Minister Kamineni
-
'ఫాతిమా విద్యార్థుల సమస్య ప్రభుత్వానిది కాదు'
బి.కొత్తకోట: ఫాతిమా వైద్య విద్యార్థుల సమస్య ప్రభుత్వానిది కాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆ విద్యార్థులకు న్యాయం జరగడం కష్టమేనని, అయినప్పటికీ మరోమారు దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విన్నవించడం జరిగిందన్నారు. విద్యార్థులు నష్టపోకుండా వారికి నీట్లో నారాయణ విద్యాసంస్థలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, కళాశాల యాజమాన్యం నుంచి విద్యార్థులు చెల్లించిన డొనేషన్లను తిరిగి ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రమంత్రి గడ్కరీ భరోసా ఇచ్చారని, ఈనెల 26న ఆయన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలూ చర్చిస్తామన్నారు. -
ఫాతిమా కాలేజీ విద్యార్ధులకు షాక్
-
వైద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన సడలింపు
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్ల భర్తీలో జాతీయ పూల్‌లోకి చేరేందుకు అడ్డంకిగా ఉన్న 371డి నిబంధనను కేంద్రం సడలించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీని వల్ల ఏపీతో పాటు తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు కూడా వచ్చే ఏడాది నుంచి జాతీయ పూల్ పరిధిలోకి వస్తాయన్నారు. జాతీయ స్థాయిలో చేరడం వల్ల ఎక్కువ ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లుండగా, రాష్ట్రంలో 1,900 సీట్లు ఉన్నాయని, 15% చొప్పున మనం 285 సీట్లు ఇస్తే 4,482 సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 13,872 పీజీ వైద్య సీట్లున్నాయని, మన రాష్ట్రంలో 660 సీట్లుండగా, 50 శాతం లెక్కన 330 సీట్లు ఇస్తే 7,236 సీట్లలో పోటీ పడవచ్చన్నారు. -
నీట్ రాయాల్సిందే..
సాక్షి, అమరావతి: ఫాతిమా విద్యార్థుల సమస్య చాలా జఠిలమైనదని, కేంద్ర అధికారులు చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పు మేరకు వీళ్లందరూ నీట్ రాయాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆయన బాధిత విద్యార్థులు, కళాశాల యాజమాన్యంతో సచివాలయంలో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోలవరం, ఆర్థిక లోటుతో పాటు ఫాతిమా విద్యార్థుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. ఫాతిమా విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని, అయినా సరే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ ప్రతిపాదననూ భారతీయ వైద్యమండలి అంగీకరించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఫీజులు ఇప్పిస్తామని, దీనిపై యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఫాతిమా బాధిత విద్యార్థులకు పోరంకిలోని నారాయణ కళాశాలలో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తున్నామని, దీనికి మూడొంతుల మంది విద్యార్థులు అంగీకరించారన్నారు. నీట్ పరీక్షలో అర్హత సాధించి సీటొచ్చిన వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, ఇది జరగాలంటే ఫాతిమా నుంచి ఫీజు తీసుకోకూడదని అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాలి ఫీజులు అందరికీ వెనక్కు ఇప్పించి అందరూ తిరిగి కళాశాలలో చేరి చదువుకునేలా ఆర్డినెన్స్ తీసుకు రావాలని ఫాతిమా విద్యార్థులు డిమాండ్ చేశారు. మంత్రి వద్ద చర్చలు అనంతరం ఫాతిమా విద్యార్థులు సాక్షితో మాట్లాడారు. లాంగ్‌టర్మ్ కోచింగ్, ఫీజులు కట్టి చదివించడం వంటివన్నీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేశారు. -
మంత్రి కామినేనిని నిలదీసిన స్ధానికులు
-
వైద్య సీట్లలో జాతీయ పూల్‌కు వెళ్తున్నాం
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్ల విషయంలో జాతీయ పూల్‌లోకి వెళ్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో 27,710 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వీటిలో 15 శాతం సీట్ల చొప్పున మనమిచ్చే సీట్లతో కలిపి 4,442 సీట్లలో పోటీపడవచ్చన్నారు. మన రాష్ట్రం నుంచి 285 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి వెళ్తాయన్నారు. పీజీ సీట్ల విషయంలో మన రాష్ట్రం 415 సీట్లు ఇస్తే మన విద్యార్థులు దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేశామని చెప్పారు. ఫాతిమా విద్యార్థుల సమస్యపై 3న రివిజన్ పిటిషన్ వేస్తున్నట్టు చెప్పారు. -
మీడియాపై మంత్రి కామినేని రుసరుసలు
-
నీట్ పీజీ అర్హత మార్కులు తగ్గించండి
కేంద్ర మంత్రి నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పీజీ వైద్య విద్యార్థుల అర్హత మార్కులను తగ్గించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రితో కామినేని సమావేశమయ్యారు. దీనిపై మంత్రి కామినేని మీడియాతో మాట్లాడుతూ.. అర్హత మార్కుల తగ్గింపు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రాథమికంగా అంగీకరించారని తెలిపారు. అయితే ఎంత శాతం మార్కులు తగ్గిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నడ్డా చెప్పారని వివరించారు. అలాగే రాయలసీమ ప్రాంత విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు తిరుపతిలో నీట్ పీజీ వైద్య పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. -
గ్రేస్ మార్కులు కలిపేది లేదు : కామినేని
చేతులు తడవకుండానే పదోన్నతులు కల్పించాం సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇక కలపబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రం విడిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో గ్రేస్ మార్కులు కలిపామని, ఇకపై అలాంటిదేమీ ఉండదన్నారు. తాజాగా వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు చేతులు తడవకుండా కల్పించామని విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్స్‌ను తానెప్పుడూ కలవలేదని, వాళ్ల పనితీరును బట్టే చెల్లింపులు చేస్తున్నామన్నారు. మిగతా పథకాలకు నిధులు ఆపేసి మెడాల్‌కు మాత్రమే ఏడాదిలో రూ.102 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించగా.. మెడాల్ సంస్థ పనితీరు అద్భుతంగా ఉందని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలకు అవార్డు కూడా వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌కు అవార్డు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ గురువారం హరియాణా హిస్సార్‌లోని చౌదరీ చరణ్ సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారత వ్యవసాయ ఇంజనీర్ల సమాఖ్య మూడు రోజుల జాతీయ సదస్సులో ఆయనకు నేషనల్ ఫెలోషి‹ప్ అవార్డును అందజేయనున్నట్టు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇంద్రమణి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తకు గత 20 ఏళ్లలో ఇటువంటి పురస్కారం లభించడం ఇదే తొలిసారి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసించిన డాక్టర్ సత్యనారాయణ నీటి యాజమాన్య సంస్థ, ఉప్పునీటి పరిశోధన కేంద్రం, భూగర్భ మురుగు నీటి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ఈ అవార్డు రావడంపై వర్సిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో సెంచూరియన్ యూనివర్సిటీ: వీసీ సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా ఒడిశాలోని పర్లాకిమిడి, భువనేశ్వర్లలో ఉన్న తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరిస్తున్నట్టు సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎస్ఎన్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ జిల్లా ఆనందపురం వద్ద ఉన్న తాత్కాలిక క్యాంపస్‌ను విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని విశాఖలో బుధవారం విలేకరులకు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ తరగతులను నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చాన్సలర్ పి.పట్నాయక్ మాట్లాడుతూ ఏపీలో తమ విశ్వవిద్యాలయం ప్రత్యేకత పొందుతుందన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీకి రూ.130 కోట్లు వెచ్చించబోతున్నామని చెప్పారు. తమ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ–రిక్షాల అమ్మకానికి అనుమతి లభించిందని తెలిపారు. -
ఏడాది తర్వాత తీరిగ్గా
ఎట్టకేలకు నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏజెన్సీ పర్యటన ఇన్నాళ్లూ మన్యాన్ని వ్యాధులు వణికించినా పట్టని సర్కారు గిరిజనం పిట్టల్లా రాలిపోయినా స్పందించని వైనం పీహెచ్‌సీల్లో డాక్టర్, సిబ్బంది పోస్టుల ఖాళీ రంపచోడవరం ఏరియా ఆస్పత్రి స్థాయి పెంపు ఎప్పుడో! రంపచోడవరం : విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో గిరిజనుల మృత్యువాత, రాజవొమ్మంగి మండలంలో చిన్నారుల మరణాలు మన్యాన్ని తీవ్రంగా కలవరపెట్టాయి. మన్యంలో గిరిజనులు అనేక రకాల అనారోగ్యాలతో మృత్యువాత పడినప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాక రాష్ట్ర ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం ఏజెన్సీ సందర్శించడానికి వస్తున్నారు. ఇక్కడ గిరిజనులు రోగాలతో ఇబ్బందులు పడినప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని మంత్రి సంవత్సరం తరువాత ఏజెన్సీ పర్యటనకు రావడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఏజెన్సీ ఆసుపత్రులలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కనీస స్థాయిలో కూడా మందుల సరఫరా లేదు. వంద పడకల స్థాయి కాగితాలకే పరిమితం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచినట్టు ప్రకటించి సుమారు తొమ్మిది నెలలు గడచినా అందుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. ఈ ఆసుపత్రిలో సివిల్ సర్జ¯ŒS స్పెషలిస్టు (సీఎస్ఎస్), డిప్యూటీ సివిల్ సర్జ¯ŒS (డీఎస్సీ), సివిల్ అసిస్టెంట్ సర్జ¯ŒS (సీఏఎస్) పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదు. ఏడుగురు ప్రత్యేక వైద్య నిపుణులు పనిచేయాల్సి ఉండగా మత్తు డాక్టర్, ఆప్తామాలజిస్ట్, గైనిక్ వైద్యులు లేరు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి కూడా మందుల సరఫరా సక్రమంగా లేదు. పూర్తిస్థాయిలో ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో అత్యవసర కేసులు రాజమండ్రి, కాకినాడలకు రిఫర్ చేయడం మినహా ఇక్కడ ఏం జరగడం లేదు. ఏజెన్సీకి ప్రధాన ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే పీహెచ్‌సీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 24 గంటల ఆసుపత్రుల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. రాత్రి సమయంలో ఏ అత్యవసర వైద్యం కోసం వెళ్లినా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో కిలోమీటర్లు ప్రయాణించి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రావాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పీహెచ్‌సీల్లో పోస్టుల ఖాళీ ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే పీహెచ్‌సీలను పర్యవేక్షించాల్సిన అధికారి పోస్టు సైతం ఇ¯ŒSచార్జి పాలనలో సాగుతోంది. సివిల్ సర్జ¯ŒS స్పెషలిస్టు, డిప్యూటీ సివిల్ సర్జ¯ŒS పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపీహెచ్‌ఓ పోస్టులు 33 ఖాళీ ఉన్నాయి. వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో పరిస్థితి తెలుసుకుని ఆనారోగ్య పరిస్థితులు ఉంటే రోగులను పీహెచ్‌సీలకు పంపించే ఏర్పాటు చేస్తారు. ఫార్మాసిస్ట్ పోస్టులు 19కి తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంబులె¯Œ్సలు అవసరం ఏజెన్సీలో వైద్యసేవలు మెరుగుపరచాలి. గిరిజన మహిళలకు గైనిక్ సేవలు సక్రమంగా అందడం లేదు. పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు గ్రామాల్లో సేవలు అందించేందుకు అంబులె¯Œ్సలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
నేడు ఉద్ధానం పర్యటనకు పవన్
కిడ్నీ వ్యాధి బాధితులతో మాటామంతీ సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మంగళవారం పర్యటించనున్నారు. 20 ఏళ్లగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి స్థానికుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఉద్ధానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 20 వేల మంది కిడ్నీ వ్యాధి కారణంగా మరణించారని పవన్‌కల్యాణ్ సోమవారం తన ట్వీట్టర్లో పేర్కొన్నారు. ‘ఉద్ధానం’ బాధితులకు డయాలసిస్ సెంటర్లు: కామినేని కైకలూరు: శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితులకు అదనంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పవన్‌కల్యాణ్ మంగళవారం ఉద్ధానం కిడ్నీ బాధితుల పరామర్శకు వెళ్తున్నట్లు ట్వీటర్లో ప్రకటించడంతో మంత్రి కామినేని కైకలూరులో విలేకరులతో మాట్లాడారు. -
నేడు ఉద్ధానం పర్యటనకు పవన్
-
కరెంటు కోతలు లేని ప్రభుత్వం ఇది
వరహాపట్నం (కైకలూరు) : గతంలో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, నేడు కోతలు లేని గ్రామాలను చూస్తున్నారని ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన స్వగ్రామైన వరహాపట్నంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకంలో రూ.కోటీ 20 లక్షలతో మంజూరైన 33/11కెవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ఇక్కడ నిర్మించే సబ్‌స్టేషన్ వల్ల 14 గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. అక్వా చేపల రైతు సాగుదారులకు సబ్‌స్టేషన్ నుంచి నాణ్యమైన కరెంటు అందుతుందన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం మట్టిని తరలించే వాహనాలపై చర్యలు వద్దని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పళ్ళెం సరవమ్మ, ఎంపీటీసీ జయదేవ్‌కుమార్, కైకలూరు, కలిదిండి ఏఎంసీ చైర్మన్లు వీరరాజరాజేశ్వరీ, తాడినాడ బాబు, టీడీపీ నాయకులు గుర్రాజు, త్రినాథరాజు, విజయవాడ ఆపరేషన్ ఎస్ఈ ఎం.విజయ్‌కుమార్, గుడివాడ డీఈఈ కేవీఎస్.సూర్యనారాయణ, కైకలూరు ఏడీఈ జీబీ.శ్రీనివాసరావు, కైకలూరు రూరల్ ఏఈ బి.లక్ష్మానాయక్‌లు పాల్గొన్నారు. క్రిస్మస్ సరుకులు పంపిణీ కైకలూరులో క్యాంపు కార్యాలయం వద్ద చంద్రన్న క్రిస్మస్ కానుక సరుకులను మంగళవారం మంత్రి శ్రీనివాస్ అందించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్‌ను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండి సత్యవతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంపాటి విష్ణురావు, సర్పంచ్ నర్సిపల్లి అప్పారావు, గుడివాడ ఆర్డీవో చక్రపాణి, కైకలూరు తహశీల్దారు శ్రీనునాయక్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. 20కెకెఎల్‌ఆర్06–27040006– వరహాపట్నంలో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కామినేని -
జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా: సీఎం
డిసెంబర్ 24న స్వస్త విద్యావాహిని ప్రారంభం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే జనవరి 1 వ తేదీన ప్రారంభించాలని నిర్ణరుుంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీనికి ముందే స్వస్త విద్యావాహిని పేరుతో మరో కార్యక్రమాన్ని డిసెంబర్ 24 వ తేదీన రాష్ట్రంలోని 222 ప్రదేశాల నుంచి ప్రారంభించనున్నట్టు చెప్పారు. మంగళవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఈ రెండు పథకాలను కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందించాలని నిర్ణరుుంచినట్లు చంద్రబాబు చెప్పారు. ఆరోగ్య బీమా కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక్కో వ్యక్తి నెలకు రూ.100 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. స్వస్త విద్యావాహిని పథకం విద్యార్థులకు ఉద్దేశించినది. బాలబాలికలకు సరైన పోషకాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కలిగించడం, వారిలో రోగనిరోధక శక్తి పెంచడం ఈ పథకం లక్ష్యాలు. క్లినికల్ స్పెషలిస్టుల కోసం ఉద్దేశించిన ఇన్సోర్సింగ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 25 హెల్త్ ఏటీఎంలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే ఆధునిక మార్చురీ
రూ 3.25 కోట్లతో నిర్మాణం. వైద్య విద్యార్థుల పరిశోధనకు విశాలమైన హాలు ఎంబాల్మింగ్ ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రులు నెల్లూరు(అర్బన్) : రాష్ట్రంలో తొలిసారిగా రూ 3.25 కోట్లతో నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిలో ఆధునికమైన విశాలమైన మార్చురీ భవనాలను ఏర్పాటు చేశారు. వైద్య విద్యార్థుల పరిశోధనకు అనుకూలంగా నిర్మించారు. ఎలాంటి వాసన లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో ఎంబాల్మింగ్ వంటి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ భవనాలను సోమవారం రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, శిద్దరాఘవరావు, పొంగూరు నారాయణ ప్రారంభించనున్నారు. అరెకరా స్థలంలో ఏర్పాటు అర ఎకరా స్థలంలో మార్చురీ భవనాలను ఏర్పాటు చేశారు. భవనాల కోసం రూ 1.25 కోట్లను, వైద్య పరికరాలు, ఫ్రీజర్లు, ఎక్స్‌రే, ఎంబాల్మింగ్ వంటి పరికరాల కోసం మరో రూ.2 కోట్లు వెచ్చించారు. ఎంబాల్మింగ్ ప్రత్యేకత ఇప్పటి వరకు పెద్దాసుపత్రిలో ఎంబాల్మింగ్ పరికరాలు లేవు. ఎవరైనా మరణించి ఇతర దేశాల నుంచి రక్తసంబంధీకులు రావాల్సి ఉండి కొన్ని రోజులు ఆగాల్సి వస్తే శవాలు కుళ్లిపోయేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఎంబాల్మింగ్ ప్రక్రియ పరికరాలుండటం వల్ల వారం రోజులైనా శవాలను కుళ్లిపోకుండా ఉండే ఏర్పాట్లు చేశారు. వైద్య విద్యార్ధులకు ఎంతో ఉపయోగం : డాక్టర్ శశికాంత్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ ఇలాంటి వసతులున్న మార్చురీ భవనాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రి తర్వాత నెల్లూరు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 150 మంది విద్యార్థులు చొప్పున 2 బ్యాచ్‌లుగా ఇక్కడ మెడికల్ వైద్యసేవలు నేర్చుకుంటారు. మెడికోలకు ఇది ఎంతో ఉపయోగం -
విజయసారథితో రాజీనామా చేయిస్తాం..!
మంత్రి కామినేని, ఆరోగ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య సాక్షి, గుంటూరు: ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయసారథితో ఆయన పదవికి రాజీనామా చేయిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. గుంటూరులో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆరోగ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీజీహెచ్ గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగానే పీజీ విద్యార్థిని సంధ్యారాణి మృతిచెం దినట్లు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. లక్ష్మి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పారు. హెల్త్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయకుండా ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. అరెస్టు చేసిన అనంతరం లక్ష్మి, ఆమె భర్త విజయసారథిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రొఫెసర్ల వేధింపులపై వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు చేసి తీరుతాం: ఐజీ సంజయ్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసి తీరుతామని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఆస్పత్రుల అభివృద్ధికి కృషి
మంత్రి కామినేని శ్రీనివాస్ పెద్దాడలో పీహెచ్సీ భవనానికి శంకుస్థాపన పెద్దాడ(పెదపూడి) : రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పెద్దాడలో ఎ¯ŒSహెచ్ఎం నిధులు రూ.1.18 కోట్లతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆస్పత్రుల భవనాల నిర్మాణానికి, అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ ఎం.మురళీమోహ¯ŒS మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందిస్తున్న మెరుగైన, ఖరీదైన వైద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు తదితరులు మాట్లాడారు. సర్పంచ్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ తాను గతంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఎంపీ మురళీ మోహ¯ŒSపై చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని కోరారు. ఒక బేబికిట్, 8 మందికి ఇంటి రుణ మంజూరు పత్రాలు మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఎంపీపీ జుత్తక సూర్యకుమారి, డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వి.వెంకట్రావు పాల్గొన్నారు. -
జీవితాంతం ఆడే ఆట టెన్నిస్
విజయవాడ స్పోర్ట్స్ : జీవితాంతం ఆడగల ఆట టెన్నిస్ అని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోధవేజీ – ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ అసోసియేషన్ (ఐయిస్టా) టోర్నీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెన్నిస్ ఆడడం ద్వారా చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. రాజధానిలో టెన్నిస్‌కు మంచి ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. మండలానికి ఓ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శారీరక అక్షరాస్యత, యోగా వంటివి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టోర్నీ స్పాన్సర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో ఈ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 8 టోర్నీలు నిర్వహించామని, విజయవాడలోనే 20 టెన్నిస్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. టెన్నిస్‌కు అమరావతి టూరిజం కేంద్రంగా తయారు కావాలన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.రాజారావు, ఐయిస్టా ప్రధాన కార్యదర్శి డి.రామారావు, రాష్ట్ర కార్యదర్శి బుద్దా రాజు, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.పట్టాభిరామయ్య, రామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు సింగిల్స్ మెయిన్ డ్రా మొదటి రౌండ్ ఫలితాలు – 65+ సింగిల్స్ విభాగంలో డాక్టర్ రామ్మోహన్ 6–2, 6–3 తేడాతో బీఏ ప్రసాద్‌పై, సీబీఎస్ వరప్రసాదరావు 6–3, 3–6, 10–7 తేడాతో ఎంజే సామ్యూల్‌పై, పీకే బాబా 6–4, 6–4 తేడాతో వై.భాస్కరరావుపై, ఏఎస్ఎన్ రాజు 6–2, 6–2 తేడాతో ఆర్టీఆర్ నాయుడుపై, ధావల్ పటేల్ 3–6, 4–2, 10–7 తేడాతో కులకర్ణిపై, పీకే పట్నాయక్ 6–1, 6–0 తేడాతో గౌతం బుద్ధాపై, వైవీ రామకృష్ణ 6–3, 6–3తో ఎస్.నరసింహారావుపై, సీబీ రామచంద్ర 7–6, 6–2 తేడాతో ఎంవీ సత్యమోహన్పై గెలుపొందారు. – 55+ కేటగిరీలో ఏవీ వర్థన్ 6–0, 6–0 తేడాతో యూఆర్ఎస్ జగదీష్‌పై, మెహర్ ప్రసాద్ 6–3, 6–0 తేడాతో జోయల్ కుమార్‌పై, మేఘనాథ్ 6–1, 6–1 తేడాతో కోటయ్యపై, రమేష్‌బాబు 7–5, 1–6, 11–9 తేడాతో ఎస్ఏఎన్ రాజుపై, ఆర్వీ రామరాజు 6–1, 6–1 తేడాతో బలరామయ్యపై, ఎం.సురేష్ 6–0, 6–3 తేడాతో జి.నాగరాజుపై విజయం సాధించారు. – 45+ కేటగిరీలో డి.నీలకంఠ 6–2, 6–1 తేడాతో ఎ.వెంకటేశ్వర్లు, కేవీ కృష్ణారెడ్డి 6–2, 6–2 తేడాతో ఎంఎస్ గోపాలకృష్ణపై, జి.కన్నన్ 6–0, 6–0 తేడాతో బి.కుమార్‌పై, ఎల్.సత్యగోపాల్ 6–4, 6–2 తేడాతో సాంబశివరావుపై గెలుపొందారు. -
ప్రొఫెసర్ వేధింపుల వల్లే సంధ్య ఆత్మహత్య
మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి సాక్షి, అమరావతి/గుంటూరు: గుంటూరు వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగానే పీజీ వైద్య విద్యార్థిని డా.సంధ్యారాణి మృతి చెందినట్లు తమ విచారణలో వెల్లడైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నివేదిక ఆధారంగా ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన మంగళవారం వెలగపూడిలో సచివాలయంలో డిస్పెన్సరీని ప్రారంభించారు. తన కుమార్తెకు సీటు రాలేదన్న అక్కసుతోనే? తన కుమార్తెకు కాకుండా సంధ్యారాణికి సీటు రావడం పట్ల ప్రొఫెసర్ లక్ష్మి అక్కసుతో తమ బిడ్డను ఇబ్బందులకు గురి చేసిందని తాము భావిస్తున్నట్లు సంధ్యారాణి తండ్రి సత్తయ్య చెప్పారు. బాగా చదివి మెరిట్లో సీటు సాధించడమే తన బిడ్డ పాలిట శాపంగా మారిందని ఆయన గుండెలు బాదుకున్నారు. నిందితురాలిని కాపాడేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే యత్నాలు ప్రొఫెసర్ లక్ష్మిని కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు సమాచారం. పోలీస్ శాఖను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న సదరు సీనియర్ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ లక్ష్మి భర్త విజయసారథి, మరికొందరు వైద్యులతో కలసి పల్నాడు ప్రాంతంలో అతి పెద్ద ప్రైవేట్ ఆస్పత్రి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న లక్ష్మిని పోలీసులు అరెస్టు చేయకుండా ఆ ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారు. -
వెయ్యి మంది వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ
- కాళ్లవాపు వ్యాధిపై కమిటీ - వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెయ్యి వైద్యులు, సిబ్బంది పోస్టులను త్వరలో భర్తీచేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిన్ యూనిట్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ డయాలసిస్ యూనిట్ ఉభయగోదావరి జిల్లా వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కడా లేవన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి ప్రభావం అధికంగా ఉందని, దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వ్యాధి కిడ్నీ, గుండెలపై ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వారి రక్తనమూనాలు ల్యాబ్‌లకు పంపామని, పూర్తిస్థాయి నివేదిక అందలేదని చెప్పారు. ఒక ప్రాంతంలో మాత్రం బెరిబెరి వ్యాధి లక్షణాలు కనిపించినట్టు రక్తపరీక్షల్లో తేలిందన్నారు.ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో దాతల సహకారంతో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు కృషిచేస్తున్నానన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రికి వచ్చేది పేదలేనని, వైద్యులు, సిబ్బంది సేవాదృక్పథంతో మెలగాలని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ధవళేళ్వరంలోని హెల్త్ సెంటర్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని మంత్రిని కోరారు. ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్స్‌ను మంత్రి అందించారు. రాష్ట్రంలో 222 అర్బన్ హెల్త్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా 222 అర్బన్ హెల్త్సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు మంత్రి కామినేని తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని ఆనంద్‌నగర్‌లో అర్బన్ హెల్త్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 21 అర్బన్ హెల్త్సెంటర్లు మంజూరు కాగా వాటిలో 8 రాజమహేంద్రరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ రమేష్‌కిశోర్, ఆర్ఎంవో పద్మశ్రీ, డాక్టర్ నాయక్ పాల్గొన్నారు. -
తేడా వస్తే సస్పెండవుతారు
సాగునీటి విడుదలలో నిర్లక్ష్యం వద్దు ఇంజనీర్లకు మంత్రి కామినేని హెచ్చరిక కౌతవరం (గుడ్లవల్లేరు) : సాగునీటి విడుదలలో ఇరిగేషన్ అధికారులు అలక్ష్యం చేస్తే సస్పెన్షన్లు తప్పవని వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. కౌతవరం ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చారు. పంట పొలాల్లో నీరున్నా పైనున్న కొందరు రైతులు మళ్లీ తోడుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉయ్యూరు నుంచి పుల్లేటికి రావలసిన వాటాను తీసుకురావాలని ఇరిగేషన్ సీఈ వై.సుధాకర్‌ను ఆయన కోరారు. అలాగే బల్లిపర్రు లాకుల గేట్లను వెంటనే తెరిపించాలని ఆదేశించారు. కాగా, వర్షాకాలంలో వచ్చే జబ్బుల నివారణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సగమే వరి నాట్లు : సీఈ సుధాకర్ జిల్లాలోని 13లక్షల హెక్టార్లకుగాను 7లక్షల వరకు వరి సాగవుతుందని ఇరిగేషన్ సీఈ సుధాకర్ తెలిపారు. అందులో 50శాతం వరకు మాత్రమే వరినాట్లు పడ్డాయన్నారు. మిగిలిన శాతం సాగు చేయాలంటే మరొక 10టీఎంసీల సాగునీటి అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం నుంచి 8వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పులిచింతలలో 7టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. ఒకవేళ వర్షాలు పడితే ఆ నీటిని నిలిపివేస్తామన్నారు. -
వైఎస్సార్ జిల్లాలో మంత్రి కామినేని పర్యటన
కడప : రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. మొదట కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కడప రిమ్స్‌కు చేరుకున్నారు. రిమ్స్ కళాశాల డైరెక్టర్ చాంబర్లో అధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. రిమ్స్‌లో సమస్యలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం మంజూరు చేశారు గానీ ఇంత వరకు ఏర్పాటు చేయలేదని ఆయన దృష్టికి అధికారులు తీసుకెళితే...ప్రైవేటు భాగస్వామ్యంతో త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్‌సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కాన్పుల విభాగంలో ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా మదర్ చైల్డ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ బాబ్జి, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శశిదర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అక్కడే భోజనం చేసి ఐపీ విభాగంలోని ఎంఐసీయూ పక్కనున్న గదిలో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. -
జిల్లాలో మంత్రి కామినేని పర్యటన
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈనెల 29, 30 తేదీలలో జిల్లా పర్యటనకు వస్తున్నట్లు డీఆర్వో సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి 29వతేదీన మధ్యాహ్నం అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పెండ్లిమర్రికి చేరుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు కడపకు చేరుకుని బస చేస్తారన్నారు. 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కడప రిమ్స్ ఆస్పత్రినితనిఖీ చేసి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షిస్తారన్నారు. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజంపేట నియోజకవర్గంలోని ఆకేపాడుకు వెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యకర్తలతో సమావేశమై ఆత్మకూరుకు బయలుదేరి వెళతారని డీఆర్వో వివరించారు. -
దృష్టి మళ్లించడానికే ‘హైకోర్టు’పై వివాదం
మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ టీజీ వెంకటేశ్ సాక్షి, నూఢిల్లీ: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రజా వ్యతిరేకత, జేఏసీతో ఉన్న విభేదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు విభజనపై అనవసర వివాదాన్ని సృష్టిస్తోందని మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... హైకోర్టు విభజనపై కేంద్రాన్ని, ఏపీని నిందించడం సరికాదని చెప్పారు. న్యాయవ్యవస్థకు ప్రాంతీయ విభేదాలు అంటకట్టడం న్యాయం కాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ చేతిలో ఉన్న అంశాలైన ఆస్తుల పంపకాలు, 9,10 షెడ్యూల్ ఉన్న అంశాల గురించి తేల్చకుండా, కోర్టు పరిధిలో ఉన్న హైకోర్టు విభజనపై రాద్ధాంతం చేయడమేమిటని నిలదీశారు. హైకోర్టు విభజనపై మౌలిక సదుపాయాలు కల్పించాలని హైకోర్టు లేఖ రాసిందని, అందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ భూమి ఎంపికపై సుప్రీంకోర్టు, ైెహ కోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విభజన చట్టం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ విమర్శించారు. టీసర్కారు మళ్లీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. -
డాక్టర్లకు మినిస్టర్ వార్నింగ్
మీ అందరి చిట్టా మావద్దుంది నర్సింగ్ హోంలే కావాలనుకుంటే వెళ్లిపోండి సర్వజనాస్పత్రి వైద్యులను హెచ్చరించిన మంత్రి కామినేని అనంతపురం మెడికల్ : ‘సర్వజనాస్పత్రికి ఏ డాక్టర్ ఎప్పుడొస్తున్నారు.. ఎవరు బయట ప్రైవేట్ నర్సింగ్ హోం లకే పరిమితమవుతున్నారనేది అంతా తెలుసు.. మీ అందరి చిట్టా మా వద్ద ఉంది.. నర్సింగ్ హోంలే కావాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్యులను హెచ్చరించారు. సోమవారం రాత్రి అనంతపురం జిల్లాలోని సర్వజనాస్పత్రిలో ‘ఆస్పత్రి నిద్ర’ చేసిన ఆయన మంగళవారం ఉదయం అన్ని విభాగాల హెచ్ఓడీలతో సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమయ్యారు. నిరుపేదలే ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు.. వ్యాపార దృక్పథం మానుకొని సేవలందించాలని సూచించారు. విధుల పట్ల అంకితభావం ఉన్న వాళ్లకు పట్టం కడతామని అన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో మార్పుల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అందరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వైద్యుడిపై సస్పెన్షన్‌కు ఆదేశం : కదిరి ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ త్రిలోక్నాథ్పై సస్పెన్షన్‌కు మంత్రి ఆదేశించారు. ఆయన ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తూ ప్రైవేట్ నర్సింగ్ హోంలో కూడా సర్జరీలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఇటీవల ఒకరు మృతి చెందినట్లు స్థానిక ఎమ్మెల్యేతో పాటు కొందరు నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సస్పెన్షన్‌కు ఆదేశించారు. జూన్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన అనంతపురంలో రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి జూన్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల అందిస్తుందన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, మెడాల్, పిరమిల్ సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు అందిస్తామన్నారు. ఆస్పత్రికి వచ్చిన కేసును మరో ఆస్పత్రికి రెఫర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యులు కష్టపడి పని చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. -
పదవులకు దళితులు అనర్హులా?
♦ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి దళిత మహిళా ప్రొఫెసర్ లేఖ ♦ విచారణకు ఆదేశించిన పూనం మాలకొండయ్య! సాక్షి, హైదరాబాద్: దళితురాలినైన తనకు డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పదవి చేపట్టడానికి అన్ని అర్హతలున్నాయని, అయినా ఆ పదవి ఎందుకు ఇవ్వలేదని దళిత మహిళా ప్రొఫెసర్ డా.డి.రాజ్యలక్ష్మీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె కాకినాడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రొఫెసర్ల సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్నారు. సీనియారిటీని బట్టి ఈమెకు వైద్య విద్యా సంచాలకురాలి(డీఎంఈ)గా అవకాశం ఇవ్వాలి. అర్హతలున్నప్పటికీ పదవి దక్కకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు తాజాగా లేఖాస్త్రం సంధించారు. తనకు అత్యున్నత పదవి ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలియజేయాలని ఆమె లేఖలో కోరినట్లు తెలిసింది. సీనియారిటీ పరంగా తనకంటే జూనియర్లకు డీఎంఈగా అవకాశం ఇచ్చారని రాజ్యలక్ష్మీ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పదోన్నతుల వ్యవహారంపై పూనం మాలకొండయ్య విచారణకు ఆదేశించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్ల సీనియారిటీ జాబితాను రూపొందించి ఇవ్వాలని ఆమె సూచించినట్లు వెల్లడించాయి. మంత్రి తీరుపై అసంతృప్తి సెగలు మంత్రి కామినేని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి తనకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడానికి ఇదేమైనా ఆయన సొంత ఆస్తా? అని విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలకు చెందిన ఒక సీనియర్ వైద్యుడు ప్రశ్నించారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, కామినేని శ్రీనివాస్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాకే ఇలా జరుగుతోందని కర్నూలు వైద్య కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. -
మహిళలకు ఇక ఉచితంగా అల్ట్రా స్కానింగ్
-శాసనమండలిలో మంత్రి కామినేని ప్రకటన - ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఆపేశామని వెల్లడి హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచిత అల్ట్రా స్కానింగ్ పరీక్షల సౌకర్యం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఒక్క నెల రోజుల వ్యవధిలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. శాసనమండలిలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య పాలసీపై చేపట్టిన స్వల్పకాలిక చర్చకు మంగళవారం మంత్రి సమాధానమిచ్చారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు- అంగన్వాడీ కేంద్రాలు కలిసి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వైద్య విధాన పరిషత్ ద్వారా రెండు విడతలలో 1400 మంది డాక్టర్ల నియమాకాలు చేపట్టామని, మూడో విడతలో త్వరలో మరో 205 డాక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అపోలో సంస్థకు అప్పగించడాన్ని కొందరు తప్పుపడుతున్నారని.. ఈ ప్రక్రియలో అటు ప్రభుత్వానికీ, అపోలో సంస్థకు ఇద్దరికీ ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించినప్పటికీ, వారు రోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఉండదన్నారు. మిగిలిన ప్రభుత్వ ఆసుప్రతులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఆపేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కామినేని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు బయట సొంత ఆసుపత్రులను కూడా నిర్వహిస్తున్నవారిని 600 మందిని గుర్తించి తొలి హెచ్చరికగా వారందరి జీతాల నుంచి మూడు ఇంక్రిమెంట్లు చొప్పున కోత పెట్టినట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు మొత్తం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైజాగ్‌లోని విమ్స్ కొత్త భవనంలో వచ్చే నెల 11వ తేదీ నుంచి ఒపీ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని, దానిని సూపర్ సెష్పాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స
-
ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స
గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు శుక్రవారం మోచిప్ప మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు మాట్లాడుతూ.. ఆస్పత్రి చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. జీజీహెచ్ వైద్యులపై నమ్మకం ఉంచి.. ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై ఉన్న అపనమ్మకాలను పారద్రోలేలా స్వయంగా మంత్రి జీజీహెచ్‌లో ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పారు. -
'ఏపీలో 600 మంది వైద్యులకు చార్జి మెమో'
గుంటూరు : పభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సిన సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 600మంది వైద్యులకు చార్జి మెమో జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం గుంటూరులో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చార్జిమెమోతోపాటు మూడు ఇంక్రిమెంట్ల కోత విధించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో మిస్‌మ్యాచింగ్ పోస్టులు లేకుండా సరిచేశామని, డిప్యూటేషన్లు ప్రభుత్వానికి అవసరమైతే తప్ప వ్యక్తులకు అవసరమైతే ఇవ్వబోమని స్పష్టం చేశారు. బదిలీలపై నూతన పాలసీని రూపొందించామని, త్వరలోనే అమలు చేస్తామన్నారు. అనధికారికంగా విధులకు డుమ్మా కొడితే సహించేది లేదని, గైర్హాజరు ఏడాది కాలం దాటితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. వైద్యులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. నర్సింగ్ హోమ్‌లు పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటల్‌కు రాకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు ముగిశాక క్లినిక్‌కు వెళ్లవచ్చని, ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఆరోగ్య మిత్రలను ఏడాదికోసారి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుని ఏడాది పూర్తయిన పిదప రెన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నవారి కాంట్రాక్టు 2015 డిసెంబర్‌తో ముగిసిందన్నారు. గతంలో మెడికల్ నాలెడ్జి లేకుండా డిగ్రీ అర్హతతో ఆరోగ్య మిత్రల నియామకాలు చేశారని, కనీస పరిజ్ఞానం లేకుండా ఉంటే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ అర్హత ఉన్న ఆరోగ్యమిత్రలను తిరిగి కొనసాగిస్తామని మంత్రి కామినేని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది నర్సులు, 500 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటున్నామని, వారం రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను క్లినికల్ అటాచ్మెంట్ కోసమే ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేటు కళాశాలలవారు ఒక్క రూపాయి కూడా రోగుల నుంచి వసూలు చేయరని, ఐదేళ్లు క్లినికల్ పీరియడ్ పూర్తికాగానే వైద్య పరికరాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రికి ఇచ్చి వెళ్లిపోతారని వెల్లడించారు. వారి కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద 50 శాతం సీట్లు కూడా వస్తాయని మంత్రి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం.వంశీకృష్ణ, కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక అసమానతలు మంచిది కాదు
నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్య నరసరావుపేట వెస్ట్: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు నేతలు కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చేందుకు యత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాల రెండోరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కొన్ని పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడుతూ మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వారు మైనార్టీల కోసం నిజంగా శ్రమించి ఉంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మైనార్టీలు ఇంకా పేదవారిగానే ఎందుకున్నారని ప్రశ్నించారు. పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీకి జాతీయ రహదారుల కింద రూ.65 వేల కోట్ల నిధులు మంజూరు చేయనున్నామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల, మంత్రి కామినేని , ఎంపీ రాయపాటి ప్రసంగించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
'ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నా'
-
అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు : మంత్రి కామినేని
అనంతపురం : అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగు నీరు అందిస్తామని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. జీవన్‌ధార ఔషధ దుకాణాలను 'అన్న సంజీవని' పేరుతో మార్చి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 120 జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలో కరువు, వైద్య పరిస్థితులపై ఈ నెల 27, 28వ తేదీల్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. -
ఆస్పత్రి సొమ్ము.. ఆర్భాటానికా?
వైద్యుల శస్త్రచికిత్సల సొమ్ముతో సొంత ప్రచారమా? రిపేరు పనులకు శిలాఫలకాలా..! గతంలో ఇచ్చిన హామీలు మరిచారా నేడు ప్రభుత్పాస్పత్రిలో మంత్రి కామినేని పర్యటన అంతన్నారు.. ఇంతన్నారు.. ప్రభుత్వాస్పత్రిని ప్రక్షాళన చేసేస్తానని మాటలు కోటలు దాటించారు. అమలులో అన్నీ మరిచిపోగా.. ఆస్పత్రి సొమ్ముతో సొంత ప్రచారం చేసుకుంటున్నారు రాష్ట్ర వైద్యశాఖ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్. వైద్యులు శస్త్రచికిత్సలు చేయడం ద్వారా సమకూరిన రివాల్వింగ్ ఫండ్‌తో ఆస్పత్రిలోని రిపేరు పనులు చేయించడమే కాకుండా మునుపెన్నడూ లేనట్టుగా.. తమ సొంత నిధులతో ఆ పనులు చేయిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ శిలాఫలకం వేయించు కోవడం వివాదాస్పదమవుతోంది. లబ్బీపేట : వైద్యశాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రభుత్వాస్పత్రి కనీస మౌలిక సదుపాయాలకు రూపాయి కేటాయించింది లేదు. ‘రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏం బాగోలేదు. పేదలకు సరైన వైద్యం అందుతుందని నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను.’ అంటూ బాధ్యతలు చేపట్టిన కొద్దికాలం వరకూ మంత్రివర్యులు ఇదే మాట చెబుతూ వచ్చారు. మార్పు రావాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏం కావాలో చెప్పాలంటూ పదేపదే ప్రశ్నిస్తూ వచ్చారు. ఆస్పత్రిలో రాత్రి నిద్రచేసి మరీ సమస్యలు తెలుసుకున్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించిన సందర్భాలు లేవు. కనీసం రిపేరైన పరికరాలకు మరమ్మతులు చేయించేందుకు రూపాయి విదల్చలేదు. మరి ఇదేం కథ మంత్రివర్యా! ప్రభుత్వాస్పత్రి దుస్థితి ఇలా ఉంటే.. మంత్రిగారి ప్రచార ఆర్భాటం కోసం ఏకంగా ప్రభుత్వాస్పత్రి సొమ్మునే వాడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుచేసిన 2008వ సంవత్సరం నుంచి ఆస్పత్రికి రావాల్సిన నిధుల మొత్తంలో 20 శాతం ప్రభుత్వం వద్దే ఉంచారు. వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాల్సి ఉంది. అలా.. ప్రభుత్పాస్పత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్యుల కృషి కారణంగా నిధులు క్రమేణా పెరుగుతూ వచ్చాయి. ఆ డబ్బుతో సుమారు రూ.4 కోట్లతో ప్రస్తుతం ఆస్పత్రిలో పలు రిపేర్లు చేయనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి సొమ్ముతో చేసిన అభివృద్ధి పనులకు ప్రచారం చేసుకున్న సందర్భాలేమీ లేవు. కానీ, ప్రస్తుతం వైద్యశాఖ మంత్రి మాత్రం రిపేరు పనుల ప్రారంభోత్సవానికి శిలాఫలకం వేయనున్నారు. ఇదేమిటని వైద్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏడాది కిందట ఆస్పత్రిలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అనేక సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, ఒక్క పనికూడా చేయలేదని, ఇప్పుడు ఆస్పత్రి నిధులతో మరమ్మతులు చేస్తూ సొంత ప్రచారం చేసుకుంటున్నారని పలువురు వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు. వీటి సంగతేంటి సార్? ఫిజియోథెరఫీ విభాగంలో పరికరాలన్నీ మూలన పడ్డాయి. కొత్త పరికరాలు కొనుగోలు చేయాలని విన్నవించినా ఫలితం లేదు.న్యూరాలజీలో ఫిట్స్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసే ఈఈజీ పనిచేయడం లేదు.కార్డియాలజీలో ట్రెడ్మిల్ మూలనపడింది. సీటీ స్కాన్ కొని పదేళ్లు దాటింది. దాని స్థానంలో ఎంఆర్ ఐ కొనుగోలు చేయాలని అధికారులు ప్రతిపాదించినా ఆ ఊసే లేదు.రెండేళ్లుగా రెండు ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. శ్లాబ్ నుంచి నీరు కారడంతో సర్జరీలు నిలిపివేశారు. నేటికీ అవి మరమ్మతులు నోచుకోలేదు. ప్రభుత్వాస్సత్రికి గత ఏడాది ఏప్రిల్‌లో డిజిటల్ ఎక్స్‌రే మిషన్ సమకూరింది. దానిని ఒక గదిలో ఉంచి భద్రపరచడం మిన హా వినియోగంలోకి తీసుకు రాలేదు. సుమారు రూ.25 లక్షలు వెచ్చించి కొన్న మిషన్ నిరుపయోగంగా మారింది. అందుకు ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్ల కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై అనేకసార్లు మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదు. -
అమాత్యా.. హామీలు గుర్తున్నాయా!
♦ ఎక్కడి సమస్యలు అక్కడే ♦ సొంత జిల్లా ఆస్పత్రినే పట్టించుకోని వైనం ♦ పది నెలల్లో చేసింది శూన్యం ♦ నేడు మంత్రి కామినేని ప్రభుత్వాస్పత్రికి రాక లబ్బీపేట : పదేళ్లలో వైద్యరంగం భ్రష్టుపట్టిపోయింది. వైద్యశాఖ భాగా పనిచేస్తుందని ఆ శాఖ మంత్రిగా నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. ఈ వ్యవస్థలను గాడిలో పెట్టాలి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తా..వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలివి. నెల రోజులపాటు ఎక్కడికెళ్లినా ఇవే మాటలు చెప్పేవారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి పది నెలలు గడిచిపోయింది. సొంత జిల్లాలోని బోధనాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరై వైద్యులు, అధికారులు చెప్పిన సమస్యలన్నీ విన్నారు. నెల రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీలు గుప్పించారు. కానీ సమావేశం జరిగి ఏడు నెలలు గడుస్తోంది. స్వయంగా వైద్య మంత్రే హామీలివ్వడంతో నెరవేరుతాయని వైద్యులు ఆశగా ఎదురుచూశారు. కాని వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆయనిప్పుడు చెప్పేదొక్కటే.. ఆర్థికపరంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని. తాను పదవి చేపట్టాక అదనపు వైద్య సీట్లు రప్పించానంటూ ఊదరగొట్టే ప్రచారం చేశారు. కానీ వాటికనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో అవి కూడా రద్దయ్యాయి. ఆస్పత్రి నిద్రలో సమస్యలు మరిచారు.. ఆస్పత్రి నిద్ర పేరుతో నెల రోజుల కిందట ఒక రోజు రాత్రి ఆస్పత్రిలో గడిపారు. అప్పుడు సిబ్బంది, రోగులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. సొంత జిల్లాలో ఉన్న ఆస్పత్రినే కామినేని అభివృద్ధి చేయలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం మళ్లీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్నారు. మళ్లీ సమస్యల పాత రికార్డును వేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. మంత్రిగారూ వీటిపై దృష్టిపెట్టండి.. ♦ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను100 నుంచి 150కి పెంచారు. దానికనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో మళ్లీ సీట్లు రద్దు చేస్తామని ఎంసీఐ లేఖ రాసింది. సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలి. ♦ పెంచిన సీట్లకు అనుగుణంగా గతంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాసిన లేఖ ఆదారంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పిడియాట్రిక్ వంటి విభాగాలను పెంచా ల్సి ఉంది. దీని ద్వారా వైద్యులు, సిబ్బంది పెరగడంతో పాటు పడకల సంఖ్య పెరిగి రోగులకూ మంచి వైద్యం అందే అవకాశం ఉంది. ♦ నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న ఆస్పత్రిలో నేటికీ ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం అందుబాటులోకి రాలేదు. దాని ఏర్పాటుకు కృషి చేయాలి. మరోవైపు రేడియోగ్రాఫర్స్ కొరత కారణంగా డిజిటల్ ఎక్స్‌రే మెషీన్ సమకూరినా పనిచేయించలేని దుస్థితి నెలకొంది. ♦ రెండు ఆపరేషన్ థియేటర్లు రెండేళ్లుగా మూతపడ్డాయి. ఆ రెండు ఆర్థోపెడిక్ విభాగానికి చెందినవి కాగా, కాలు విరిగి ఆస్పత్రికి వస్తే వారికి ఆపరేషన్ థియేటర్లు లేక వారం రోజులు సర్జరీ వాయిదా పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ♦ కాలిన గాయాలతో వచ్చిన వారికి చికిత్స చేసే బర్న్స్ వార్డు అస్తవ్యస్తంగా మారింది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయండి. ♦ రక్తపరీక్షల విషయంలో నేటికీ 24 గంటల లేబొరేటరీ అందుబాటులోకి రాలేదు. దీనికోసం ప్రత్యేక సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. ♦ గుండెజబ్బు వచ్చిన వారికి పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేయాలి. ♦ ఇప్పటివరకూ ఐసీయూ అందుబాటులో లేక ఏఎంసీ వంటి వార్డులో ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యాధునిక సౌకర్యాలతో ఐసీయూ ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రామా కేర్ వార్డులో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
ప్రభుత్వాస్పత్రిలో బయోమెట్రిక్
జనవరి రెండో వారం నుంచి అమలు ఆదేశాలు జారీచేసిన వైద్య విద్య సంచాలకులు వైద్యులు, సిబ్బంది ఆలస్యంగా రావడంపై మంత్రి కామినేని సీరియస్ లబ్బీపేట : ప్రభుత్వాస్పత్రిలో జనవరి రెండో వారం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల నుంచి ఆస్పత్రి అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం ఏర్పాటుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి కామినేని సీరియస్.. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులతోపాటు నర్సింగ్, ఇతర సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సీరియస్‌గా ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయన ఉదయం 10.15 గంటలకు పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, అప్పటికి 13 మంది వైద్యులు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయలేదు. వారిలో నగులురు వైద్యులు సెలవులో ఉన్నారు. మంత్రి ఆగ్రహం వ్యక్తంచేయడంతో మిగిలిని 9మంది వైద్యులకు ఆస్పత్రి అధికారులు మెమోలు జారీచేశారు. మూడేళ్ల క్రితమే ఏర్పాటుచేయాలని... ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించడంలేదని చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. రోగులను అనుక్షణం పర్యవేక్షించాల్సిన షిఫ్ట్ డ్యూటీ చేసేవారు సైతం గంట ఆలస్యంగా రావడం, నిర్ణీత సమయం కన్నా ముందే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితమే బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రశేపెట్టాలని అప్పటి కలెక్టర్ రిజ్వీ భావించారు. ఆయన బదిలీ కావడంతో అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మంత్రి జోక్యం చేసుకోవడంతో వెంటనే ఆదేశాలు జారీ అయ్యాయి. తద్వారా ఆలస్యంగా విధులకు హాజరయ్యేవారిని దారిలో పెట్టవచ్చని భావిస్తున్నారు. -
వైద్యులపై మంత్రి కామినేని ఆగ్రహం
విజయవాడ : విజవాడ విద్యాధరపురంలోని కబేళా సెంటర్లో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ అయిదేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చికిత్స కోసం బాలుడి తల్లిదండ్రులు బెజవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే, తమ వద్ద కుక్కకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని బాలుడుని గుంటూరుకు తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు వైద్యులకు ఛార్జ్ మెమో ఇచ్చారు. అలాగే చంద్రశేఖర్ అనే వైద్యుడిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. మరోవైపు కాబోయే రాజధానిలోని ప్రభుత్వాసుపత్రిలో కుక్కకాటుకు వ్యాక్సిన్ లేకపోవడంపై విపక్ష నేతలు మండిపడ్డారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవడం బాగానే ఉన్నా.. ఇంత పెద్ద ఆసుపత్రిలో మందుల కొరతకు మంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
సూపర్ స్పెషాలిటీపై సమాధానం లేదు
మంత్రి కామినేని స్పష్టం చేయలేదని ఆర్కే వెల్లడి మంగళగిరి: జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. శుక్రవారం శాసనసభ సమావేశ అనంతరం ఆయన ఫోన్లో సాక్షితో మాట్లాడుతూ జీరోఅవర్‌లో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్‌పై చర్చ జరిగిందన్నారు. చర్చల్లో భాగంగా మంగళగిరి టీబీ శానిటోరియంలో ఎయిమ్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు, మంత్రి స్థల పరిశీలన తదితర అంశాలపై జరిగిన చర్చలో తాను పాల్గొని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌పై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న టీబీ శానిటోరియంను వేరేచోటకు తరలించి సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తారా? లేక శానిటోరియంలోని ఖాళీ స్థలాల్లో నిర్మిస్తారా? అని ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మిస్తామని చెప్పారు కానీ మంగళగిరి టీబీ శానిటోరియంలో ఆస్పత్రి నిర్మాణంపై సమాధానం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ఎయిమ్స్‌ను జిల్లాలో ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. -
అచ్చెన్న+ కూన
టీడీపీలో అధికార కేంద్రాల మధ్య వర్గపోరు ఆరోగ్య మంత్రి ఎదుటే ఇరువురి సంవాదం గతంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ భేటీలోనూ ఇదే సీన్ ఆమదాలవలసలో పెట్టాలని విప్ కూన రవి పట్టు ఎచ్చెర్ల లేదా అంపోలు ప్రాంతాలను సూచిస్తున్న మంత్రి అచ్చెన్న అంతా కలిసి నిర్ణయించండంటూ దాటవేసిన మంత్రి కామినేని రిమ్స్ క్యాంపస్: రెండు అధికార కేంద్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి మంత్రిగా అచ్చెన్నాయుడుకు.. ప్రభుత్వ విప్‌గా కూన రవికుమార్ నియమితులయ్యారు. పోటాపోటీగా సమీక్షలు నిర్వహిస్తూ హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వీరద్దరి మధ్య నర్సింగ్ కళాశాల అంశం వివాదం రాజేస్తోంది. తాము చెప్పిన చోటే కళాశాలను ఏర్పాటు చేయాలని ఎవరికి వారు పట్టుపడుతున్నారు. చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం రిమ్స్‌లో జరిపిన సమీక్ష సమావేశంలోనూ వీరి మధ్య నెలకొన్న వివాదంబయటపడింది. దీంతో ఇదే చర్చనీయాంశంగా మారింది. కళాశాల మంజూరైనప్పటి నుంచీ.. శ్రీకాకుళంలోని రిమ్స్‌కు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజురైంది. తొలుత రిమ్స్ ఆవరణలోనే దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అం దుకు అవసరమైన ఐదు ఎకరాల స్ధలం రిమ్స్‌లో లేకపోవటంతో అధికారు లు స్థలాన్వేషణలో పడ్డారు. తాత్కాలికంగా రిమ్స్‌లోని స్టాఫ్ నర్సుల క్వార్టర్లను హాస్టల్‌గా మార్చి, వైద్య కళాశాలలోనే నర్సింగ్ కళాశాలను కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు ఎచ్చెర్లలోని కొండపై స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఆమదాలవలసలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా ఆమదాలవలసలోనే నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ అక్కడ జరిగిన పలు సమావేశాల్లో ఆర్భాటంగా ప్రకటించేశారు కూడా. ఇటీవల జరిగిన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశంలో నూ ఈ విషయం ప్రస్తావించారు. ఎచ్చెర్లలో ఇప్పటికే యూనివర్సిటీ, గురుకులంతోపాటు ఎన్నో పరిశ్రమలు ఉన్నందున నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస, ఎచ్చెర్ల రెండూ సమాన దూరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ సమావేశంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందిస్తూ.. అక్కడెక్కడో ఆమదాలవలసలో ఎలా పెడతారని అంటూ.. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేస్తారని బదులిచ్చారు. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేయండంటూ అక్కడే కలెక్టర్‌కు సూచించారు. వీరిద్దరి సంవాదంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నివ్వెరపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి ముందూ అదే తీరు అభివృద్ధి కమిటీ సమావేశంలో మొదలైన వివాదం తిరిగి మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముందుకొచ్చింది. రిమ్స్‌పై సమీక్షిస్తున్న సందర్భంగా నర్సింగ్ కళాశాలను త్వరగా ఏర్పాటు చేయాలని రిమ్స్ అధికారులు మంత్రిని కోరారు. వెంటనే కూన రవికుమార్ జోక్యం చేసుకొని ‘సార్ మంత్రిగారు.. నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయం డి’ అని కోరారు. ఆ వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు మైక్ ఆన్ చేసి ‘కళాశాల ఏర్పాటుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అంపోలు దారిలో స్థలం చూశారని.. దాన్ని ఆర్డీవో పరిశీలించారని అంటూ.. వీలైతే అక్కడ ఏర్పాటు చేయండి.. అది కాకపోతే ఎచ్చెర్లలో ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా అచ్చెన్న, రవికుమార్‌లు తమ ప్రతిపాదనకు మద్దతుగా పోటాపోటీగా వాదించడం మొదలుపెట్టారు. వ్యవహారం ముదురుతున్నట్లు గమనించిన మంత్రి కామినేని అందరి ముందు చర్చించటం సరికాదని, వేరేగా కూర్చొని మాట్లాడుకుందామంటూ అడ్డుకట్ట వేశారు. మీరంతా నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో చెబితే.. అక్కడే పెడదామంటూ ఆ అంశాన్ని దాటవేశారు. ఈ వాగ్వాదాన్ని చూసి జిల్లా కలెక్టరుతో సహా రిమ్స్ అధికారులు విస్మయానికి గురయ్యారు. జిల్లాకు ప్రయోజనకారి అయిన నర్సింగ్ కళాశాల ఏర్పాటు విషయంలో ఈ వర్గపోరేంటంటూ పలువురు ముక్కున వేలేసుకున్నారు. -
మంత్రి కామినేనికి చుక్కెదురు
-
కాకినాడలో చదువుకున్నా : మంత్రి కామినేని
కడియం : తాను కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యనభ్యసించానని రాష్ట్ర వైద్యవిద్య, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు కుమారుడు కిరణ్, నర్సరీ రైతు మార్గాని వీరబాబు కుమార్తె గౌతమిల నిశ్చితార్ధ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు రాజకీయ ప్రముఖులు జిల్లాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఈ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానమని మంత్రి కామినేని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తూర్పుగోదావరిజిల్లాలోనే పుట్టిన తనకు ఈ జిల్లాతో విడదీయలేని బంధముందన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం,ఆప్యాయతను పంచే ఈ జిల్లాతో బంధుత్వం కలవడం ఆనందంగా ఉందన్నారు.