మెడికల్ హబ్‌గా తిరుపతి | Tirupati as Medical hub | Sakshi
Sakshi News home page

మెడికల్ హబ్‌గా తిరుపతి

Published Wed, Aug 5 2015 3:17 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

మెడికల్ హబ్‌గా తిరుపతి - Sakshi

మెడికల్ హబ్‌గా తిరుపతి

- రుయా అభివృద్ధి సొసైటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్
- కమిటీ సభ్యుల ఎంపికకు నేడు రుయాకు రాక
- రుయా  అభివృద్ధి బాధ్యత టీటీడీకి అప్పగించే యోచన
తిరుపతి కార్పొరేషన్ :
రాయల సీమలోనే ప్రతిష్టాత్మక ఆస్పత్రిగా గుర్తింపు ఉన్న శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ ‘రుయా’ ఆస్పత్రిని అభివృద్ధి చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. తిరుపతికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఇది వరకే రాష్ట్ర ముఖ్యమం త్రి   చంద్రబాబు నాయుడు ప్రకటిం చారు. తిరుపతికి వచ్చిన ప్రతి సారీ రాష్ట్ర మంత్రులు సైతం ఇదే విషయా న్ని చెబుతూ వస్తున్నారు. రుయాతో పాటు స్విమ్స్, బర్డ్, మెటర్నటీతో పాటు అనుబంధ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈనేపథ్యంలో రుయా ఆస్పత్రి  కేం ద్రంగా ఆస్పత్రుల అభివృద్దికి చర్య లు తీసుకుంటోంది.

అందులో భాగంగానే రుయా హాస్పిటల్ అభి వృద్ది సొసైటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు  ఈఏడాది జూన్‌లో జీవో జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయి కమిటీని నియమించలేదు.   9 మంది కమిటీ సభ్యులతో కూడిన కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్‌పైనే ఉంచింది. ఈనేపథ్యంలో  కలెక్టర్ బుధవారం రుయా ఆస్పత్రికి రానున్నారు. కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఏవిధంగా అభివృద్ధి చేయాలి, రుయా వార్షిక బడ్జెట్ ఎంత, మౌలిక సదుపాయాలు ఉన్నా యా, లేకుంటే ఏవిధంగా కల్పిం చాలి, వైద్య సేవలు మెరుగు పరి చేందకు తీసుకోవాలి తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది.

ఇది వరకు రుయా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి అయి న టీటీడీ ఈవోను ప్రభుత్వం నియమించింది. అయితే తిరుపతిని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో టీటీడీని ప్రధాన భాగస్వామ్యం పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఆ బాధ్యతలు జిల్లా కలెక్టర్‌కు అప్పగించినట్టు సమాచారం. రుయా అభివృద్ధిని టీటీడీకి అప్పగించడం (దత్తత) ద్వారా  అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావి స్తోంది. దీనికి టీటీడీ కూడా సుముఖంగానే ఉన్నట్టు ఈవో శాంబశివరావు ఇది వరకే  ప్రకటించారు.
 
కమిటీలో వీరు ఉండచ్చు....
రుయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉండగా కన్వీనర్‌గా రుయా సూపరింటెండెట్, స భ్యులుగా రుయా సీఎస్‌ఆర్‌ఎంవో ఉంటారు. వీరితోపాటు సభ్యులుగా రుయాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఒక సీని యర్ ప్రొఫెసర్, రు యాలోనే విద్యను అభ్యసించిన ఒక పూర్వపు సీనియర్ వైద్య విద్యార్థి, నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను ఎంపిక చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement