీవ్ర మనోవేదనకు గురైందని పోలీసులు తెలిపారు. మూడోసారి కూడా పిల్లలు కలగకపోతే భర్త వదిలేస్తాడనే భయంతో నయనారాణి ఈ కిడ్నాప్‌కు పాల్పడొచ్చని నిందితురాలి వదిన సునీత చెప్పారు. కిడ్నాప్ అనంతరం నయన బీదర్‌వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల సాయంతో తెలుసుకున్నామని కమిషనర్ అన్నారు. కర్ణాటక పోలీసుల సాయంతో బీదర్‌లో ప్రతి ఇంటిని తనిఖీ చేశామని వెల్లడించారు. ఈ కేసులో మీడియా సహకారం మరువలేనిదని కొనియాడారు. గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో నిందితురాలు చిన్నారిని బీదర్ ప్రభుత్వాసుపత్రిలో వదిలి వెళ్లిందని తెలిపారు. నయనా, ఆమె భర్త సల్మాన్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నగర్లో నివాసముండేవారని కమిషనర్ తెలిపారు. పిల్లలు పుట్టక పోవడంతోనే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. చిన్నారి కిడ్నాప్ కేసులో ఏసీపీ చేతన చాకచక్యంగా వ్యవహరించారనీ, ఆమె పేరునే పాపకు పెట్టామని తెలిపారు. నయనారాణిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
పసికందు కిడ్నాప్ కేసులో మహిళ అరెస్ట్
-
గర్భక్షోభ
-
కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో కిడ్నాపైన శిశువు క్షేమం
-
కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో కిడ్నాపైన పాప సురక్షితం
-
కోఠీ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి
- హైకోర్టుకు అడ్వొకేట్ కమిషన్ నివేదిక - కానరాని వెంటిలేటర్లు.. అధ్వానంగా అంబులెన్సలు - ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని - సర్కారుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని కోఠీ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమితో వైద్యం కోసం వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమి షన్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ఆస్ప త్రిలో వెంటిలేటర్ సౌకర్యంలేదని, అవసరం వచ్చినప్పుడు రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపుతున్నారని కమిషన్ తెలి పింది. ఆస్పత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోం దని వివ రించింది. రోగులకు సరిపడా సిబ్బంది లేరని, ఉన్న 2 అంబులెన్సలు అధ్వాన స్థితిలో ఉన్నాయని, ఖాళీల భర్తీకి సర్కారు చర్యలు తీసుకోవడంలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు...ఇందులో లేవనెత్తిన లోటుపాట్లపై ఏం చర్యలు తీసుకుం టున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. విచారణను ఈ నెల 15కు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల్లేక చెట్ల కింద గర్భిణులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో కథనాలు వచ్చారుు. ఈ కథనాలపై స్పందించిన హైకోర్టు వాటిని సుమోటోగా పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని మహిళా న్యాయ వాదులు పద్మజ, జయంతి లతో అడ్వొకేట్ కమిషన్‌ను నియమించింది. ఆస్పత్రిని సందర్శించి అక్కడి లోటుపాట్లపై హైకోర్టుకు వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. ఆస్పత్రిలో రక్త నమూనాల కోసం నిరీక్షించాల్సి వస్తోందని పద్మజ తన నివేదికలో పేర్కొన్నారు. వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని, రోజుకు 40-50 వరకు ప్రసవాలు చేయాల్సి వస్తున్నందున శుభ్రం చేసే సమయం సిబ్బందికి దొరకడం లేదని తెలిపారు. పోస్టులు 154 మంజూరు కాగా, 109 భర్తీ అయ్యాయన్నారు. -
శిశువుల మార్పిడి వివాదానికి తెర!
హైదరాబాద్: శిశువుల మార్పిడి వివాదానికి తెర పడింది. తనకు పుట్టింది ఆడశిశువు కాదు.. మగశిశువేనని ఆందోళనకు దిగిన రజిత అనే మహిళకు ఆడశిశువు జన్మించిందని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. మగశిశువు డీఎన్ఏతో మరో మహిళ రమాదేవి డీఎన్ఏ మ్యాచ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు శిశువులు, తలిదండ్రుల డీఎన్ఏ రిపోర్టును అధికారులు బుధవారం విడుదల చేశారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం కోఠి మెటర్నిటీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువుల మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. ఒకేరోజున రమాదేవి, రజిత ఇద్దరు మహిళలు ప్రసవించారు. ఈ నేపథ్యంలో బాలింత రజితకు అబ్బాయి పుట్టాడని ముందుగా చెప్పి.. కొద్దిసేపటి తరువాత వచ్చి, కాదు.. రజితకు అమ్మాయేనని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో వివాదానికి దారి తీసిన సంగతి విధితమే. తన భార్య(రజిత) మగబిడ్డకే జన్మనిచ్చిందని.. ఆస్పత్రి సిబ్బందే బాబును తారుమారు చేసి ఆడ శిశువును అంటగట్టారని ఆమె భర్త శత్రువు ఆస్పత్రి వర్గాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు జంటలతో పాటు ఇద్దరు చిన్నారులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. డీఎన్ఏ నివేదికలో బాబు తల్లి రమాదేవి అని తేలిందని పోలీసులు తెలిపారు. -
శిశువుల మార్పిడి వివాదానికి తెర!
-
'డీఎన్ఏ పరీక్ష జరిపి ఎవరి పిల్లల్ని వాళ్లకి అప్పగిస్తాం'
హైదరాబాద్ : శిశువు తారుమారు అయిన ఘటనపై కోఠి మెటర్నటీ ఆసుపత్రి ఆర్ఎంవో విద్యావతి బుధవారం హైదరాబాద్‌లో స్పందించారు. సమాచార లోపంతోనే ఈ వివాదం ఏర్పడిందన్నారు. ఈ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష జరిపి ఎవరి పిల్లల్ని వాళ్లకు అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం రజిత, రమాదేవి పిల్లలు మా సంరక్షణలోనే ఉన్నారని విద్యావతి పేర్కొన్నారు. ఆసుపత్రిలో పిల్లలను తారుమారు చేశారని ఆరోపిస్తూ.. రజిత కుటుంబ సభ్యులు మంగళవారం కోఠి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
కోఠీ మెటర్నిటీ ఆస్పత్రిలో హైడ్రామా!
♦ కోఠీ ఆస్పత్రిలో నిన్నటి నుంచి కొనసాగుతున్న ఆందోళన ♦ ప్రసూతి ఆస్పత్రిలో శిశువుల తారుమారు ♦ ఆస్పత్రి ఆయాపై బాలింత రజిత కుటుంబసభ్యుల ఆరోపణ ♦ ఆడబిడ్డ అయితే రూ. 11 వందలు ♦ మగబిడ్డ అయితే రూ. 2 వేల వరకూ వసూలు చేస్తున్నారని ఆరోపణ హైదరాబాద్: కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో హైడ్రామా చోటుచేసుకుంది. డబ్బుల కోసం పురిటి బిడ్డలను తారుమారు చేసిన ఆస్పత్రి సిబ్బంది పెద్ద హైడ్రామానే నడిపింది. కేవలం డబ్బుల కోసం ఆశపడి అప్పుడే పుట్టిన శిశువులను తారుమారు చేయడం.. రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపింది. పుట్టిన బిడ్డలను బట్టి ఆడపిల్ల అయితే రూ. 11 వందలు, మగబిడ్డ అయితే 2 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటే ఇలా నిలువుదోపిడీ పాల్పడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మగశిశువు తమ బిడ్డేనని ఇరువర్గాలు పట్టుబట్టడంతో నిన్నటి నుంచి ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పత్తాలేకపోవడంతో రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మాంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగయ్య భార్య రమాదేవిని సోమవారం కాన్పుకోసం ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం కడ్తాల్‌కు చెందిన శత్రు భార్య రజిత కూడా కాన్పు కోసం ఇదే ఆస్పత్రిలో చేరింది. రమాదేవి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నర్సులు, ఆయాలు రమాదేవి అని పిలవడంతో ఆమె కుటుంబీకులకు బదులు రజిత పెద్దమ్మ మసూర్ వచ్చి నిలబడింది. మీ పాపకు మగ శిశువు జన్మించాడని సిబ్బంది ఆమె వద్ద రూ.వెయ్యి తీసుకొని బాబును అందజేశారు. అనంతరం గంట తరువాత రజిత సైతం ప్రసవించింది. అప్పుడు ఆస్పత్రి సిబ్బంది వచ్చి మసూర్ వద్ద ఉన్న మగ శిశువును మీ బిడ్డ కాదని చెప్పి.. రమాదేవి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో రజిత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. తమ కూతురికి పుట్టింది మగ శిశువేనని.. ఆస్పత్రి వర్గాలు తారుమారు చేశాయని ఆరోపిస్తూ సిబ్బందిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇరువర్గాల గొడవ నేపథ్యంలో శిశువులను ఆస్పత్రిలోని చైల్డ్‌వార్డ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, తమకు పుట్టిన చిన్నారిని ఆస్పత్రి ఆయానే తారుమారు చేసిందని రజిత భర్త ఛత్రునాయక్ ఆరోపిస్తున్నాడు. బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తే కుదరదనీ, డీఎన్ఏ పరీక్ష చేయాల్సిందేనని పట్టుబడ్డాడు. న్యాయం జరిగే వరకు ఆస్పత్రి నుంచి కదిలేది లేదని బాధిత కుటుంబం బైఠాయించింది. -
కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : మగపిల్లవాడు పుడితే ఆడపిల్లిను ఇచ్చారంటూ బాలింత రజిత బంధువులు మంగళవారం కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాలింత రజిత బంధువులతో పోలీసులు మాట్లాడుతున్నారు.