Hospital Development Committee
-
పనులు చకచకా
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని బొబ్బిలి సామాజిక కేంద్రంలో 30 పడకలు ఉన్నాయి. ఆరు మండలాల పేద రోగులు ఇక్కడికి వస్తుంటారు. పాత భవనంలో అరకొర వసతులతో ఆస్పత్రి నడిచేది. ఈ పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాడు–నేడు కింద ఆస్పత్రి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వం ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన నూతన భవనంలో ఓపీ, ల్యాబ్, సర్జికల్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. వసతులు మెరుగుపడటంతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున 250 నుంచి 300 వరకూ ఓపీలు ఉంటున్నాయి. నూతన భవనంపై మరో అంతస్తు నిర్మించి జనరల్ వార్డుతోపాటు, ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సాక్షి, అమరావతి: నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ప్రాంతీయ ఆస్పత్రుల(ఏహెచ్)లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వీటిలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 ఏహెచ్‌లు, 177 సీహెచ్‌సీలు ఉండగా.. వీటిలో 11,380 పడకలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఆస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా ఆస్పత్రులు అప్‌గ్రేడ్ కాకపోవడం, వసతులు అరకొరగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో సీహెచ్‌సీ, ఏహెచ్‌ల రూపురేఖలు మారుతున్నాయి. రూ.1,223 కోట్లు వెచ్చించి.. రాష్ట్రవ్యాప్తంగా 45 ఏహెచ్‌లు, 121 సీహెచ్‌సీలు, 2 ఎంసీహెచ్/సీడీహెచ్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,223.28 కోట్లను వెచ్చిస్తోంది. ఏపీ వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో నాడు–నేడు పనులు చేపట్టారు. మూడు ప్యాకేజీలుగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకు సగటున రూ.60 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. ఆస్పత్రుల అభివృద్ధిలో భాగంగా పలుచోట్ల ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. మరికొన్నిచోట్ల నూతన భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలో అన్ని వసతులతో ఓపీ బ్లాక్, లేబర్ వార్డు, పోస్టుమార్టం యూనిట్, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను అభివృద్ధి చేస్తున్నారు. మూడు దశలుగా వచ్చే డిసెంబర్ నాటికి ఈ పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి 59 ఆస్పత్రులు, అక్టోబర్ నెలాఖరు నాటికి మరో 69, డిసెంబర్ నెలాఖరు నాటికి మిగిలిన 40 ఆస్పత్రుల్లో నిర్మాణాలను పూర్తి చేస్తారు. సకాలంలో పూర్తి చేయకుంటే పెనాల్టీలు ఆస్పత్రుల్లో చేపట్టే పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు పెనాల్టీలు విధిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులన్నీ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంన్నాం. పనుల నాణ్యతలో రాజీపడటం లేదు. డిసెంబర్‌లోగా మొత్తం పనులు పూర్తి చేస్తాం. – డి.మురళీధర్‌రెడ్డి, ఎండీ అండ్ వైస్‌చైర్మన్, ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రి మెరుగుపడింది నాడు–నేడు కింద బొబ్బిలి ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే ఆస్పత్రిలో చాలా మార్పు వచ్చింది. వసతులు మెరుగుపడ్డాయి. గతంలో ఆస్పత్రిలోకి అడుగు పెట్టాలంటేనే అపరిశుభ్రత వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. వాతావరణం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకన్నా బొబ్బిలి ఆస్పత్రి మెరుగ్గా ఉంది. – రేజేటి ఈశ్వరరావు, బొబ్బిలి -
ఖాళీలు ఎక్కువ.. సేవలు తక్కువ
సాక్షి, ఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం): స్థానిక ప్రభుత్వ వైద్యశాల సమస్యల నిలయంగా మారింది. నియోజకవర్గ కేంద్రంలో రోగులకు వైద్యం అందించాల్సిన ఈ దవఖానా సమస్యలతో కునారిల్లుతోంది. ఒకవైపు పరిష్కారానికి నోచుకోని సమస్యలు, మరొక వైపు ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించరనే విమర్శలు ఈ వైద్యశాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం 300 మందికి పైగా రోగులకు వైద్యశాలకు వస్తారు. కానీ ఇక్కడ రోగులకు కనీస సదుపాయాలు లేవు. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్, మత్తు, పిల్లల, ప్రశూతీ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్యం అందటం కష్టంగా మారింది. ఇక వచ్చే వర్షాకాలంలో రోగం వస్తే ఖమ్మానికి పరుగులు తీయాల్సి వస్తోంది. గడిచిన రెండు ఏళ్లుగా ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. ఐదుగురు వైద్యులు ఉండాల్సిన ఈ వైద్యశాలలో నలుగురే ఉన్నారు. ఇక డిప్యూటీ సివిల్ సర్జన్, మత్తు, చిన్న పిల్లల వైద్యులు, గైనకాలజిస్ట్ పోస్టు భర్తీకి నోచుకోవటం లేదు. 30 పడకల వైద్యశాలలో సమస్యలు.. ఇల్లెందు 30 పడకల వైద్యశాలలో ఏడాది కాలంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశాలు లేవు. అయితే వైద్యశాలలో గెనకాలజీ, సర్జన్, స్వీపర్ ఒక పోస్టు , స్కావెంజర్ – 1 పోస్టు, సెక్యూర్టీగార్డు – 1 పోస్టు, ఎంఎన్ఓ రెండు పోస్టులు, వంట కుక్– 1 పోస్టు, వాటర్ మెన్–1 పోస్టు,దోబీ–3 పోస్టులు, తోటీ –3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబులెన్సు అందుభాటులో లేదు. అత్యవసరమైన కేసులు ఖమ్మానికి తరలించాలంటే సొంత వాహనంలో తరలించాల్సి వస్తోంది. చిన్న పిల్లల వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో లేక పోవటం వల్ల రోగులు అవస్థలు పడుతున్నారంటూ రెండు రోజుల క్రితం సీపీఎం ఆధ్వర్యంలో హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. సమస్యల వలయంలో వైద్యశాలను గట్టెక్కించాల్సిన అవసరం ఉన్నతాధికారుల మీదే ఉంది. -
ఆస్పత్రుల అభివృద్ధికి కృషి
మంత్రి కామినేని శ్రీనివాస్ పెద్దాడలో పీహెచ్సీ భవనానికి శంకుస్థాపన పెద్దాడ(పెదపూడి) : రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పెద్దాడలో ఎ¯ŒSహెచ్ఎం నిధులు రూ.1.18 కోట్లతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆస్పత్రుల భవనాల నిర్మాణానికి, అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ ఎం.మురళీమోహ¯ŒS మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందిస్తున్న మెరుగైన, ఖరీదైన వైద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు తదితరులు మాట్లాడారు. సర్పంచ్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ తాను గతంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఎంపీ మురళీ మోహ¯ŒSపై చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని కోరారు. ఒక బేబికిట్, 8 మందికి ఇంటి రుణ మంజూరు పత్రాలు మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఎంపీపీ జుత్తక సూర్యకుమారి, డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వి.వెంకట్రావు పాల్గొన్నారు. -
పరిశుభ్రతను పాటించే ఆస్పత్రులకు ప్రత్యేక బహుమతులు
ఎంజీఎం : స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలోని ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచి సుందరీకరించడంలో, పేద రోగులకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తున్న పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రులను ఎంపిక చేసి ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం తెలిపారు. కాయకల్ప్ కార్యక్రమంలో భాగంగా ఐఎంఏ హాల్లో శనివారం ఎస్పీహెచ్ఓలతోపాటు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరాం మాట్లాడుతూ ఆస్పత్రుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన పరిసరాలు మెరుగుపరిచేందుకు కాయకల్ప్ కార్యక్రమం చేట్టినట్లు తెలిపారు. బహుమతులు సాధించిన జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర స్థాయిలో బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ సంజీవయ్య, ఎన్ఆర్హెచ్ఎం ప్రోగ్రామింగ్ అధికారి రాజిరెడ్డి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, డిప్యూటీ డెమో స్వరూపరాణి, హెల్త్ ఎడ్యూకేటర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలతో శానిటేషన్ సెక్యూరిటీ పర్యవేక్షణ
– రుయాను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దుతాం – రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని వెల్లడి తిరుపతి మెడికల్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగించనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ ‘రుయా’ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రూ.30లక్షలతో ఏర్పాటు చేసిన రోగుల సహాయకుల సదుపాయముల భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకే తలమానికంగా ఉన్న రుయా ఆస్పత్రిని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.1.50 కోట్లు నిధులు విడుదల చేశామని, అందులో రూ.30లక్షలతో రోగుల సహాయకులమ వసతి సముదాయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. దుస్థితికి చేరిన భవనాలను రూ.30లక్షలతో ఆధునీకరించినట్టు తెలిపారు. క్యాన్సర్ విభాగం భవనాన్ని తొలగించి రూ.25 లక్షలతో నూతన ఆర్థో విభాగాన్ని నిర్మిస్తున్నామని, మరో 15 రోజుల్లో పూర్తవుతుందని వివరించారు. రుయాలో ప్రభుత్వ జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బి.సిద్దానాయక్, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, సీఏఎస్ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరి, డీఎంహెచ్‌వో డాక్టర్ విజయగౌరి, మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ భవాని, ఆరోగ్య విభాగపు జిల్లా అద్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డీసీహెచ్ఎస్ సరళమ్మ, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ నాగేష్, ఎస్ఈ శ్రీనివాసరావు, డీఈ మురళి, ఏపీఎన్జీవోస్ అసోసియేట్ ప్రెసిడెంట్ వరప్రసాద్ పాల్గొన్నారు. -
కలెక్టర్ దృష్టికి ఆస్పత్రి సమస్యలు
వి.కోట: స్థానిక సావూజిక ఆరోగ్య కేంద్రంలో ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని ఆసుపత్రి అభివృద్ధి అడ్హాక్ కమిటీ తీర్మానించింది. శుక్రవారం జరిగిన కమిటీ సవూవేశంలో ఎంపీపీ సులోచన, ఎంపీడీవో రమేష్ అధ్యక్షతన పలు అంశాలను సమీక్షించారు. నాల్గవ తరగతి ఉద్యోగుల ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బంది ఉందన్నారు. నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నావుని వైద్యాధికారి కిజియారాణి వివరించారు. కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో హెచ్‌డీఎస్ నిధులు రూ. ఐదు లక్షలు వినియోగించే పరిస్థితి లేదన్నారు. ఆస్పత్రిఆవరణలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సూచించారు. వైద్యుల కొరత తీర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. కార్యక్రవుంలో ఎస్పీహెచ్వో లలిత, సర్పంచ్ రావుకృష్ణప్ప, ఈవో శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. సవూవేశం అనంతరం డీసీహెచ్ఎస్ సరళవ్ము ఆసుపత్రిని తనిఖీ చేశారు. ని«ధుల వుంజూరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతావుని పేర్కొన్నారు. -
ఆస్పత్రి నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేయండి
అనంతపురం సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అత్యవసర విభాగానికి నూతన భవనం నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులకు సూపరింటెండెంట్ జగన్నాథ్ గురువారం కృతజ్ఙతలు తెలిపారు. మూడు రోజులుగా సెలవులో ఉన్న ఆయన గురువారం విధుల్లో చేరారు. కలెక్టర్ కోన శశిధర్ సూచనల మేరకు ఇంజనీరింగ్ కంపెనీ వారికి భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారి నర్సయ్యకు సూచించారు. ప్లాన్‌ను జిల్లా కలెక్టర్‌కు చూపించి ఇంజనీరింగ్ కంపెనీ వారికి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు ప్లాన్‌ను నాలుగు రోజుల వ్యవధిలో అందజేస్తామని అధికారి నర్సయ్య తెలిపారు. -
ఆస్పత్రుల ఆధునికీకరణకు సర్వే
జిల్లాలో 89 ఆస్పత్రుల భవనాలపై డాక్యుమెంటరీ ఎంకే సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్ ఏటూరునాగారం : జిల్లాలోని 89 ఆస్పత్రులను ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంకే ప్రైవేట్ సంస్థ బృందం ఇంజనీర్లు సర్వే చేపట్టారు. గురువారం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రి భవనం, పరిసరాలను పరిశీలించారు. భవనం పరిస్థితి ఎలా ఉందని, శిథిలావస్థకు చేరిందా లేక దీనిని ఆధునీకరణ చేస్తే పనిచేస్తోందని అనే కోణంలో సర్వే చేసినట్లు ఎంకే సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంకే టీం సభ్యులు జి ల్లాలోని 89 ఆస్పత్రులను పరిశీలిస్తున్నామ న్నారు. ఇందులో ఎంజీఎం, సీకేఎం, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రి, పీహెచ్‌సీలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రి భవనాల అభివృద్ధి, సిబ్బంది క్వార్టర్స్, పరి సర ప్రాంతాల్లో చేపట్టే పనులపై అధ్యయనం చేసి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీ ఎస్ఈ దేవేందర్‌కుమార్ సమర్పిస్తామని వెల్లడించారు. ఆయ న ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అలాగే మరో బృందం వైద్యులు ఖాళీలు, సామగ్రి, ఆపరేషన్ పరికరాలు, ఇతర మౌళిక వసతులను కూడా సర్వే చేసేందుకు వస్తోందని చెప్పారు. ఇలా రెండు బృందాలు చేపట్టిన ఆధారాలతో ఆస్పత్రుల రూపురేఖలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చనుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని శిథి లావస్థ భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే ఆలోచన చేస్తోందని వెల్లడిం చారు. ఈ రెండు అంశాలపై సమగ్ర సర్వే చేసేందుకు వచ్చినట్లు ఎంకే సంస్థ సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్ తెలిపారు. ఎంకే ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఎస్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నామని చెప్పారు. -
రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలి : ఎంపీ బుట్టా
► రూ.250కోట్లు విడుదల చేయాలి ► వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రిమ్స్/టిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. బుధవారం ఏపీ సెక్రటేరియట్లో ఆమెను కలిసి ఆసుపత్రి, కళాశాల సమస్యలపై విన్నవించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని ఏరియా ఆసుపత్రికి సంబంధించిన వివిధ ఆధునీకరణ పథకాల నిధుల మంజూరు, స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన మందుల సరఫరా.. తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కర్నూలు బోధనాసుపత్రికి రూ.250కోట్లు కేటాయించి రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పీఎంఎస్ఎస్వై ప్రోగ్రామ్ కింద ప్రతిపాదనలను పంపించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను ఎంపీగా తాను ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కర్నూలు మెడికల్ కాలేజి డైమండ్ జూబ్లి ఉత్సవాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం కర్నూలులో రెండు, మూడురోజులు పర్యటించి ఈ విషయాలపై చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య చెప్పారు. -
మంత్రి బర్త్‌డేనా.. మజాకా!
ఆస్పత్రిలో బెడ్లు, మంచాలు బయట పడేసిన టీడీపీ శ్రేణులు రోగులకు సెలైన్లు కట్, ఆస్పత్రిలో ఆగిన ఓపీ సేవలు ప్రేక్షకపాత్ర వహించిన ఆస్పత్రి అధికారులు వైద్యం అందక రోగులకు ఇక్కట్లు ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందాన మంత్రిగారి బర్త్‌డే వేడుకలు రోగులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు ఆస్పత్రి ఆవరణమంతా ఫ్లెక్సీలతో నిండిపోవడంతో గందరగోళానికి గురయ్యారు. ఓపీ సేవలు నిలిపివేయడంతో చేసేదేమీలేక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మరికొంతమంది వైద్యం కోసం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రి ఆవరణలోని చెట్ల కింద పడిగాపులు కాశారు. శ్రీకాళహస్తి: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 68వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల నిర్వహణ కోసం ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. రక్తపరీక్షలు, ల్యాబ్‌లు మూసివేశారు. గుండె, కిడ్నీలు తదితర వ్యాధులకు వూత్రమే పరీక్షలు చేస్తున్నారని, వైద్యం అందిస్తున్నారని తెలిసి రోగులు నిరాశకు గురయ్యారు. అపోలో వైద్య బృందంతో ఆస్పత్రి ఆవరణలో వైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో గుండె, కిడ్నీలు తదితర వ్యాధులకు వూత్రమే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం నిర్వహణకు ఆస్పత్రిలోని పరుపులు, వుంచాలు అడ్డంగా ఉంటాయుని టీడీపీ కార్యకర్తలు వాటిని బయుట పడేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ టీడీపీ కార్యకర్తలు హంగామా చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహించారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు రోజూ ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచాలు లేకపోవడంతో రోగులకు సెలైన్ పెట్టేందుకు వీలులేకుండా పోయింది. ఓపీ సేవలు లేకపోవడంతో రోగులు వుధ్యాహ్నం 1.30 గంటల వరకు పడిగాపులు కాసి, వెనుదిరిగారు. సాధారణంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఖాళీ స్థలంలో లేదా తమ వ్యక్తిగత భవనాల్లో నిర్వహించుకోవాలి. అరుుతే అధికారం వారిదే గనుక ప్రైవేటు వైద్యశిబిరం ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు భావించారు. దీంతో ఆస్పత్రి అధికారులు బదులు చెప్పలేక మిన్నకుండిపోయారు. ఆస్పత్రా, టీడీపీ కార్యాలయుమా ? ప్రభుత్వాస్పత్రిలో ఎటు చూసినా టీడీపీ నేతల హంగావూతో కనిపించింది. ఆస్పత్రిలో వుంత్రికి పార్టీ నేతలు, వివిధశాఖల అధికారులు శుభాకాంక్షలు చెప్పడానికి క్యూ కట్టారు. వురోవైపు పెద్దఎత్తున స్థానిక టీడీపీ నేతలు పూలవూలలు, శాలువాలతో మంత్రి సత్కరించడం మొదలెట్టడంతో ఆస్పత్రి ఆవరణమంతా మైకుల శబ్దాలతో మార్మోగింది. జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు కూడా ఈ హంగామాను చూసి మౌనం వహించారు. ఆస్పత్రిలో పలు విభాగాల అధికారులు కూడా బొజ్జల బర్త్‌డే సంబరాల్లో మునిగిపోవడం మరో విశేషం! ఓపీ ఇవ్వలేదు మంత్రి బర్త్‌డే సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అపోలో వైద్యులే ఆస్పత్రిని చూస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. దీంతో మేము అత్యవసర కేసులు వూత్రమే చూశాం. అందువల్ల ఓపీ ఇవ్వలేదు. సాధారణంగా రోజూ 600 వుంది ఓపీలు తీసుకుంటారు. వుంత్రి బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వారే అన్ని కార్యక్రవూలు చూసుకున్నారు. - బాలసుబ్రమణ్యం, సూపరింటెండె ంట్ -
అమరావతి తొలి దశకు రూ.52,548 కోట్లు
-
తొలి దశకు రూ.52,548 కోట్లు
అమరావతి మౌలిక సదుపాయాలపై సీఆర్డీఏ అంచనా ♦ 2018 డిసెంబర్ నాటికి రూ.34,772 కోట్లు ♦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.3,216 కోట్లు కావాలి ♦ రాజధాని ప్రాంత ఎత్తు పెంపునకు రూ.750 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతిలో తొలి దశ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.52,548 కోట్ల వ్యయం అవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అంచనా వేసింది. ఈ మొత్తం నిధులు 2021-22 సంవత్సరం నాటికి అవసరం అవుతాయంది. 2018 డిసెం బర్ నాటికి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34,772 కోట్లు అవసరమంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2016-17) రూ. 3,216 కోట్ల్లు కావాలంది. తొలి దశ పనులకు, నిర్మాణాలకు సంబంధించి రంగాల వారీగా సీఆర్డీఏ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రధానంగా కొండవీటి వాగువల్ల రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందనే విషయం తెలిసిందే. వరద నిర్వహణ పనులకే రూ.2941 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్డీఏ పేర్కొంది. మొత్తం రాజధాని ప్రాంతం ముంపునకు గురికాకుండా చూసేం దుకు ప్లాట్‌ఫాం ఎత్తును పెంచాల్సి ఉందని, ఇందుకు రూ.750 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. కొండవీటి వాగు ప్రధానడ్రెయిన్ నిర్వహణ పనులకు రూ.295 కోట్లు,ఎర్రవాగు, కట్టెలవాగు, అయ్యన్నవాగు, పాలవాగు నిర్వహణ పనులకు రూ.370 కోట్లు అవుతుందని అంచనా వేసింది. నీరుకొండ, కృష్ణయ్యపాలెంలో డైవర్షన్ పాండ్స్ నిర్మాణానికి రూ.800 కోట్ల వ్యయం అవుతుంది. వరద నీటి మళ్లింపు పనులకు రూ.406 కోట్ల అవసరం అవుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు రూ.2,371 కోట్లు అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు రూ.2,371 కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ పేర్కొంది. 67,73,560 చదరపు అడుగుల్లో అసెంబ్లీ, మండలి, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాజభవన్, రిక్రియేషన్ కార్యకలాపాల నిర్మాణాలను చేపట్టనున్నారు. ప్రభుత్వ నివాస కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు రూ.1473 కోట్లను అంచనా వేసింది. 46,96,750 చదరపు అడుగుల్లో అమరావతి గెస్ట్ హౌస్, సీఎం నివాసం, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు, ప్రధాన న్యాయమూర్తి నివాసం, జడ్జీల నివాసాలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలు, గెజిటెడ్ ఆఫీసర్ల నివాసాలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల నివాసాలు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాసాలను నిర్మించాలని నిర్ణయించారు. రవాణా మౌలిక సదుపాయాలు, యుటిలిటీ డక్ట్ పనులు, నీటి సరఫరా, వృధా నీటి నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ, వ్యర్ధ పదార్థాల నిర్వహణ, కృష్ణా నది ఒడ్డున పార్కులు, గ్రీనరీ అభివృద్ధి , విద్యుత్ సరఫరా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, స్కూల్స్, ఆసుపత్రులు నిర్మాణాలు, 900 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్ క్యాంపస్‌లో సదుపాయాలు, 17 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత వ్యయం అవుతుంతో సీఆర్డీఏ అంచనాలను రూపొందించింది. -
ఆస్పత్రి భవనం... రక్షణ ఎలా!
ఇళ్లు, వ్యాపార సముదాయాలు కట్టడం వేరు... ఆస్పత్రులు కట్టడం వేరు. ఆస్పత్రి అంటే రోగి చికిత్సకు వచ్చే స్థలం. జబ్బుతో బలహీనంగా ఉన్న రోగిని బయటి క్రిమి కీటకాలు మరింత బలహీన పరచకుండా దాడి చేయకుండా నిర్మాణం సమయం నుంచే జాగ్రత్తలు తీసుకుంటారు. అవి ఎలాంటి జాగ్రత్తలో తెలుసుకునే అవగాహన కోసం... ఈ కథనం.. హాస్పిటల్ భవనాన్ని ఎంపిక చేసుకునే సమయంలోనే నిర్మాణపరం (ఆర్కిటెక్చరల్)గా అది ఎంత పటిష్టమైనదో పరిశీలిస్తారు. కొత్తగా కడుతున్న భవంతి అయితే ముందు నుంచే ఎలాంటి పగుళ్లకు ఆస్కారం లేకుండా భవన నిర్మాణపనులను సాగిస్తారు.హాస్పిటల్ భవనంలోకి ఎలాంటి జీవులూ రాకుండా చుట్టూ రీటెయినింగ్ వాల్ నిర్మిస్తారు. అది చాలా ఎత్తుగా, లోతుగా ఉందా లేదా పరిశీలిస్తారు. సెల్లార్ ఉంటే ఈ రీటెయినింగ్ వాల్ తప్పనిసరి. సాధారణ ఫ్లోరింగ్కూ, హాస్పిటల్ ఫ్లోరింగ్కూ తేడా ఉంటుంది. మామూలు భవనాల్లా కాకుండా హాస్పిటల్ ఫ్లోర్ నిర్మాణంలో కింద ఐరన్ మెష్ ఏర్పాటు చేసి, దానిపై ఆర్సీసీతో కూడిన ఫ్లోరింగ్ వేస్తారు.కిటికీలకూ, వెంటిలేటర్స్కూ చాలా సన్నటి మెష్ అమరుస్తారు. దీనివల్ల దోమలు, బొద్దింకలు వంటి క్రిమికీటకాలు భవనంలోకి ప్రవేశించలేవు. ఆర్సీసీ నిర్మాణాన్ని ఎలుకలు ధ్వంసం చేయలేవు. రూఫ్ ఎలాగూ ఆర్సీసీతో పటిష్టంగా ఉంటుంది. కాబట్టి భవనం పైకప్పు నుంచి ఎలాంటి క్రిమికీటకాలూ వచ్చేందుకు అవకాశం ఉండదు. కాని అప్పటికే నిర్మాణం జరిగిన భవనాన్ని హాస్పిటల్ కోసం ఎంపిక చేస్తే అందులో పగుళ్లను గుర్తించిన వెంటనే వాటిని ఎప్పటికప్పుడు మూసేస్తూ ఉండాలి. దీనికి కాలపరిమితి అనే నిబంధన ఉండదు. భవన నిర్మాణ నిర్వహణ సిబ్బంది (బిల్డింగ్ మెయింటెనెన్స్ సిబ్బంది) దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. డ్రయినేజీల కోసం... డ్రయినేజీల ఓపెనింగ్స్‌లో మెష్ వేస్తారు. ఎలుకల వంటివి ఏవైనా డ్రైనేజీ మార్గంలో ప్రవేశిస్తే అవి ఈ వెంట్ల దగ్గరికి రాగానే మెష్లను దాటలేక వెనుకకు మరలుతాయి. డ్రయినేజీవ్యర్థాలు ప్రవహించే ప్రతి చోటా భవనంలోకి తెరచుకునే ప్రాంతంలో మెష్ అమర్చుతారు. మరుగుదొడ్ల విషయంలో... మరుగుదొడ్ల వంటి నిర్మాణంలో ‘టీ’ట్రాప్ అనే నిర్మాణపరమైన జాగ్రత్త తీసుకుంటారు. మరుగుదొడ్లలోంచి ఏ రకమైన జీవులూ రాకుండా, దుర్వాసన రాకుండా ఇంగ్లిష్‌లో టీ ట్రాప్ అని పిలిచే ఈ టెక్నిక్‌ను వాడతారు. దీనిలో టీ అనే ఇంగ్లిష్ అక్షరంలా ఉండే పైపును ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఇంగ్లిష్ అక్షరాలు ‘యు’ ‘ఎస్’ ‘జే’ ఆకృతిలో ఉండే పైపులను ఉపయోగిస్తున్నారు. టాయిలెట్స్‌లో సాధారణంగా ఉపయోగించే ట్రాప్స్ కాబట్టి వీటిని ‘టీ’ ట్రాప్స్‌గా కూడా పేర్కొంటారు. ఇందులో సాధారణంగా ఇంగ్లిష్ అక్షరం ‘యూ’ ఆకృతిలో ఉండే పైప్‌లను ఉపయోగిస్తూ, వాటిలో ఎప్పుడూ ఆ అక్షరం ఇరువైపులా నీళ్లు ఉండేలా చూస్తారు. ఒకవేళ టాయిలెట్లలో ఉండే ఇరువైపులా నీళ్లు ఎండిపోతే మళ్లీ దుర్వాసన రావడంతోపాటు, క్రిములు కీటకాలు రావచ్చు. అందుకే, ఒకసారి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితే నిర్వహణ సిబ్బంది టీట్రాప్లోని నీళ్లను ఎండిపోకుండా చూస్తుంటారు. నిపుణుల కోసం ఈ ఎడ్యుకేషన్ ఈ ప్రక్రియలన్నీ తెలుసుకోడానికి మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించిన అర్హులైన వారిని హాస్పిటల్స్ యాజమాన్యం నియమించి, వారి పర్యవేక్షణలోనే ఈ పారిశుద్ధ్య ప్రక్రియలు జరగాలి. పేషెంట్‌తో ఉంటున్నారా? గుర్తుంచుకోండి... ఈ విషయాలు ఆస్పత్రుల్లో చేరిన బంధువులను చూసేందుకు వెళ్లే అటెండెంట్లు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలన్నీ చికిత్స పొందుతున్న బంధువుల క్షేమం కోసమేనని గుర్తుపెట్టుకోవాలి. ఆస్పత్రుల పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు తమ వంతు సహకారం అందించాలి. బంధువుల అటెండెంట్లు ఆస్పత్రుల్లో ముఖ్యంగా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు... చికిత్స పొందుతున్న మీ బంధువులను చూసేందుకు ఆస్పత్రులు అనుమతించే విజిటింగ్ అవర్స్‌లోనే వెళ్లండి. ఒకసారి ఒకరి కంటే ఎక్కువమంది వెళ్లడం మంచిది కాదు. విజిటింగ్ అవర్స్ ముగిసిన తర్వాత రోగి పక్కనే ఉంటామంటూ పట్టుబట్టడం కూడా మంచిది కాదు.ఆస్పత్రి పరిసరాల్లో, పేషెంట్ బెడ్ దగ్గర తినడం, తాగడం, పొగతాగడం, పాన్ నమలడం, తినగా మిగిలిన పదార్థాలను, పండ్ల తొక్కలను, ఆహార పదార్థాల ప్యాకెట్లతో వచ్చే ర్యాపర్లను అక్కడికక్కడే పడేయడం వంటి పనులు చేయవద్దు. ఆస్పత్రి ప్రాంగణంలో లేదా పేషెంట్ బెడ్ సమీపంలో ఏర్పాటు చేసిన చెత్తబుట్టల్లోనే చెత్త వేయాలి. అలా కాకుండా రోగుల గదుల్లో, వరండాలో, ఆవరణలో చెత్తాచెదారాన్ని ఎక్కడికక్కడే పడేయరాదు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉండే బోర్‌వెల్స్ లేదా మంచినీటి పైపుల దగ్గర ఎంగిలి పళ్లాలు, గిన్నెలు కడగరాదు. ఆస్పత్రి పరిసరాలను నిర్లక్ష్యంగా చెత్తాచెదారంతో నింపేస్తే, పరిసరాలు కాలుష్యంతో నిండిపోతాయి. ఫలితంగా ఆస్పత్రిలోని రోగులు ఈగలు, దోమలు, నల్లులు, బొద్దింకలు, ఎలుకలు వంటి వాటితో నానా ఇబ్బందులు పడే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. శస్త్రచికిత్సలు జరిగిన సందర్భాల్లో లేదా పేషెంట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (ఐసీయూ) చికిత్స పొందుతున్నప్పుడు ఎవరినీ అనుమతించరు. అలాంటి సందర్భాల్లో రోగులను చూసేందుకు వెళ్లే అటెండెంట్స్ వైద్యుల ఆంక్షలను సానుకూలంగా అర్థం చేసుకోవాలి.రోగుల మేలు కోరి వైద్యులు చెప్పే సూచనలను తప్పకుండా పాటించాలి. అలా కాకుండా, రోగి వద్ద ఎక్కువ మంది గుమిగూడితే, రోగికి కొత్త ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఎంట్రీ రూట్... కీటకాలూ స్టాప్! భవనాల్లోకి క్రిమి కీటకాలు, ఎలుకల వంటి జీవులు ప్రవేశించకుండా ఉండాలంటే ముందుగా అవి లోపలకు రావడానికి అనువైన మార్గాల్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బొద్దింకలు, ఎలుకలు వంటివి సాధారణంగా డ్రైనేజీ పైపుల ద్వారా, ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ ద్వారా భవనాల్లోకి ప్రవేశిస్తాయి. ఆస్పత్రి భవనాలేమీ వాటికి మినహాయింపు కాదు. సరిహద్దుల వద్ద పటిష్టమైన కాపలా పెడితే శత్రువుల దాడిని ఎలా నిరోధించవచ్చో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలుకలు, బొద్దింకలు వంటి వాటిని కూడా సమర్థంగా నిరోధించవచ్చు. ఇవి చాలా తేలికపాటి జాగ్రత్తలు. వీటి వల్ల వ్యాపించే రోగాలకు చికిత్స కోసం అయ్యే ఖర్చుతో పోలిస్తే, వీటి నిరోధానికయ్యే ఖర్చు చాలా తక్కువ. కీటకాలు, ఎలుకలు చొరబడకుండా తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని... భవనం అంతటికీ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ ద్వారా కీటకాలు, ఎలుకలు చేరకుండా చూసుకోవాలి. నిర్ణీత వ్యవధిలో వాటిపై స్ప్రే చేయడం, వాటి చుట్టూ పటిష్టమైన గ్రిల్, మెష్ వంటివి అమర్చడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్పై దుమ్ముధూళి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. నిర్ణీత వ్యవధిలో ఏసీని ఆఫ్ చేసి, డక్ట్స్పై పేరుకున్న దుమ్ముధూళిని సబ్బునీటిలో ముంచిన తడిగుడ్డతో తుడిచేయాలి. ఎలాంటి అడ్డంకులు ఉన్నా కొరికి పారేసి, దారి చేసుకుని లోపలకు దూసుకుపోయే ఎలుకలను అరికట్టేందుకు అక్కడక్కడా ట్రాప్స్ అమర్చుకోవాలి. భవనాల్లోకి చొరబడటానికి ఇవి సాధారణంగా డ్రైనేజీ పైపులైన్లనే సురక్షిత మార్గాలుగా ఎంచుకుంటాయి. నేలకు దిగువగా ఉండే ఈ మార్గాల్లో ఇవి కలుగులు కూడా ఏర్పాటు చేసుకోగలవు. ఇవి చొరబడకుండా ఉండాలంటే, డ్రైనేజీ పైపులైన్లకు మెటల్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. అలాగే సెప్టిక్ ట్యాంకు మూతలపై ఎలాంటి రంధ్రాలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చోట్ల వాడని మరుగు దొడ్లు ఉంటే వాటిలో నీళ్లు ఇంకిపోయి ఎలుకలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటి వాడని మరుగుదొడ్ల కమోడ్‌పై ఏదైనా కప్పి వాటిపై ఇటుకలు వంటి బరువును ఉంచాలి. ఎలుకలు పైకి ఎగబాకి చొరబడకుండా, అవి తేలికగా పెకైక్కే మార్గాల్లో మెకానికల్ గార్డ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఎలుకల కదలికలను ఎలా గుర్తించొచ్చు? విసర్జకాలు.. ఎలుకల స్వైరవిహారానికి ముఖ్యమైన సూచన వాటి విసర్జకాలు. వంట గదుల్లోని షెల్ఫుల్లో, కబోర్డ్స్‌లో, గ్యాస్ గట్టు కిందున్న అరల్లో, అల్మారాల్లో ఎలుకల విసర్జకాలు కనిపిస్తున్నాయంటే సమస్య తీవ్రంగా ఉన్నట్లు లెక్క. ఎలుకల జాడలు.. ఎలుకలు సంచరిస్తున్న జాడల్ని పసిగట్టడం కాస్త కష్టమే. మట్టి, దుమ్ము, ధూళి వంటివాటిల్లో మాత్రమే వాటి జాడల్ని అంటే ఎలుకల అడుగులు, తోకల గుర్తులను పసిగట్టొచ్చు. కాబట్టి భవనాల్లో కంతలు, కలుగుల దగ్గరా లేదంటే ఎలుకలు సంచరించొచ్చు అన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో టాల్కమ్ పౌడర్ని కాని చాక్‌పీస్ పొడిని కాని చల్లి వాటి కదలికలను పట్టుకోవచ్చు. పంటి చప్పుళ్లు.. ఎలుకల ముందు పళ్లు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి. వాటిని అరగదీయడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాయి. ఎలక్ట్రిక్ వైర్లను కొరకడం, పైకప్పుకి రంధ్రాలు చేయడం, వాటర్ హీటర్స్‌ను, డక్ట్‌లో అమర్చిన హీటర్లను, ఏసీల్లోని వైర్లను, కప్బోర్డ్స్ని కొరుకుతూ ఉండటానికి కారణం అదే. ఎలుకలు కొరుకుతున్నప్పుడు కటకటమని చిత్రమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దంతోనూ, పాడైపోయిన వైర్లు, పెచ్చులూడి చిన్నచిన్న రంధ్రాలు పడ్డ గోడల ఆనవాళ్లతోనూ ఎలుకల కదలికలను పట్టుకోవచ్చు. భవనం ఆవరణలో గుంతలు, కన్నాలు, కలుగులు ఉన్నాయంటే ఎలుకలు ఉన్నట్లే. మార్గాలు... సాధారణంగా ఎలుకలు ఏ దారి గుండా వచ్చాయో అదే దారి గుండా మళ్లీ వెళ్తాయి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఆ దానికి విస్తరింపచేస్తాయి. పరిసరాల్లో ఇలాంటి పొడవైన సొరంగాలుంటే ఎలుకలు పక్క బిల్డింగ్కీ దారి వేసుకున్నట్లేనని గుర్తించాలి. చమురు గుర్తులు.. ఎలుకలు బయటకు వచ్చే కలుగులు, కంతలన్నీ జిడ్డుజిడ్డుగా ఉంటాయి. వాటి మూత్ర విసర్జనతో ఒకరకమైన దుర్వాసన వస్తుంటుంది. ముఖ్యంగా గాలి, వెలుతురు అంతగా లేని గదుల్లో ముక్కుపుటాలదిరే వాసన వేస్తుంది. మిగిలిపోయిన ఆహారపదార్థాలు.. మామూలుగా అయితే ఎలుకలు ఎత్తుకుపోయిన ఆహారన్నంతా తింటాయి. కాని కొన్ని మాత్రం తిన్నంత తినగా మిగిలినవి వదిలేస్తాయి. అలా కంతలు, కన్నాలు, కలుగుల దగ్గర మిగిలిపోయిన ఆహారపదార్థాలు కనిపించాయంటే మాత్రం అది కచ్చితంగా ఎలుకల స్థావరమే. పగలు కూడా.. సహజంగా ఎలుకలు రాత్రిపూటే తిరుగుతుంటాయి. పగటి పూటా కనిపించాయంటే భవనంలో వాటి సంఖ్య ఎక్కువన్నమాట. ఎలుక.. నిజాలు ప్రపంచంలోని చాలా అగ్నిప్రమాదాలకు కారణం ఎలుకలే. అవి కొరికిన వైర్ల ద్వారా షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎలుకలకు తిండియావ ఎక్కువ. ఎంత తింటాయో అంతకంటే ఎక్కువ వ్యాధులను ప్రబలింపచేస్తాయి. వాటి విసర్జకాలు, వెంట్రుకలు,... చివరకు వాటి వాసనతోనూ వ్యాధులు వస్తాయి. ప్రతి యేడూ ప్రపంచంలోని 20 శాతం ఆహారం ఎలుకల పాలే అవుతోందట. అవి కొరికి పాడు చేసే పుస్తకాలు, భవనాల ఇంటీరియర్, ఫర్నీచర్కెతే లెక్కేలేదు. ఎలుకల నివారణ భవనాల్లోని కలుగులు, కంతలు, కన్నాల దగ్గర బోన్లు, ఎరలను పెట్టి ఎలుకలను పడ్తారు.మామూలు బోన్లు, మెష్‌లు పనిచేయని చోట ప్రత్యేకంగా తయారు చేసిన బోన్లను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ట్రాకింగ్ పౌడర్స్ అనే పొడినీ ఉపయోగించి ఎలుకలను పట్టుకుంటారు. వాటికి ఆహారం, నీరు దొరకుండా చేసి కూడా ఎలుకలను తరిమి కొట్టొచ్చు. డ్రైనేజ్ హోల్స్, గుంతలు, కన్నాలు ఉన్నచోట మెష్‌ను అమర్చి కూడా ఎలుకలు చొరబడకుండా చేయొచ్చు. హాస్పిటల్ నిర్వహణ ఖర్చులు హాస్పిటల్స్ పరిశుభ్రత చాలా ప్రధానమైన అంశం. హాస్పిటల్స్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉద్దేశించిన బృందం ఆధ్వర్యంలో ఇది నిరంతరం జరుగుతుంది. ఫలితంగా ఎన్నో జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. హాస్పిటల్స్ అమలు చేయాల్సిన కొన్ని కార్యకలాపాలు... రోగి రక్షణ కోసం తీసుకునే చర్యలు రోగులను సురక్షితంగా ఉండేందుకు మాస్క్‌లు, గ్లౌవ్స్, ఆప్రాన్స్, దుప్పట్లు వంటి వాటిని ఎప్పుడూ సురక్షితంగా ఉంచాలి. రోగులకు ఉపయోగించిన కొన్ని ఇంజెక్షన్లు, కాథెటర్లు, కొన్ని సర్జికల్ ఎక్విప్మెంట్ పరికరాలు మళ్లీ ఉపయోగించకుండా డిస్పోజ్ చేయాలి. డాక్టర్ల కోసం లిక్విడ్ సబ్బులు, హ్యాండ్ డ్రయర్లు, పేపర్ తువ్వాళ్లు అమర్చాలి. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్‌లు అమర్చాలి.పాదాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల కోసం షూ కవర్స్ తొడగాలి. రోగులను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడం కోసం క్లోరోహెక్సిడిన్ వంటి రసాయనాలను చల్లాలి. లాండ్రీ అనేక రకాల దుస్తులు, పరుపులు, దుప్పట్ల పరిశుధ్యం కోసం లాండ్రీ నిర్వహణ సమర్థంగా ఉండాలి. ఇమ్యూనైజేషన్ హాస్పిటల్లో పనిచేసే ప్రతి డాక్టర్ని, ఇతర సిబ్బందిని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి టీకాలు వేసి ఇమ్యూనైజ్ చేయాలి. (ఉదాహరణకు హెచ్1ఎన్2, టైఫాయిడ్). కిచెన్ సిబ్బందికి మరింత కూలంకషమైన పరీక్షలు అవసరం. జీవ వ్యర్థాల నిర్వహణ (బయో వేస్ట్ మేనేజ్మెంట్ ఆసుపత్రిలోని జీవ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేకమైన ప్రాంతాలు, ట్రాలీల వంటి ఏర్పాట్లు అవసరం. కొన్ని ఉపకరణాల శుభ్రత ఎండోస్కోప్, బ్రాంకోస్కోప్, క్యాథెటర్ల వంటి వాటిని పరిశుభ్రం చేయడం కోసం సిడెక్స్ ఏపీఏ వంటి రసాయనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా... ఏవైనా ప్రకృతి విపత్తులు, ఆకస్మికంగా వ్యాధుల వ్యాప్తి (ఎపిడెమిక్స్) వచ్చినప్పుడు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయాల్లో అవసరమైన పడకలను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దీనికి తగినట్లే సిబ్బందినీ వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో అవసరమైన మందులను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోవాలి. మందుల కొరత అనే పరిస్థితిని ఎప్పుడూ రాకుండా చూసుకోవాలి. ఫైర్‌ఫైటింగ్... చిన్నపాటి పొగ వెలువడ్డా కనిపెట్టే స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ బ్లాంకెట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వంటి నిప్పును ఆర్పే పనిముట్లను సంసిద్ధంగా ఉంచాలి. వాటిని ఎప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా చూడాలి. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటివి నిత్యం అందేలా చూసుకోవాలి. ఎలుకలు విద్యుత్ తీగలనూ, వైర్లనూ, కంప్యూటర్‌కు సంబంధించిన ఉపకరణాలను ధ్వంసం చేయకుండా చూడాలి.ఏసీలు అమర్చే ప్రదేశాలు, ఆక్సిజన్ ఉంచే ప్రాంతాలు, ఏసీ ప్లాంట్లు, విద్యుత్ సబ్స్టేషన్లు వంటి చోట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉండాలి. ఈ అన్ని విషయాలపై ఆసుపత్రి సిబ్బందికి నిత్యం అవగాహన కల్పిస్తుండాలి. దీంతో పాటు హాస్పిటల్లో రేడియో ధార్మిక పదార్థాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణలో ఉంచాలి. - డాక్టర్ హరిప్రసాద్, సీఈవో, అపోలో హాస్పిటల్స్ సెక్యూరిటీ సిబ్బంది సాధారణ ఆవాస భవనాల లాగానే హాస్పిటల్ భవనాల నిర్మాణం కూడా ఉంటుంది. సాధారణ ఆవాసాలలో కంటే హాస్పిటల్స్‌లో రద్దీ ఎక్కువ కాబట్టి అనుక్షణం నిఘా సిబ్బంది ద్వారా ఆహారపదార్థాలను లోపలికి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు ప్రత్యేకంగా రోగుల వెంట చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే సహాయకులను అనుమతించేందుకు ఎప్పుడూ పర్యవేక్షణ కొనసాగుతుంటుంది. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉంచేందుకు రోగుల భద్రత కోసం ఎన్నో చర్యల అవసరమవుతాయి. అవి... రోగుల బంధువుల నుంచి ఇతరులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూసేందుకు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. రోగుల వెంట వచ్చే సిబ్బంది తెచ్చుకునే ఆహార పదార్థాలను ఆసుపత్రి ప్రాంగణంలోకి నిరోధించే కార్యకలాపాలు భద్రత సిబ్బంది చేపట్టాలి. రోగులకు ఇబ్బందులు కలగకుండా నిఘా ఏర్పాట్ల కోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సెక్యూరిటీ సిబ్బంది పటిష్టంగా ఉంచడం ద్వారా రోగికి అవసరమైన రక్షణ చర్యలను కల్పిస్తుండటమే గాక హాస్పిటల్ పరిసరాలను పర్యవేక్షిస్తుండాలి. ఉన్న భవనంలో ఏం చేయాలి? ఐసీయూ లేదా ఎమర్జెన్సీవార్డుల నిర్వహణ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. అక్కడ రోజూ నాలుగు గంటల నుంచి ఆరుగంటలకొకసారి శుభ్రం చేయాలి. సాధారణ వెయిటింగ్ వార్డులలో రోజుకు కనీసం మూడు సార్లు శుభ్రం చేయాలి.శుభ్రం చేసే ప్రక్రియలలోనూ చాలా రకాలు ఉన్నాయి. దుమ్మును శుభ్రం చేసే ప్రక్రియలను డస్ట్ క్లీనింగ్ అంటారు. గదులు కడగడాన్ని వాషింగ్ అంటారు. తడిబట్ట వేసి తుడిచే ప్రక్రియను మాపింగ్ అంటారు. ఫ్లోర్ క్లీనింగ్, వాల్ క్లీనింగ్, విండో క్లీనింగ్... ఇవన్నీ వేర్వేరుగా జరుగుతుంటాయి. కిచెన్, భోజనశాల వంటి ప్రదేశాలకు ప్రత్యేక నిర్వహణ ఉంటుంది. అక్కడికి వ్యర్థ ఆహార పదార్థాల కోసం వచ్చే బొద్దింకలు, ఎలుకలు ఎక్కువ. అందుకే వాటి నిర్వహణ విషయంలో ఎప్పటికప్పుడు అక్కడ ఎలుకలను నిర్మూలించే ట్రాప్స్, కీటకాల కోసం రిపెల్లంట్స్ ఉపయోగించాలి. హాస్పిటల్‌లోని చాలా గదులను సాధారణ ఫినైల్‌తోనే శుభ్రం చేస్తారు. అయితే ఈ ఫినైల్ మోతాదులోనూ మార్పు ఉంటుంది. సాధారణంగా హాస్పిటల్స్‌లో ఉపయోగించే ఫినైల్ అందరూ ఊహించినట్లుగా చాలా శక్తిమంతంగా ఉండదు. రోగుల వ్యాధి నిరోధకశక్తి తక్కువ కాబట్టి తక్కువ శక్తిమంతమైన క్లీనింగ్ మెటీరియల్‌ను హాస్పిటల్స్‌లో ఉపయోగిస్తుంటారు. ఈ జాగ్రత్త పాటిస్తూనే శుభ్రతను గమనించుకోవాలి. తగినంత మంది సిబ్బంది ఉండాలి హాస్పిటల్స్‌లో పారిశుధ్ధ్యం కోసం దాదాపు వంద పడకలకు నెలకు ఎంతవుతుందో చూసుకుని బడ్జెట్ కేటాయించుకోవాలి. వంద పడకలకు అన్ని షిఫ్ట్లనూ కలుపుకొని కనీసం 50 మంది సిబ్బంది పనిచేయాలి. ఆపరేషన్ థియేటర్స్, ఎమర్జన్సీలలో ప్రతిరోజూ ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. థియేటర్స్‌లో క్రిములను నాశనం చేసే ఫార్ములిన్ వంటి రసాయనాలను చల్లాల్సి ఉంటుంది. ఇక వార్డులు, పరీక్ష ప్రదేశాలు వంటి మిగతా ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా శుభ్రపరచాల్సిన అవసరం ఉంటుంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఎండీ, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ అందుబాటులో ర్యాట్ ప్యాడ్స్... కాక్రోచ్ జెల్స్... ఒక హాస్పిటల్లో మనం పారిశుద్ధ్యం కోసం వెచ్చించే మొత్తం మన నివారించే జబ్బుల వల్ల కలిగే ఆర్థిక భారంతో పోలిస్తే చాలా తక్కువ. పైగా అది పెద్ద ఖర్చు కూడా కాదు. హాస్పిటల్స్‌ను నిత్యం పరిశుభ్రం చేయడం కోసం ఇప్పుడు ర్యాట్ప్యాడ్స్, కాక్రోచ్ జెల్స్ వంటి ఆధునికమైన అనేక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి పారిశుద్ధ్యం కోసం పెట్టే ఖర్చు, పెద్దగా ఖర్చు అనిపించుకోదు. - డాక్టర్ చిగురుపాటి మోహనవంశీ, ఒమెగా హాస్పిటల్స్ షుగర్ రోగుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం! ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిక్ పేషెంట్స్‌కు స్పర్శ తగ్గుతుంది. కాబట్టి వారిని ఏదైనా కీటకం కరిచినా లేదా ఎలుకలు కొరికినా వెంటనే స్పర్శ తెలియదు. తర్వాతి దశల్లో అది చాలా పెద్ద సమస్యగా, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. హాస్పిటల్స్‌లో పారిశుద్ధ్య చర్యలు పాటించడం చాలా అవసరం. దాని కోసం చేసే ఖర్చు పెద్ద వ్యయమూ అనిపించుకోదు. - డాక్టర్ అనూరాధరెడ్డి, చైర్పర్సన్, డయాబెటిక్ ఫౌండేషన్, హైదరాబాద్ సహాయకుల బాధ్యతా ఉంటుంది... హాస్పిటల్లో చేరేవారు తమ ఇంటిలాగే దాన్నీ శుభ్రంగా ఉంచాలి. హాస్పిటల్స్ యాజమాన్యాలు తమ వంతుగా చేసే పారిశుద్ధ్య యత్నాలకు రోగుల అటెండెంట్స్ కూడా సహకరిస్తూ ఉండేలా వారిలో పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందాలి. అప్పుడే పారిశుధ్య ప్రయత్నాలు సంపూర్ణమవుతాయి. - డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, ఎండీ అండ్ సీఈవో కిమ్స్ హాస్పిటల్స్... -
మెడికల్ హబ్‌గా తిరుపతి
- రుయా అభివృద్ధి సొసైటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ - కమిటీ సభ్యుల ఎంపికకు నేడు రుయాకు రాక - రుయా అభివృద్ధి బాధ్యత టీటీడీకి అప్పగించే యోచన తిరుపతి కార్పొరేషన్ : రాయల సీమలోనే ప్రతిష్టాత్మక ఆస్పత్రిగా గుర్తింపు ఉన్న శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ ‘రుయా’ ఆస్పత్రిని అభివృద్ధి చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. తిరుపతికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఇది వరకే రాష్ట్ర ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ప్రకటిం చారు. తిరుపతికి వచ్చిన ప్రతి సారీ రాష్ట్ర మంత్రులు సైతం ఇదే విషయా న్ని చెబుతూ వస్తున్నారు. రుయాతో పాటు స్విమ్స్, బర్డ్, మెటర్నటీతో పాటు అనుబంధ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈనేపథ్యంలో రుయా ఆస్పత్రి కేం ద్రంగా ఆస్పత్రుల అభివృద్దికి చర్య లు తీసుకుంటోంది. అందులో భాగంగానే రుయా హాస్పిటల్ అభి వృద్ది సొసైటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఈఏడాది జూన్‌లో జీవో జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయి కమిటీని నియమించలేదు. 9 మంది కమిటీ సభ్యులతో కూడిన కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్‌పైనే ఉంచింది. ఈనేపథ్యంలో కలెక్టర్ బుధవారం రుయా ఆస్పత్రికి రానున్నారు. కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఏవిధంగా అభివృద్ధి చేయాలి, రుయా వార్షిక బడ్జెట్ ఎంత, మౌలిక సదుపాయాలు ఉన్నా యా, లేకుంటే ఏవిధంగా కల్పిం చాలి, వైద్య సేవలు మెరుగు పరి చేందకు తీసుకోవాలి తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇది వరకు రుయా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి అయి న టీటీడీ ఈవోను ప్రభుత్వం నియమించింది. అయితే తిరుపతిని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో టీటీడీని ప్రధాన భాగస్వామ్యం పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఆ బాధ్యతలు జిల్లా కలెక్టర్‌కు అప్పగించినట్టు సమాచారం. రుయా అభివృద్ధిని టీటీడీకి అప్పగించడం (దత్తత) ద్వారా అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావి స్తోంది. దీనికి టీటీడీ కూడా సుముఖంగానే ఉన్నట్టు ఈవో శాంబశివరావు ఇది వరకే ప్రకటించారు. కమిటీలో వీరు ఉండచ్చు.... రుయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉండగా కన్వీనర్‌గా రుయా సూపరింటెండెట్, స భ్యులుగా రుయా సీఎస్‌ఆర్‌ఎంవో ఉంటారు. వీరితోపాటు సభ్యులుగా రుయాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఒక సీని యర్ ప్రొఫెసర్, రు యాలోనే విద్యను అభ్యసించిన ఒక పూర్వపు సీనియర్ వైద్య విద్యార్థి, నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను ఎంపిక చేయనున్నారు. -
నిమ్స్ వైద్యుల వినూత్న నిరసన
- గాంధీజీ చిత్రపటానికి గులాబీల సమర్పణ - యాజమాన్యానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకోలు పంజగుట్ట: నిమ్స్‌కు నష్టం వాటిల్లే చర్యలు తీసుకోకుండా, ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడేలా యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని నిమ్స్ ఆసుపత్రి ఫ్యాకల్టీ అసోసియేషన్ మంగళవారం ఆసుపత్రిలోని గాంధీ చిత్రపటానికి గులాబీలు సమర్పించి వేడుకుంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ చేపట్టిన ఆందోళన మంగళవారం 2వ రోజుకు చేరింది. వైద్యులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి, గాంధీ చిత్రపటం వద్ద గులాబీలు ఉంచి తమ సమస్యలు పరిష్కరించేలా నిమ్స్ యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం డెరైక్టర్ నరేంద్రనాథ్‌కు గులాబీలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. పదోన్నతులు పాతవిధానంలోనే కొనసాగించాలని కోరారు. వైద్యులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిరసన వ్యక్తంచేసి అనంతరం ఓపీ రోగులకు సేవలందించారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీభూషన్‌రాజు మాట్లాడుతూ... ఆసుపత్రిలోని ఫ్యాకల్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పదోన్నతులపై ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో మాదిరిగానే ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిమ్స్ యాజమాన్యానికి ఇచ్చిన 72 గంటల సమయం మంగళవారంతో పూర్తవుతుందని, బుధవారం సాయంత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
ఆసుపత్రి కమిటీల్లో రాజకీయ నేతలకు చెక్
తణుకు : ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీల్లో రాజకీయ నాయకులకు చెక్ పడింది. ఇంతకాలం కమిటీల్లో చైర్మన్ పదవి నుంచి సభ్యుల వరకు పదవులు చేపట్టి చేసిన రాజకీయాలు ఇక చెల్లకుండా కమిటీలను పునర్నియామకం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు సంబంధించి కమిటీల్లో మార్పులు చేయాలని సూచించింది. ఇప్పటివరకు చైర్మన్ హోదాలో ఆసుపత్రి స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వారి స్థానంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులు జిల్లాలో 8 ఏరియా ఆసుపత్రులు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 73 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు ఏలూరులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉన్నాయి. జిల్లా ఆసుపత్రి సలహా కమిటీ చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్మన్, ఏరియా ఆసుత్రులకు ఎమ్మెల్యేలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జెడ్పీటీసీ సభ్యులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు మండల పరిషత్ అధ్యక్షులు చైర్మన్లుగా కొనసాగుతుండగా సభ్యులు, ఇతరత్రా పదవుల్లో రాజకీయ నాయకులతో పాటు స్థాయిని బట్టి ఆసుపత్రి వైద్యులు కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం కమిటీల్లో రాజకీయ నేతలను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంతో కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వాదనకు దిగుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక, సామాజిక ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులకు ప్రస్తుతం చైర్మన్ హోదాలో కలెక్టర్ నియమించిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని నియమించాల్సి ఉంది. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కన్వీనర్లుగా సీనియర్ మెడికల్ ఆఫీసర్, డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వ్యవహరిస్తారు. ఏరియా ఆసుపత్రులకు కో చైర్‌పర్సన్‌గా ఆర్డీవో లేదా సబ్‌కలెక్టర్, కన్వీనర్‌గా ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రులకు కో చైర్‌పర్సన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా మెడికల్ సూపరింటెండెంట్ వ్యవహరించనున్నారు. వీరంతా నెలకోసారి సమావేశమై ఆసుపత్రి అభివృద్ధికి అవసరమయ్యే సూచనలు, సలహాలు సమీకరించడంతోపాటు స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు సేకరించి తద్వారా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది. -
బిల్లు కట్టి బయటకెళ్లండి..!
ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. జన్మనిచ్చిన తల్లి, కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ల ముందే కన్నుమూశారు. ఇక మిగిలింది ఒక్కడే.. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిని చూస్తే ఎంతటి కఠినాత్ముడైనా అయ్యో పాపం అంటారు. కానీ ఆ ఆస్పత్రి యూజమాన్యం మాత్రం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. మృతి చెందిన తన కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు వెళ్లేందుకు పంపించాలని కోరినా బిల్లు మొత్తం చెల్లించకుంటే పంపించమని మొండికేయడం వైద్య వృత్తికే మాయని మచ్చగా మారింది. ⇒ అంత్యక్రియలకు వెళ్లేందుకు క్షతగాత్రున్ని నిరాకరించిన ఆస్పత్రి యాజమాన్యం ⇒ ఆస్పత్రి వైద్యులతో బంధువుల వాగ్వాదం ⇒ సర్దిచెప్పి పంపించిన పోలీసులు నిజామాబాద్ క్రైం: రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామం వద్ద కారు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కారు నడుపుతున్న విజయ్‌కుమార్ కాలు విరగడంతో అతన్ని నిజామాబాద్‌లోని హైదరాబాద్‌రోడ్డు ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో అతని తల్లి, భార్య, కుమారుడు మృతి చెందారు. వారి అంత్యక్రియలకు ఆయన తప్పనిసరిగా వెళ్లాల్సి ఉండటంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి పంపించాలని బంధువులను వైద్యులను కోరారు. అయితే ఆస్పత్రి యూజమాన్యం, సిబ్బంది మాత్రం చికిత్సకు అరుున రూ.70 వేలు చెల్లిస్తేనే పంపిస్తామని మొండికేశారు. అయితే తమ వద్ద అంత మొత్తం లేదని రూ.10 వేలు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. అయినా చికిత్సకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వేయడంపై వారు మండిపడ్డారు. ఓ పక్క కుటుంబాన్ని కోల్పోయిన బాధలో ఉంటే బిల్లు కట్టకుంటే పంపించమని మొండికేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. దీంతో నాల్గవ టౌన్ ఎస్సై మధు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బిల్లు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. చివరకు రూ.15 వేలు చెల్లిస్తామని చెప్పడంతో బిల్లు కట్టించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. -
ఆస్పత్రుల శుభ్రానికి గోమూత్రం
వృధాగా పోయే గోమూత్రంతో ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వాస్పత్రులు ముందుకొస్తున్నాయి. ఖరీదైన ఫినాయిల్‌ను పక్కన పడేసి గో మూత్రంతోనే ఆస్పత్రిలను శుభ్రం చేయిస్తామని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రి ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర రాథోర్ ప్రకటించారు. జలోర్ జిల్లాలోని పథ్మేడ గ్రామంలో ఏర్పాటు చేసిన గోమూత్రం రిపైనరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రిఫైనరీని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఫినాయిల్ స్థానంలో గో మూత్రానికి వేపాకును కలిపి ఉపయోగించడం మంచిదని, దానివల్ల ఆవు పట్ల మనకున్న ఆరాధ్య భావన మరింత ఇనుమడిస్తుందని కేంద్రమంత్రి, జంతు కారుణ్య కార్యకర్త మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి శుచి, శుభ్రతల కోసం గో మూత్రాన్ని ఉపయోగించాలనే ఆలోచన ఆమెదే. గత మార్చి నెలలోనే ఆమె ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. పథ్మేడ గ్రామంలో రూ. 4 కోట్లతో గోమూత్రం రిఫైనరీ ప్లాంటును గోపాల్ గోవర్ధన్ గోశాల అనే సంస్థ ఏర్పాటుచేసింది. ఆవు పాలు, మూత్రాన్ని ఉపయోగించి తయారుచేసే ఉత్పత్తులను ఇక తాము విరివిగా మార్కెటింగ్ చేస్తామని రిఫైనరీ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైద్య శ్యామ్సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. రోజుకు 7 వేల లీటర్ల గోమూత్రాన్ని శుద్ధిచేసే సామర్థ్యం తమ రిఫైనరీకి ఉందని, వాటిలో సగభాగాన్ని శుభ్రత ఉత్పత్తుల కోసం, మిగతా సగ భాగాన్ని ఔషధాల కోసం ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. మధుమేహం, హృద్రోగుల ఔషధాల్లో గో మూత్రాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు. -
ఆస్పత్రుల కోసం స్థలమివ్వండి
♦ కేంద్ర మంత్రి వెంకయ్యను కోరిన ఢిల్లీ సర్కార్ ♦ ప్రైవేటుకు కేటాయించిన భూముల్ని రద్దు చేయాలి ♦ ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలేదని ఆవేదన న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ఆస్పత్రుల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఢిల్లీ సర్కార్ కోరింది. గత 40 ఏళ్ల కాలంలో ఆస్పత్రులు నిర్మించడం కోసం వివిధ ప్రైవేటు కంపెనీలకు 18 ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇటీవల వెంకయ్యనాయుడుకు రెండు లేఖలు రాశారు. ఢిల్లీ ప్రభుత్వమే ఆస్పత్రులు నిర్మించాలని యోచిస్తోందని లేఖలో వివరించారు. అందుకోసం స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)కి రెండు లేఖలు వచ్చిన మాట వాస్తవమే. విలువైన భూముల్ని ఆసక్తి లేని వ్యక్తులకు కట్టబెట్టారని లేఖలో వివరించారు. భూములు దక్కించుకున్న వారు వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు’ అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ‘ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ గత 40 ఏళ్ల కాలంలో ఆస్పత్రులు నిర్మించడానికి పలు ప్రైవేటు కంపెనీలకు 18 ప్లాట్లు కేటాయింది. ఆస్పత్రుల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. అయినా ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయలేదు. నిర్దేశిత సమయంలో కట్టడాలు పూర్తి చేయకపోతే లీజు రద్దు చేస్తామని డీడీఏ హెచ్చరించిది’ అని ఒక అధికారి తెలిపారు. -
కడిగేసిన కాగ్
ఆస్పత్రి అభివృద్ధి కమిటీల పనితీరుపై ఆగ్రహం ఖాతాల నిర్వహణ తీరుపై అభ్యంతరం అర్హత లేని వ్యక్తికి రూ.10 లక్షలు చెల్లించారంటూ చురక సిటీబ్యూరో: ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల పనితీరుపై కాగ్(కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి మూడునెలలకు ఒకసారి కమిటీల సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం ఆరునెలలైనా సమావేశాల ఊసెత్తడం లేదని పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వ నిజామియా జనరల్ (యునాని)ఆస్పత్రి హెచ్‌డీసీ ఖాతాలో ల క్షల నిధులు మగ్గిపోతున్నట్లు తెలిపింది. దీనికితోడు ప్రతిష్టాత్మకమైన గాంధీ, ఉస్మానియా తదితర బోధనాస్పత్రుల్లోనూ ఖాతాల నిర్వహణ సక్రమంగా లేదని, ఇప్పటి వరకు చార్టెర్డ్ అకౌంటెంట్‌తో ఆడిట్ చేయించక పోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈఎమ్‌డీ, ఎస్డీ రిజిస్ట్రర్ సరిగా నిర్వహించక పోగా అర్హత లేని వ్యక్తికి రూ.10 లక్షల ఈఎమ్‌డీ చెల్లించినట్లు పేర్కొంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కాక్లీయర్ ఇంప్లాంట్ సర్జరీల కోసం కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టినట్లు స్పష్టం చేసింది. తొమ్మిది మంది ఏవీ థెరపీ కోసం దరఖాస్తు చేసుకోగా, ట్రస్ట్ నుంచి రూ .5.80 లక్షలు డ్రా చేసుకున్నప్పటికీ లబ్దిదార్ల పేర్లు ఏవీ థెరపీకి సంబంధించిన హాజరు పట్టికలో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతీయ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం నెలకు 20 కన్నా ఎక్కువ ప్రసవాలు జరిగే పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యాధికారులు, నలుగురు స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా, నగరంలోని ఆరోగ్య కేంద్రాల్లో 88 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. నగరంలో రక్తనిధి కేంద్రాల నిర్వహణపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రక్తం సేకరణ, నిల్వ, సరఫరాలో సరైన ప్రమాణాలు పాటించడం లేదన్నారు. రక్త నిల్వలపై సెంట్రల్ ఆన్లైన్ డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలని 2011లోనే సూచించినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఆస్పత్రి సమస్యలు పరిష్కరించకుంటే.. ఆమరణ దీక్ష: ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో పట్టిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష చేయడానికైనా వెనుకాడేది లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఆస్పత్రి పరిరక్షణ కమిటీ నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేతోపాటు ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉందని, ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారన్నారు. ల్యాబ్ సౌకర్యం ఉన్నప్పటి కీ టెక్నీషియన్లు లేరని, ఈసీజీ, అల్ట్రా సౌండ్ మిషన్లు ఉన్నా రేడియాలజిస్టు లేరన్నారు. ఇంతటి పెద్ద భవనాలకు ఫ్యాన్లు, విద్యుత్ ఉంది కానీ కొంచం రిపేరు వచ్చినా సరి చేసే ఎలక్ట్రిషియన్ లేడన్నారు. ఆస్పత్రితోపాటు మంచినీటి సౌకర్యం కోసం తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అయినా వీటి అభివృద్ధి కోసం నడుస్తామన్నారు. ఒక వేళ ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే తెలుగుదేశం పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడానికి ఆటంకమైతే.. నియోజకవర్గ ప్రజల కోసం తన శాసనసభ సభ్యత్వాన్ని అయినా వదులుకోవడానికి సిద్ధమని అన్నారు. ఉన్నతాధికారులకు నివేదించాలి డీసీహెచ్ఎస్ రామేశ్వరుడు ధర్నా ప్రాంతానికి వచ్చారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే రాచమల్లు డీసీహెచ్ఎస్ను ప్రశ్నిం చారు. ఉన్న ఫళంగా ఉద్యోగులందరిని తొలగిస్తే అత్యవసర పనులు ఎలా జరుగుతాయని అడిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబ్బందిని తొలగించామని డీసీహెచ్ఎస్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఇంకా కింది స్థాయి సిబ్బంది అవసరం ఉందని, అలాగే డాక్టర్లు కూడా కావాలని ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు ప్రజా సంఘాల నాయకులు డీసీహెచ్ఎస్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, ఆర్ఎస్ఎఫ్ కన్వీనర్ భాస్కర్, జిల్లా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ కన్వీనర్ అన్వేష్, సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, కృష్ణ, తవ్వా సురేష్‌రెడ్డి, కరుమూరి వెంకటరమణ, యల్లయ్య, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అనసూయ, మురళీధర్‌రెడ్డి, టప్పా గైబుసాహెబ్, శంకర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, నాయకులు పోసా భాస్కర్, పాలగిరి ఖాజా, చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరణ మృదంగం!
నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిలోఫర్‌లో రోజుకు సగటున 13 మంది శిశువుల మృతి కోర్టులు చీవాట్లు పెట్టినా మారని వైద్యసేవల తీరు పసికూనల బోసినవ్వులు విరబూయాల్సిన చోట మరణ మృదంగం మోగుతోంది... పురిటి నొప్పుల బాధను ఇంకా పూర్తిగా మరిచి పోని ఆ తల్లులకు తీరని వ్యధే మిగులుతోంది... మౌలిక వసతుల లేమి, మందుల కొరతకు తోడు సకాలంలో వైద్యం అందక ప్రతిష్టాత్మాక నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు సగటున 13 మంది శిశువులు మృతి చెందుతుండటం అందరినీ కలిచివేస్తోంది. నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో జరుగనుంది. సమావేశంపై ఆస్పత్రికి సంబంధించిన సీనియర్ ప్రొఫెసర్లు కానీ, ఇతర అధికారులకు సమాచారం లేదు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఆస్ప త్రిలో కాకుండా సచివాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. సిటీబ్యూరో : అమ్మ కలలు కల్లలవుతున్నాయి. తొమ్మిది నెలలు కడుపులో మోసి పండంటి బిడ్డను కనేందుకు నిలోఫర్ ప్రభుత్వ నవజాతా శిశువుల దవఖానుకు వచ్చే తల్లులకు గుండె కోతే మిగులుతోంది. పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ మత్యుముఖంలోంచి బయటకొచ్చిన తల్లిని మృత శిశువు వెక్కిరిస్తోంది. మరోవైపు ప్రసూతి విభాగంలో క్రిటికల్‌కేర్ యూనిట్ లేక పోవడంతో అధిక రక్తస్రావం వ ల్ల బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉంటే... నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను వెచ్చదనం కోసం వార్మర్లలో పెట్టాల్సి ఉంది. ఆస్పత్రిలో సుమారు వంద వార్మర్లు ఉన్నా...వీటిలో 40కిపైగా పని చేయడం లేదు. ఇది తెలిసి కూడా శిశువులను వాటిపైనే ఉంచడం వల్ల చలికి గజగజ వణుకుతున్నారు. త్వరగా కోలుకుంటారని భావించిన తల్లిదండ్రులకు చివరకు తీరని ఆవేదనే మిగులుతోంది. చాలా మందికి పుట్టుకతోనే కామెర్లు వస్తాయి. శిశువులను ఫొటో థెరిపీ యూనిట్లుపై ఉంచి చికిత్స అందించాల్సి ఉంది. అయితే చూసేందుకు ఫొటోథెరపీ యూనిట్లు పనిచేస్తున్నట్లే కన్పించినా వ్యాధిని నయం చేయలేక పోతున్నాయి. వాస్తవానికి ప్రతి వంద రోజులకు ఒకసారి లైట్లను మార్చాల్సి ఉన్నా..అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. అభివృద్ధి కమిటీ అనుమతి ఇచ్చినా... మూడు అంతస్తులు ఉన్న ఎమర్జెన్సీ విభాగంలో మూడేళ్లుగా లిఫ్ట్ పనిచేయడం లేదు. బాలింతలు తమ చంటిపిల్లలను ఎత్తుకుని అతి కష్టం మీద పై అంతస్తులకు చేరుకోవాల్సి వస్తోంది. కుట్లు పడినలేత శరీరంతో మెట్లు ఎక్కలేక బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు. చేతుల్లో శిశువును పెట్టుకుని మెట్లపై నడుచుకుంటూ పైకి ఎక్కుతుండటం వల్ల మెడలోని నరాలు తెగి శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఎమర్జెన్సీ విభాగంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో 15-20 శాతం మరణాలకు ఇదే కారణమని నిపుణులంటున్నారు. లిఫ్ట్ మరమ్మతుకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అనుమతి ఇచ్చినా ఆర్ ఎంఓ పట్టించుకోవడం లేదు. పిల్లలే కాదు తల్లులది అదే దుస్థితి.. ఆస్పత్రిలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్య తలెత్తుతోంది. అత్యవసర పరిస్థితుల్లో వీరికి రక్తం ఎక్కించేందుకు అవసరమైన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ కూడా లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంలో బాలింతలు మృత్యువాత పడుతున్నారు. కేవలం రెండు మాసాల్లోనే 8 మంది బాలింతలు మృత్యువాత పడినట్లు విశ్వసనీ సమాచారం. చిన్ని గుండెలు బీటలు... పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది శిశువుల్లో పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. రోగ నిర్థారణకు ఉపయోగించే ఈసీజీ, 2డిఎకో యంత్రాలు ఆస్పత్రిలో లేవు. ఇక ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఉన్నా... లేనట్లే. ప్రతి రోజూ 20-30 మంది శిశువులను నిలోఫన్ వాహనంలో ఉస్మానియాకు తరలిస్తున్నారు. తీరా ఈసీజీ వద్దకు చేరుకునే సమయానికి అప్పటికే అక్కడ భారీ క్యూ ఉంటోంది. మెరుగైన వైద్యం అందాలంటే.. దేశంలోనే అతిపెద్ధ నవజాత శిశువుల రెఫరల్ సెంటర్‌గా గుర్తింపు పొందిన నిలోఫర్ ఆస్పత్రిలో 550 పడకలు ఉండగా, నిత్యం వెయ్యి మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. 450 పడకల సామర్థ్యంతో కొత్తగా నిర్మించిన రాజీవ్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌ను ప్రారంభిస్తే పడకల సమస్య కొంత వరకు తీరుతుంది. ఆస్పత్రిలో ప్రస్తుతం 75 మంది వైద్యులుండగా, మరో 75 మంది అవసరం. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు అవసరం కాగా... 130 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో రోగుల బంధువులే సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో 51 వెంటిలేటర్లు ఉండగా, వీటిలో 11 పని చేయడం లేదు. రోగుల అవసరాలు తీరాలంటే మరో 25 వెంటిలేటర్లు, వ ంద వార్మర్లు, 5 ఫోర్టబుల్ ఎక్సరే మిషన్లు, 4 ఆల్ట్రాసౌండ్ మిషన్లు, ఒక టు డి ఎకో మిషన్, రక్తనాళాల్లో లోపాన్ని గుర్తించే ఒక ఈఎంఎన్జీ మిషన్‌తో పాటు 25 ఇంకుబేటర్లు, 60 ఫొటోథెరపీ యూనిట్లు, 50 ఇన్ఫ్లూజన్ పంప్స్ 20 ఎన్ఐబీ మానిటర్స్, 20 పల్స్ ఆక్సో మీటర్స్, 40 గ్లకోమీటర్లు అవసరం. శిశు మరణాల రేటు తగ్గించేందుకు శ్రమిస్తున్నాం ఆపదలో వచ్చిన ప్రతి శిశువును ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నాం. ఇక్కడికి వస్తున్న కేసుల్లో నూటికి 80 శాతం బ్యాక్ కండిషన్ బేబీలే. వారిని కాపాడేందుకు మా వైద్య బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఆస్పత్రిలో వైద్యులకు కొరత లేదు.. కానీ నర్సింగ్ స్టాఫ్, పారమెడికల్ స్టాఫ్, వార్డు బోయ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశాం. మా ఇబ్బందులను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్లో నిలోఫర్‌కు రూ.30 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వైద్య పరికరాలు, రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ దేవరాజ్, సూపరింటెండెంట్ , నిలోఫర్ -
ఇక్కడ..లొల్లి
మంత్రికి తెలియకుండానే ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నియామకం ⇒ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులకు ప్రాధాన్యమిచ్చిన జెడ్పీ చైర్మన్ ⇒ కలెక్టర్‌కు తెలియకుండానే సమావేశం ఏర్పాటు ⇒ మంత్రి జోక్యంతో వాయిదా ⇒ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య సఖ్యతకు భంగం! సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) పదవులను సజావుగా పంచుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య కొత్త లొల్లి మొదలైంది. ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన ‘రాజీ’ మూడుగంటల ముచ్చటగానే మిగిలిపోయి రాజకీయ వైరానికి దారితీసింది. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి సలహా కమిటీ నియామకంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పూర్తిగా కాంగ్రెస్ వారికే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రభుత్వం నియమించాల్సిన ఎమ్మెల్యేలను తానే నామినేట్ చేయడం, జిల్లా మంత్రికి తెలియకుండానే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం కొత్త వివాదానికి దారితీసింది. తనకు తెలియకుండానే కమిటీని నియమించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలుసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమావేశాన్ని వాయిదా వేయించినట్టు సమాచారం. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్గాజెడ్పీచైర్మన్, కార్యదర్శిగా కలెక్టర్ ఉంటారు. ఇందులో రాజకీయ నాయకులకు కూడా స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కమిటీలో తీసుకోవాలి. అయితే, ఎంపీపీలు, జెడ్పీటీసీలను నియమించే అధికారం జెడ్పీచైర్మన్‌కు ఉన్నా ఎమ్మెల్యేలను మాత్రం ప్రభుత్వం (జిల్లా ఇన్చార్జ్ మంత్రి) సిఫారసు చేయాల్సి ఉం టుంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను అధికారికంగా నియమించనందున జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ఎమ్మెల్యేల పేర్లను సిఫారసు చేయాలి. ఏం జరిగిందో ఏమో కానీ... మంత్రికి, ప్రభుత్వానికి తెలియకుం డానే జెడ్పీచైర్మన్ బాలునాయక్ ముగ్గు రు ఎమ్మెల్యేలను కూడా నియమించేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కమిటీ సభ్యులుగా నియమించేశారు. జెడ్పీటీసీ, ఎంపీపీలను కూడా కాంగ్రెస్ వారినే నియమించారు. జెడ్పీచైర్మన్ ఆదేశాలతో ఈ కమిటీని ఖరారు చేసిన వైద్యశాఖ అధికారులు కలెక్టర్‌కు తెలియకుండానే శనివారం కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కనీసం సమావేశ ఏర్పాటు గురించి మంత్రి జగదీష్‌రెడ్డికి సమాచారం కూడా ఇవ్వలేదు. దీనిపై మంత్రి జిల్లా ఉన్నతాధికారులను ఆరాతీయడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుం డా కమిటీని నియమించి సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆ శాఖ ఉన్నతాధికారులు జెడ్పీచైర్మన్‌ను ఒప్పించి సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆస్పత్రుల అభివృద్ధి కమిటీని వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డీపీసీ పదవులను ఏ పేచీ లే కుండానే పంచుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య రాజకీయ అగాథం ఏర్పడిందని, జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నియామకం కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీస్తుందని రాజకీ య వర్గాలంటున్నాయి. అసలు జిల్లా మంత్రికి తెలియకుండా కమిటీని నియమించి, సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ విషయమై తాడోపేడో తేల్చుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో నూ ఈ కమిటీని అంగీకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల పంచాయితీ ఏ మలు పు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. -
పిచ్చోళ్లను చేస్తున్నరు!
⇒ వైద్యులపై మండిపడిన మంత్రి ‘పోచారం’ ⇒ శానిటేషన్ అధ్వానంగా ఉంది, పరిశుభ్రత లేదు ⇒ మెడికల్ కళాశాల నిధుల వినియోగంపై స్పష్టత లేదు ⇒ పేద రోగులకు మానవత్వంతో సేవలందించాలని హితవు ⇒ సదరం శిబిరాల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం ⇒ వాడీవేడీగా సాగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్ : ‘‘మేమేమైన పిచ్చోళ్లలాగా కనబడుతున్నామా, సూటిగా సమాధానం చెప్పరెందుకు? మమ్మల్నే తికమక పెడతరు. మీతో మాట్లాడితే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించండి. మీలో మీకు సమన్వ యం లేదు. పనిలో శ్రద్ధ లేదు. వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి’’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైద్యులపై మండిపడ్డారు. సోమవారం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమీక్ష సమావేశం జరిగింది. ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగుల అవసరాలపై చర్చించారు. వైద్యాధికారుల తీరుపై తీవ్రంగా చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ ‘‘శానిటేషన్ ఎవరు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి రాగానే దుర్వాసన వస్తుంది. ఏ మాత్రం శుభ్రత లేదు. శానిటేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరు? నెలకు ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. రూ. 2.15 లక్షలు చెల్లిస్తున్నారని, 61 మంది సిబ్బంది ఉన్నారని కాంట్రాక్టర్ బదులిచ్చారు. కొత్త, పాతవారికి వేరువేరు బడ్జెట్లు ఉన్నాయని, నిధులు రావడం లేదన్నారు. ఆస్పత్రి శుభ్రంగా శుభ్రంగా ఉందని చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేమేమైనా పిచ్చోళ్లమా...మాకు కనిపించడం లేదా, ఎక్కడ ఉంది శుభ్రత, మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తావా’’ అంటూ అసహనం వ్యక్తం చే శారు. శానిటేషన్ సిబ్బందికి గత జులై నుంచి నిధులు విడుదల కాలేదని చెప్పడంతో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, డీఎంఈ శ్రీనివాస్, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ మీనాకుమారితో మంత్రి పోచారం ఫోన్లో మాట్లాడారు. నిధులకు సంబంధించి ఎవరూ అడగలేదని వారు చెప్పడంతో, సమన్వయం లేకనే పనులన్ని నిలిచి పోతున్నాయని, సక్రమంగా పనులు చేయాలని వైద్యులను హెచ్చరించారు. ఎందుకు వెళుతున్నారు? రేడియాలిస్టు సమయపాలన పాటించడం లేదని, అందుబాటులో ఉండడం లేదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మంత్రి దృష్టికి తెచ్చారు. తాను పగలు 2.30 గంటలకు ఇంటికి వెళుతున్నానని రేడియాలజిస్టు చెప్పడంతో, ఎందుకు వెళుతున్నారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడం తో, మీతో మాట్లాడితే మాకే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. మెడికల్ కళాశాలకు మంజూరైన రూ. 26 కోట్లను ఎలా వినియోగిస్తారో అధికారులు చెప్పలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొనసాగుతున్న జనరిక్ మందుల దుఆణాలు, ఆస్పత్రికి డబ్బులు చెల్లించకపోవడం, ఆస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన ఆంధ్ర బ్యాంకు ఏటీఎంకు కేవలం నెలకు రూ. 1500 మాతమే వసూలు చేయడాన్ని మంత్రి ప్రశ్నించారు. ఆస్పత్రిలో సైకిల్ స్టాండ్, క్యాంటిన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జనరిక్ మందు ల దుకాణాలను టెండర్ల ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి పక్షాన జరుగ కపోతే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘సదరం’ ఇలాగేనా? సదరం నిర్వహణపై కలెక్టర్ మండిపడ్డారు. నియోజకవర్గాలవారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రి వైద్యులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘‘మీకు వాహనాలు ఏర్పాటు చేయాలా! మీరు ప్రభుత్వ వైద్యులు కారా! వైద్యులు లేరని ఆర్మూర్ నుంచి తరచూ ఫోన్లు వచ్చాయి. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోండి’’ అని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. డీసీహెచ్ఎస్ శివదాస్ సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల సుజాత, కళాశాల ప్రిన్సిపాల్ జీజీయాబాయి, డీఎంహెచ్ఓ గోవింద్‌వాగ్‌మోరే, ఆస్పత్రి సూ ప రిండెంట్ భీంసింగ్, ఆర్‌ఎంఓలు రజినీకాంత్, బ న్సీలాల్, విశాల్ పాల్గొ న్నారు. అంతకు ముం దు మంత్రి పోచారం ఆ స్పత్రిలోని వివిధ వా ర్డులను తిరుగుతూ పరి శీలించారు. -
ఆసుపత్రుల్లో సదుపాయాల కల్పనకు రూ.66.6 కోట్లు: రాజయ్య
హైదరాబాద్: తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.66.6 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య తెలిపారు. వెంగళరావునగర్ కాలనీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో బుధవారం వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులోని బెడ్లు, ఇతర సౌకర్యాలు రోగులకు సరిపడాలేవని చెప్పారు. నీలోఫర్ ఆసుపత్రిలో 30 పడకలకుగాను దాదాపు 250 మంది పిల్లలు చేరుతున్నారని, 500 మంది రోగులకు సరిపడా స్టాఫ్ ఉండగా 1500 మంది పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్(పీహెచ్సీ), అర్బన్ హెల్త్ పోస్టు(యూహెచ్‌పీ)ల్లోనే పలు వైద్య పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూహెచ్‌పీ, పీహెచ్సీలో మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.113 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మార్చి 31వ తేదీలోపు ఈ నిధులను ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నీలోఫర్‌లో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లు విద్యుత్, మరో రెండున్నర కోట్ల రూపాయల మేర మంచినీటి బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరలోనే చెల్లించనున్నామన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి 200 ప్రభుత్వ, 350 ప్రైవేటు మెడికల్ సీట్లును సాధించుకోగలిగామని మంత్రి చెప్పారు. వరంగల్‌లో హెల్త్ యూనివర్శిటీ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాల నిర్మించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో 30 నుంచి 40 శాతం వరకు అంటువ్యాధులు తగ్గాయని తెలిపారు. సీమాంధ్రతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్ నగరానికి డిప్యూటేషన్ కోరుతున్నారని, తెలంగాణలోనే వారు ఉద్యోగాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. జీవీకే అమర్థత కారణంగా పలు 104, 108 వాహనాలు మూలన పడ్డాయన్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు ముందు తనను సంప్రదించలేదని చెప్పారు. ప్రొటెక్షన్ ఫోర్స్‌ను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు.