ఆస్పత్రుల అభివృద్ధికి కృషి
-
మంత్రి కామినేని శ్రీనివాస్
-
పెద్దాడలో పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన
పెద్దాడ(పెదపూడి) :
రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పెద్దాడలో ఎ¯ŒSహెచ్‌ఎం నిధులు రూ.1.18 కోట్లతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆస్పత్రుల భవనాల నిర్మాణానికి, అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ ఎం.మురళీమోహ¯ŒS మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందిస్తున్న మెరుగైన, ఖరీదైన వైద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు తదితరులు మాట్లాడారు. సర్పంచ్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ తాను గతంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఎంపీ మురళీ మోహ¯ŒSపై చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని కోరారు. ఒక బేబికిట్, 8 మందికి ఇంటి రుణ మంజూరు పత్రాలు మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఎంపీపీ జుత్తక సూర్యకుమారి, డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వి.వెంకట్రావు పాల్గొన్నారు.