జిల్లాలో మంత్రి కామినేని పర్యటన | minister kamineni tour in kadapa | Sakshi
Sakshi News home page

జిల్లాలో మంత్రి కామినేని పర్యటన

Published Thu, Jul 28 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

minister kamineni tour in kadapa

కడప సెవెన్‌రోడ్స్‌ :
 రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ఈనెల 29, 30 తేదీలలో జిల్లా పర్యటనకు వస్తున్నట్లు డీఆర్వో సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి 29వతేదీన మధ్యాహ్నం అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పెండ్లిమర్రికి చేరుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు కడపకు చేరుకుని బస చేస్తారన్నారు.

30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కడప రిమ్స్‌ ఆస్పత్రినితనిఖీ చేసి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షిస్తారన్నారు. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజంపేట నియోజకవర్గంలోని ఆకేపాడుకు వెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యకర్తలతో సమావేశమై ఆత్మకూరుకు బయలుదేరి వెళతారని డీఆర్వో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement