సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించేందుకు న్యాయవాది కిరణ్మయిని అడ్వొకేట్ కమిషన్‌గా హైకోర్టు నియమించింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
కోఠి ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని కిరణ్మయిని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక గర్భిణీ లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను 2016లో హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment