
సర్వే వివరాలను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్వేతామహంతి
అమరచింత: సమగ్ర భూసర్వే కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి అధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆమె అమరచింత తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి భూ సమగ్రసర్వే ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తహసీల్దార్ పాండునాయక్, వీఆర్‌ఓలతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తప్పొప్పులకు తావివ్వకుండా నిజమైన పట్టాదారుడికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
మండలంలో 6,994ఖాతాలు ఉండగా 5,561 ఖాతాల పూర్తి భేష్ అన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో వెనకపడడం ఏమిటని రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. వేగవంతంగా పూర్తిచేయాలని ఆమె తహసీల్దార్ పాండునాయక్‌కు ఆదేశించారు. వ్యవసాయశాఖ అధికారులు రెవెన్యూ సిబ్బందితో కలిసి సమగ్ర వివరాలను పొందుపరుస్తూ ఆన్‌లైన్ ప్రక్రియలను కొనసాగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల వ్యవసాయా«ధికారి మురళీధర్‌ను ప్రశ్నించారు. çసమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆమె వెంట ఆర్‌ఐ తిరుపతయ్య, వీఆర్‌ఓలు పాంచజన్య, వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.