మంత్రి బర్త్‌డేనా.. మజాకా! | In hospital beds, beds | Sakshi
Sakshi News home page

మంత్రి బర్త్‌డేనా.. మజాకా!

Published Sat, Apr 16 2016 1:42 AM | Last Updated on Sun, Sep 2 2018 3:26 PM

మంత్రి బర్త్‌డేనా.. మజాకా! - Sakshi

మంత్రి బర్త్‌డేనా.. మజాకా!

ఆస్పత్రిలో బెడ్‌లు, మంచాలు బయట పడేసిన టీడీపీ శ్రేణులు
రోగులకు సెలైన్లు కట్, ఆస్పత్రిలో  ఆగిన ఓపీ సేవలు
ప్రేక్షకపాత్ర వహించిన   ఆస్పత్రి అధికారులు వైద్యం అందక రోగులకు ఇక్కట్లు

 

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందాన మంత్రిగారి బర్త్‌డే వేడుకలు రోగులకు   కష్టాలు తెచ్చిపెట్టాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు ఆస్పత్రి ఆవరణమంతా ఫ్లెక్సీలతో నిండిపోవడంతో గందరగోళానికి గురయ్యారు. ఓపీ సేవలు నిలిపివేయడంతో చేసేదేమీలేక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మరికొంతమంది వైద్యం కోసం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రి ఆవరణలోని చెట్ల కింద పడిగాపులు కాశారు.

 

శ్రీకాళహస్తి:  పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 68వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల నిర్వహణ కోసం ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. రక్తపరీక్షలు, ల్యాబ్‌లు మూసివేశారు. గుండె, కిడ్నీలు తదితర వ్యాధులకు వూత్రమే పరీక్షలు చేస్తున్నారని, వైద్యం అందిస్తున్నారని తెలిసి రోగులు నిరాశకు గురయ్యారు. అపోలో వైద్య బృందంతో ఆస్పత్రి ఆవరణలో వైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో గుండె, కిడ్నీలు తదితర వ్యాధులకు వూత్రమే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం నిర్వహణకు ఆస్పత్రిలోని పరుపులు, వుంచాలు అడ్డంగా ఉంటాయుని టీడీపీ కార్యకర్తలు వాటిని  బయుట పడేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ టీడీపీ కార్యకర్తలు హంగామా చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహించారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు రోజూ ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచాలు లేకపోవడంతో రోగులకు సెలైన్ పెట్టేందుకు వీలులేకుండా పోయింది. ఓపీ సేవలు లేకపోవడంతో రోగులు వుధ్యాహ్నం 1.30 గంటల వరకు పడిగాపులు కాసి, వెనుదిరిగారు. సాధారణంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఖాళీ స్థలంలో లేదా తమ వ్యక్తిగత భవనాల్లో నిర్వహించుకోవాలి. అరుుతే అధికారం వారిదే గనుక ప్రైవేటు వైద్యశిబిరం ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు భావించారు. దీంతో ఆస్పత్రి అధికారులు బదులు చెప్పలేక మిన్నకుండిపోయారు.

 
ఆస్పత్రా, టీడీపీ కార్యాలయుమా ?

ప్రభుత్వాస్పత్రిలో ఎటు చూసినా టీడీపీ నేతల హంగావూతో కనిపించింది. ఆస్పత్రిలో వుంత్రికి పార్టీ నేతలు, వివిధశాఖల అధికారులు శుభాకాంక్షలు చెప్పడానికి క్యూ కట్టారు. వురోవైపు పెద్దఎత్తున స్థానిక టీడీపీ నేతలు పూలవూలలు, శాలువాలతో మంత్రి సత్కరించడం మొదలెట్టడంతో ఆస్పత్రి ఆవరణమంతా మైకుల శబ్దాలతో మార్మోగింది. జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు కూడా ఈ హంగామాను చూసి మౌనం వహించారు. ఆస్పత్రిలో పలు విభాగాల అధికారులు కూడా బొజ్జల బర్త్‌డే సంబరాల్లో మునిగిపోవడం మరో విశేషం!

 

ఓపీ ఇవ్వలేదు
మంత్రి బర్త్‌డే సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అపోలో వైద్యులే ఆస్పత్రిని చూస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. దీంతో మేము అత్యవసర కేసులు వూత్రమే చూశాం. అందువల్ల ఓపీ ఇవ్వలేదు. సాధారణంగా రోజూ 600 వుంది ఓపీలు తీసుకుంటారు. వుంత్రి బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వారే అన్ని కార్యక్రవూలు చూసుకున్నారు.

 - బాలసుబ్రమణ్యం, సూపరింటెండె ంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement