శిశువుల మార్పిడి వివాదానికి తెర పడింది. తనకు పుట్టింది ఆడశిశువు కాదు.. మగశిశువేనని ఆందోళనకు దిగిన రజిత అనే మహిళకు ఆడశిశువు జన్మించిందని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. మగశిశువు డీఎన్ఏతో మరో మహిళ రమాదేవి డీఎన్ఏ మ్యాచ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు శిశువులు, తలిదండ్రుల డీఎన్ఏ రిపోర్టును అధికారులు బుధవారం విడుదల చేశారు