![Private Jets Collide At Scottsdale Airport In Arizona](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Private-Jets-Collide-At-Sco.jpg.webp?itok=NAUTxQf6)
ఆరిజోనా: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ జెట్‌ను మరో విమానం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుండి జారి రాంప్‌పై ఉన్న బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఆరిజోనాలోని స్కాట్‌డేల్ ఎయిర్‌పోర్టులో ఘటన జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కాగా, గత పది రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, మరో విమానానికి కూడా తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత వారం.. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
![అమెరికాలో రెండు విమానాలు ఢీ..!](https://www.sakshi.com/s3fs-public/inline-images/ai_1.jpg)
Comments
Please login to add a commentAdd a comment