బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగం | vadrevu china veerabhadrudu | Sakshi
Sakshi News home page

బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగం

Published Tue, Sep 6 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగం

బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగం

  •  
  • 91వ జయంతి సభలో వాడ్రేవు చినవీరభద్రుడు
  • సమకాలీన హిందీ సాహిత్య విశిష్ట సంచిక ఆవిష్కరణ
  •  
    రాజమహేంద్రవరం కల్చరల్‌ :
    బైరాగి నా యవ్వనకాలపు నేస్తం, నేటికీ బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడు, సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. మంగళవారం అక్షర సాహితీ, సాంస్కృతిక సేవాపీఠంఆధ్వర్యంలో జరిగిన బైరాగి 91వ జయంతి ఉత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.‘ మల్లంపల్లి శరభయ్య ఒకసారి నాతో మాట్లాడుతూ ఈ సృష్టిలో కాళిదాసు కవిత్వం కన్నా గొప్పప్రేయసి దొరకదని’ అన్నారు. నేను బైరాగి సాహిత్యం కూడా అంతటిదని భావిస్తున్నానని చినవీరభద్రుడు అన్నారు. తెలుగు వారు నన్నయ, తిక్కన, ఎర్రనలను కవిత్రయంగా భావిస్తారు, శ్రీశ్రీ అయితే తిక్కన, వేమన, గురజాడలు కవిత్రయమని అంటాడు– నేను గురజాడ, శ్రీశ్రీ, బైరాగి కవిత్రయమంటాను అని పేర్కొన్నారు. అమరఅక్షర ప్రచురించిన ‘సమకాలీన హిందీసాహిత్య’ విశిష్ట సంచికను ఆయన ఆవిష్కరించారు. హిందీభాషావ్యాప్తికి అక్షర చేస్తున్న కృషిని అభినందించారు. తొలి ప్రతిని రొటేరియన్‌ పట్టపగలు వెంకటరావుకు అందజేశారు. అక్షర సంస్థ అధ్యక్షుడు ఫణి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ౖహైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగ్‌ అధ్యక్షుడు ఆర్‌.యస్‌.సర్రాజు, సంస్థ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ కర్రి రామారెడ్డి ప్రసంగించారు. అక్షర వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్‌ పేరిశెట్టి శ్రీనివాసరావు స్వాగతవచనాలు పలికారు. సాహిత్యాభిమానులు హాజరయ్యారు.
    యువతకు సాహిత్యంపై ఆసక్తి తగ్గిపోలేదు
    నేటి తరానికి సాహిత్యంపై ఆసక్తి తగ్గిపోతున్నదని అనడం సరి కాదు, నేటి యువతకు కూడా సాహిత్యం పట్ల ఆసక్తి ఉందని వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. ‘అక్షర’సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన ఒక సాహితీ సమావేశంలో మాట్లాడటానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే....సంప్రదాయ , ఆధునిక సాహిత్యాల మధ్యౖ వెరుద్ధ్యం ఏమీలేదు, నాటి తరం రెంటినీ సమానంగా ఆస్వాదించేవారు, నేడు ఆ పరిస్థితి అంతగా లేకపోవచ్చును. పద్యం ఒక చక్కటి సాహితీప్రక్రియ అనడంలో అతిశయోక్తి లేదు.1982–87మధ్యకాలంలో ఈ నగరంలోఉన్నాను. రాజమహేంద్రి హృదయం విశాలమయింది. ఇక్కడ గాలివల్లనే సాహిత్యం అధ్యయనం, అభ్యాసం బలపడ్డాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement