విజయవాడ : విజవాడ విద్యాధరపురంలోని కబేళా సెంటర్లో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ అయిదేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చికిత్స కోసం బాలుడి తల్లిదండ్రులు బెజవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే, తమ వద్ద కుక్కకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని బాలుడుని గుంటూరుకు తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతలో మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు వైద్యులకు ఛార్జ్ మెమో ఇచ్చారు. అలాగే చంద్రశేఖర్ అనే వైద్యుడిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు.
మరోవైపు కాబోయే రాజధానిలోని ప్రభుత్వాసుపత్రిలో కుక్కకాటుకు వ్యాక్సిన్ లేకపోవడంపై విపక్ష నేతలు మండిపడ్డారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవడం బాగానే ఉన్నా.. ఇంత పెద్ద ఆసుపత్రిలో మందుల కొరతకు మంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
వైద్యులపై మంత్రి కామినేని ఆగ్రహం
Published Sun, Dec 21 2014 10:56 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
Advertisement