
నేడు ఉద్ధానం పర్యటనకు పవన్
కిడ్నీ వ్యాధి బాధితులతో మాటామంతీ
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మంగళవారం పర్యటించనున్నారు. 20 ఏళ్లగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి స్థానికుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఉద్ధానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 20 వేల మంది కిడ్నీ వ్యాధి కారణంగా మరణించారని పవన్‌కల్యాణ్ సోమవారం తన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
‘ఉద్ధానం’ బాధితులకు డయాలసిస్ సెంటర్లు: కామినేని
కైకలూరు: శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితులకు అదనంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పవన్‌కల్యాణ్ మంగళవారం ఉద్ధానం కిడ్నీ బాధితుల పరామర్శకు వెళ్తున్నట్లు ట్వీటర్‌లో ప్రకటించడంతో మంత్రి కామినేని కైకలూరులో విలేకరులతో మాట్లాడారు.