jets
-
శతకోటి సూర్యులను తలదన్నే... ప్లాస్మా ప్రవాహాలు
ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్‌హోల్ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్‌హోల్ జెట్) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో అత్యంత పెద్దవి ఇవేనట. ఈ ప్రవాహాలు అంతరిక్షంలో ఏకంగా 2.3 కోట్ల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకున్నట్టు గుర్తించారు! అంతేగాక ఇవి లక్షలాది కోట్ల సూర్యులను మించిన శక్తిని వెదజల్లుతున్నాయట! దీన్నిబట్టి వాటి ఉద్గమ స్థానమైన రాకాసి కృష్ణబిలం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ కృష్ణబిలం భూమికి 750 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అనంతశక్తితో నిండిన కృష్ణబిలాలు తన పరిధిలోకి వచ్చే ఏ వస్తువునైనా లోనికి లాక్కుంటాయన్నది తెలిసిందే. ఎంతటి భారీ నక్షత్రాలైనా వాటి బారినుంచి తప్పించుకోలేవు. వాటిని కబళించే క్రమంలో కొద్దిపాటి ద్రవ్యరాశి ప్లాస్మా ప్రవాహంగా మారి కృష్ణబిలం తాలూకు రెండు అంచుల గుండా అపరిమితమైన వేగంతో బయటికి ఎగజిమ్ముతుంది. వాటిని బ్లాక్‌హోల్ జెట్స్‌గా పిలుస్తారు. ఇవి అనంతమైన ప్రకాశంతో మెరిసిపోవడమే గాక దాదాపుగా కాంతివేగంతో దూసుకెళ్తాయి. ఆ క్రమంలో అంతరిక్షంలో ఇలా కళ్లు చెదిరే దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. విశ్వనిర్మాణాన్ని బ్లాక్‌హోల్ జెట్స్ ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఈ జంట ప్రవాహాలు ఎంతగానో దోహదపడతాయని సైంటిస్టులు మురిసిపోతున్నారు. వీటికి ముద్దుగా గ్రీకు పురాణాల్లోని మహాకాయుడు పోరి్ఫరియాన్ పేరు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'ది స్కై క్వీన్': 34 ఏళ్లకే ఏకంగా 10 ప్రైవేట్ జెట్లు..!
చిన్నతనంలో కేన్సర్‌లాంటి మహమ్మారితో పోరాటం చేసి గెలిచింది. అక్కడి నుంచి మొదలైన గెలుపు ప్రస్థానం..వినూత్న స్టార్టప్‌తో అనితర సాధ్యమైన విజయాన్ని అందుకుంది. ఎవ్వరూ ఊహించిన విధంగా కోట్లకు పడగలెత్తింది. జస్ట్ 34 ఏళ్లకే ఏకంగా పది ప్రైవేట్ జెట్లు కలిగిన మహిళగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎవరీమె అంటే..ఆమె పేరు కనికా టేక్రివాల్. మార్వాడీ కుటుంబానికి చెందిన యువ పారిశ్రామికవేత్త. 1990లో జన్మించిన కనికా 20 ప్రాయంలో ప్రాణాంతక కేన్సర్‌తో పోరాటం చేసి గెలిచింది. ఆమె విధ్యాభాసపరంగా.. ప్రఖ్యాత లారెన్స్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత లవ్‌డేల్ అండ్ జవహర్లాల్, భోపాల్‌లోని నెహ్రూ సీనియర్ సెకండరీ స్కూల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. ఇక కోవెంట్రీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వగానే వినుత్నాంగా విమానాయన స్టార్టప్ జెట్‌సెట్ గోని ప్రారంభించింది.అలా అంచలంచెలుగా ఎదుగుతూ 420 కోట్లు విలువ చేసే సామ్రాజ్యాన్ని స్థాపించింది. ప్రస్తుతం కనికా ఆ కంపెనీ సీఈవోగా శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా దూసుకుపోతోంది. అంతేగాదు ఏకంగా లక్ష మంది ప్రయాణికులును గమ్యస్థానాలకు చేర్చి శెభాష్ అని ప్రశంసలందుకుంది. ఇప్పటివరకు ఆమె కంపెనీ దాదాపు 6వేల విమానాలను విజయవంతంగా నడుపుతోంది. కేవలం 34 ఏళ్ల వయసుకే దాదాపు 10 ప్రైవేట్ జెట్లను కలిగిన అత్యంత ధనిక మహిళగా హురున్ రిచ్ లిస్ట్‌లో నిలిచింది. అంతేగాదు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, వరల్డ్ ఎకనామి ఫోరమ్ ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ వంటి అవార్డులు అందుకుంది. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను నిర్వహించే స్టార్టప్ వెంచర్‌ను సమర్థవంతంగా నిర్వహించి లాభల దిశగా నడిపించిన కనికా ప్రతిభాపాటవాలను అందరూ కొనియాడుతుండటం విశేషం. అంతేగాదు విమానాల లీజింగ్ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచి 'ది స్కై క్వీన్' పిలిపించుకుంది కనికా. ఇక ఆమె వ్యక్తిగత జీవితం వద్దకు వచ్చేటప్పటికీ కనికా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇక్కడ కనికా వినూత్న స్టార్టప్‌ని సమర్థవంతంగా నిర్వహించి మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పైగా మహిళలు ఎలాంటి వ్యాపారాన్నైనా సమర్థవంతంగా నిర్వహించగలరని ప్రూవ్ చేసింది. (చదవండి: శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్‌చేస్తే..!) -
తైవాన్‌పై దాడికి దిగుతుందా?.. అనేలా చైనా కసరత్తులు
చైనా, తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తైవాన్ సమీప సముద్ర జలాల్లో జాయింట్ స్టోర్డ్ పేరిట చేపట్టిన యుద్ధ విన్యాసాలు ఆదివారం కూడా యథావిధిగా కొనసాగాయి. షెడ్యూల్ ప్రకారం నేటితో ముగియాల్సి ఉండగా వరుసగా మూడో రోజు కూడా యుద్ధ విన్యాసాలు కొనసాగించింది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతంలో యుద్ధ నౌకలతో సహా డజన్ల కొద్ది విమానాలకు కూడా మోహరించింది చైనా. ఐతే తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ గతవారం యూఎస్‌లో హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీని కలవడంపై ప్రతిస్పందనగా చైనా యుద్ధ సన్నహాల గస్తీ మాటున మూడు రోజుల సైనిక కసరత్తులకు తెర తీసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విన్యాసాల్లో చైనా బలగాలు తైవాన్ను చుట్టు ముట్టడంపై సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా ఓ అధికారిక వార్తా సంస్థలో కథనంలో.. "తైవాన్‌పై లక్షిత దాడులకు సన్నాహం చేయడం, ద్వీపాన్ని చుట్టుముట్టడం వంటి వరుస కసరత్తులను ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించింది. దీంతోపాటు తైవాన్‌ని ముట్టడించేలా..రెండు విమానా వాహక నౌకలు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, యూఎస్ఎస్ మిలియస్, బాంబర్లు, జామర్లు వంటి వాటిని మోహరించింది". అని పేర్కొంది. ఈ విన్యాసాలను లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్(పీఎల్ఏ) నిర్వహిస్తోంది. అలాగే సోమవారం చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని రాతి తీరంలోని మాట్సు దీవులకు దక్షిణంగా 80 కిలోమీటర్లు (50 మైళ్లు), తైపీకి 190 కిలోమీటర్ల దూరంలోనూ లైవ్-ఫైర్ డ్రిల్లను జరగనున్నాయి. ఈ మేరకు తైవాన్‌కు చైనాకు సమీపంలో ఉన్న ఆగ్నేయ ద్వీపం అయిన పింగ్టాన్ చుట్టూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ విన్యాసాలు నిర్వహించనున్నట్లు చైనా స్థానికి సీ అథారిటీ పేర్కొంది. ఈ కార్యకలాపాలు 'తైవాన్ స్వాతంత్యం' కోరుకునే వేర్పాటువాద శక్తులు కలిసి చేపట్టే కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా గట్టి హెచ్చరికగా పనిచేస్తాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్(పీఎల్ఏ) ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ చైనా చర్యను వ్యతిరేకించారు. నిరంతర నిరంకుశ విస్తరణవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా తోసహా ఇతర సారూప్య దేశాలతో కలిసి పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. (చదవండి: మోదీ గ్రేట్! భారత్ లాగానే మాక్కూడా చీప్‌గా కావాలి: ఇమ్రాన్ ఖాన్) -
విజయవాడ-ఒంగోలు మధ్య ఎన్‌హెచ్ 16పై విమానాల ట్రయల్ రన్ సక్సెస్ (ఫొటోలు)
-
ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాప్ట్ డీల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా లిమిటెడ్ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్‌లైన్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. ఈ మేరకు క్యారియర్ ఎయిర్‌బస్ A320neo ఫ్యామిలీ జెట్లు లేదా బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్ లేక రెండింటిని మిక్స్ చేసి సరికొత్త మోడల్స్‌ని ఆర్డర్ చేయవచ్చునని అధికారులు అంటున్నారు. దేశంలో ఎయిర్‌బస్ ఆధిపత్యం చెలాయిస్తున్నందున భారత్ ఈ నారోబాడీ జెట్ ఆర్డర్‌ని గెలుచుకోవడం బోయింగ్ విమానాలను తిరుగుబాటుగా అయ్యింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న ఇండిగో అత్యధికంగా అమ్ముడై నారోబాడీల కోసం యూరోపియన్ తయారీదారులకు ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్‌గా మారింది. పైగా సుమారు 700 నారోబాడీలను ఆర్డర్ చేస్తోంది. గో ఎయిర్‌లైన్స్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ఏషియా ఇండియా లిమిటెడ్‌తో సహా ఇతర సంస్థలు ఒకేతరహా విమానాలను నడుపుతున్నాయి. సుమారు 300 విమానాల ఉత్పత్తికి, డెలివరీకి సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చునని అధికారుల చెబుతున్నారు. ఎయిర్‌బస్ ఒక నెలలో దాదాపు 50 నారోబాడీ జెట్లను నిర్మిస్తుంది, 2023 కల్లా వాటిని 65కి, 2025 నాటికి 75కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రైవేటీకరణలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలోనే టాటా ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేసింది. ఇది నాలుగు ఎయిర్‌లైన్ బ్రాండ్లతో సహా దాని విమానయాన వ్యాపారాలను ఏకీకృతం చేయాలని భావిస్తోంది. కొత్త విమానాల కోసం చేస్తున్న ఆర్డర్ డీల్ ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్వహణపై అనుకూలమైన నిబంధనలతో ఖర్చులను తగ్గించుకోవడం తోపాటు చాలా చౌక ధరల్లో కొనుగోలు చేసి..ప్రత్యర్థులతో మెరుగ్గా పోటీ పడడంలో సహాయపడుతుంది. (చదవండి: అగ్నివీరులకు స్వాగతమంటున్న ఆనంద్ మహీంద్రా) -
చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్లో ప్రవేశం
తైవాన్: చైనా దేశం తైవాన్‌పై మరోసారి బలప్రదర్శనకు దిగింది. తమ యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది. మొత్తం 27 విమానాలు బఫర్ జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తమ యుద్ధవిమానాల ద్వారా హెచ్చరించగా.. చైనా విమానాలు పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెనుతిరిగాయని అధికారులు తెలిపారు. చదవండి: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రకంపనలు..భారత్‌లోనూ దడ ఏడాది కాలంగా తైవాన్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుతూ.. చైనా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కిపైగా యుద్ధ విమానాలను తైవాన్ దేశం మీదకు వెళ్లాయి. కాగా, తైవాన్ను తన అంతర్భాగంగా చెబుతున్న చైనా.. ఆ దేశాన్ని పూర్తిగా తమలో కలుపుకుంటామని, అవసరమైతే సైనిక చర్యకూ వెనకాడబోయేది లేదంటోంది. -
అమెరికా రాయితీ ఇవ్వకపోతే కొనుగోలు కష్టమేః పాకిస్తాన్
వాషింగ్టన్ః ఎఫ్-16 యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని, ఎటువంటి రాయితీలు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. అవసరమైతే పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి విమానాలు కొనుగోలు చేయొచ్చని సలహా కూడ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కూడ తన నిర్ణయం మార్చుకునేట్లు కనిపిస్తోంది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా రాయితీలు ఇవ్వని పక్షంలో అంత పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి విమానాలను కొనుగోలు చేయడం కష్టమేనని పాకిస్తాన్ విదేశీ వ్యవహారల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో తాము వాడే ఎఫ్-17 థండర్ జెట్స్ స్థానంలో ప్రభావవంతమైన ఎఫ్-16 కు ప్రాధాన్యతనిచ్చామని అజీజ్ తెలిపినట్లు ఓ పాకిస్తానీ వార్తా పత్రిక తెలిపింది. చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ద్వారా అభివృద్ధి చేసిన జెఎఫ్-17 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఇకపై వెన్నెముకగా మారుతుందని కూడ ఆయన అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికానుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనేందుకు ఇంతకు ముందు పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న ప్రకారం అమెరికా రాయితీని కల్పించి ఉంటే... ఎనిమిది విమానాలకు పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి అమెరికాకు 270 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోలుకు కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ, విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్ నిధులను వినియోగించడంపై అమెరికా సెనేటర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి తారుమారైంది.