land survey works
-
పోడు సర్వేకు బ్రేక్.. విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోడు సర్వేకు బ్రేక్ పడింది. ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు హత్యను నిరసి స్తూ అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాఖ సిబ్బంది గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేయడంతో పాటు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే గాందీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇక శుక్రవారం నుంచి డివిజన్, జిల్లా స్థాయిలో ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమ కు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేష న్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని నినదించారు. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్‌ను బహిర్గతం చేయాల న్నారు. ఇక ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన దర్యాప్తును పారదర్శకంగా చేయా లని డిమాండ్ చేశారు. నిందితులను తామే పట్టు కుని పోలీసులకు అప్పగించినట్లు ఉద్యోగులు తెలిపారు. దరఖాస్తులపై గందరగోళం.. పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. దర ఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోడు సర్వే చివరి దశకు చేరిందని ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది చెబుతున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతలోనే ఎఫ్ఆర్ఓ హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి. పోడు సర్వేలో అటవీ సిబ్బంది కీలకం కాగా.. వీరు లేకుండా రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వేకు వెళ్లే అవకాశాలు లేవు. ఇదీ చదవండి: Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి -
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..!
బ్రిటీష్ ప్రభుత్వ హయాం నుంచి మొన్నటి వరకూ గొలుసులతో సర్వే చేసేవారు. అందువల్ల ఎకరానికి కొన్ని అడుగులు/ కొన్ని గజాలు తేడా వచ్చేది. అధికారికంగానే కొంత అటూ ఇటూగా అనుమతించేవారు. దీంతో ఎప్పుడైనా క్రయవిక్రయాలు జరిగినప్పుడు హద్దుల విషయంలో అక్కడక్కడ గొడవలు చోటుచేసుకునేవి. ఇకపై ఇలాంటి గొడవలకు తావే ఉండదు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో రీ సర్వే చేస్తుండటం వల్ల సెంటీమీటర్లతో సహా లెక్క తేలుతోంది. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా ఉన్న భూ రికార్డులను స్వచ్ఛీకరణ చేసి, వివాదాలను పూర్తిగా రూపు మాపడమే లక్ష్యంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద చేపట్టిన రీ సర్వే వెయ్యికిపైగా గ్రామాల్లో దాదాపు పూర్తయింది. రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీసర్వేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పూర్తి చేశారు. వీటి ఆధారంగా మిగిలిన గ్రామాల్లో వేగంగా సర్వే ప్రక్రియ మొదలు పెట్టారు. దీంతో ఇప్పటి వరకు 529 గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఆ గ్రామాల్లో పాత భూముల రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా కొత్త భూముల రికార్డులు తయారయ్యాయి. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా పరిష్కరించి సరిహద్దులు నిర్ణయించారు. వాటి ప్రకారం గ్రానైట్ రాళ్లు కూడా పాతారు. తద్వారా ఆయా భూ యజమానులకు వారి భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. ఆ గ్రామాల్లో పక్కాగా రెవెన్యూ రికార్డులు రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు పక్కాగా రూపొందాయి. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్) స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం – భూ కమతాల మ్యాప్) పుస్తకం, ఆర్ఎస్ఆర్ స్థానంలో రీసర్వే ల్యాండ్ రిజిçస్టర్, కొత్త 1బి రిజిస్టర్, అడంగల్ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయి. ఇవన్నీ తాజా వివరాలు, తాజా భూ యజమానుల వివరాలతో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల్లో 1928లో బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేసి నిర్ధారించిన వివరాలు, అప్పటి భూ యజమానుల పేర్లు ఉన్నాయి.. ఇప్పటి వరకు సర్వే నంబర్లు ఉండగా, రీసర్వే తర్వాత ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు ఉంటాయి. ఎల్పీఎం పుస్తకంలో ప్రతి భూమికి సంబంధించిన మ్యాప్, యజమాని వివరాలు ఉంటాయి. క్యూ ఆర్ కోడ్ జియో కో ఆర్డినేట్స్‌తో ఎల్పీఎంలను ముద్రించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమి వివరాలు తెలుస్తాయి. ఈ గ్రామాల్లో చనిపోయిన వారి పేర్లతో ఉన్న భూములను హక్కుదారుల పేర్లతో మ్యుటేషన్ చేశారు. ప్రతి ల్యాండ్ పార్సిల్ (ల్యాండ్ బిట్)కు త్వరలో ఆధార్ తరహాలో ఒక విశేష గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం 37 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు సైతం ప్రారంభించారు. ఇదిలా ఉండగా మరో 652 గ్రామాల్లో రీ సర్వే తుది దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు (సర్వే పూర్తయినవి మినహా), 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని (అటవీ భూములు మినహా) భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి, హద్దులు నిర్ణయించే మహా యజ్ఞాన్ని 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అత్యాధునిక విధానంలో రీ సర్వే – ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో హైబ్రిడ్ తరహాలో కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహిస్తున్నారు. డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. – వేలాది గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉండడంతో ప్రైవేటు కంపెనీల నుంచి కూడా డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 26 జిల్లాల్లో 2,155 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోను వేగంగా డ్రోన్ సర్వే చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. – 782 గ్రామాలకు సంబంధించిన 7.76 లక్షల ఎకరాల్లో క్షేత్ర స్థాయి నిజనిర్ధారణ అంటే డ్రోన్ చిత్రాలతో, భూ యజమానుల సమక్షంలో వాస్తవ హద్దులను పోల్చి చూసే ప్రక్రియ పూర్తయింది. సర్వే నిర్వహణలో గ్రామ సచివాలయ వ్యవస్థలోని గ్రామ సర్వేయర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. 11,128 గ్రామ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ శాఖ సంప్రదాయ, ఆధునిక సర్వే విధానాలపై శిక్షణ ఇవ్వడంతో వారు చురుగ్గా పని చేçస్తున్నారు. ఆ గ్రామ సచివాలయంలో 102 రిజిస్ట్రేషన్లు – ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్పేటలో రీ సర్వే పూర్తయింది. ఇప్పుడు ఈ గ్రామంలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన ఎవరూ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లడం లేదు. భూములు, ఇళ్ల అమ్మకాలు, గిఫ్ట్ డీడ్లు వంటి రిజిస్ట్రేషన్లన్నీ గ్రామ సచివాలయంలోనే చేయించుకుంటున్నారు. – ఇప్పటి వరకు అక్కడ 102 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. రీసర్వే పక్కాగా జరగడంతో గ్రామ సచివాలయంలో పాత భూముల రికార్డుల స్థానంలో కొత్త రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. 1928లో బ్రిటీష్ హయాంలో చేసిన సర్వే ప్రకారం గ్రామంలో 1,251.37 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే తర్వాత 1,253.35 ఎకరాలు ఉన్నట్లు తేలింది. – గతంలో గ్రామ కంఠం 54 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 187 ఎకరాలకు పెరిగింది. వందేళ్లలో ఆ ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పడడం, పారిశ్రామిక ఇతర అభివృద్ధితో గ్రామ కంఠం పెరిగింది. ఫలితంగా పట్టా భూమి తగ్గినట్లు మండల సర్వేయర్ అనీష్ తెలిపారు. సర్వేకు ముందు భూ వివరాలు – మొత్తం భూమి : 1,251.37 ఎకరాలు – పట్టా భూమి : 889.38 ఎకరాలు – ప్రభుత్వ భూమి : 297.87 ఎకరాలు – గ్రామ కంఠం : 54.11 ఎకరాలు – అసైన్డ్ భూమి : 10.01 ఎకరాలు – మొత్తం సర్వే నంబర్లు : 240 – సబ్ డివిజన్లు : 467 రీ సర్వే తర్వాత.. – మొత్తం భూమి : 1,253.35 ఎకరాలు – పట్టా భూమి : 758.56 ఎకరాలు – ప్రభుత్వ భూమి : 297.87 ఎకరాలు – గ్రామ కంఠం : 187.23 ఎకరాలు – అసైన్డ్ భూమి : 9.69 ఎకరాలు – మొత్తం ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు) : 610 ఏపీ రీసర్వేపై ఇతర రాష్ట్రాల ఆసక్తి ఏపీలో రీసర్వే గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మహారాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చి రీ సర్వేపై వివరాలు సేకరించింది. క్షేత్ర స్థాయికి వెళ్లి మరీ వాస్తవాలు తెలుసుకుని హర్షం వ్యక్తం చేసింది. అనుకున్నదానికంటే రీ సర్వే చక్కగా సాగుతోంది. వెయ్యికి పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. రికార్డుల స్వచ్ఛీకరణ నుంచి కొత్త భూ రికార్డులు రూపొందించే వరకు 16 దశల ప్రక్రియను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన గడువులోపు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తవుతుంది. – కెజియా కుమారి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ అధికారులే హద్దులు నిర్ణయించి రాళ్లు పాతారు నాకు, నా తమ్ముడికి కలిపి 4.17 ఎకరాల పొలం ఉంది. సర్వేలో కొలతలు బాగా వచ్చాయి. సర్వే చేశాక అధికారులే హద్దులు నిర్ణయించి రాళ్లు పాతించారు. మేమే రాళ్లు కొనుక్కోవాలంటే రూ.4, 5 వేలు ఖర్చవుతుంది. ప్రభుత్వమే రాళ్లు పాతించడం పట్ల ఆనందంగా ఉంది. – మోచర్ల నాగయ్య, రైతు, షేర్ మహ్మద్‌పేట, జగ్గయ్యపేట మండలం ఖర్చు లేకుండా సర్వే చేశారు సర్వే నంబర్ 45లో నాకు ఉన్న 6 ఎకరాల పొలాన్ని రూపాయి ఖర్చు లేకుండా సర్వే చేసి, హద్దులు నిర్ణయించారు. నేను సర్వే చేయించుకోవాలంటే చాలా రోజులు పట్టేది. డబ్బూ ఖర్చయ్యేది. కానీ అధికారులే స్వయంగా వచ్చి సర్వే పూర్తి చేసి, హద్దు రాళ్లు పాతారు. చాలా సంతోషంగా ఉంది. – కాకనబోయిన బిక్షమయ్య, రైతు, షేర్ మహ్మద్‌పేట, జగ్గయ్యపేట మండలం -
భూముల డిజిటల్ సర్వేకు ప్రత్యేక నెట్వర్క్
భూ సమస్యలకు పరిష్కారం.. రెవెన్యూ శాఖ ప్రతిపాదించిన విధంగా ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేసి భూమి పార్శిళ్ల విస్తీర్ణాన్ని నిర్ధారిస్తే చాలా వరకు భూముల సర్వేకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడంతోపాటు నిజాం కాలం నాటి రికార్డుల సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. పక్కాగా వివరాలు.. ఇలా చేస్తే సర్వే నంబర్ల వారీగా సబ్ డివిజన్ల పరిధిలోని భూముల విస్తీర్ణం నిర్ధారణ అవుతుంది. ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉందో తేలి పోనుంది. దీని ఆధారంగానే కొత్త రికార్డులు తయారు చేయాల్సి ఉంటుంది. అంటే భూములకు టైటిల్ గ్యారంటీ ఇవ్వడమే. చిక్కుముళ్లూ ఉన్నాయి.. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు ద్వారా భూముల విస్తీర్ణాన్ని తేలిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తాయి. తన పాస్ పుస్తకంలో ఉన్న వివరాల మేరకు గుంట భూమి తగ్గినా రైతు అంగీ కరించడు. పెరిగిన విస్తీర్ణం మేరకు జరి గేందుకు సరిహద్దు రైతులు ఒప్పుకోరు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూవివాదాల సమస్యకు శాశ్వతంగా తెరదించడంతోపాటు భూ రికార్డుల తారుమారుకు వీల్లేని విధంగా భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇందులో భాగంగా భూముల హద్దులే కాకుండా వాటి విస్తీర్ణాన్నీ ఖరారు చేయాలనే యోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో కేవలం భూముల హద్దులు (బౌండరీలు) మాత్రమే నిర్ధారించగలమని, ఆయా భూముల విస్తీర్ణం తేల్చలేమని భావిస్తున్న రెవెన్యూ శాఖ... ఇందుకోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విజువల్ రిఫరెన్స్ స్టేషన్స్ (వీఆర్ఎస్)–గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరిజ్ఞానాలను ఉపయోగించి రూపొందించే ఈ నెట్‌వర్క్‌తో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ల (జీసీపీ)ను అనుసంధానించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించి తీసిన భూముల చిత్రాలను వాడాలని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత విధానంలో సాధ్యం కాదు... డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో ప్రస్తుతమున్న భూమి హద్దులను అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా గుర్తించగలమని రెవెన్యూ (సర్వే) శాఖ అంటోంది. వాటి ఆధారంగా భూముల విస్తీర్ణం తేల్చడం సాధ్యం కాదని, ఇందుకోసం 2డీ సాంకేతిక పరిజ్ఞానంతో అక్షాంశ, రేఖాంశాల ఉపరితల కొలతలను లెక్కకట్టాల్సి ఉంటుందని చెబుతోంది. ఇలా లెక్క కట్టేందుకు అనుభవం, నైపుణ్యంగల సర్వేయర్లు పెద్ద సంఖ్యలో అవసరం అవుతారని, అంత మంది సర్వేయర్లను సమకూర్చుకోవడం సాధ్యం కాదని తేల్చింది. ఒకవేళ అలా లెక్కకట్టినా నిజాం కాలంలో తయారైన రికార్డుల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే ఈ కొలతల ద్వారా తేల్చే విస్తీర్ణం తక్కువ వస్తుందని అంచనా వేస్తోంది. అప్పుడు రికార్డులన్నింటినీ సవరించాల్సి ఉంటుందని, ఇందుకు చాలా ఖర్చు అవడంతోపాటు సమయం వృథా అవుతుందని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరించింది. తరుణోపాయం ఏమిటి? ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జనలు పడిన రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి 3డీ డిజిటల్ టెర్రయిన్ మోడల్‌ను తయారు చేసింది. ఈ పద్ధతిలో ఉపయోగపడేలా 10 సెంటీమీటర్ల ప్రాదేశిక స్పష్టత వచ్చే విధంగా డ్రోన్ల ద్వారా భూముల చిత్రాలను సేకరించింది. ఈ చిత్రాలను వర్చువల్ గ్రౌండ్ పాయింట్లుగా పరిగణనలోకి తీసుకోనుంది. ఈ చిత్రాల జియో రిఫరెన్స్ ద్వారా భూముల సరిహద్దు పాయింట్లను 5 సెంటీమీటర్లకు అటుఇటుగా నిర్ధారించనుంది. ప్రతి గ్రామంలోని భూముల విస్తీర్ణ హద్దులు చెరిగిపోకుండా ట్రై, బై జంక్షన్లను తయారు చేసి వాటిని జీసీపీలుగా, రెఫరెన్స్ స్టేషన్లుగా ఉపయోగించుకోనుంది. ఇప్పటికే డిజిటల్ సర్వే కోసం ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఈ విధానం ద్వారా గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ల (జీసీపీ) కోఆర్డినేట్లను నిర్ధారించింది. ఇప్పుడు ఈ జీసీపీలను ప్రత్యేక నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా హద్దుల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించడమే కాక భూ విస్తీర్ణం లెక్కలను కూడా తేల్చనుంది. -
Digital Survey of Agricultural Lands: ‘సర్వే’త్రా చర్చ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములను డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజానీకం ఈ అంశాన్ని నిశితంగానే పరిశీలిస్తోంది. భూములను సర్వే ఎలా చేస్తారనే విషయంతో పాటు తమకేం కావాలన్న దానిపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. తమ అనుభవంలో ఉన్న భూమిని సర్వే చేస్తే అందుకు సంబంధించిన పటం పక్కాగా ఉండాలి. ఆ పటం ఆధారంగా తమ భూమిని ఎక్కడి నుంచైనా గుర్తించగలగాలి. కొలవగలగాలి. క్రయ, విక్రయ లావాదేవీలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదని ప్రజలు భావిస్తున్నారు. ఇలావుండగా.. సర్వే నిర్ణయం సహేతుకమైందేనని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ప్రతి 30 ఏళ్లకు ఒక్కసారి ఈ సర్వే జరగాలి. ఒక అంచనా ప్రకారం 30 ఏళ్ల కాలంలో భూమి స్వభావం లేదంటే యాజమాన్య హక్కుల్లో మార్పులు జరుగుతాయి. దాదాపు 80 శాతం భూముల్లో ఈ మార్పు సంభవిస్తుంది. ఇందుకోసమే తాజా రికార్డులు (వివాదాలకు ఆస్కారం లేని) అందుబాటులో ఉండాలి. అయితే, ఒక్క సర్వేకు మాత్రం పరిమితం కాకుండా ఆ భూములపై యాజమాన్య హక్కులను సెటిల్ కూడా చేయాలి. లేదంటే తేనెతుట్టెను కదిపినట్టే అవుతుందని స్పష్టం చేస్తున్నారు. డిజిటల్ సర్వే ఇలా.. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం రాష్ట్రంలోని భూములను డిజిటల్ సర్వే చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన ఏజెన్సీ రైతుల భూముల వద్దకు వెళ్లి ఆ భూమి హద్దులు చూపించమని అడుగుతారు. నాలుగువైపులా ఉన్న ఇతర భూముల యజమానులతో వివాదాలున్నాయో లేవో అడిగి తెలుసుకుంటారు. ఎలాంటి వివాదాలు లేనిపక్షంలో జీపీఎస్ లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టూల్‌ను ఉపయోగించి హద్దులు నమోదు చేసుకుంటారు. నాలుగు మూలలా ఆ భూమి అక్షాంశ, రేఖాంశాలు నమోదు చేసిన తర్వాత వచ్చే చుక్కల ఆధారంగా ఒక మ్యాప్ (పటం) గీస్తారు. దీంతో డిజిటల్ సర్వే పూర్తవుతుంది. ఈ మ్యాప్‌ను రైతుల పాస్‌పుస్తకంలో ఒక పేజీగా జత చేస్తారు. ప్రస్తుతానికి వివాదాలు లేని భూములు, వివాదాలున్న భూములను రెండింటినీ పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేసి ముందుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఎలాంటి సమస్యలొస్తాయి..? వివాదాలు లేని భూములు, ప్రభుత్వ శాఖల మధ్య వివాదాలున్న భూములపై పైలట్ సర్వేతో ఎలాంటి సమస్యలు రావని, విస్తృతంగా సర్వే చేసినప్పుడే సమస్యలు వస్తాయని నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రతి సర్వే నంబర్‌కు టిప్పన్ (రికార్డు)లున్నాయి. ఈ టిప్పన్లన్నింటినీ కలిపి గ్రామ నక్ష (మ్యాప్)లు తయారు చేశారు. ఈ నక్షలో ఎంత విస్తీర్ణం ఉంటే ఆ టిప్పన్లన్నింటి విస్తీర్ణం కూడా అంతే ఉండాలి. అయితే ఫలానా సర్వే నంబర్లో ఇంత భూమి ఉన్నట్టుగా రికార్డుల్లో పేర్కొన్న దానికి, సదరు రైతు అనుభవంలో ఉన్న వాస్తవ విస్తీర్ణానికి తేడా ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ సర్వే చేస్తే క్షేత్రంలో ఉన్న భూమి మాత్రమే నమోదవుతుంది. అప్పుడు రైతు భావిస్తున్న లేదంటే పాస్ పుస్తకంలో ఉన్న విస్తీర్ణానికి, డిజిటల్ సర్వే ద్వారా వచ్చే విస్తీర్ణానికి తేడా వస్తుంది. మరోవైపు ఫలానా రైతుకు ఫలానా గ్రామంలోని ఫలానా సర్వే నంబర్లో ఇంత విస్తీర్ణంలో భూమి ఉందని రికార్డులు పేర్కొంటాయి. అలా ఆ రైతుకు భూమి ఉన్న మాట వాస్తవమే అయినా సర్వే నంబర్లో తేడాలుంటాయి. రికార్డులో ఒక సర్వే నంబర్ ఉంటే రైతు ఇంకో సర్వే నంబర్లో భూమిని కలిగి ఉంటాడు. గత 80 ఏళ్లుగా సర్వే జరగలేదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువగానే వస్తాయని రెవెన్యూ వర్గాలు అంచనా. మరో వైపు రాష్ట్రంలో దాదాపు 20–40 శాతం భూములకు సంబంధించిన టిప్పన్లు అందుబాటులో లేవు. భూములకు హద్దు రాళ్లు లేవు. అలాంటప్పుడు టిప్పన్ (రికార్డు) లేకుండా, హద్దులు గుర్తించకుండా సర్వే ఎలా జరుగుతుందన్నది ప్రశ్నార్థకమవుతోంది. ఈ సమస్యలు పరిష్కరించకుండా కేవలం సర్వేకు పరిమితం కావడం వల్ల సమస్యలు వస్తాయే కానీ శాశ్వత రక్షణ లభించదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది..? దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో భూముల సర్వే జరిగింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా భూములను సమగ్రంగా సర్వే చేస్తోంది. గ్రామాల వారీగా వీఆర్వోలు, సర్వేయర్లు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బందితో కలిసి సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకుంటూ టైటిల్ గ్యారంటీ కట్టబెడుతూ సర్వేకు పూనుకుంది. కర్ణాటకలో గత రెండు దశాబ్దాలుగా ఇంక్రిమెంటల్ సర్వే అమల్లో ఉంది. అంటే లావాదేవీలు జరిగినప్పుడల్లా ఆ భూమిని సర్వే చేస్తారు. అలా సర్వే చేసిన రికార్డును మాత్రమే రిజిస్టర్ చేస్తారు. ఈ పద్ధతి వల్ల 90 శాతానికి పైగా భూవివాదాలు పరిష్కారం అయ్యాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఒడిశా, బిహార్‌లు కొత్త సర్వే చట్టాలను తయారు చేసుకుని సర్వేకు పూనుకున్నాయి. రాజస్తాన్ టైటిల్ సర్టిఫికేషన్ చట్టం తీసుకురాగా, మహారాష్ట్ర టైటిల్ గ్యారంటీకి సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రూపొందించుకుంది. ప్రజల మేనిఫెస్టోలో తొలి ప్రాధాన్యత సర్వేదే భూములు సర్వే చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముదావహం. ఇది ప్రజల అభిప్రాయానికి విలువివ్వడమే. ఎందుకంటే తెలంగాణ ప్రజల మేనిఫెస్టోలో తొలి ప్రాధాన్యత సర్వేదే. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు మేము 4 బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని 3 వేల కిలోమీటర్లు పర్యటించి, 10 వేల మందితో మాట్లాడి.. 1,000 మందిని కెమెరా ముందు మాట్లాడించిన తర్వాత కూడా సర్వే అభిప్రాయమే స్పష్టమైంది. అయితే సర్వేతో పాటు సెటిల్మెంట్ కూడా అనివార్యం. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ మన ప్రభుత్వం ఏం చేయాలి.. కేవలం సర్వేతో పరిమితం కాకుండా సెటిల్మెంట్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో సర్వే, హద్దుల చట్టం–1923 అమల్లో ఉంది. ఇప్పుడు సర్వే సమగ్రంగా చేయాలంటే కొత్త చట్టం తీసుకురావాలి. భూరికార్డులకు గ్యారంటీ ఇస్తూ టైటిల్ గ్యారంటీ చట్టం లేదంటే ఒడిశా, బిహార్ తరహాలో కొత్త చట్టం అమల్లోకి తేవాలి. సర్వే అంటేనే వివాదాలు వస్తాయి కనుక వివాద పరిష్కార వ్యవస్థను తీసుకురావాలి. మండల లేదా గ్రామ స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. పేదలు, నిరక్షరాస్యులకు అండగా ఉండేందుకు పారా లీగల్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలి. సర్వే రికార్డులను భద్రపరిచేందుకు గాను బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను రూపొందించాలని కూడా నిపుణులు చెబుతున్నారు. -
జిల్లా వ్యాప్తంగా రీ సర్వే
ఇళ్లు, వాకిళ్లు, పంట పొలాలు.. వీటిలో కొన్నింటిలో సరిహద్దు వివాదాలు.. సర్వే నంబర్లతో కుస్తీపట్లు.. అడంగళ్లలో తప్పులు.. పొరపాట్లతో న్యాయస్థానాల్లో సహితం తేలని పంచాయితీలు. మరోవైపు వరి, కొబ్బరి, ఆక్వా, రియల్ ఎస్టేట్‌గా మారుతున్న భూములు... రోజుల్లోనే మారిపోతున్న ఆయకట్టు భూములు.. ఒకరికి ఇవ్వాల్సిన రాయితీ మరొకరికి.. సాగు చేయకున్నా పరిహారం పొందేవారు ఒకరు..పొలం ఉన్నా పరిహారం పొందలేని దురదృష్టవంతులు మరికొందరు.ఇటువంటి సమస్యలకు సరైన పరిష్కారం చూపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కదులుతోంది. మొత్తం భూమిని రీ సర్వే చేయాలని యోచిస్తోంది. కోర్టు కేసులు, వివాదాలు ఉన్న భూములకు స్వల్ప కాలిక ప్రణాళికలో రీ సర్వే చేయించాలని, మొత్తం సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక సర్వే చేపట్టేందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు ఏళ్ల తరబడి సమయం పట్టినా పక్కాగా రీ సర్వే చేయించాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ఉందని సమాచారం. సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను ప్రభుత్వం రీ సర్వే చేయించనుంది. రెవెన్యూతో పాటు కీలక శాఖల అధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించే పనిలో ఉన్నారు. తూ.గో జిల్లాలో సహితం ఈ సర్వే జరగనుంది. ఇళ్లు, స్థలాలు, పొలాలు, తోటలు, చెరువులు.. ఇలా ప్రతి భూమినీ సర్వే చేయాలని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు ఆయకట్టు, ఇతర భూముల సరిహద్దులు, సర్వే నంబర్లను కచ్చితంగా పొందుపరచడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. రాష్ట్రం మొత్తంమీద అన్ని రకాల భూములనూ సర్వే చేయడం దాదాపు అసాధ్యమే అయినా.. దీనినుంచి మంచి ఫలితాలు వస్తాయ న్న భావనతో ప్రభుత్వం ఈ సర్వేకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సమగ్ర సర్వే చేయడానికి కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందని అం చనా. స్వల్పకాలిక, దీర్ఘకాలి క సర్వేలు చేయించాలని ప్రా థమికంగా నిర్ణయించారు. ఒకవైపు దీర్ఘకాలికంగా సర్వే చేయిస్తూనే... మరోవైపు వివా దాలు ఉన్న భూములకు స్వల్ప కాలిక సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోజనాలెన్నో.. ఇళ్లు, పంట పొలాల సరిహద్దుల వద్ద పలు సందర్భాల్లో ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. భూముల సర్వే వల్ల ఇటువంటి వివాదాలు చాలావరకూ సమసిపోతాయి. కొత్తగా వచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో జరుగుతున్న మోసాలకు ఈ సర్వే వలన చెక్ పడనుంది. ఒకే సర్వే నంబరుతో జరిగిన రిజస్ట్రేషన్ల బాగోతాలు కూడా బయటపడనున్నాయి. భూ సర్వేతో మొత్తంగా 90 శాతం భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రధానంగా ఆయకట్టు నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటివరకూ పాత లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల రైతులకు ఇచ్చే రాయితీలు.. పరిహారాల విషయంలో అనర్హులు లాభపడడం, అర్హులు నష్టపోవడం జరుగుతోంది. ఇటువంటి వాటికి ఈ సర్వే వలన చెక్ పడుతుంది. జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి, కొబ్బరి, ఆయిల్‌పామ్ తదితర పంటలకు చెందిన భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, ఆక్వా చెరువులుగా మారిపోయాయి. ► జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం గోదావరి మధ్యడెల్టా ఆయకట్టు 1.80 లక్షల ఎకరాలు. కానీ వాస్తవ సాగు 1.20 లక్షలు కూడా ఉండదని అంచనా. ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు 1.20 లక్షల ఎకరాలను పరిగణనలోకి తీసుకుని సాగునీరు విడుదల చేయడం, వ్యవసాయ రాయితీలు ఇవ్వడం, ధాన్యం దిగుబడి అంచనా వేయడం చేస్తూంటాయి. ► తూర్పు డెల్టా ఆయకట్టు 2.70 లక్షల ఎకరాలు. కానీ ఇక్కడ వరి సాగు జరిగేది మాత్రం రెండు లక్షల ఎకరాలు కూడా ఉండదు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ)లో 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా వాస్తవ సాగు 22 వేల ఎకరాలు మాత్రమే. రీ సర్వేలో వాస్తవ ఆయకట్టు బయటపడనుంది. ► ఆయకట్టు మార్పులకు సంబంధించిన తాజా వివరాలు అటు ఇరిగేషన్, ఇటు వ్యవసాయ, రెవెన్యూ అధికారుల వద్ద లేవు. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా రైతులు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన పొలాలు, తోటల మీద కూడా కొంతమంది పరిహారం పొందుతున్నారు. ఈ సర్వే వల్ల ప్రభుత్వానికి సహితం రాయితీ, పరిహారాల్లో కోట్లాది రూపాయల మేర ఆదా అయ్యే అవకాశముంది. ► కబ్జాల బారిన పడిన దేవస్థానం భూములు సహితం రీ సర్వేలో బయటపడతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భూముల రీ సర్వేకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశముంది. ఇప్పుడున్న సర్వే పరికరాల కన్నా ఆధునిక పరికరాలను రీ సర్వే కోసం వాడనున్నారు. ప్రస్తుతం రెవెన్యూలో సర్వే సిబ్బంది అంతంతమాత్రంగానే ఉన్నారు. వీరి సంఖ్యను గణనీయంగా పెంచాల్సి ఉంది. అయితే జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న గ్రామ సచివాలయ వ్యవస్థలో సర్వే చేసేందుకు ఒకరిని నియమిస్తారని, తద్వారా రీ సర్వేను వేగవంతం చేస్తారని తెలుస్తోంది. లెక్క తేల్చేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం భూముల రీ సర్వే ద్వారా ఆయకట్టు లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనివల్ల దీర్ఘకాలికంగా సామాన్య ప్రజలు, రైతులు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశముంది. భూ వివాదాలను చాలా వరకూ పరిష్కరించే అవకాశముంది. సమగ్ర సర్వే వల్ల మన జిల్లాలో ఆయకట్టుపై స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశముంది. ఇటీవలి కాలంలో వరి స్థానంలో ఉద్యాన పంటలు, ఆక్వా పెరిగాయి. దీనివల్ల ఆయా పంటలకు అందే ప్రయోజనాలు రైతులకు పూర్తిస్థాయిలో అందనున్నాయి. – జిన్నూరి రామారావు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు, -
'సర్వే'జనా సుఖినోభవంతు
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రామయ్యకు ఓ సర్వే నంబరులో వాస్తవానికి 0.50 ఎకరం భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో కేవలం 0.45 సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదు చేశారు. వ్యత్యాసం సరిచేయాలని సర్వే కోసం(ఎఫ్–లైన్) దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి రామయ్యకు భూమి ఉన్న సర్వే నంబరులో మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు. రామయ్యకు ఉన్న అర ఎకరా మాత్రమే సర్వే చేస్తే సరిపోదు. మొత్తం 10 ఎకరాల భూమిని సర్వే చేయాల్సి ఉంది. ఇతర రైతులు అంగీకరించకపోవడం, దీర్ఘకాలిక పంటలు వేయడంతో సర్వే నిలిచిపోయింది. వీరయ్యకు ఒక సర్వే నంబరులో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ సర్వే నంబరు నాలుగు సబ్ డివిజన్లు చేశారు. ఇందులో ఒక సర్వే సబ్ డివిజన్లో కొంత అసైన్డ్ భూమి ఉంది. తన కూతురు పెళ్లికోసం వీరయ్య భూమి అమ్మేశాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే సదరు సర్వే నంబరులో అసెన్డ్ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. సర్వే చేయించి సర్టిఫికెట్ తేవాలని రిజిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. వీరయ్య అవసరాన్ని గుర్తించిన సర్వేయర్లు, డబ్బులు ఇస్తేగానీ సర్వే చేయబోమని నిరాకరించారు. ఇవి ఏ ఒక్క గ్రామానికో పరిమితమైన çసమస్యలు కాదు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇవే ప్రధాన సమస్యలు. 7 ఎకరాల భూమి, ఒకే సర్వే నంబరు, 15 మంది భూ యజమానులు. సర్వే సబ్ డివిజన్ జరగలేదు. సరిహద్దుల విషయంలో వారి మధ్య వివాదం. రైతులు పోలీస్ స్టేషన్, కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ఇటువంటి వివాదాలను గ్రామాల్లో సాధారణంగా చూస్తుంటాం. భూముల సర్వే అసమగ్రంగా ఉండడం వల్ల రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి పొంతన లేని పరిస్థితి నెలకొంది దీంతో భూవివాదాలు నెలకొంటున్నాయి. వీటన్నిటికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూముల సమగ్ర రీ సర్వే జరపాలని నిర్ణయించింది. వాస్తవానికి ప్రతి 30ఏళ్ల కోసారి భూములు రీ సర్వే చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో భూ వివాదాలు పెరిగిపోయాయి. 1954కు పూర్వం భూముల రీ సర్వే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు భూముల రీ సర్వే ఊసే లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వే బిల్లును బడ్జెట్ సమావేశాల్లో పెట్టేందుకు కసరత్తు చేసింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తరతరాల భూవివాదాలకు పరిష్కారం లభించినట్లేనని రైతులు భావిస్తున్నారు. రీసర్వే పూర్తి చేస్తే గ్రామాల్లో రైతుల మధ్య సమస్యలు సమసి పోతాయని, నిజమైన భూ యజమానులకు సర్వహక్కులు లభిస్తాయి. రీ సర్వే ప్రక్రియ సత్వరమే కార్యరూపం దాల్చాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దశాబ్దాల కిందట రీసర్వే.. ఎప్పుడో దశాబ్ధాల కిందట భూముల రీ సర్వే జరిగింది. అప్పట్లో తయారు చేసిన ఫీల్డ్ మెజర్ మెంట్ బుక్(ఎఫ్ఎంబీ) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని చెదలు పట్టి పాడైపోగా, మరికొన్నింటిని భూ వివాదాల నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందే ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అసలు ఎఫ్ఎంబీ లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఎఫ్ఎంబీ సక్రమంగా లేదు. వీరులపాడు మండలంలో జయంతి గ్రామంలో ఎఫ్‌ఎంబీని ఇక్కడ పనిచేసిన రెవెన్యూ సిబ్బంది సగానికి పైగా ధ్వంసం చేశారు. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి పొంతన లేని పరిస్థితి. రైతుల మధ్య వివాదాలు వస్తే పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రైతులు కోర్టులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మండలాల్లో భూమలు సర్వేకు సంబంధించిన ఎఫ్–లైన్ పిటిషన్లు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో ఈ ఏడాది ఎఫ్–లైన్ కోసం వచ్చిన దరఖాస్తులు - 1298 సర్వే సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు -130 మంది దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తున్నాం రైతులు సర్వే కోసం ఆన్లైన్లో ఎఫ్–లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులో మండల సర్వేయర్ వాటిని పరిష్కరిస్తారు. రైతులనుంచి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఏవైనా వివాదాలు ఉంటే తప్ప అన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. – కృష్ణప్రసాద్, డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వే -
సర్వేశ్వరా !
తంబళ్లపల్లె మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన రామప్ప అనే రైతు తగాదాలో ఉన్న తన పొలాన్ని కొలవాలని మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అతని సమస్య ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదు. పిచ్చాటూరు మండలంలోని రాజనగరం గ్రామానికి చెందిన Ôశంకరప్ప అనే భూ యజమాని తన స్థలాన్ని కబ్జా చేసారని, తన భూమిని కొలవాలని గత ఏడాది డిసెంబర్లో మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. నెలలు గడిచినా సర్వేయర్ రాకపోవడంతో, తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. మీసేవ దరఖాస్తు తమకు అందలేదని సమాధానం. చేసేది లేక ఆయన ప్రైవేట్ సర్వేయర్‌ను ఆశ్రయించాడు. చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వమేమో ఒక పక్క రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే జిల్లాలో క్షేత్రస్థాయిలో సర్వేయర్లు లంచం లేనిదే విధులు నిర్వహించరనే విమర్శలున్నాయి. భూ కొలతల కోసం అర్జీ అందజేసే సామాన్యులు, రైతుల నుంచి ఆమ్యామ్యాలు తీసుకున్నాకే విధులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆమ్యామ్యాలు ఇవ్వడానికి వెనకాడితే వాళ్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారు. సర్వే శాఖపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలు జరపకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటలా తయారైంది. సర్వే నిమిత్తం వచ్చేఅర్జీదారులను ముప్పుతిప్పలు పెడుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. భూ కొలతలకు సంబంధించి అర్జీలు చేసుకుంటున్న వారి స్థలం విస్తీర్ణాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. ఈ విధంగా అక్రమ సంపాదనకు అలవాటు పడిన సర్వేయర్లు ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా లెక్కపెట్టే స్థితిలో లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది సర్వేయర్లు ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ప్ర జలు తమ భూమిని సర్వే చేయించుకోవా లంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పెండింగ్‌లో దరఖాస్తులు జిల్లాలోని 66 మండలాల్లో మూడు నెలలుగా 2,786 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్ల అలసత్వం కారణంగానో.. ముడుపులు అందని కారణంగానో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల, జిల్లా స్థాయిలో దరఖాస్తులు కొండలా పేరుకుపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. కొన్ని దరఖాస్తులకు మోక్షం లభించడం లేదని తెలుస్తోంది. సాధారణంగా రైతుల మధ్య భూముల హద్దులకు సంబంధించి వివాదాలు, సమస్యలు తలెత్తినప్పుడు లేదా భూముల క్రయవిక్రయాల సందర్భంగా హద్దులను క్షేత్రస్థాయిలో అధికారికంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు తదితర సమయాల్లో ప్రభుత్వ సర్వేయర్ల అవసరం ఏర్పడుతుంది. గ్రామస్థాయిలో కొలతల కోసం మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకుంటారు. ఆ దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాలకు చేరుతాయి. ఆ దరఖాస్తులను రెవెన్యూ శాఖ సర్వేయర్లు పరిశీలించి, కొలతలు వేసి హద్దులను నిర్ణయించి, అధికారికంగా నివేదికలను సమర్పిస్తారు. సంబంధిత అర్జీదారుని భూములను సర్వే చేసేందుకు ఫలానా తేదీన భూమి దగ్గరకు వస్తున్నామని, అందుబాటులో ఉండాలని నోటీసులు పంపాల్సి ఉంటుంది. కానీ వారికి ముడుపులు అందలేదనే కారణంతో ఏదో ఒక సాకు చెప్పి తరచూ వాయిదాలు వేస్తున్నారని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొరవడిన పర్యవేక్షణ సర్వే శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సర్వేయర్లు ఆడిందే ఆటగా మారిందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ శాఖకు సంబంధించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చాలా అవసరం. ప్రస్తుతం వారు పని ఒత్తిడిలో ఉండడంతో సర్వేయర్లు తమ ఇష్టానుసా రం ప్రవర్తిస్తున్నారు. సర్వేయర్లు భూము ల కొలవకపోవడంతో రైతులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వ సర్వేయర్లకు లంచాలు ఇచ్చుకోలేక, ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. -
రైతులు సతమతం
మోర్తాడ్(బాల్కొండ): రైతు సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఓవైపు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవసాయ శాఖలో అన్ని హోదాల్లో ఉన్న ఉద్యోగులకు అప్పగించింది. ఇలా ఏక కాలంలో రెండు ప్రధాన బాధ్యతలను నిర్వర్తించాల్సి రావడంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. రైతులు పండించే పంటలు, వారికి ఉన్న భూమి వివరాలు, వ్యవసాయ పరికరాలు తదితర అంశాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమగ్ర సర్వేను ప్రారంభించింది. మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసి, ఆ సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు, పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ శాఖల ఉద్యోగులతో పాటు వ్యవసాయ శాఖ ఉద్యోగులను కూడా ఎన్నికల సంఘం నియమించింది. వ్యవసాయ శాఖలోని అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను జెడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులుగా, మండల వ్యవసాయాధికారులను ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. ఏఈవోలను పోలింగ్ అధికారులుగా, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన అధికారులు నామినేషన్ల స్వీకరణలో బిజీగా ఉన్నారు. పీవో, ఏపీవోలుగా నియమితులైన వారు ఎన్నికల నిర్వహణ శిక్షణలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రైతు సమగ్ర సర్వేను నిర్వహించాల్సి ఉంది. అటు ఎన్నికల బాధ్యతలు, ఇటు రైతు సర్వేను ఒకే సమయంలో నిర్వహించడం తమకు సాధ్యం కావడం లేదని, అందువల్ల ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయించింది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం వ్యవసాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి తప్పించలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందుగానే వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించామని, అందువల్ల రైతు సమగ్ర సర్వే కోసం వారిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించడం కుదరదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎక్కువగా ఉండటంతో అన్ని శాఖల ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు వారు పేర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందుగానే రైతు సమగ్ర సర్వే పూర్తి చేయాల ని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది. ఎన్నికలకు సంబంధించిన విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తినా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ శాఖ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కనీసం ప్రభుత్వం పునరాలోచన చేసి సమగ్ర సర్వేకు గడువు పెంచితే బాగుంటుందని వారు కోరుతున్నారు. తప్పడం లేదు ఎన్నికల విధుల నిర్వహణ, రైతు సమగ్ర సర్వే ఏకకాలంలో నిర్వహించాల్సి రావడం కొంత ఇబ్బందే. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో తప్పనిసరిగా ఎన్నికల విధులను నిర్వహించాల్సిందే. సమగ్ర సర్వేకు ఆటంకం కలుగకుండా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
లెక్క తేలుస్తారు..
హన్మకొండ: వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పంట కాలనీలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది. ఇందుకోసం మార్గాలను ఆధ్యయనం చేసేందుకు పంటల సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించి సేకరించాల్సిన అంశాలతో ప్రొఫార్మా రూపొందించింది. జిల్లాలో వ్యవసాయ శాఖ పం టల సమగ్ర సర్వే ప్రారంభమైంది. వ్యవసాయ విస్తరణాధికారులు సేకరించిన రైతుల వివ రాలను ప్రభుత్వం రూపొందించిన ప్రొఫార్మాల్లో పొందుపరుస్తున్నారు. మరోసారి సమగ్ర సర్వే.. తెలంగాణ ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే, భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, రైతు బీమా పథకాల కోసం చేసినట్లుగానే మరో సమ గ్ర సర్వేకు సిద్ధమైంది. రైతుల ఆదాయాన్ని రెట్టిం పు చేయాలనే ఉద్దేశంతో వారు సాగు చేస్తున్న పంటల వివరాలు సాగునీటి వసతి, భూవివరాల వంటి మొత్తం 39 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా పంట కాలనీలు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తెలుసుకునేందుకు ఈ సర్వేను ప్రభుత్వం చేపడుతోంది. దీని ఆధారంగా ఏ గ్రామంలో పంట కాలనీలు నెలకొల్పాలి, ఏ పంటలు పండించాలనేది నిర్ధారించనున్నారు. అలాగే స్థానికంగా పండిన పంటలతో ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. జిల్లాలో 75 వేల మంది రైతులు ఉన్నారు. జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన ప్రకారం 3,17,483 ఎకరాల భూమి ఉండగా వ్యవసాయ యోగ్యమైన భూమి 2,19,413 ఎకరాలు ఉంది. ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పెసర, పత్తి, శనగ వంటి పంటలను అధికంగా సాగుచేస్తున్నారు. వచ్చే నెల 15లోగా పూర్తి.. పంటల సమగ్ర సర్వే మే నెల 15లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకొని జిల్లా వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియ చేపట్టే బాధ్యతను వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించింది. ఈ సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా పంట కాలనీలకు నెలకొల్పి రైతుకు వ్యవసాయంపై నిత్యం అవగాహన కల్పిస్తూ సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. పంట కాలనీ ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్య సేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్లైన్ చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, డీటీబీ పద్ధతిలో రాయితీ చెల్లింపు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు ఈ సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ అనుబంధ ఇతర ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. రైతులు పండించిన పంటను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కనీస మద్దతు ధరకు అమ్ముకునేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తద్వారా నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సర్వేలో సేకరించనున్న అంశాలు పంటల సమగ్ర సర్వేలో రైతుల నుంచి 39 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. రైతు పట్టాదారు పాసుబుక్ నెంబర్, రైతు పేరు, తండ్రి పేరు, పురుషుడు లేక స్త్రీ అనే వివరాలు, ధరణి పోర్టర్లో ఆధార్ నంబర్‌తో లింక్ చేశారా లేదా, పుట్టిన తేదీ, సెల్‌ఫోన్ నంబర్, బ్యాంక్, ఖాతా వివరాలు, సామాజిక స్థితి వివరాలు, రైతు భూమి వివరాలు సేకరించి ఫార్మాట్లోని పార్ట్ ‘ఏ’ (మొదటి పేజీ)లో నమోదు చేస్తారు. పార్ట్ ‘బీ’లో... ఇక సర్వేలో భాగంగా పార్ట్ ‘బీ’లో పలు అంశాలను నమోదు చేస్తారు. సాగుకు భూమి ఎంత ఉంది... ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది. ఇందులో వ్యవసాయానికి అనువుగా ఉందా, సాగు నీటి వివరాలు. సాగు నీటికి దేని మీద ఆధారపడుతున్నారు అనేది తెలుసుకుంటారు. ఇంకా మట్టి పరీక్షల వివరాలు, గత ఖరీఫ్‌లో ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన పంటలను సాగు చేశారు, దిగుబడి ఎంత.. ఈసారి యాసంగిలో వేసిన పంటల వివరాలు.. పండ్ల తోటల పెంపకం, చెట్ల వయస్సు, సర్వే నంబర్ల వారీగా సాగు, సాధిస్తున్న దిగుబడి నమోదు చేస్తారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఖరీఫ్‌లో ఏయే పంటలను వేయాలని అనుకుంటున్నారనేది కూడా ఆరా తీస్తారు. వీటికి తోడు యంత్రాల వాడకం, బ్యాంకు రుణాలు, పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారా.. ఎలాంటి ఫోన్ వాడుతున్నారనేది కూడా తెలుసుకుంటారు. అలాగే, కిసాన్ సువిధ, పంటల యాజమాన్యం యాప్‌లు, కిసాన్ పోర్టల్, కిసాన్ కాల్‌సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్‌పై అవగా హన ఉండా, లేదా అనే అంశాలతో పాటు పశువులు, గొర్రెల సంఖ్య, సేంద్రియ వ్యవసాయంపై ఏ మేరకు తెలుసనే వివరాలను కూడా వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇంటి వద్దకు వెళ్లి సేకరించి నిర్ణీత ఫార్మాట్లో పొందుపర్చాక ప్రభుత్వానికి నివేదించనున్నారు. రైతుల పూర్తి వివరాలు సేకరిస్తాం.. పంటల సమగ్ర సర్వేలో రైతు నుంచి పూర్తి వివరాలు సేకరిస్తాం. ఈ బాధ్యతను వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించాం. వారు పని చేస్తున్న ప్రాంతాల్లోని ప్రతి రైతును నేరుగా కలిసి మొత్తం 39 అంశాలపై వివరాలు సేకరించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరుస్తారు. వెంటనే ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తాం. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి -
డిజిటలైజేషన్‌పై నిర్లక్ష్యం వద్దు
అమరచింత: సమగ్ర భూసర్వే కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి అధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆమె అమరచింత తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి భూ సమగ్రసర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తహసీల్దార్ పాండునాయక్, వీఆర్ఓలతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తప్పొప్పులకు తావివ్వకుండా నిజమైన పట్టాదారుడికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. మండలంలో 6,994ఖాతాలు ఉండగా 5,561 ఖాతాల పూర్తి భేష్ అన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో వెనకపడడం ఏమిటని రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. వేగవంతంగా పూర్తిచేయాలని ఆమె తహసీల్దార్ పాండునాయక్‌కు ఆదేశించారు. వ్యవసాయశాఖ అధికారులు రెవెన్యూ సిబ్బందితో కలిసి సమగ్ర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్ ప్రక్రియలను కొనసాగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల వ్యవసాయా«ధికారి మురళీధర్‌ను ప్రశ్నించారు. çసమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆమె వెంట ఆర్ఐ తిరుపతయ్య, వీఆర్ఓలు పాంచజన్య, వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
ఆగిన ఎయిర్‌పోర్టు సర్వే పనులు
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఎంపిక చేసిన భూములను ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. శాంతిపురం మండల పరిధిలోని అమ్మవారిపేట రెవెన్యూలో ప్రభుత్వ భూములను, రైతులు సాగుచేసుకుంటున్న డీకేటీ భూములను సర్వే చేసేందుకు గురువారం అధికారులు ప్రయుత్నించారు. ఆ విషయం తెలుసుకున్న అమ్మవారిపేట, వెంకటేష్‌పురానికి చెందిన రైతులు వంద మందికి పైగా పోగయ్యూరు. భూమి కొలతలకు అడ్డుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా తమకు అన్నం పెడుతున్న భూములను లాక్కోవద్దని బతిమలాడారు. తాము సాగు చేస్తున్న పంటలను అధికారులకు చూపించారు. భూములను లాక్కోవడానికి బదులు తమ కుటుంబాలను చంపేయూలని వారు అధికారులను కోరారు. రైతుల వ్యతిరేకతతో సర్వే కోసం వచ్చిన ఆర్ అండ్ బీ ఏఈఈ కృష్ణనాయుక్, ఆర్ఐ శివరమేష్, స్థానిక రెవెన్యూ సర్వేయుర్లు, ఒడిశా నుంచి వచ్చిన సర్వే బృందం వెనుదిరిగింది. గతంలో రామకుప్పం మండలంలోని కిలాకిపొడు, విజలాపురం రైతులు సర్వే పనులను అడ్డుకున్నారు. ఇప్పుడు శాంతిపురం మండలంలోనూ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. భూములను కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధవుని రైతులు చెప్పారు. న్యాయుం కోసం త్వరలో సీఎం, విపక్షనేత, గవర్నరును కలుస్తామని రైతులు తెలిపారు.