యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట: సీఎం రేవంత్‌ | Cm Revanth Review Meeting With Officials On The Development Of Yadagirigutta Temple | Sakshi
Sakshi News home page

యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట: సీఎం రేవంత్‌

Published Fri, Nov 8 2024 2:48 PM | Last Updated on Fri, Nov 8 2024 4:03 PM

Cm Revanth Review Meeting With Officials On The Development Of Yadagirigutta Temple

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 

టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న సీఎం.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న సీఎం.. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న సీఎం.. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తు చేశారు.

కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలి. అవసరమైన నిధులను మంజూరు చేయాలి’’ అని అధికారులకు రేవంత్‌రెడ్డి సూచించారు.

‘‘ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్‌.. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలన్నారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి’’ అని సీఎం రేవంత్‌ ఆదేశించారు.

యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ!: కేటీఆర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement