చైనా, తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తైవాన్ సమీప సముద్ర జలాల్లో జాయింట్ స్టోర్డ్ పేరిట చేపట్టిన యుద్ధ విన్యాసాలు ఆదివారం కూడా యథావిధిగా కొనసాగాయి. షెడ్యూల్ ప్రకారం నేటితో ముగియాల్సి ఉండగా వరుసగా మూడో రోజు కూడా యుద్ధ విన్యాసాలు కొనసాగించింది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతంలో యుద్ధ నౌకలతో సహా డజన్ల కొద్ది విమానాలకు కూడా మోహరించింది చైనా. ఐతే తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ గతవారం యూఎస్‌లో హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీని కలవడంపై ప్రతిస్పందనగా చైనా యుద్ధ సన్నహాల గస్తీ మాటున మూడు రోజుల సైనిక కసరత్తులకు తెర తీసిన సంగతి తెలిసిందే.
ఈ యుద్ధ విన్యాసాల్లో చైనా బలగాలు తైవాన్‌ను చుట్టు ముట్టడంపై సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా ఓ అధికారిక వార్తా సంస్థలో కథనంలో.. "తైవాన్‌పై లక్షిత దాడులకు సన్నాహం చేయడం, ద్వీపాన్ని చుట్టుముట్టడం వంటి వరుస కసరత్తులను ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించింది. దీంతోపాటు తైవాన్‌ని ముట్టడించేలా..రెండు విమానా వాహక నౌకలు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, యూఎస్‌ఎస్ మిలియస్, బాంబర్లు, జామర్లు వంటి వాటిని మోహరించింది". అని పేర్కొంది. ఈ విన్యాసాలను లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్(పీఎల్ఏ) నిర్వహిస్తోంది. అలాగే సోమవారం చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని రాతి తీరంలోని మాట్సు దీవులకు దక్షిణంగా 80 కిలోమీటర్లు (50 మైళ్లు), తైపీకి 190 కిలోమీటర్ల దూరంలోనూ లైవ్-ఫైర్ డ్రిల్‌లను జరగనున్నాయి.
ఈ మేరకు తైవాన్‌కు చైనాకు సమీపంలో ఉన్న ఆగ్నేయ ద్వీపం అయిన పింగ్టాన్ చుట్టూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ విన్యాసాలు నిర్వహించనున్నట్లు చైనా స్థానికి సీ అథారిటీ పేర్కొంది. ఈ కార్యకలాపాలు 'తైవాన్ స్వాతంత్యం' కోరుకునే వేర్పాటువాద శక్తులు కలిసి చేపట్టే కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా గట్టి హెచ్చరికగా పనిచేస్తాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్(పీఎల్ఏ) ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ చైనా చర్యను వ్యతిరేకించారు. నిరంతర నిరంకుశ విస్తరణవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా తోసహా ఇతర సారూప్య దేశాలతో కలిసి పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
(చదవండి: మోదీ గ్రేట్! భారత్ లాగానే మాక్కూడా చీప్‌గా కావాలి: ఇమ్రాన్ ఖాన్)
Comments
Please login to add a commentAdd a comment