inagiration
-
ఆ‘పాత’మధురం.. నేటికీ మరువం
రాజమహేంద్రవరం కల్చరల్ : నటుడు, గాయకుడు శ్రీపాద జిత్ మోహ¯ŒS మిత్రా ఆర్కెస్ట్రా 47వ వార్షికోత్సవం ఆదివారం ఆనం రోటరీహాలులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిత్ మోహ¯ŒSమిత్రా, ఇతర గాయనీగాయకులు 1957లో విడుదలైన 17 హిందీ, తెలుగు సినిమాల్లోని గీతాలను ఆలపించారు. సినీవిజ్ఞాన విశారద ఎస్వీ రామారావు గీతాలనేపథ్యాన్ని వివరించారు. ‘మాయాబజారు, పాండురంగమహాత్మ్యం, సువర్ణసుందరి, తోడికోడళ్లు, సారంగధర, భాగ్యరేఖ, వినాయకచవితి, దొంగల్లో దొర, ఎమ్మెల్యే తెలుగు సినిమాలతో పాటు హిందీగీతాలను వినిపించారు. 15సార్లు మాయాబజార్ నిర్మాణం.. భారతీయ భాషల్లో 15 సార్లు మాయాబజారు నిర్మించారని సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు తెలిపారు. ‘‘మహాభారతంలో మాయాబజారు కథ ఎక్కడా లేదు. ఇది పూర్తిగా కల్పితగాథ. ఈ సినిమాలో పాండవులు ఎక్కడా కనపడకపోయినా వారి ప్రస్తావన అడుగడునా వినవస్తుంది. మహానటి సావిత్రి శశిరేఖ పాత్ర కోసం, ఎస్వీఆర్ ఘటోత్కచుడి పాత్రకోసమే పుట్టారా అనిపిస్తారు. ఇప్పటివరకు ఓ సర్వే భారతదేశంలో 60 వేల సినిమాలు నిర్మాణమయ్యాయని తేల్చింది. అధిక సంఖ్యాకులు వీటిలో మాయాబజారు ఉత్తమ చిత్రమని పేర్కొన్నారు.’’ -
త్యాగధనుడు అల్లూరిని స్మరించుకోవాలి
ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి అడ్డతీగలలో అల్లూరి విగ్రహావిష్కరణ అడ్డతీగల : దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే వంతలSరాజేశ్వరి అన్నారు. అల్లూరి దాడి చేసిన వాస్తవ పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదుట మంగళవారం అల్లూరి సీతారామరాజు యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహాన్ని రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్ నయూం అస్మీ, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవిష్కరించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి తరంతో పాటు భావితరాలకు కూడా గిరిజనుల హక్కులు, బాధ్యతలను గుర్తుచేస్తూ అల్లూరి నెరపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించేలా కృషిచేయాలన్నారు. అల్లూరి స్మారక స్థలాలను పరిరక్షించడానికి యువజన సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఏఎస్పీ అన్నారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, చైతన్యాన్ని నింపుకొని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అల్లూరి దాడి చేసిన పోలీస్‌స్టేçÙన్ల వద్దనే కాకుండా పాఠశాలలు, ఇతరత్రా గ్రామాల్లోనూ అల్లూరి విగ్రహాలను నెలకొల్పనున్నట్టు యువజనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తెలిపారు. అల్లూరి జీవిత చరిత్రపై నిర్వహించిన బుర్రకథ పలువురిని ఆకట్టుకుంది. ఎంపీపీ అన్నం సత్తిబాబు, అడ్డతీగల సర్పంచ్ పప్పుల చిట్టమ్మ అడ్డతీగల, రాజవొమ్మంగి సీఐలు ముక్తేశ్వర్రావు, మోహ¯ŒSరెడ్డి, అడ్డతీగల ఎస్ఐ వై.గణేష్‌కుమార్, అల్లూరిసీతారామరాజు యువజన సంఘం బాధ్యులు దంగేటి సత్తిబాబు, రామన శ్రీను తదితరులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్పత్రుల అభివృద్ధికి కృషి
మంత్రి కామినేని శ్రీనివాస్ పెద్దాడలో పీహెచ్సీ భవనానికి శంకుస్థాపన పెద్దాడ(పెదపూడి) : రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పెద్దాడలో ఎ¯ŒSహెచ్ఎం నిధులు రూ.1.18 కోట్లతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆస్పత్రుల భవనాల నిర్మాణానికి, అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ ఎం.మురళీమోహ¯ŒS మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందిస్తున్న మెరుగైన, ఖరీదైన వైద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు తదితరులు మాట్లాడారు. సర్పంచ్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ తాను గతంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఎంపీ మురళీ మోహ¯ŒSపై చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని కోరారు. ఒక బేబికిట్, 8 మందికి ఇంటి రుణ మంజూరు పత్రాలు మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఎంపీపీ జుత్తక సూర్యకుమారి, డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వి.వెంకట్రావు పాల్గొన్నారు. -
ఘనంగా సాహితీ సందీప్తి’పుస్తకావిష్కరణ
రాజమహేంద్రవరం కల్చరల్ : పద్యమే తెలుగుజాతికి శ్రీరామరక్ష అని త్రికరణశుద్ధిగా నమ్మిన యువ కవి తాతా శ్రీనివాస రమాసత్య సందీప్ అని ‘రాధికాప్రియ’ శతక కర్త మంగళంపల్లి పాండురంగ విఠల్ అన్నారు. పద్య సారస్వత పరిషత్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీహాల్లో సందీప్ రచించిన ‘సాహితీ సందీప్తి’ పుస్తకాన్ని ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి శనివారం ఆవిష్కరించారు. సభకు ‘ప్రజ్ఞారాజహంస’ చింతలపాటి శర్మ అధ్యక్షత వహించారు. డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, ఆదిత్య కళాశాలల ౖడైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, భాష్యం కళాశాలల తెలుగు పండితుడు గొర్ల ఏసురాజు, పరిషత్ ప్రధాన కార్యదర్శి ఓలేటి బంగారేశ్వర శర్మ, శతావధాని డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, సరసకవి డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు తదితరులు తాతాసందీప్కు పద్యరూపకాలతో ఆశీస్సులు అందించారు. రొటేరియన్ పట్టపగలు వెంకట్రావు జ్యోతి ప్రకాశనం చేశారు. తొలిప్రతిని సంగీత విద్వాంసుడు తాతా రామజోగి శర్మ స్వీకరించారు. ప్రముఖ గేయకవి జోరాశర్మ స్వాగత వచనాలు పలికారు. నీలోత్పలకవి యార్లగడ్డ మోహనరావు వందన సమర్పణ చేశారు. అనంతరం తాతా సందీప్‌ను సత్కరించారు. భారత భారతి శలాక రఘునాథశర్మ, పెరుమాళ్ల రఘునాథ్, బీవీ రమాదేవి, డీవీ హనుమంతరావు హాజరయ్యారు. -
ఆన్లైన్లో తలుపులమ్మ వివరాలు
తలుపులమ్మ లోవ వెబ్సైట్ ఆవిష్కరణ భక్తుల సూచనలు, సలహాలు, ఫిర్యాదులకు ప్రాధాన్యం తుని రూరల్ : జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి లోవదేవస్థానం వెబ్‌సైట్‌ను చైర్మన్ కరపా అప్పారావు ఆవిష్కరించారు. మంగళవారం దేవస్థానం కార్యాలయంలో ఈఓ ఎస్.చంద్రశేఖర్‌తో కలిసి చైర్మన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తలుపులమ్మలోవ.కం పేరుతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అమ్మవారి చరిత్ర, ప్రాచూర్యం తెలుసుకోవడంతోపాటు భక్తులనుంచి వచ్చే సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తామని చైర్మన్ పేర్కొన్నారు. అమ్మవారి విశిష్టతలు, ప్రత్యేక పూజలు, జాతరోత్సవాలు, శాశ్వత పూజా పథకాలు, శాశ్వత పులిహోర ప్రసాద వినియోగ ప«థకంలో భాగస్వాములయ్యేందుకు విరాళాలు స్వీకరణ వంటి వివరాలు అందుబాటులో ఉంచామన్నారు. ఏవరైనా నేరుగా అమ్మవారి విశేషాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఒకటో తేదీ నుంచి శరన్నవరాత్రులు : శక్తిపీఠాల్లో ఘనంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది నుంచి తలుపులమ్మ అమ్మవారి సన్నిధిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు చైర్మన్ అప్పారావు తెలిపారు. అమ్మవారికి అక్టోబర్ ఒక నుంచి 12వ తేదీవరకు రోజుకు ఒక అలంకరణ చేస్తామన్నారు. అదేవిధంగా జగన్నాథగిరి జంక్షన్లో ఉన్న నమూనా ఆలయం, తుని పట్టణం ఫీడర్రోడ్డులో ఉన్న ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తామని వివరించారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు యాదాల లోవకృష్ణ, అత్తి అచ్యుతారావు, నల్లాని చక్రవర్తుల వెంకటనారాయణాచార్యులు, కాకర్లపూడి వెంకటపుల్లంరాజు, ఎక్స్ ఆఫిషియో మెంబర్ దూలం సత్యనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగం
91వ జయంతి సభలో వాడ్రేవు చినవీరభద్రుడు సమకాలీన హిందీ సాహిత్య విశిష్ట సంచిక ఆవిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్ : బైరాగి నా యవ్వనకాలపు నేస్తం, నేటికీ బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడు, సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. మంగళవారం అక్షర సాహితీ, సాంస్కృతిక సేవాపీఠంఆధ్వర్యంలో జరిగిన బైరాగి 91వ జయంతి ఉత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.‘ మల్లంపల్లి శరభయ్య ఒకసారి నాతో మాట్లాడుతూ ఈ సృష్టిలో కాళిదాసు కవిత్వం కన్నా గొప్పప్రేయసి దొరకదని’ అన్నారు. నేను బైరాగి సాహిత్యం కూడా అంతటిదని భావిస్తున్నానని చినవీరభద్రుడు అన్నారు. తెలుగు వారు నన్నయ, తిక్కన, ఎర్రనలను కవిత్రయంగా భావిస్తారు, శ్రీశ్రీ అయితే తిక్కన, వేమన, గురజాడలు కవిత్రయమని అంటాడు– నేను గురజాడ, శ్రీశ్రీ, బైరాగి కవిత్రయమంటాను అని పేర్కొన్నారు. అమరఅక్షర ప్రచురించిన ‘సమకాలీన హిందీసాహిత్య’ విశిష్ట సంచికను ఆయన ఆవిష్కరించారు. హిందీభాషావ్యాప్తికి అక్షర చేస్తున్న కృషిని అభినందించారు. తొలి ప్రతిని రొటేరియన్ పట్టపగలు వెంకటరావుకు అందజేశారు. అక్షర సంస్థ అధ్యక్షుడు ఫణి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ౖహైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగ్ అధ్యక్షుడు ఆర్.యస్.సర్రాజు, సంస్థ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి ప్రసంగించారు. అక్షర వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు స్వాగతవచనాలు పలికారు. సాహిత్యాభిమానులు హాజరయ్యారు. యువతకు సాహిత్యంపై ఆసక్తి తగ్గిపోలేదు నేటి తరానికి సాహిత్యంపై ఆసక్తి తగ్గిపోతున్నదని అనడం సరి కాదు, నేటి యువతకు కూడా సాహిత్యం పట్ల ఆసక్తి ఉందని వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. ‘అక్షర’సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన ఒక సాహితీ సమావేశంలో మాట్లాడటానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే....సంప్రదాయ , ఆధునిక సాహిత్యాల మధ్యౖ వెరుద్ధ్యం ఏమీలేదు, నాటి తరం రెంటినీ సమానంగా ఆస్వాదించేవారు, నేడు ఆ పరిస్థితి అంతగా లేకపోవచ్చును. పద్యం ఒక చక్కటి సాహితీప్రక్రియ అనడంలో అతిశయోక్తి లేదు.1982–87మధ్యకాలంలో ఈ నగరంలోఉన్నాను. రాజమహేంద్రి హృదయం విశాలమయింది. ఇక్కడ గాలివల్లనే సాహిత్యం అధ్యయనం, అభ్యాసం బలపడ్డాయి.