నేడు జిల్లాకు తమిళనాడు గవర్నర్ రోశయ్య
కడప కల్చరల్ :
తమిళనాడు గవర్నర్ రోశయ్య శుక్రవారం జిల్లాకు రానున్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆయన చెన్నై నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా జిల్లాలోని పోరుమామిళ్లకు చేరుకోనున్నారు. 11.55 గంటలకు పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దిగి అనంతరం పోలీసు అతిథి గృహానికి వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటుతారు. 12.10 గంటలకు పునర్నిర్మించిన శ్రీమత్ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. 1.00 గంటలకు అమ్మవారిశాల వీధిలోని జయరామకృష్ణయ్య ఇంటికి వెళ్లనున్నారు. 2.45 గంటలకు అక్కడి ప్రభుత్వ జూనియర్‌కళాశాల మైదానానికి బయలుదేరి అక్కడి నుంచి సాయంత్రం మూడు గంటలకు తిరుపతికి వెళతారు.