District Tour
-
YS Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
-
అధైర్య పడొద్దు..ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధికారం కోల్పోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, మన సత్తా ఏంటో చూపిద్దామని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, మున్ముందు మంచిరోజులు వస్తాయని శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకు రానున్నారని తెలిపారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తరువాత కోలుకుంటున్న కేసీఆర్ జిల్లాల్లో పర్యటనలు జరుపుతారని చెప్పారు. వచ్చే నెలలో కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతిరోజూ కార్యకర్తలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫొటో తొలగించినా ప్రజల గుండెల నుంచి తొలగించలేరు.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే పనిలో ఉందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోందనీ కిట్ నుంచి కేసీఆర్ ఫొటో, పేరును తొలిగిస్తారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయి దాలు అన్నట్టుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు.కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతుబంధు ఇప్పటికీ వేయలేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు., ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కీలక పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు అధికారిక మీటింగ్‌లలో పాల్గొనడం కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. రెవెన్యూ తదితర కీలకమైన శాఖల్లో పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారని, రేవంత్ మనుషులు విచ్చల విడిగా సిటీ చుట్టుపక్కల లే అవుట్లు వేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎంపీ వెంకటేష్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. రేవంత్ కనీస హోం వర్క్‌చేయడం లేదు: కడియం సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరు బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలి యదని, సీఎం దేనిపైనా కనీస హోం వర్క్ కూడా చేయడం లేదనిపిస్తోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఫార్మా సిటీ, మెట్రో రైలుపై సీఎం వైఖరి కొన్ని రోజుల్లోనే మారిందన్నారు. అదానీని నాగపూర్‌లో విమర్శించిన సీఎం హైదరా బాద్‌లో అదే అదానీకి రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకా లను ప్రారంభించకపోగా, కేసీఆర్ పథకాలను రద్దు చేస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గృహలక్ష్మి పథకాన్ని అలాగే కొనసాగించాలన్నారు. దళితబంధు పథకంలో సాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న పథకాన్నే ఎత్తివేస్తూ దళితులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. -
తిరుపతి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రేపు సీఎం కేసీఆర్ జనగామ పర్యటన
సాక్షి, జనగాం: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో శనివారం కేసీఆర్ పర్యటించనున్నారు. హెలీక్యాప్టర్ ద్వారా రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం పూర్తయిన రైతు వేదికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. అంతేకాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్ మాట్లాడతారు. ఈ సందర్భంగా రైతు వేదికల ముఖ్య ఉద్దేశాలను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హాజరయ్యే రైతు బంధు జిల్లా, మండల, గ్రామ కమిటీల సభ్యులతో పాటు రైతులకు, తద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి సీఎం వివరించనున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొడకండ్లకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం పరిశీలించారు. స్వయంగా సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేసి కొడకండ్లకు వస్తున్న సమాచారాన్ని తెలియజేశారు. అప్పటికే వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి దయాకర్‌రావు వెంటనే కొడకండ్లకు చేరుకున్నారు. రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డితో కలిసి సీఎం పర్యటన కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీఎం ప్రారంభించనున్న రైతు వేదిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, డబుల్ బెడ్రూం ఇళ్లు, వ్యవసాయ మార్కెట్లోని సభాస్థలి, హెలీప్యాడ్ నిర్మాణాలను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సూచించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని ముఖ్యమంత్రిని కోరడంతో, అధికారులతో నివేదిక తెప్పించుకుని జనగామ జిల్లా కొడకండ్లకు రావాల ని నిర్ణయించుకోవడం అదష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. సీఎం ఫోన్ ద్వారా కొడకండ్లతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారని దయాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి ర వీందర్ నాయక్, జెడ్పీటీసీ సత్తమ్మ, ట్రైకార్ మాజీ చైర్మన్ గాంధీనాయక్, సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీలు విజయలక్ష్మి, యాకయ్య పాల్గొన్నారు. -
ఉపరాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
సాక్షి, నెల్లూరు : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. మూడురోజుల పాటు ఆయన జిల్లాలో ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు జిల్లాకు వస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ çఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలన్నింటినీ పోలీసులు శుక్రవారం నుంచే తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబ్, డాగ్స్క్వాడ్లతో పాటు సాయుధ పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా తీర, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఇలా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.35గంటలకు నెల్లూరు పోలీసు కవాతుమైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన సర్ధార్‌వల్లబాయి పటేల్ నగర్‌లోని తన స్వగృహానికి చేరుకుని అక్కడ సేదతీరుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు రోడ్డుమార్గాన వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు వెళుతారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వే టన్నల్‌ను పరిశీలి స్తారు. సాయంత్రం 5గంటలకు బయలుదేరి రాత్రి 7గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటా రు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టులో రాత్రి బసచేస్తారు. సెప్టంబర్ ఒకటోతేదీ ఉదయం 9.30గంటలకు గూడూరు రైల్వేస్టేషన్‌కు వెళతారు. అక్కడ గూడూరు–విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు అక్షర విద్యాలయానికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4.20గంటలకు వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మిత్రులు, శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమావేశమవుతారు. అక్కడ నుంచి స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. రెండోతేది వినాయకచవితి వేడుకలను ట్రస్టులోనే జరుపుకుంటారు. 3వ తేదీ ఉదయం 8.20 గంటలకు నెల్లూరు పోలీసు కవాతుమైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో రేణిగుంటకు వెళతారు. కేంద్ర సహాయ మంత్రుల పర్యటన రైల్వేశాఖ కేంద్ర సహాయమంత్రి సురేష్ అంగడి రేణిగుంట నుంచి ఉపరాష్ట్రపతితో కలిసి హెలికాప్టర్లో నెల్లూరుకు వస్తారు. అనంతరం వెంకయ్యనాయుడుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సెప్టంబర్ ఒకటోతేదీన గూడూరులో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రోడ్డుమార్గాన తిరుపతికి వెళతారు. హోం శాఖ కేంద్ర సహాయ మంత్రి సెప్టంబర్ ఒకటోతేదీన తిరుపతి రోడ్డుమార్గం ద్వారా గూడూరుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకుంటారు. సింహపురి వైద్యశాల వద్ద నుంచి జరగనున్న ఆర్టికల్ 370 రద్దు విజయోత్సవ ర్యాలీ సభలో పాల్గొని తిరుపతికి వెళుతారు. 1,075మందితో బందోబస్తు పోలీసు యంత్రాంగం 1,075 మందితో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎస్పీతో పాటు, ఏఎ స్పీ, ఎనిమిది మంది డీఎస్పీలు, 19మంది సీఐలు, 58 మంది ఎస్ఐలు, 738 మంది సిబ్బంది, 120మంది ఏఆర్ సిబ్బంది, 130 మంది స్పెషల్ పార్టీ బందో బస్తులో పాల్గొంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఉపరాష్ట్రపతి, కేంద్రసహాయ మంత్రుల పర్యటన సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు కవాతుమైదానంలో బందోబస్తులో పా ల్గొనే సిబ్బందికి సూచనలి చ్చా రు. అనంతరం ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. -
ఓటమి టీడీపీకి కొత్తేమీ కాదు: చంద్రబాబు
సాక్షి, ధర్మవరం: ఓటమి అనేది టీడీపీకి కొత్తేమి కాదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. గతంలో కూడా టీడీపీ ఓటమి పాలై మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంగా పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడకూడదని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారని, మృతుల కుటుంబసభ్యులను పరామర్శించేందుకు భరోసా యాత్ర చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, బండారు శ్రావణి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో చింతా భాస్కరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటాం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణ వివాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మృతుడి భార్య వరలక్ష్మికి రూ. 5లక్షల చెక్కును అందించారు. పిల్లలు వినయ్, ఆనంద్, అవంతిను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామన్నారు. ఇదే ఘర్షణలో గాయపడ్డ మరో ఆరుగురికి రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. హత్యారాజకీయాలకు తాము భయపడమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. త్వరలో ధర్మవరంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ను ప్రకటిస్తామన్నారు. -
మాజీ సీఎంగా మొటిసారి కడపకు..
సాక్షి, కడప రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా జిల్లాకు రాగానే ఆయన వెంట భారీగా పార్టీ నేతలు..శ్రేణులు అనుసరించేవి. అలాంటిది మంగళవారం ఆయన కడప విమానాశ్రయం చేరుకున్నప్పుడు కనీస స్థాయిలో కూడా ఆ పార్టీ నాయకులు కనిపించకుండా పోయారు. జిల్లాలో పేరున్న నాయకులుగా చెలామణి అయిన నేతలు సైతం స్వాగతం పలకడానికి రాలేదు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి చంద్రబాబునాయుడు మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో అనంతపురం జిల్లా పర్యటనకు వెళుతూ మంగళవారం ఉదయం కడప విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయన వెంట హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. వారికి ఆ పార్టీ దిగువ స్థాయి శ్రేణులు స్వాగతం పలికాయి. ఎన్నికల ముందు వరకు జిల్లాలో ఆపార్టీ తరఫున అన్నీ తానై వ్యవహరించిన మంత్రి ఆదినారాయణరెడ్డి పత్తాలేకుండాపోయారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకొని ఉన్న మరో కీలక నేత జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కూడా విమానాశ్రయం వద్ద జాడలేదు. మైదుకూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన టీటీడీ మాజీ చైర్మను పుట్టా సుధాకర్ యాదవ్ సైతం చంద్రబాబు స్వాగతానికి డుమ్మా కొట్టారు. పార్టీ అధినేత స్వాగతానికి కీలక నేతల గైర్హాజరుపై పార్టీలో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆదినారాయణరెడ్డి అదృశ్యం కావడంపై వీరంతా ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు పనిగట్టుకొని ఈయన్ను మంత్రిగా చేశారు. మంత్రి కాగానే పార్టీలో సర్వం అయనే నడిపేవారు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునేవారు. పార్టీ కార్యకర్తలకు ఈ ధోరణినచ్చకపోయినప్పటికీ సర్దుకుపోయారు. ఏమైనప్పటికీ చంద్రబాబుకు ఈ పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించిందనడంలో సందేహం లేదు. -
లష్కర్‌బాబు.. జిల్లాకు చేసిందేమిటి?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు చేసిన మేలు ఏమీ లేదని.. 2014 ఆగస్టులో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించి దాదాపు 80–85 శాతం వరకు పూర్తి చేశారన్నారు. మిగతా పనులను తూతూ మంత్రంగా చేపట్టి వాటి గేట్లు ఎత్తుతూ సీఎం చంద్రబాబునాయుడు పెద్ద లష్కర్గా మారారని విమర్శించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే ఐజయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల ప్రారంభ సభల్లో వైఎస్ఆర్ పేరు ఎత్తకూడదనే ముచ్చుమర్రిలో ఎమ్మెల్యే ఐజయ్య, పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డిల నుంచి మైక్‌లు లాక్కున్నారన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేయించి దుశ్శాసన పర్వానికి ..బహిరంగ సభల్లో మాట్లాడితే రౌడీల ద్వారా మైక్ లాక్కోని రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. గతంలో ముచ్చుమర్రి సభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడుతుంటే సీఎం ఆనందించడం వికృత ధోరణికి నిదర్శనమన్నారు. సిద్ధాపురం, ముచ్చుమర్రి పథకాలు ముమ్మాటికీ వైఎస్ఆర్ చలువతోనే ప్రారంభమయ్యాయన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు మరిచావా ? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని ఒక్క పెండింగ్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకపోగా రాయలసీమకు గుండెకాయలాంటి గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై నోరు మెదపడం లేదన్నారు. పక్క రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయన్న సాకుతో కనీసం సర్వే పనులు చేపట్టలేదన్నారు. జన్మభూమిలో సమస్యలకు పరిష్కారం లభించడం లేదని చాలామంది ప్రజలు వెళ్లడం లేదన్నారు. కొందరు ఏదో ఆశతో వెళితే టీడీపీ నాయకుల అధికార దాహానికి బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో లక్ష ఇళ్లను కట్టించలేని ప్రభుత్వం..ఏడాదిలో 19 లక్షల ఇళ్లను ఎలా కట్టిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పడమటి ప్రాంతాన్ని సీఎంపట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తే స్వయంగా చెప్పడం దేనికి నిదర్శనమన్నారు. టీడీపీకి ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు – ఎమ్మెల్యే ఐజయ్య 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు ఆయన వ్యవహార తీరుతో సిగ్గుపడుతున్నారని ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎత్తకూడదని ముచ్చుమర్రి సభలో తన మైక్ , పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాస్‌రెడ్డి మైక్ లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేయించినందుకు సీఎం సిగ్గుపడాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ దళితులను కించపర్చుతుందని, రాష్ట్రపతి కోవిందు కుటుంబాన్ని అనుమతి లేని బోటులో విజయవాడ కృష్ణాబ్యారేజ్‌లో ఎలా విహారానికి తీసుకెళ్తుందని ప్రశ్నించారు. కేంద్ర, ప్రభుత్వ నిధులతో ఎస్సీ కార్పొరేషన్ ఇస్తున్న ఇన్నోవా కార్లపై సీఎం బొమ్మను తొలగించాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. రైతు రథం పేరుతో ట్రాక్టర్లన్నీ టీడీపీ వారికే ఇచ్చారని, ఇందులోఅర్హులు ఒక్కరూ లేరన్నారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, సత్యంయాదవ్, కర్నాటి పుల్లారెడ్డి, ధనుంజయాచారి, రాజావిష్ణువర్దన్‌రెడ్డి, విజయకుమారి, పర్ల శ్రీధర్‌రెడ్డి, రమణ, భాస్కరరెడ్డి, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారా..? అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజలకు వివరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారా..? ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన కేలండర్ ఖరారు అయినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రతిపక్షాలు, జేఏసీ వంటి ప్రజాసంఘాల నుంచి విమర్శల దాడి జరుగుతున్న తీరుపై పార్టీలో జరిగిన చర్చ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున ఖరీప్, రబీ పంటలకు కలిపి రూ.8 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం పక్కదోవ పట్టకుండా ఉండేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం తదితరాలపై అధికార పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకూ అడ్డంకులు సృష్టించడం, కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకురావడం వంటి అంశాలపై వాస్తవాలను తన పర్యటనలో వివరించనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఏడాది కిందటే సీఎం జిల్లా పర్యటనలు ఉంటాయని ప్రచారం జరిగినా, ఇప్పటికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఈ పర్యటనలో పార్టీ కేడర్‌లోనూ ఉత్సాహం నింపొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది గడిచిన నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం కూడా ఈ పర్యటనల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. 11న సిద్దిపేటతో ప్రారంభం.. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో బహిరంగ సభల్లో 11న పాల్గొనడంతో పాటు అదేరోజు నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 12న సూర్యాపేటలో బహిరంగ సభలో పాల్గొంటారు. సోమవారం జరగాల్సి ఉన్నా వాయిదా పడ్డ నారాయణఖేడ్ పర్యటన 13న పూర్తి చేయనున్నారు. 20న వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో పర్యటించి వరంగల్‌లో టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన, ఔటర్‌రింగ్ రోడ్ పనులను ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఈ నెల 29తో గత అసెంబ్లీ సమావేశాలు ముగిసి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ లోపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తర్వాత నవంబర్‌లో మరికొన్ని జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఆత్మీయ స్వాగతం
జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం భీమవరం చేరుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు సాగర్–సుధ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఏలూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ కుమార్తె డాక్టర్ పావని, డాక్టర్ నిషాంత్ వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు అత్మీయ స్వాగతం పలికారు. ఆయన భీమవరం, ఏలూరులో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అభిమాన నేతకు నీరాజనం పలికారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలు విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి పెనుగొండ మండలం సిద్ధాతం వద్ద జిల్లాలో అడుగుపెట్టారు. ఆయన పర్యటన ఏ రూట్లో ఉంటుందో ప్రకటించకపోయినా.. అప్పటికప్పుడు ఆయన వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు సెంటర్లలోకి చేరుకుని స్వాగతం పలికారు. సిద్ధాతం, ఉండ్రాజవరం జంక్షన్, తణుకు, దువ్వలో అభిమానులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. తాడేపల్లిగూడెం మీదుగా భీమవరం చేరుకున్న వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఈనెల 9న భీమవరంలో గ్రంధి ఇంట జరిగిన వివాహ వేడుకకు అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం వెళ్లి నూతన దంపతులు సాగర్, సుధలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుంచి ఏలూరు బయలుదేరి వచ్చారు. మండుటెండలోనూ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి, ఆకివీడు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. ఆకివీడులో హారతులు పట్టారు. అక్కడ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన వైఎస్ జగన్ ఏలూరు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ నగర, మండల శాఖ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మంచెం మైబాబు ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాని ఇంటికి తరలివచ్చారు. అనంతరం వట్లూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్న వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ కుమార్తె డాక్టర్ పావని, డాక్టర్ నిషాంత్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, శ్రీకాకుళం జిల్లా పార్టీ ఇన్ చార్జి కొయ్యే మోషేన్ రాజు, నియోజకవర్గాల కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, తానేటి వనిత, దయాల నవీన్ బాబు, గుణ్ణం నాగబాబు, దూలం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తోట గోపి, చీర్ల రాధయ్య, మామిళ్లపల్లి జయప్రకాష్, వందనపు సాయిబాలపద్మ, పేరిచర్ల విజయనర్సింహరాజు, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, బొద్దాని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మంత్రి అమర్నాథ్ రెడ్డి జిల్లా పర్యటన
చిత్తూరు(రూరల్): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7న ఉదయం 9 గంటలకు తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారని తెలిపారు. అనంతరం తిరుపతి నుంచి బయల్దేరి చంద్రగిరి, నేండ్రగుంట మీదుగా చిత్తూరుకు చేరుకుంటారని, పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను కలుస్తారన్నారు. 8న బి.కొత్తకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
నేడు జిల్లాకు తమిళనాడు గవర్నర్ రోశయ్య
కడప కల్చరల్ : తమిళనాడు గవర్నర్ రోశయ్య శుక్రవారం జిల్లాకు రానున్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆయన చెన్నై నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా జిల్లాలోని పోరుమామిళ్లకు చేరుకోనున్నారు. 11.55 గంటలకు పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దిగి అనంతరం పోలీసు అతిథి గృహానికి వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటుతారు. 12.10 గంటలకు పునర్నిర్మించిన శ్రీమత్ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. 1.00 గంటలకు అమ్మవారిశాల వీధిలోని జయరామకృష్ణయ్య ఇంటికి వెళ్లనున్నారు. 2.45 గంటలకు అక్కడి ప్రభుత్వ జూనియర్‌కళాశాల మైదానానికి బయలుదేరి అక్కడి నుంచి సాయంత్రం మూడు గంటలకు తిరుపతికి వెళతారు. -
వైఎస్సార్ జిల్లాలో మంత్రి కామినేని పర్యటన
కడప : రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. మొదట కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కడప రిమ్స్‌కు చేరుకున్నారు. రిమ్స్ కళాశాల డైరెక్టర్ చాంబర్లో అధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. రిమ్స్‌లో సమస్యలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం మంజూరు చేశారు గానీ ఇంత వరకు ఏర్పాటు చేయలేదని ఆయన దృష్టికి అధికారులు తీసుకెళితే...ప్రైవేటు భాగస్వామ్యంతో త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్‌సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కాన్పుల విభాగంలో ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా మదర్ చైల్డ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ బాబ్జి, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శశిదర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అక్కడే భోజనం చేసి ఐపీ విభాగంలోని ఎంఐసీయూ పక్కనున్న గదిలో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. -
జిల్లాలో మంత్రి కామినేని పర్యటన
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈనెల 29, 30 తేదీలలో జిల్లా పర్యటనకు వస్తున్నట్లు డీఆర్వో సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి 29వతేదీన మధ్యాహ్నం అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పెండ్లిమర్రికి చేరుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు కడపకు చేరుకుని బస చేస్తారన్నారు. 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కడప రిమ్స్ ఆస్పత్రినితనిఖీ చేసి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షిస్తారన్నారు. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజంపేట నియోజకవర్గంలోని ఆకేపాడుకు వెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యకర్తలతో సమావేశమై ఆత్మకూరుకు బయలుదేరి వెళతారని డీఆర్వో వివరించారు. -
ఆ డబ్బు వడ్డీకి కూడా సరిపోలేదు
-
బాధితులకు బాసటగా...
- పొగాకు రైతులకు అండగా జగన్ - రేపు జిల్లాలో పరామర్శ యాత్ర - అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఓదార్పు - టంగుటూరు వేలం కేంద్రం ఎదుట ధర్నా సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిట్టుబాటు ధర లేక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు, పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 6 గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరి పొందలవారిపాలెంలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి టంగుటూరు చేరుకుని వేలం కేంద్రం ఎదుట గిట్టుబాటు ధర కోసం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొంటారు. ధర్నా అనంతరం జరుగుమిల్లి మండలం చింతలవారిపాలెం వెళ్లి వేలం కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందిన మిడసల కొండలరావు కుటుంబాన్ని, వలివేటివారిపాలెం మండలం కొండసముద్రంలో ఆత్మహత్య చేసుకున్న నీలం వెంకట్రావు కుటుంబాలను పరామర్శిస్తారు. టంగుటూరులో నిర్వహించే ధర్నాలో పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. ట్రాక్ పై తీగలు - నిలిచిన రైళ్లు కంభం : రైలు పట్టాలపై విద్యుత్తు తీగలు తెగిపడడంతో సోమవారం అర్ధరాత్రి వరకూ రైళ్లకు అంతరాయం ఏర్పడిన ఘటన కంభం మండలంలోని సైదాపురం సమీపంలో చోటుచేసుకుంది. తొలుత సాయంత్రం కొన్ని విద్యుత్ తీగలను అతికష్టం మీద పక్కకు లాగి గుంటూరు - డోన్ ప్యాసింజర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ మరో తీగ రాత్రి 7.30 గంటలకు పడడంతో కంభం రైల్వేస్టేషన్‌కు వచ్చిన కాచిగూడ - గుంటూరు ప్యాసింజరు రాత్రి 9.40 నిమిషాల వరకూ కదలలేకపోయింది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. 9 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, గుంటూరు -కాచిగూడ ప్యాసింజరు, అమరావతి, ప్రశాంతి, ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. రూ 27.11కోట్ల ముద్రా రుణాలు జిల్లా కలెక్టర్ సుజాతశర్మ వెల్లడి ఒంగోలు టౌన్: ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద జిల్లాలో 10100 మందికి 27.11కోట్ల రూపాయల ముద్రా రుణాలు ఇవ్వనున్నట్టు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ముద్రా రుణ మెగా క్యాంపు నిర్వహించారు. ఏపీఐఐసీ ద్వారా ఏకగవాక్ష విధానం అమలులో ఉందని, పరిశ్రమల కోసం కొత్తగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారికి విద్యుత్, పంచాయతీ, అగ్నిమాపక శాఖల నుంచి సకాలంలో అనుమతులు మంజూరు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా అమలు చేయాలని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్రాజుసూచించారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా రుణం పొందే సౌలభ్యం ఉండటం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహారావు, సిండికేట్ బ్యాంకు డివిజనల్ మేనేజర్ రామ్మూర్తి, డీఆర్డీఏ పీడీ మురళి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ డాక్టర్ బీ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యాంకు చెక్కులను అందజేశారు. -
కరగ్రహారం రైతులతో వైఎస్ జగన్ భేటీ
-
ఉరుకులు.. ఉరుములు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి జిల్లా పర్యటన గురువారం ఏడుగంటల పాటు ఉరుకులు.. పరుగులు అన్నట్టుగా సాగింది. పుష్కర పనులు, పోలవరం కుడికాలువ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు వ చ్చిన ఆయన ఎక్కడ నిలకడగా ఉండకుండా వడివడిగా పర్యటనను సాగించారు. ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిం చారు. 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఆయన మధ్యలో అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్ర హావేశాలు వ్యక్తం చేస్తూ.. తనదైన శైలిలో హెచ్చరిస్తూ ముందుకు సాగారు. ఏలూరు :ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. దాదాపుగా ఏడు గంటలపాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, నరసాపురంలో పుష్కర ఏర్పాట్ల తీరును ఆయన మొక్కుబడిగా సమీక్షించారు. దాదాపు అరగంట లోపే సమీక్షలను పూర్తిచేశారు. పర్యటన మొత్తం వచ్చామా... వెళ్లామా అన్నట్టుగా సాగింది. పోలవరం కుడికాలువ పనుల విషయంలో అక్కడ ఎస్ఈ శ్రీనివాసయాదవ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం పర్యటనలోనే పోలవరం మండలం బంగారమ్మపేటలో ఒక గుడిసెలోకి పోలీస్ జీపు దూసుకు వెళ్లి ఒక వృద్ధురాలు మృతి చెందడంతో పాటు మరో వృద్ధురాలికి తీవ్ర గా యాలైన సంఘటనపై సీఎం స్పందించారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను పంపి సమస్య సద్దుమణిగేలా చేశారు. 45 నిమిషాలు ఆలస్యంగా సీఎం చంద్రబాబునాయుడు నిర్దేశించిన సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం ఉదయం 11.15 గంటల నరసాపురానికి చేరుకున్నారు. అక్కడ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం వలంధర రేవు, లలితాంబఘాట్, గోదావరి గట్టు మీదుగా కారులో ప్రయాణిస్తూ పుష్కర ఏర్పాట్లను గంటకు పైగా పరిశీలించారు. స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో 15 నిమిషాల పాటు పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన చంద్రబాబు మధ్యాహ్నం 1.40 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని భోజనం చేశారు. అనంతరం ప్రాజెక్టుకు చెందిన అతిథిగృహంలో అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై సమీక్ష జరిపి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 3.45 గంటలకు బయలుదేరి దేవరపల్లికి వెళ్లారు. ఎస్ఈపై ఆగ్రహం పోలవరం కుడికాలువ పనులను పరిశీలించిన చంద్రబాబుకు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు తనయురాలు పీసీఎల్ కంపెనీ ఎండీ వాణి బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. రూ. 15 కోట్లు చెల్లించవలసి ఉందని తెలిపారు. గతంలో చేసిన పనులకు రూ. 8 కోట్లు బకాయిలు రావలసి ఉన్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం ప్రాజెక్టు ఎస్ఈ బి.శ్రీనివాసయాదవ్‌ను పిలిచి మండిపడ్డారు. నీ సంగతి చూస్తాను.. తమాషాగా ఉందా.. నా దగ్గరకు రా అంటూ ఆదేశించారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పెదవేగి మండలం కొప్పులవారిగూడెం వద్ద పోలవరం కుడికాలువ పనులు పరిశీలించారు. జానంపేటలో రాత్రి ఏడున్నర గంటలకు కారులో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. 25లోగా చేయకపోతే కాంట్రాక్టు రద్దు ఈనెల 25లోగా పోలవరం కుడి కాలువ పనులు పూర్తి చేయకపోతే నీ కాంట్రాక్టు రద్దు చేస్తానని కాంట్రాక్టర్‌ను జానంపేటలో సీఎం హెచ్చరించారు. సీఎం కాంట్రాక్టర్‌ను నిలదీయడంతో ఆయన నీళ్లు నమిలారు. ఈ పుష్కరాలు చరిత్రలో నిలవాలి : సీఎం నరసాపురం అర్బన్ : 2015 పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే పెద్ద సంబరంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నరసాపురంలోని లయన్స్ క్లబ్ హాలులో పుష్కరాల నిర్వహణ, అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. పుష్కరాల అనంతరం ఉభయగోదావరి జిల్లాలు టూరిజం ప్రాంతాలుగా అవతరిస్తాయన్నారు. పుష్కరాల కోసం పశ్చిమగోదావరి జిల్లాకు రూ.550 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి స్నానఘట్టం వద్ద మల్టీ ఫంక్షనల్ బృందాలను ఏర్పాటు చేస్తామని, పుష్కర సిబ్బందికి డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నామని చెప్పారు. మంత్రులు పీతల సుజాత, పైడికొండల మణిక్యాలరావు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, ఎ.రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, గన్ని రామాంజనేయులు, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్రావు, ఎంఏ ఫరీఫ్ నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల పాల్గొన్నారు. -
జిల్లాలో నేడు ఎంపీ పర్యటన
వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిజామాబాద్‌కల్చరల్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి నిజామాబాద్‌కు 10 గంటలకు చేరుకుంటారని, అనంతరం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఆసుపత్రుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని నాయకులు తెలిపారు. బోధన్ మండలం భవానిపేటలో బోనాల పండుగలో, 12 గంటలకు బోధన్‌లో జరిగే జేఏసీ సమావేశంలో పాల్గొంటారని , సాయంత్రం 4 గంటలకు ధర్మారంలో పీఎంపీ అసోసియేషన్ భవన్‌కు శంకుస్థాపన చేస్తారని, 4.45 నిమిషాలకు నిజామాబాద్‌లోని రెడ్‌క్రాస్ సొసైటీలో కంపోనెంట్ యూనిట్‌ను ప్రారంభిస్తారని, 5.15 నిమిషాలకు నగరంలోని ఖలీల్వాడిలో లయన్స్ ఆసుపత్రి ప్రారంభిస్తారని , 5.45 నిమిషాలకు అదే ప్రాంతంలో ఈశ్వర్ గ్యాస్ట్రో ఆసుపత్రిని ప్రారంభిస్తారని వివరించారు. -
నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 7 గంటలకు సత్తుపల్లి మండలంలోని గంగారంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించనున్న ఆదర్శ గ్రామ సమీక్షకు ఎంపీ హాజరవుతారు. శనివారం ఉదయం 8 గంటలకు గంగారంలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు. -
ఆ వరాలన్నీ.. ఉత్త ఊరింపులేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వారాల్లో రెండోసారి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ కొన్ని హామీలిస్తున్న ఆయన వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టడం లేదనే విమర్శను ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చాక బాబు పలు సందర్భాల్లో జిల్లాకు ప్రకటించిన తాయిలాలు నోటి మాటలుగానే మిగులుతున్నాయి. జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్న బాబు వరాలు ఆచరణకు నోచుకోవడం లేదు. కేంద్రంలో తమ భాగస్వామ్యపక్షమే అధికారంలో ఉందని చెప్పుకోవడానికే తప్ప సమన్వయంతో జిల్లాకు ప్రయోజనం కల్పించే ప్రాజెక్టులు తీసుకురాలేకపోతున్నారని జిల్లావాసులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :చంద్రబాబు సీఎం అయ్యాక జిల్లాకు ఇచ్చిన వరాల్లో కాకినాడలో హార్డ్‌వేర్ పార్కు, తొండంగిలో జీఎంఆర్ పోర్టు ఏర్పాటు, కాకినాడలో యాంకరేజ్ పోర్టు అభివృద్ధి, కాకినాడలో ట్రిపుల్ ఐటీ, కాకినాడ ఎస్ఈజడ్, పెట్రో కారిడార్, పెట్రో యూనివర్సిటీ, కాకినాడ-రాజమండ్రి మధ్య ఇండస్ట్రియల్ కారిడార్, కోనసీమలో కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం, కడియంలో నర్సరీ రీసెర్చ్ సెంటర్, రాజమండ్రి సమీపాన ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ కొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వరాల జాబితా చాంతాడంత ఉంటుంది. అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్నా వీటిలో ఏ ఒక్కదాన్నీ ఇంతవరకు సాకారం చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు యువతకు ఆశలు కల్పించారు. అరుుతే ఇంతవరకూ జిల్లాలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం లేదా ఉపాధి కల్పించలేకపోయారంటున్నారు. శుక్రవారం జిల్లాకు పర్యటనకు వస్తున్న చంద్రబాబు ఇంతవరకు తాను ప్రకటించిన తాయిలాల రుచి చూపేలా చిత్తశుద్ధితో కూడిన కృషి సలపాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సాంకేతికంగా అనుమతులు సాధించాలని యువత కోరుకుంటోంది. పుష్కర పనుల్ని వేగవంతం చేయూలి.. గోదావరి పుష్కరాలను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పుష్కరాల పనుల ప్రగతి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పుష్కరాలకు 60 రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఆర్అండ్బి, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో పనులు మందకొడిగా నడుస్తున్నాయి. చివరకు రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పనులు కూడా ఆ బాపతుగానే ఉన్నాయి. పర్యవేక్షణకు కమిటీలపై కమిటీలు వేసినా పనులు మాత్రం ముందుకు కదలని వాస్తవంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని వేగవంతం చేయూల్సి ఉంది. -
గ్లోబరీనా ‘గోల్మాల్’పై ఆరా?
జేఎన్టీయూకే వీసీతో గవర్నర్ ప్రత్యేక భేటీ రూ.100 కోట్ల ఆ ఒప్పందంపైనే ప్రధాన చర్చ! దీనిపై గతంలోనే గవర్నర్‌కు సీపీఐ నేతల ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్ర గవర్నర్ ఎస్ఎల్ నరసింహన్‌తో జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్సలర్ వీఎస్ఎస్ కుమార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ రెండు రోజుల జిల్లా పర్యటన మంగళవారంతో ముగిసింది. తొలిరోజు సోమవారం రాజమండ్రిలో పుష్కర ఘాట్లను పరిశీలించి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ కాకినాడలో డాక్టర్ ఎస్వీఎస్ రావు కుమారుడి వివాహానికి హాజరయ్యూరు. అనంతరం ఆర్అండ్బి అతిథిగృహంలో బసచేశారు. కాగా మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్ ఒక్కరే ఒక ఫైల్ పట్టుకుని వడివడిగా ఆర్అండ్బి అతిథిగృహంలోకి వెళ్లారు. అలా వెళ్లిన వీసీ సుమారు అరగంట పాటు చాన్సలర్, గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఆ అరగంట చాన్సలర్, వైస్ చాన్సలర్ల మధ్య ఏం జరిగిందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరి మధ్య ఏకాంతంగా సాగిన ఆ అరగంట భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై వర్సిటీ వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. గత వీసీ తులసీరామ్‌దాస్ హయాంలో గ్లోబరినాతో కుదుర్చుకున్న ఒప్పందం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సుమారు రూ.100 కోట్ల ఈ ఒప్పందంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఒప్పందంలో అవకతవకలు జరిగాయని గతంలో జిల్లా నుంచి సీపీఐ నాయకుడు మీసాల సత్యనారాయణ, ఇటీవల సీపీఐ రాష్ట్ర నేత నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వీసీ వీఎస్ఎస్ కుమార్ గవర్నర్‌తో సమావేశం కావడంతో సహజంగానే ఈ అంశం చర్చకు వచ్చిందని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఆ ఒప్పందం వల్ల పరీక్షల ఫలితాలు సకాలంలో విడుదల కాక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనే వీసీ, గవర్నర్లు ప్రధానంగా చర్చించినట్టు భావిస్తున్నారు. ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి అనే దానిపై గవర్నర్ ఆరా తీశారని తెలుస్తోంది. ఫిర్యాదులు వస్తున్నట్టుగా రూ.100 కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న దానిలో వాస్తవమెంత, ఒప్పందానికి ముందు ఫలితాల విడుదలకు ఎంత సమయం పట్టేది, ఒప్పందం తరువాత ఎంత కాలం పడుతోంది, ఇందుకు కారణాలు ఏమిటి అన్నది గవర్నర్ వీసీని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన గవర్నర్ దీనిపై సమగ్ర సమాచారాన్ని కోరారని తెలుస్తోంది. పోస్టుల భర్తీపై సానుకూల స్పందన అలాగే వర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల విషయంలో ఇంతవరకు తీసుకున్న చర్యలు, పంపిన ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగిందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జేఎన్టీయూకే తొలిసారి నిర్వహించిన ఎంసెట్‌పై కూడా గవర్నర్ ఆరా తీశారు. ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఆర్టీసీ సమ్మె ప్రభావం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం మీద గవర్నర్ పర్యటనతో వర్సిటీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని వర్సిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గవర్నర్‌తో భేటీ విషయమై వీసీ వీఎస్ఎస్ కుమార్‌ను ‘సాక్షి’ సంప్రదించగా మర్యాదపూర్వకంగా జరిగిందని, ఎంసెట్ నిర్వహణపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసి ఎంసెట్ టీమ్‌కు అభినందనలు తెలియచేశారన్నారు. ఇతర విషయాలపై స్పందించ లేదు. గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు కోరుకొండ : జిల్లా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వెళ్లిన గవర్నర్ నరసింహన్ దంపతులకు మధురపూడి విమానాశ్రయంలో పలువురు ఘనంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్పైస్‌జెట్‌లో గవర్నర్ దంపతులు హైదరాబాద్ పయనమయ్యారు. వీడ్కోలు పలికిన వారిలో రాజమండ్రి సబ్‌కలెక్టర్ వి.విజయరామరాజు, రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ, అడిషనల్ ఎస్పీలు సిద్ధారెడ్డి, బి.శరత్‌బాబు, కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, సీఐ ఎన్.మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు ఎస్సై ఎం. కనకరావు తదితరులు ఉన్నారు. -
నేడు జిల్లాకు ఎంపీ కవిత రాక
నిజామాబాద్‌కల్చరల్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆమె ఉదయం 10 గంటలకు ఆర్మూర్ మున్సిపాలిటీలో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారని టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు మానిక్‌భండార్ గ్రామాన్ని సందర్శిస్తారని, 2 గంటలకు ఖలీల్వాడిలో ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం ప్రగతనగర్ వెళ్లి ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయత డాక్టర్ కేశవరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని, జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తారని, సాయంత్రం 5 గంటలకు బీసీ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరిస్తారని, 5.15 గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగే హరిదా రచయితల సంఘం ద్వితీయ మహాసభలో పాల్గొంటారని తెలిపారు. -
చంద్రబాబు రాక
నేడు జిల్లాలో ఏపీ సీఎం పర్యటన తెలంగాణలో మొదటి టూర్ కార్యకర్తలతో సుదీర్ఘ చర్చలు విజయవంతానికి నేతల ప్రయత్నం వరంగల్ రూరల్ : సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో మొదటి సారిగా జిల్లా పర్యటనకు వస్తున్నారు. గురువారం ఆయన రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆయనకు స్వాగతం పలికేందుకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 200 మందితో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించనున్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగే సభాస్థలికి మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాంగణంగా నామకరణం చేయనున్నారు. కాగా, టీడీపీ ప్రతినిధులతో జరిగే సభాస్థలిలో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చే కార్యకర్తలు ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసే కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకొన్న వారినే లోనికి అనుమతిస్తారు. ఉదయం 11.30 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం అవుతుంది. నియోజకవర్గాలవారీగా సమీక్ష జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఒక గంట పాటు చంద్రబాబు విరామం తీసుకుంటారు. అనంతరం ఆక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామియానాలో నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి దశ, దిశలను నిర్ధేశిస్తారు. అన్ని నియోజకవర్గాలతో సమీక్ష అనంత రం బాబు ఇక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం హెలీక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి ఇ నుగాల పెద్దిరెడ్డి, టీడీఎల్పీ పక్ష నేత దయాకర్‌రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, పార్టీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్ పర్యవేక్షించారు. కాగా, చంద్రబాబు పర్యట నను వీవీఐపీగా పరిగణించి జిల్లాలోని వివిధ ప్రధాన శాఖలకు చెందిన 14 మంది అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశరు. జిల్లా ఎస్పీతోపాటు డీఆర్వో, ఆర్డీవోలు, డీఅండ్‌హెచ్‌వో ఇతర అధికారులను వారివారి శాఖల పరంగా చేపట్టాల్సి చర్యలు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాహనాలకు పార్కింగ్.. వరంగల్ క్రైం : చంద్రబాబు పర్యటనకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబాబాద్, వర్ధన్నపేట నుంచి వచ్చే వాహనాలకు హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో, జనగామ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఏకశిల పార్కును, ములుగు, నర్సంపేట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పద్మాక్షమ్మ గుట్టవద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. -
సీఎం టూర్ ఆలస్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా పర్యటన మరికొన్ని రోజులు వాయిదా పడింది. నెలరోజులుగా ఊరిస్తున్న కేసీఆర్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వెంటనే పర్యటన వాయిదాపడటం ఆనవాయితీగా మారింది. తొలుత జనవరి 22వ తేదీన, తరువాత గత నెల చివరివారంలో సీఎం పర్యటన ఉంటుందని అందరూ భావించారు. పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తి చేశారు. ఆసరా పింఛన్లు, అర్హుల గుర్తింపు, పట్టాలు, నివాసస్థలాలు, మురికివాడల శుభ్రం ఇలా..పనులన్నీ చక్కబెట్టారు. మణుగూరు విద్యుత్‌ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేశారు. సీఎం జిల్లాకు రావాల్సిన సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరకు వెళ్లాల్సి రావడం, స్వైన్‌ఫ్లూ వ్యాప్తి, డెప్యూటీ సీఎం మార్పు ఇలా ఒకదానికి తర్వాత ఒకటి చోటుచేసుకోవడంతో సీఎం బాగా బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది. జనవరి 29న జిల్లాకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం త్వరలో సీఎం పర్యటన ఉంటుందని ప్రకటించారు. ప్రగతి నివేదికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. సీఎంకు రాష్ట్రస్థాయిలో సమీక్షలు, ఢిల్లీ పర్యటన ఉండటంతో ఈనెల మూడోవారం వరకు ఆయన జిల్లాకు వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండోవారంలో కాస్త వెసులుబాటు దొరికినా కేంద్ర బడ్జెట్ సమావేశాలపై పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా సీఎం పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సీఎం పర్యటన రెండో వారం తర్వాతే: జలగం వెంకట్రావు ‘ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరి రెండోవారంలోపు వచ్చే అవకాశం లేదు’ అని పార్లమెంటరీ కార్యదర్శి, సీఎంఓ ఇన్చార్జి జలగం వెంకట్రావు తెలిపారు. కొత్తగూడెంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు కాలేదన్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఈనెలలో ఖరారయ్యే అవకాశం ఉందని, అయితే ఏ తేదీల్లో పర్యటిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. -
అధికారులకు అదే భయం!
ప్రశాంత ‘పశ్చిమ’లో హాయిగా పనిచేసుకోవచ్చన్న మాట ఇప్పుడు అధికారులు మర్చిపోవాల్సిసిందే. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన పశ్చిమగోదావరి జిల్లాయే తనకు తొలి ప్రాధాన్యమంటూ చీటికీమాటికీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చేస్తుం డటం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. పైకి చెప్పేందుకు ఎవరూ సాహసించడం లేదు గానీ.. జిల్లా అధికార వర్గాల్లో చాలామంది సీఎం పర్యటన అంటేనే వణికిపోతున్నారు. ఈనెల 1న పోలవరం, ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు మూడు వారాలు తిరక్కుండానే పాదయాత్ర పేరిట ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో రెండు రోజుల పర్యటన చేశారు. పండగ సెలవులు, సరదాలను పక్కన పెట్టి మరీ అధికారులు, ఉద్యోగులు చేసిన పకడ్బందీ ఏర్పాట్ల మధ్య సీఎం పాదయాత్ర సాఫీగానే నడిచింది. కానీ.. ఆ పాదయాత్రతో చాలామంది అధికారుల ఒళ్లు పులిసిపోయింది. చంద్రబాబు 14, 15 కిలోమీటర్లు నడిచినా రూట్ మ్యాప్ సరిగ్గా ఉండేందుకు, బందోబస్తు పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు అంతకు రెట్టింపు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అధికారులు అంత కష్టపడితే.. బాబుకు సంఘీభావంగా నడవాల్సిన టీడీపీ నేతలు మాత్రం లైట్ తీసుకున్నారు. తన నియోజకవర్గంలోనే సీఎం యాత్ర కాబ ట్టి నిడదవోలు ఎమ్మెల్యే తప్పించి మిగిలిన ఎమ్మెల్యేలెవరూ కనీసమాత్రం నడవలేదు. పల్లీలు తింటూ ఓ ఎమ్మెల్యే, ఫొటోలకు ఫోజులిస్తూ మరో ఎమ్మెల్యే, కారులో కునుకు తీస్తూ మరొకరు గడిపేశారే గానీ అధినేతతో ఎవరూ పాదం కలపలేదు. అధికారులు మాత్రం సీఎం వెనుక పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు కాళ్లు బొబ్బలెక్కి రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి రాలేకపోయూరు. ఇలా చాలామందికి ఒళ్లు హూనంకాగా, త్వరలోనే సీఎం పర్యటన ఉందన్న సమాచారం అధికారలను కలవరపెడుతోంది. వచ్చే నెలలో జరగనున్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుమారుడి వివాహానికి సీఎం వస్తారని, ఆ సందర్భంగా ప్రభుత్వపరంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ‘ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం.. సీఎం మళ్లీ వస్తారా.. వామ్మో’ అని జిల్లా అధికారులు కంగారు పడిపోతున్నారు. మాణిక్యం ముచ్చట్ల వెనుక మర్మమేమిటో? సీఎం చంద్రబాబును రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అవకాశమొచ్చినప్పుడల్లా తెగ పొగి డేస్తున్నారు. టీడీపీ నేతలకంటే ఎక్కువగా మాణిక్యాలరావు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. దీనివెనుక చాలా విషయం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరగనున్న తన కుమారుడి వివాహం నేపథ్యంలో సీఎం రాక కోసం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ పొగడ్తలని కొందరు అం టున్నారు. మరోవైపు రాజకీయ అవసరాల నేపథ్యంలోనూ మాణిక్యాలరావు సీఎంను ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత సోము వీర్రాజుకు త్వరలో ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మద్దతు పుష్కలంగా ఉందని, ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ వద్దకు పవన్‌ను తీసుకువెళ్లిం ది కూడా ఆయనేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ మార్పుల్లో మాణిక్యాలరావుకు బదులు వీర్రాజుకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతోనే మాణిక్యాలరావు సీఎంకు సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ కండువా సరిచేసిన రెవెన్యూ అధికారి అందరూ కాదు కానీ.. కొంతమంది అధికారులు మాత్రం పచ్చచొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా హల్చల్ చేస్తుంటారు. ఈ బాపతుకే చెందిన ఓ రెవెన్యూ అధికారి ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మెడలోని టీడీపీ కండువాను సరి చేశారు. ‘సార్.. అలా కాదు. కండువా సరిగ్గా కనపడేలా వేయండ’ంటూ మడతలు పడిన కండువాను సరి చేసి వెళ్లారు. పోనీలే.. ఆ అధికారి కండువా వేసుకోలేదు కదా అని సర్దుకుంటారా.. అరుుతే ఓకే. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
సీఎం పర్యటన రద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన రద్దయ్యింది. గురువారం ఆయన హైదరాబాద్‌కు నుంచి కామారెడ్డికి హెలిక్యాప్టర్ ద్వారా చేరుకొని వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఆదిలాబాద్ జిల్లాకు వె ళ్లాల్సి ఉంది. ఈ మేరకు ముఖ్యమం త్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి కె.వెంకటనారాయణ కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులకు బుధవారం సాయంత్రం సమాచారమందించారు. అయితే, చివరి నిమిషంలో సీఎం కామారెడ్డి పర్యటన రద్దయినట్లు సీఎంఓ నుంచి రాత్రి అత్యవసర సమాచారం వచ్చింది. అంతకు ముందు కేసీఆర్ పర్యటన కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నాలుగైదు రోజులుగా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, విద్య, వైద్య ఆరోగ్య, గృహ నిర్మాణ, వ్యవసాయ తదితర శాఖలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ రొ నాల్డ్‌రోస్, ఎస్పీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారుల తో సమీక్ష సమావేశాలు కూడ నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉ దయం 10.45 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పా టు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చేరుకోవాల్సి ఉంది. డిగ్రీ కళాశాల ఆవరణలో హె లిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ది, జిల్లా ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపేందుకు వీలుగా పార్శి రాములు కళ్యాణమండపంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సీఎం పర్యటన రద్దయినట్లు సమాచారమందింది. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం, ఉన్నతాధికారుల సమీక్షలతో బిజీబిజీగా గడిపిన సీఎం, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో పర్యటన రద్దు చేశారని భావిస్తున్నారు. -
సీఎం పర్యటన వాయిదా
తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో..? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 22, 23 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని భావించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయని, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తెలిపారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 22, 23 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని భావించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో ఆయన పర్యటన వాయిదా పడిందని, తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయని, తేదీలు ఇంకా ఖరారుకాలేదని పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తెలిపారు. సీఎం జిల్లాలోని ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని తొలుత భావించిన అధికారులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నెల 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నాగోబా జాతర జరగనుండటంతో దానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. సీఎం ఫిబ్రవరి మొదటివారంలో జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని, ఏ తేదీన వస్తారు?, ఎన్ని రోజులు ఉంటారనే విషయం ఇంకా ఖరారు కాలేదని పార్లమెంటరీ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాల ఇన్చార్జి జలగం వెంకటరావు విలేకరులకు తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు సర్వసన్నద్ధం అవుతూనే ఉన్నారు. సోమవారం నుంచి జిల్లా కేంద్రంలోని 17 మున్సిపల్ రెవెన్యూ వార్డులలో ఆసరా పింఛన్లు మంజూరు కాని వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డుల అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందుకు 17మంది జిల్లా అధికారులను ఖమ్మం నగరంలో ప్రాంతాల వారీగా నియమించారు. సీఎం పర్యటన ఫిబ్రవరి మొదటివారంలో ఖాయమని తెలుస్తోంది. -
వైద్యుల పక్షమే..!
సాక్షి, మంచిర్యాల : జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో రాత్రి బస చేసి న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య ప రోక్షంగా వైద్యులకే మద్దతు తెలిపారు. అవినీతిమయమైన మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేసేందుకు లంచం అడిగి శిశువు మృతికి కారణమైన వైద్యురాలిపై విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. ఆస్పత్రిలో పడకేసిన వైద్యం గురించి మంగళవారం పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆస్పత్రి నుంచి బయల్దేరే ముందు విలేకరులతో మాట్లాడారు. పారిశుధ్యం.. సెక్యూరిటీ.. పలు విభాగాల నిర్వహణపై ప్రసంశల జల్లు కురిపించారు. హైదరాబాద్ తర్వాత ఇక్కడే మూడు వేల యూనిట్ల బ్లడ్ స్టోరేజీ సౌకర్యం ఉండడం విశేషమన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది రూ.100, రూ.200 అడిగితే అది తప్పు కాదన్నారు. సమయపాలన పాటించాలని వైద్యులను సున్నితంగా మందలించారు. చికిత్స పేరిట రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. తప్పుడు రిపోర్టులు ఇస్తున్న వ్యాధి నిర్ధారణ కేంద్రాలు.. అనుమతి లేని ఆస్పత్రులపై చర్యల విషయాన్ని మంత్రి ప్రస్తావించలేదు. ‘ప్రైవేట్’ దోపిడి గురించి మీడియా మంత్రి వివరణ కోరగా.. డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ. 3.15 కోట్లతో అభివృద్ధి పనులు.. జిల్లావ్యాప్తంగా అన్ని ఏరియా, సామాజిక ఆస్పత్రులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.3.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి రాజయ్య తెలిపారు. జైపూర్‌లో రూ.40 లక్షలు, ఇచ్చోడలో రూ.55 లక్షలు, గుడిహత్నూర్‌లో రూ.50 లక్షలు, ఆదిలాబాద్‌లోని భీంపూర్, తిర్యాణిలో రూ.40 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. రూ.11 కోట్లతో ఆసిఫాబాద్ ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వెంట.. మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, వైద్యారోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ నాగేశ్వరరావు, కలెక్టర్ జగన్మోహన్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానం ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు.. మంచిర్యాల టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో వైద్యులు కానీ సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని ఉప ముఖ్యమంత్రి రాజయ్య హెచ్చరించారు. రాత్రి సమీక్ష సమావేశంతోపాటు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేస్తామన్నారు. వైద్య శాఖలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిపి అవినీతికి స్థానం లేకుండా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రాత్రి సమీక్ష సమావేశం అనంతరం ఒంటి గంటకు భోజనం పూర్తి చేసి ఆస్పత్రిలో మరోసారి పర్యవేక్షణ జరిపారు. నైట్ డ్రెస్ ధరించి ఆస్పత్రి ఆవరణలో కలియతిరిగారు. తాను వచ్చింది నిద్రావస్థలో ఉన్న వైద్య వ్యవస్థను మేల్కొల్పడానికని అందుకే తాను నిద్రపోను.. ఎవ్వరినీ నిద్ర పోనివ్వను అంటూ స్పష్టం చేశారు. దాదాపు గంటపాటు ఆస్పత్రిలో రోగులను పరిశీలిస్తూ.. పరీక్షిస్తూ వార్డులో తిరిగారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో తనకు కేటాయించిన ప్రత్యేక గదికి వెళ్లారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో గది నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఆస్పత్రిలోని సిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. 6.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో మార్చురీ వైపు ఖాళీ ప్రదేశంలో మామిడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఆర్డీవో అయేషా మస్రత్ ఖానమ్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రుక్మిణమ్మ, మంచిర్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావు పాల్గొన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో సన్మానం... ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతమంచిర్యాలలోని ఐఎంఏ భవన్లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సాల్మన్‌రాజ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిప్రసాద్, సీనియర్ వైద్యులు ఎన్.మల్లేశ్, ఫణికుమార్, రమణ, ఉదయ్‌కుమార్, అన్నపూర్ణ, సమత, జయలలిత, సుమబిందు, డ్రగ్గిస్ట్, కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు మోటూరి చంద్రశేఖర్, తొగరు సుధాకర్, రావుల రాజశేఖర్ పాల్గొన్నారు. -
4.35 గంటలు సీఎం ఉండే సమయం
⇒ రింగు రోడ్డు కోసం ఏరియల్ సర్వే ⇒ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సాక్షి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముచ్చటగా మూడో సారి జిల్లాలో పర్యటించనున్నారు. ఇదివరకు రెండు సార్లు జిల్లాకు వచ్చినప్పటికీ... సాంస్కృతిక కార్యక్రమాలకే ఆయన పర్యటన పరిమితమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్షించేందుకు మరోసారి రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానానికి ఉదయం 11:30 గంటలకు సీఎం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4:05 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. మొత్తం మీద నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలపాటు జిల్లాలో సీఎం పర్యటన ఉంది. ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి ఉదయం 11:30 గంటలకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వేతో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభం కానుంది. వరంగల్ నగరం చుట్టూ రింగురోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాలను అరగంట పాటు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్న భోజనం ముగించుకున్న తర్వాత 3:10 గంటలకు చింతగట్టు సమీపంలో జయగిరి వద్ద టెక్స్టైల్స్ పార్కు నిర్మాణం కోసం ప్రతిపాదిస్తున్న స్థలాన్ని పరిశీలించనున్నారు. సాయంత్రం 4.05 గంటలకు ఆర్ట్స్ కాలేజీ చేరుకుని హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. నగరాభివృద్ధిపై గంపెడాశలు వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి గతంలో అనేక సార్లు హామీలు ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఇటీవలే నగర రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు సీఎం పర్యటనలో నగరాభివృద్ధిలో భాగమైన పలు కీలక ప్రాజెక్టుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. నగరాభివృద్ధికి సంబంధించి వివిధ పనులకు రూ. 2,500 కోట్ల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు గతంలోనే రూ. 1,600 కోట్లతో అధికారులు డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకానికి అంకురార్పణ జరగకముందే నగరంలో మంచినీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు రూ.411 కోట్లతో ప్రణాళికలు, మిగిలిన నిధులతో కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, జంక్షన్లు తదితర మౌలిక సదుపాయల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇటీవల నగరంలో విలీనమైన గ్రామాల్లో మౌలిక సదుపాయలను మెరుగుపరిచేందుకు రూ.150 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధుల లేమి కారణంగా ఈ పనులు ప్రారంభం కాలేదు. వరంగల్ నగరంలో ఉన్న ప్లానెటోరియంలో ప్రొజెక్టర్ పాడైపోవడంతో నాలుగేళ్లుగా మూతపడి ఉంది. ఈ మేరకు ప్లానెటోరియం పునః ప్రారంభానికి సీఎం కేసీఆర్ చొరవ చూపించాల్సిందిగా జిల్లా ప్రజలు కోరుతున్నారు. వీటితోపాటు హాంటర్ రోడ్డులో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన సైన్స్ సెంటర్, కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ఏడాది కాలంగా ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నాయి. అస్తవ్యస్తంగా నగర పాలన నగరపాలక సంస్థలో అస్తవ్యస్తంగా మారిన పాలన, వేళ్లూనుకున్న అవినీతిపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు. అన్ని కార్పోరేషన్లలో ఈ- టెండర్ల విధానం కొనసాగుతుండగా... ఇక్కడ బాక్స్ టెండర్లు పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన కార్పొరేషన్-మన ప్రణాళికను అధికారులు సిద్ధం చేసిన తీరు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని డిప్యూటీ సీఎం రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ... వారిలో ఎటువంటి మార్పు రాలేదు. సమగ్ర కుటుంబ సర్వేను సైతం పూర్తి స్థాయిలో చేపట్టలేక నగర ప్రజలను కార్పొరేషన్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారు. గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్‌సిటీ కార్యక్రమం నిర్వహణలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది. సేకరించిన పొడి చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోయినా... పట్టించుకునేవారు కరువయ్యారు. కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకుంటున్న సిబ్బంది ఇతర పనుల్లో నిమగ్నమైన పట్టించుకునేవారు కరువయ్యారు. ఆఖరికి డివిజన్ల పునర్విభజన సైతం సకాలంలో చేయలేక బల్దియా విమర్శలపాలైంది. సీఎం ఇక్కడకు రానున్న నేపథ్యంలో నగరంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తారని ప్రజలు గంపెడాశతో ఉన్నారు. -
త్రిసభ్య కమిటీ బృందం పర్యటన
శంకరభారతీపురం ఉన్నతపాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై పరిశీలన నరసరావుపేట రూరల్: సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ బృందం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం లింగంగుంట్ల కాలనీలోని శంకరభారతీపురం ఉన్నత పాఠశాలను సందర్శించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల పరిశీలనలో భాగంగా నరసరావుపేట విచ్చేసింది. బృందసభ్యులు గుప్తా, వి.శర్మ, వెంకటేశ్వరరావులతోపాటు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి ఆయా వివరాలను తెలియచేశారు. ఉన్నతపాఠశాలకు వచ్చిన బృందం పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎస్.ఆర్.కె. ప్రసాద్ వివరాలు తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా ఉన్న మరుగుదొడ్లను బృంద సభ్యులకు హెచ్ఎం చూపించారు. విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇవి ఏవిధంగా సరిపోతున్నాయంటూ వారు హెచ్ఎంను ప్రశ్నించారు. నూతనంగా మరో 12 మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు సమాధానమిచ్చారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను కూడా వారు పరిశీలించారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తరగతి గదికి అందుబాటులో మంచినీళ్ల క్యాన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ నేతలు, శాస్త్రవేత్తలు విగ్రహాలను చూసిన బృంద సభ్యులు మెచ్చుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణపై బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తంచేశారు. బృందం వెంట సర్వశిక్ష అభియాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.నరసింహులు, డిప్యూటీ ఈఈ ఏఎల్ఎన్ ప్రసాద్, ఏఈ బీవీ నాగేశ్వరరావు ఉన్నారు. -
నేడు జిల్లాకు తుమ్మల
⇒ మంత్రి హోదాలో తొలిసారి రాక ⇒ఏజెన్సీ నుంచే మొదటి పర్యటన ⇒అభివృద్ధిపై అధికారులతో సమీక్ష ⇒అధికార యంత్రాంగం సమాయత్తం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ర్ట మంత్రిగా మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు తొలిసారి గురువారం జిల్లాకు రానున్నారు. దశాబ్దకాలం తర్వాత మంత్రిహోదాలో జిల్లాలో పర్యటించనున్న తుమ్మలను స్వాగతించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆయన్ను ఘనంగా స్వాగతించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండురోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్న తుమ్మల తొలిరోజు భద్రాచలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రంలో రెండరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సంక్షమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. సమీక్షలో...! ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమీక్ష సమావేశంలో సీఎం పర్యటన ప్రాధాన్యాలు, ఏయే ప్రాంతంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు, శంకుస్థాపనలు తదితర అంశాలపై చర్చించనున్నారు. జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఆసరా పెన్షన్లు, పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. జిల్లా అభివృద్ధే లక్ష్యం..ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా అధికారులకు తుమ్మల హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్అండ్బీ, ఎక్సైజ్, రవాణా, డ్వామా, మున్సిపల్, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, బీసీ వెల్ఫేర్, విద్య, వైద్యం, వ్యవసాయ శాఖలకు సంబంధించిన అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకుంటున్నారు. మంత్రి తన తొలి పర్యటనను అత్యంత మారుమూల ప్రాంతమైన వాజేడు నుంచి ప్రారంభిస్తుండటంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భద్రాచలం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 2003లో గోదావరి పుష్కరాలప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల, 2015లో మళ్లీ అదే హోదాలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్షిస్తారు. అధికారుల ఉరుకులు పరుగులు జిల్లాలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు మరోమారు రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటన, వివిధశాఖల పనితీరుపై సమీక్షించనున్న నేపథ్యంలో అధికారుల్లో హైరానా నెలకొంది. ఆహారభద్రత కార్డులు, ఆసరా పెన్షన్లలో నెలకొన్న అస్తవ్యస్తతపై ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉండటంతో ఆందోళన పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఇప్పటికే ఆయా శాఖల ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల అధికారులు ఆహారభద్రత కార్డులకు సంబంధించి మండలాలవారీగా ప్రగతి నివేదికలు, గతంలో ఉన్న కార్డులు, ప్రస్తుత కార్డుల వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. మణుగూరు పవర్‌ప్లాంట్‌పై జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. పౌరసరఫరాల డీఎం, మార్కెటింగ్ ఏడీలు రైతు సంక్షేమంపై చేపడుతున్న కార్యక్రమాలు, పత్తి, వరి, మొక్కజొన్న తదితర కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర, తదితర అంశాలతో నివేదికను రూపొందిస్తున్నారు. జిల్లాలో భూ సంబంధ సమస్యలు, కోర్టు కేసుల వివరాలు తదితర నివేదికలను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో రోడ్ల నిర్మాణం, వ్యయం తదితర అంశాలపై మంత్రి ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తారని ఆర్అండ్బీ అధికారులు భావిస్తూ.. అప్రమత్తమవుతున్నారు. మంత్రి పర్యటన ఇలా... * 18వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బేగంపేట ఏయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరుతారు. * ఉదయం 10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుంటారు. భద్రాచలంలో రెండో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. * మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 12.30 గంటలకు వాజేడు చేరుకుంటారు. అక్కడ గోదావరి నదిపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జిని పరిశీలిస్తారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. * మధ్యాహ్నం 3 గంటలకు వాజేడు నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం చేరుకుని రాత్రి బస చేస్తారు. * శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. * 10.30 గంటలకు కలెక్టరేట్ లేదా జడ్పీలో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్న అధికారులు మంత్రి తుమ్మల హెలికాప్టర్లో రానున్న దృష్ట్యా ఆయన పర్యటించే ప్రాంతాల్లో హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. గురువారం భద్రాచలం చేరుకుంటారు కాబట్టి అక్కడి టుబాకో బోర్డు వద్ద హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. వాజేడు, జనగాలపల్లి, ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియంలో ఆర్అండ్బీ అధికారులు హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. -
నిరసనల భయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటనకు నిరసనల భయం వెంటాడుతోంది. దీంతో అటు జిల్లా అధికారులు ... ఇటు టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ సమావేశంలోనే రైతులకు రుణవిముక్తి కార్డులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రుణమాఫీ పొందిన రైతులకు అందించనున్నారు. రైతులతోపాటు పింఛన్‌దారులు, ఇసుక రీచ్‌లపై డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం జిల్లా అభివృద్ధికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రైతుల రుణమాఫీతోపాటు ఇటీవల జరిగిన జన్మభూమి -మా ఊరు కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ విలేజ్ తదితర అంశాలపై చర్చిస్తారు. అయితే జిల్లాలో మూడోవంతు రైతులకు మాత్రమే రుణమాఫీ అందింది. దీంతో రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఈ సభకు పూర్తిగా తెలుగుదేశం సానుభూతిపరులైన రైతులను మాత్రమే తీసుకురావాలని మండల నేతలకు, అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో పంట రుణాలు మూడు వేల కోట్ల రూపాయలకుపైగా ఉన్నాయి. ఇప్పుడు మాఫీ అయింది కేవలం రూ. 376 కోట్లు మాత్రమే. జిల్లాలో మొత్తం ఏడు లక్షల ఆరు వేల మంది ఉండగా, అందులో మొదటి దశలో మూడు లక్షల 31 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తింప చేశారు. వీరికి రూ. 1420 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా అందులో కేవలం రూ.376 కోట్లు మాఫీ అయ్యాయి. రెండో దశలో మూడు లక్షల 77 వేల మంది ఉండగా అందులో కేవలం 51 వేల మందికి మాత్రమే అన్ని వివరాలు అప్లోడ్ అయ్యాయి. ఇంకా రెండు లక్షల 32 వేల మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయన్న ఉద్దేశ్యంతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత వారిని అదుపులోకి తీసుకునే అవకావం ఉంది. మరోవైపు సీఎం సభకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలల బస్సులను రవాణాశాఖ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. -
15న జిల్లాకు సీఎం?
విజయనగరం కంటోన్మెంట్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారని తెలిసింది. ఈనెల 15న ఆయన జిల్లాలో పర్యటించనున్నారని పలు వర్గాలు వెల్లడించాయి. జిల్లా పర్యటనలో భాగంగా పార్వతీపురం డివిజన్లో ఆయన పర్యటించే అవకాశముందని అంటున్నారు. దీనిపై జేసీ రామారావును వివరణ కోరగా ఇంకా కార్యక్రమం ఖరారు కాలేదని తెలిపారు. -
నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
ఖమ్మం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి రెండు రోజు లపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జూలూరుపాడులో ఓ పెళ్లి వేడుకలో పొంగులేటి పాల్గొంటారు. అనంతరం సత్తుపల్లి కళాభారతి ఆడిటోరియంలో జరిగే డ్యాన్స్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఆదివారం ఉద యం 10.30 గంటలకు కొత్తగూడెంలో ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాల్వంచలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు కొత్తగూడెంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. -
నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం : ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు జిల్లా పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు పెనుబల్లిలో సాయిరాం హాస్పిటల్‌ను ఎంపీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే ఇంటర్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాత్రి 7గంటలకు వైరా మండలంలోని కామిశెట్టి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి రంగస్థల నాటకోత్సవాల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు చండ్రుగొండ మండలంలోని మద్దుకూరు వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 10 గంటలకు కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జరిగే అధికారుల సమీక్ష సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 6 గంటలకు నగరంలోని 32వ డివిజన్లో మినీవాటర్ స్కీమ్ ఫౌండేషన్ స్టోర్‌ను ఆయన ప్రారంభిస్తారు. -
అదిరిందయ్యా...రాజయ్య!
పంచకట్టుతో ఆకట్టుకున్న డిప్యూటీ సీఎం సాక్షి, సంగారెడ్డి: నిత్యం ప్యాంటు, షర్టుతో కనిపించే డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య జిల్లా పర్యటనలో కొత్త లుక్‌తో అదరగొట్టారు. సోమవారం సంగారెడ్డి పర్యటనకు వచ్చిన ఆయన తెల్ల పంచె, జుబ్బా ధరించి వచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ అతిథిగృహానికి వచ్చిన ఆయనను చూసిన టీఆర్ఎస్ నేతలు పోల్చుకోలేకపోయారు. ‘సార్.. పంచెకట్టులో అదిరిపోయారు అంటూ’ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పలువురు నేతలు డిప్యూటీ సీఎం రాజయ్యకు కితాబు ఇవ్వటంతో ఆయన నవ్వి ఊరుకున్నారు. పంచెకట్టుపై విలేకరులు రాజయ్యను ప్రశ్నించగా ‘డిప్యూటీ సీఎం హోదాలో ప్యాంటు, షర్టు వేసుకుంటే చిన్నవాడిగా కనిపిస్తున్నా.. కొంచెం పెద్దరికం కనిపించేందుకు పంచెకట్టుకున్నా.. బావుందా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. -
17న సీఎం చంద్రబాబు రాక!
ఏలూరు, ఉండి నియోజకవర్గాల్లో పర్యటన ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 17న జిల్లా పర్యటనకు రానున్నారు. షెడ్యూల్ అధికారికంగా ఖరారు కానప్పటికీ, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. చంద్రబాబు ఈనెల 17న జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఏలూరులో నిర్మించిన ఎన్జీవో హోమ్‌ను ఆ రోజు సీఎం ప్రారంభిస్తారని చెబుతు న్నారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీ చేసే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడతారని సమాచారం. అనంతరం చంద్రబాబు ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కలవపూడిలో జరిగే జన్మభూమి- మా ఊరు గ్రామ సభలో పాల్గొంటారు. చినకాపవరం వద్ద డెల్టా ఆధునికీకరణ పనులకు శంకుస్థ్ధాపన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ కాళ్ల మండలంలో శుక్రవారం పర్యటించి, సీఎం పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. -
సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం కంటోన్మెంట్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 11న జిల్లా పర్యటనకు రానున్న దృష్ట్యా అధికారులంతా సమాయత్తం కావాలని కలెక్టర్ ఎంఎం నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి బలిజిపేట, గుర్ల గ్రామాల్లో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొననున్నట్టు సమాచారం అందిందన్నారు. ఎస్పీ బందోబస్తు నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ప్రొటోకాల్, ఆహ్వాన పత్రికలను చూడాలన్నారు. వేదిక ఇన్చార్జిగా డ్వామా పీడీ గోవిందరాజులు, గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు అలంకరణ, సోఫాలు, ప్లెక్సీల వంటి వాటిని చూడాలన్నారు. బారికేడింగ్, హెలీపాడ్ తదితర అంశాలు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నిరంతర విద్యుత్ ఉండేలా విద్యుత్ శాఖాధికారులు చూడాలని, అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జన్మభూమిలోని ప్రాధాన్యతాంశాలను సంబంధిత శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. చక్కని ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్య ప్రణాళికాధికారి అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత గ్రామ, మండల, జిల్లా ప్రొఫైల్స్‌తో నోట్సును తయారు చేయాలని సూచించారు. బెల్టు షాపులు లేకుండా చూడాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. అవసరమైన వాహనాలుండాలని ఆర్టీఓ అబ్దుల్ రవూఫ్‌ను,మందులతో 104 వాహనం, వైద్యులు సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మికి ఆదేశించారు. ఆహార తనిఖీలకు సిద్ధంగా ఉండాలని ఫుడ్ తనిఖీ అధికారులను ఆదేశించారు. పాత్రికేయులకు ఇబ్బంది కలగకుండా అక్రిడేటెడ్ వారికి పాసులు ఏర్పాటు చేయాలని సమాచార శాఖ ఏడీ జాన్సన్ ప్రసాద్‌కు ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సమయం తక్కువ ఉన్నందున ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్, జేసీ రామారావు, సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఏఎస్పీ రమణ, ఏజేసీ నాగేశ్వరరావు, విజయనగరం, బొబ్బిలి డీఎస్పీలు శ్రీనివాసరావు, ఇషాక్ అహ్మద్‌తో పాటు అధికారులంతా పాల్గొన్నారు. -
అధికార యంత్రాంగం.. జనసమీకరణం
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అధికారిక ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగం బాధ్యత. జనసమీకరణ ఏర్పాట్లను అధికార పార్టీ నేతలే చూసుకుంటారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు కాగా.. అధికారిక ఏర్పాట్లతోపాటు జనసమీకరణ బాధ్యత కూడా జిల్లా అధికారుల పైన రుద్దారు. దాంతో ఆ ఏర్పాట్ల కోసం వారు మల్లగుల్లాలు పడుతున్నారు. బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి విలేకరులను కూడా అనుమతించకుండా జనసమీకరణపైనే ప్రధానంగా చర్చించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జన సమీకరణకు ఏ శాఖ ఎంత ఖర్చు చేయాలి, ఎవరు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేయాలి, ఏ శాఖ ఎంతమంది జనాన్ని తరలించాలి.. తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది. మొదటిరోజు నరసన్నపేటలో జరిగే రైతు సదస్సుకు 25 వేల మంది రైతులను, అనంతరం శ్రీకాకుళం వరకు జరిగే రోడ్డుషోకు వేలమంది జనాన్ని పోగేయాలని నిర్దేశించారు. ఇక రెండోరోజు రణస్థలంలో జరిగే మహిళా సంఘాల సమావేశానికి 30 వేలకు తక్కువ కాకుండా మహిళలను తరలించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సమాచారం. రైతు సదస్సుకు 400 బస్సులు, మహిళా సదస్సుకు 500 బస్సులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. రైతుల సమీకరణ బాధ్యతను డ్వామా పీడీకి, మహిళల సమీకరణ బాధ్యతను డీఆర్డీఏ పీడీకి అప్పగించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీల విషయంలో టీడీపీ ప్రభుత్వం సాచివేత విధానం అనుసరిస్తుండటం పై ఆయా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ తరుణంలో వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను అధికార పార్టీ నేతలు తెలివిగా అధికారులపైకి నెట్టేశారు.జన సమీకరణలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పర్యటన ఇలా... తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఈ నెల 17న ఉదయం హెలికాప్టర్లో నరసన్నపేటకు చేరుకుంటారు. అక్కడ రైతు సదస్సులో పాల్గొని, అనంతరం రోడ్‌షో ద్వారా శ్రీకాకుళం చేరుకుంటారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత జిల్లా పరిషత్ లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. రాత్రి శ్రీకాకుళం ఆర్అండ్బీ అతిధి గృహంలో బస చేస్తారు. 18న ఉదయం కలెక్టరేట్ సమీపంలో ఉన్న డచ్ బంగ్లా వద్ద పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి పైడిభీమవరం వెళ్లి వీకేపీ ఫార్మాలో కొత్త యూనిట్లకు ప్రారంభ, శంకుస్థాపనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రణస్థ లం చేరుకొని మహిళా సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళతారు. -
4 గంటలు 40 వరాలు
అద్దంలా కరీంనగర్... ఎల్ఎండీలో బృందావన్ గార్డెన్ సాక్షి, కరీంనగర్: నాలుగు గంటలు.. నలభై నిర్ణయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన విజయవంతమైంది. సీఎం హోదాలో మంగళవారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నాలుగు గంటల పాటు సంక్షేమ పథకాలపై కలెక్టరేట్లో అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించి.. 40 నిర్ణయాలు తీసుకోవడం విశేషం. జిల్లాల సమీక్ష ల్లో భాగంగా మొదట కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సంక్షేమంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ ఆవశ్యకతను వివరించారు. సమీక్షలో తీసుకున్న పలు నిర్ణయాలను వెంటనే అమలు చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘కరీంనగర్‌ను అద్దం తునకలా తయారు చేస్తాం. ప్రజలు ఊహించని విధంగా లండన్, న్యూయార్క్ మోడల్లో నగరాన్ని అభివృద్ధి చేస్తాం. రింగ్‌రోడ్లు, ఫోర్ లేన్ రహదారులు.. అవసరమైతే కొన్ని భవనాలు కూలగొట్టి రోడ్లు విస్తరిస్తాం. లోయర్ మానేర్ డ్యామ్ ప్రాంతాన్ని మైసూర్‌లోని బృందావన్ గార్డెన్‌లా మారుస్తాం. ఎగువన మిడ్ మానేరు, వరద కాల్వ, ఎస్సారెస్పీ ఉండటంతో ఖాళీ అయిన కొద్దీ నీరు నిండే అవకాశముంది. అందుకే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఎల్ఎండీ పరిసరాల్లో ఎస్సారెస్పీకి సంబంధించి మొత్తం 207 ఎకరాల స్థలం ఉంది. అందులో 107 ఎకరాలు వేరే వాళ్లకు అలాట్ చేశారు. వాటన్నింటినీ రద్దు చేసి మరో చోటు కేటాయిస్తాం. అవసరమైతే డ్యామ్ చుట్టూ మరింత స్థలం సేకరిస్తాం. డ్యామ్‌లో బోటింగ్, బోటింగ్ రెస్టారెంట్, నీటిలో తేలియాడుతూ చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా డిన్నర్ క్రూజింగ్ బోట్లను ఏర్పాటు చేస్తాం. పర్యాటకులు విడిది చేసేందుకు వీలుగా అందమైన విల్లాస్ నిర్మిస్తాం’ అని హామీ ఇచ్చారు. వేములవాడ, కొండగట్టు, ఎలగందుల కోటను ఇదే తీరుగా పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. హనుమాన్ భక్తుల రద్దీ ఉండే కొండగట్టు చుట్టుపక్కలా 300 ఎకరాల ప్రభుత్వ స్థలాలున్నాయని... తిరుపతి స్థాయిలో అక్కడ కాటేజీలు, విల్లాలు నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్లో ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి బాగా లేనందున ఆరేడు అంతస్తుల భవనాలు నిర్మించి జెడ్పీ, కలెక్టరేట్, మున్సిపల్ కమిషనర్, కళాభారతీలను ఆ కాంప్లెక్స్‌కు తరలిస్తామని కేసీఆర్ చెప్పారు. కరీంనగర్లో మరో ట్రాఫిక్ సీఐ పోస్టు మంజూరు, ఇండోర్ స్టేడియంతో పాటు మరో రెండు సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు బతుకమ్మ ఆడే మానకొండూరు చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిని నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేసి, జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో వసతుల కల్పన, ఆపరేషన్ థియేటర్లలో పరికాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ ఇస్తామన్నారు. ఇందులో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ కేటాయిస్తామన్నారు. పెద్దపల్లిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు, హుస్నాబాద్‌లో ఉన్న 35 పడకల ఆస్పత్రిని 55 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంథనిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు స్థల సేకరణ కోసం ఆదేశించారు. రామగుండంలో మైనింగ్ పాలిటెక్నిక్, మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నగరానికి తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ పరిధిలో ఎతైనా ప్రాంతాలకు తాగునీరందించేందుకు చిన్న లిఫ్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రాయికల్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మిస్తామన్నారు.జిల్లాలో రైతులకు రావల్సిన ఇన్‌ఫుట్ సబ్సిడీ వెంటనే అందిస్తామన్నారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నారు. బెజ్జంకి, కోహెడతో పాటు మరో ఆరేడు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు భూ నిర్వాసితులకు రావల్సిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. పెద్దపల్లిలో నిర్వహిస్తున్న కమాన్‌పూర్ మార్కెట్ యార్డును కమాన్‌పూర్‌కు తరలించేందుకు నిర్ణయం. పెద్దపల్లి పట్టణం, మండలానికి తాగునీరందించేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణంతో పాటు హుస్సేనిమియా వాగుపై మూడు చెక్‌డ్యాంలు ఏర్పాటుకు నిర్ణయం.మానేరు నదిపై కమాన్‌పల్లి, భూపాలపల్లిని కలుపుతూ వంతెన నిర్మాణం. రాయికల్ మండలం బోర్నపల్లిలో గోదావరినదిపై రూ.70 కోట్లతోబ్రిడ్డి నిర్మాణం. హౌసింగ్ బాగోతం అంతా తెలుసు సమీక్షలో.. హౌసింగ్‌లో జరిగిన అవినీతిపై పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తావించగా.. స్పందించిన కేసీఆర్ హౌసింగ్ భాగోతం అంతా మా దృష్ట్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉంటుందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పుటకు ముందుకు వస్తున్నారని తెలిపారు. సింగరేణిలో లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశముందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు, గ్రామంలో 33 వేల మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ , జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, కరీంనగర్ నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు,ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన విజయవంతం చేయాలి
మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ రూరల్: సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, ఎస్పీ ప్రవీణ్, ఏఎస్పీ కిషోర్, డీసీపీ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డుమా పీడీ శ్రీరాములునాయుడులతో సమావేశమయ్యారు. సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 30 , 31 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రతీ వేదిక వద్ద సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రజలతో ఎక్కువగా మమేకమవుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశమున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పర్యటన ఇలా సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కానప్పటికీ ఈ నెల 30న ఉదయం స్పైస్‌జెట్ విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి నేరుగా అనకాపల్లి బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి, చోడవరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి అనకాపల్లిలో బసచేసి మరుసటి రోజు కశింకోట, యలమంచిలి, నక్కపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. సాయంత్రం విమానంలో తిరిగి వెళతారన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ నక్కపల్లి: నక్కపల్లి మండలంలో ఈనెల 30,31 తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ ప్రవీణ్ శని వారం పరిశీలించారు. ఉపమాక వేంకటేశ్వరస్వామిని సీఎం దర్శించుకోనుండడంతో ఆల య పరిసరాలను పరిశీలించారు. తొలుత స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఎస్పీకి స్వాగతం పలికారు. గోత్రనామాలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేశారు. సీఎం బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ విశాల్‌గున్ని, సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐవిజయ్కుమార్ ఉన్నారు. -
చూడండి బాబూ..
సాక్షి, అనంతపురం : జిల్లాలో ప్రగతి పడకేసింది. రాష్ట్ర విభజన తరువాత కొలువు దీరిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా పలు చోట్ల ‘తెలుగు తమ్ముళ్లు’ అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తీవ్ర వర్షాభావం వల్ల జిల్లా ప్రజలను తాగు, సాగునీటి సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. జిల్లాకు ఏకైక వరదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి కోటా మేరకు నీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది కోటాలో భారీగా కోత విధిస్తున్నారు. హెచ్ఎల్సీకి 30 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా.. గత ఏడాది దామాషా పద్దతి ప్రకారం 23.99 టీఎంసీలు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాదైతే 22 టీఎంసీలే కేటాయించారు. ఇవి కేటాయింపులే కానీ.. ఇప్పటికీ ఒక్క టీఎంసీ కూడా జిల్లాకు చేరలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం, ప్రజలు తాగునీటి కోసం అవస్థ పడుతున్నారు. మరోవైపు శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణా జలాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హంద్రీ-నీవా మొదటి దశ పనులు అరకొరగా పూర్తయ్యాయి. రెండో దశ పనులు ప్రారంభమే కాలేదు. కనీసం జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తీసుకురాగలిగితే జిల్లాకు కొద్ది మేర ప్రయోజనం ఉంటుంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపి.. హంద్రీ-నీవా పనులను త్వరితగతిన పూర్తి చేయించడమే కాకుండా.. ఈ ఏడాది జిల్లాకు కనీసం 40 టీఎంసీల నీటిని తెప్పించకపోతే పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదముంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లను అందించిన జిల్లాల్లో అనంతపురం కూడా ఉంది. అయితే.. చంద్రబాబు జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. ఎయిమ్స్, నిట్, ఐఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను జిల్లాకు తెప్పించలేకపోయారు. గుంతకల్లులో రైల్వే జోన్, ఓబుళాపురం ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో ఇనుపఖనిజం పరిశ్రమ లాంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. జిల్లాలో లక్షలాది ఎకరాల భూములున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతం. అయితే..ఆ దిశగా పాలకులు దృష్టి పెట్టడం లేదు. ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగవుతున్న వేరుశనగ పంటకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు లేవు. తాము అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు ‘మీకోసం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా పాటుపడాల్సిన అవసరముంది. -
వైఎస్సార్.. జనభేరి
ఎన్నికల ప్రచారానికి నేడు షర్మిల రాక నేరేడుచర్ల వద్ద తొలి బహిరంగ సభ హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రచారం సాక్షిప్రతినిధి, నల్లగొండ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల జిల్లా పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచర్లలో బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభతోనే జిల్లాలో ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో పోటీలో ఉన్నారు. నల్లగొండ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఆ లోక్‌సభ స్థానం పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే తొలివిడత ప్రచారంలో పాల్గొననున్నారు. నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు పార్టీ కార్యకర్తలను సమీకరించే పనిలో ఉన్నారు. గతంలో జిల్లాలో షర్మిల జరిపిన పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావడంతో ఆమెనే ‘స్టార్ క్యాంపెయినర్’గా పార్టీ నాయకత్వం ప్రచారానికి తీసుకువస్తున్నారు. ఆరేళ్లపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో షర్మిల సక్సెస్ ఆయ్యారు. ఆమె ప్రచారంతో ఓటర్లను ప్రభావితం అవుతారని, తమకు లాభిస్తుందన్న ఆశాభావాన్ని పార్టీ నాయకత్వం వ్యక్తం చేసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉండడం, వైఎస్సార్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్నం దున షర్మిల ప్రచారం వారిని కదిలిస్తుందన్న కారణంతోనే కార్యక్రమాన్ని రూపొందించారు. ‘ మహానేత వైస్ రాజశేఖరరెడ్డి భిక్షతో పదవులు పొందిన వారు, ఆయనను విస్మరించినా, కిందిస్థాయి కార్యకర్తల్లో ఆయనపై అభిమానం వారి గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. మహా నేత తనయగా, యువనేత సోదరిగా షర్మిలకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. విజయవంతం చేయండి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరగనున్న మా పార్టీ నాయకురాలు షర్మిల ప్రచార పర్యటనను, బహిరంగ సభలను విజయవంతం చేయమని ప్రజలను కోరుతున్నాం. నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేటల్లో బహిరంగ సభలు జరుగుతాయి. పార్టీ కార్యకర్తలతో పాటు, మహానేత వైఎస్సార్ అభిమానులంతా ఈ సభలకు కదిలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు