
నేడు జిల్లాకు ఎంపీ కవిత రాక
నిజామాబాద్‌కల్చరల్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆమె ఉదయం 10 గంటలకు ఆర్మూర్ మున్సిపాలిటీలో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారని టీఆర్‌ఎస్ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు మానిక్‌భండార్ గ్రామాన్ని సందర్శిస్తారని, 2 గంటలకు ఖలీల్‌వాడిలో ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
అనంతరం ప్రగతనగర్ వెళ్లి ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయత డాక్టర్ కేశవరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని, జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తారని, సాయంత్రం 5 గంటలకు బీసీ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరిస్తారని, 5.15 గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగే హరిదా రచయితల సంఘం ద్వితీయ మహాసభలో పాల్గొంటారని తెలిపారు.