ఈ-వైద్యం.. జిల్లా అంతటా! | his district, across-healing | Sakshi
Sakshi News home page

ఈ-వైద్యం.. జిల్లా అంతటా!

Published Fri, Nov 27 2015 1:06 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM

his district, across-healing

ప్రస్తుతం విజయవాడ,  జగ్గయ్యపేటల్లో
త్వరలో కైకలూరులో..  ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా
కలెక్టర్ బాబు.ఎ వెల్లడి

 
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా అంతటా త్వరలో ఈ-వైద్యం అమలుచేయనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ చెప్పారు. ఈ-హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టంపై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని ఆస్పత్రుల వివరాలు, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య తదితర వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ బాబు అక్కడినుంచి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఈ-వైద్యం ద్వారా ఆన్‌లైన్‌లో రోగి లక్షణాలను పొందుపరుస్తామని చెప్పారు. వాటిని వైద్యులు చూసి వైద్యపరీక్షలు అవసరమైన వారికి సూచనలు చేస్తారన్నారు.

వైద్యపరీక్షలు పూర్తయ్యాక రిపోర్టులను ఆన్‌లైన్‌లో ఉంచితే వైద్యాధికారి సమస్యను గుర్తించి మందులు ఇస్తారన్నారు. రోగులు ఆస్పత్రికి వెళ్లకుండా ఈ-వైద్యాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్ ద్వారా వైద్యసేవలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం విజయవాడ, జగ్గయ్యపేటల్లో ఈ సేవలు అందిస్తున్నామని, త్వరలో కైకలూరు, ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలుపరుస్తామని కలెక్టర్ వివరించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement