పౌరసరఫరాలో అక్రమాలకు చెక్ | Irregularities in the supply of civilian check | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాలో అక్రమాలకు చెక్

Published Sun, Jun 19 2016 8:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

పౌరసరఫరాలో అక్రమాలకు చెక్ - Sakshi

పౌరసరఫరాలో అక్రమాలకు చెక్

కలెక్టర్ చొరవతో ఈ-వాణి మెసేజ్‌లు
అందుబాటులోకి సప్లయ్ చేంజ్ మేనేజ్‌మెంట్ సిస్టం
ఆన్‌లైన్‌లో సరుకుల రవాణా వివరాల నమోదు

 
మహబూబ్‌నగర్ రూరల్ : రాష్ర్ట ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు చేపడుతుంది. గోదాంల నుంచి ఎంసీఎస్ పాయింట్లు, అక్కడి నుంచి రేషన్ షాపుల వరకు పంపిస్తున్న బియ్యాన్ని పారదర్శకంగా ఉండేలా వినూత్న చర్యలు చేపట్టింది. కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేక చొరవతో ఈ-వాణి ప్రాజెక్టును చేపట్టి చౌకధర దుకాణాలకు సరఫ రా జరిగే నిత్యావసరాల వివరాలను మె సేజ్ ద్వారా గ్రామస్తులు, ప్రజాప్రతిని ధులకు అందిస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద సరుకుల నిలువ వివరాలు, ఆర్‌ఓఆ ర్‌లు, ట్రక్‌షీట్స్ ఆన్‌లైన్ పద్ధతిలో ఉం చారు. దీని పర్యవేక్షణకు గాను సప్లయ్ చేంజ్ మేనేజ్‌మెంట్ సిస్టంను ప్రారంభిం చారు. ట్రాన్స్ గ్లోబల్ జియోమెటిక్ సిస్టం ద్వారా సరుకులను తీసుకెళ్లే వాహనాలకు పరికరాన్ని అమర్చి లారీలు గ మ్యస్థానానికి చేరుకున్నాయా.. లేదా.. పక్కదారి పట్టాయా  విషయాలు స్పష్టం గా తెలుస్తుంది. దీంతో అక్రమార్కుల చర్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
 
సక్రమంగా సరుకుల రవాణా..
మహబూబ్‌నగర్ మండలంలో ఎంసీఎస్ పాయింట్ ద్వారా వివిధ ప్రాంతాలకు నిత్యావసర సరుకులను సక్రమంగా రవాణా చేస్తున్నాం. ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలతో పారదర్శకంగా సరుకుల రవాణా జరుగుతుంది. కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారుల ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు సరుకుల రవాణా వివరాలను నమోదు   చేస్తున్నాం.- శంకర్, ఎంసీఎస్ పాయింట్ డిప్యూటీ తహసీల్దార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement