ఆన్‌లైన్‌లో నిమ్మ వేలానికి చర్యలు
- కలెక్టర్ శ్రీకాంత్
గూడూరు టౌన్/రూరల్: నిమ్మకాయల వేలం పాటలను ఆన్‌లైన్‌లో నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర అందేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని వెల్లడిం చారు. గూడూరులోని బాలాజీ లెమన్ మార్కెట్‌తో పాటు, కటకరాజావీధిలో ని లెమన్ మార్కెట్‌ను గురువారం ఆ యన పరిశీలించారు.
నిమ్మకాయల్లోని రకాలు, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులతో చర్చించారు. పం టకు వ్యాపించే తెగుళ్లు, రైతులకు గిట్టుబాటు ధర లభించడంపై ఆరా తీశారు. ఇటీవల కాలంలో దిగుబడి తగ్గిపోయేం దుకు కారణాలను పరిశీలించి నివేదిక పంపాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పెట్లూరు నిమ్మ పరిశోధన కేం ద్రంలో త యారయ్యే విత్తనాల రకాలపైనా నివేదిక సమర్పించాలని సూచిం చారు. తో టలు తెగుళ్ల బారిన పడినప్పుడు వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు సూచనలివ్వాల్సిందేనన్నారు.
వేలం పాటల పరిశీలన
ఆయా మార్కెట్లలో నిమ్మ వేలం పా టల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ దుకాణాల వివరాలు, గ్రేడింగ్, కూలీల కు లభిస్తున్న ఉపాధి తదితర అంశాల పై ఆరా తీశారు. చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, మధురై, బీజాపూర్ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలోని డి మాండ్ ఆధారంగా ఇక్కడ ధరలు నిర్ణయిస్తామని కలెక్టర్‌కు వ్యాపారులు వివరించారు. కాయలు కొనుగోలు చేసే స మయంలోనే తాము ధర నిర్ణయిస్తామ ని, రవాణా సమయంలో ఏవైనా అ వాంతరాలు ఎదురైతే నష్టాలు తప్పవన్నారు. ఏలూరు, విజయవాడ ప్రాం తాల నుంచి గూడూరు మార్కెట్‌కు రై తులు కాయలు తెస్తున్నారని చెప్పారు.
ఈ మార్కెటింగ్‌తో ప్రయోజనాలు
ఈ-మార్కెటింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో ని మ్మకాయల వేలం నిర్వహిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని కలెక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా దేశంలోని అన్ని మార్కెట్ల ధరలను స్థానికంగా ప్రతి దుకాణంలో డిజిటల్ బోర్డుల ద్వారా రైతులకు తెలి యజేయవచ్చన్నారు. తద్వారా వారు గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకా శం లభిస్తుందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రవీందర్, తహశీల్దార్ వెంకట నారాయణమ్మ, ఎంపీడీఓ నిర్మలాదేవి, ఏపీఓ వరలక్ష్మి, ఉద్యాన శాఖ ఏడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.