చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఎంపిక చేసిన భూములను ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. శాంతిపురం మండల పరిధిలోని అమ్మవారిపేట రెవెన్యూలో ప్రభుత్వ భూములను, రైతులు సాగుచేసుకుంటున్న డీకేటీ భూములను సర్వే చేసేందుకు గురువారం అధికారులు ప్రయుత్నించారు. ఆ విషయం తెలుసుకున్న అమ్మవారిపేట, వెంకటేష్‌పురానికి చెందిన రైతులు వంద మందికి పైగా పోగయ్యూరు. భూమి కొలతలకు అడ్డుకున్నారు.
ఐదు దశాబ్దాలకు పైగా తమకు అన్నం పెడుతున్న భూములను లాక్కోవద్దని బతిమలాడారు. తాము సాగు చేస్తున్న పంటలను అధికారులకు చూపించారు. భూములను లాక్కోవడానికి బదులు తమ కుటుంబాలను చంపేయూలని వారు అధికారులను కోరారు. రైతుల వ్యతిరేకతతో సర్వే కోసం వచ్చిన ఆర్ అండ్ బీ ఏఈఈ కృష్ణనాయుక్, ఆర్‌ఐ శివరమేష్, స్థానిక రెవెన్యూ సర్వేయుర్లు, ఒడిశా నుంచి వచ్చిన సర్వే బృందం వెనుదిరిగింది.
గతంలో రామకుప్పం మండలంలోని కిలాకిపొడు, విజలాపురం రైతులు సర్వే పనులను అడ్డుకున్నారు. ఇప్పుడు శాంతిపురం మండలంలోనూ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. భూములను కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధవుని రైతులు చెప్పారు. న్యాయుం కోసం త్వరలో సీఎం, విపక్షనేత, గవర్నరును కలుస్తామని రైతులు తెలిపారు.