yadagirigutta temple
-
యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట: సీఎం రేవంత్
యాదాద్రి భువనగిరి జిల్లా: ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న సీఎం.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న సీఎం.. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న సీఎం.. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తు చేశారు.కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలి. అవసరమైన నిధులను మంజూరు చేయాలి’’ అని అధికారులకు రేవంత్‌రెడ్డి సూచించారు.‘‘ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలన్నారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు.ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ!: కేటీఆర్ -
యాదాద్రికి ఎంఎంటీఎస్ వచ్చేనా..
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దాదాపు ఎంపిక చేసిన అన్ని లైన్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయలేదు. కనీసం 9 రైళ్లను కొత్తగా కొనుగోలు చేస్తే తప్ప కొత్త మార్గాల్లోకి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించడం సాధ్యం కాని పరిస్థితి. గతంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడడంతో ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల కొరత సవాల్‌గా మారింది. ఇప్పటికైనా రెండో దశకు నిధులు కేటాయిస్తే ఔటర్ చుట్టూ వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేలా ఎంఎంటీఎస్ విస్తరణకు అవకాశం ఉంటుంది. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించే ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాదైనా ఆచరణలోకి వస్తే నగరవాసులకు ఎంతో ఊరట. అలాగే.. వందే మెట్రో రైళ్లు, హైస్పీడ్ రైళ్లు వంటి అధునాతన సదుపాయాల కోసం నగరం ఎదురు చూస్తోంది. మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఔటర్ వరకు ఎంఎంటీఎస్.. మహా నగర విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ వరకు విస్తరించనున్నారు. ఈ క్రమంలో ప్రజా రవాణాను కూడా అన్ని వైపులా విస్తరించవలసిందే. మెట్రో రెండో దశ కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. కానీ దక్షిణమధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికే పూర్తయింది. మేడ్చల్, పటాన్చెరు, ఉందానగర్, చర్లపల్లి, ఘట్కేసర్ తదితర నగర శివారు ప్రాంతాలను అనుసంధానం చేసేలా రెండో దశ లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం మౌలాలీ– సనత్‌నగర్ మధ్య కూడా పనులు తుది దశకు చేరుకున్నాయి. కానీ నగర విస్తరణకు అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న వాటినే వివిధ మార్గాల్లో నడుపుతున్నారు. గతంలో లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి మార్గాల్లో రోజుకు 121 సరీ్వసులు నడిచాయి. కానీ ప్రస్తుతం సరీ్వసుల సంఖ్య సగానికి తగ్గింది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా 9 కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని దక్షిణమధ్య రైల్వే ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొత్తగా పట్టాలెక్కలేదు. యాదాద్రికి పొడిగిస్తారా.. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం ఘట్కేసర్ వరకు చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రాయగిరి వరకు మరో 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈసారైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఏర్పడితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవకాశం ఉంది. ‘హైస్పీడ్’ను పట్టాలెక్కించండి.... గంటకు 220 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. సుమారు 922 కిలోమీటర్ల దూరం చేపట్టనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో.. శంషాబాద్ నుంచి ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూట్.. మరో రూట్లో విశాఖ పట్టణం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్ వరకు మరో హైస్పీడ్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య అత్యంత వేగంతో దూసుకెళ్లే రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 4 గంటల్లోనే విశాఖకు చేరుకునే అవకాశం ఉంటుంది. వందే మెట్రో కోసం సిటీ వెయిటింగ్.. వందేమెట్రో రైళ్ల కోసం నగరవాసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల వరకు ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– సిర్పూర్కాగజ్నగర్, సికింద్రాబాద్–పెద్దపల్లి, కాచిగూడ–కర్నూల్, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–రాయ్‌చూర్, తదితర మార్గాల్లో ఈ రైళ్లకు డిమాండ్ ఉంది. పాతబస్తీ మెట్రో సంగతేంటీ? పాతబస్తీ మెట్రో మార్గానికి నిధుల కొరత సవాల్‌గా మారింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కోసం సుమారు రూ.2000 వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా రూ.500 కోట్లు కేటాయించారు. కానీ.. ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో పాతబస్తీ మెట్రోను పట్టాలెక్కించేందుకు నిధులు విడుదల చేస్తే పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. -
యాదాద్రీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం.. ఆదాయం రెండింతలు!
యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి ఈ కార్తీక మాసం కలిసొచ్చింది. గతేడాది కార్తీక మాసంతో పోల్చుకుంటే ఈసారి అన్ని విభాగాల ద్వారా ఆదాయం డబుల్ అయింది. చివరి రెండు ఆదివారాలు భక్తులు 50వేల కంటే ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకోవడంతో నిత్యా ఆదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. ఇక సత్యనారాయణస్వామి వ్రతాలు సైతం ఈసారి అధికంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈఓ గీతారెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. ఆదాయం రెండింతలు.. గతేడాది కార్తీక మాసంలో రూ.7,35,10,307 ఆదాయం రాగా, ఈసారి రూ.14,66,38,097 ఆదాయం వచ్చింది. యాదాద్రి ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైన తర్వాత క్షేత్రానికి భక్తులు రాక అధికంగా పెరిగింది. స్వయంభూ దర్శనం పునఃప్రారంభం అయిన తరువాత మొదటిసారి వచ్చిన కార్తీక మాసం కావడంతో స్వామివారికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వ్రతాలతో రూ.1.71కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తర్వాత యాదాద్రిలోనే భక్తులు అధికంగా సత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఈ కార్తీక మాసంలో 21,480 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా రూ.1,71,84,000 ఆదాయం చేకూరినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది బాలాలయం ఉన్న సమయంలో 19,176 వ్రతాలు మాత్రమే జరిపించారు. రికార్డు స్థాయిలో నిత్యాదాయం.. కార్తీకమాసం చివరి రెండు ఆదివారాలు 50వేలకు పైగానే భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 13న ఆదివారం రోజున స్వామి వారికి రూ.1,09,82,446 నిత్య ఆదాయం రాగా, 20న ఆదివారం రోజున రూ.1,16,13,977 నిత్య ఆదాయం వచ్చింది. కార్తీక మాసం చివరి ఆదివారం వచ్చిన ఆదాయమే ఆలయ చరిత్రలో అధికమని అధికారులు వెల్లడించారు. (క్లిక్ చేయండి: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు) -
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి సన్నిధి (ఫొటోలు)
-
నల్గొండ జిల్లా : యాదాద్రికి కార్తీక శోభ (ఫొటోలు)
-
యాదాద్రి టెంపుల్ క్యూ కాంప్లెక్స్‌లో అడవి పంది హల్చల్
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఓ అడవి పంది హల్చల్ చేసింది. యాద్రాది క్యూ కాంప్లెక్స్‌లోకి దూరి పరుగులు తీసింది. ఈ క్రమంలోనే క్యూ కాంప్లెక్స్ భవనంపై నుంచి పడిపోయి పంది చనిపోయింది. అనంతరం, అడవి పంది కళేబరాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది తొలగించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోకి పంది రావడంతో అర్చకులు ఆలయంలో పుణ్యవచనం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం -
యాదాద్రి క్యూ కాంప్లెక్స్‌లో అడవి పంది పరుగులు
-
కళ్లారా చూసుకోవద్దా..
సాక్షి, యాదాద్రి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భక్తులకు యాదగిరీశుని కనులారా దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఉద్ఘాటన అనంతరం యాదాద్రీశుని సంపూర్ణ దర్శనం లభించడం లేదు. తిరుమల తరహాలో బంగారు వాకిలి నుంచే శ్రీ స్వామివారి దర్శనానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఆరేళ్ల తర్వాత గర్భాలయంలోని స్తంభోద్భవుని దర్శనం కోసం తపిస్తున్న భక్తులు ఇక్కడికి రాగానే నిరాశగా వెనుదిరుగుతున్నారు. గతంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించి దగ్గర నుంచి స్వామి దర్శనం కల్పించే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆనవాయితీకి విరుద్ధంగా..: యాదగిరిగుట్టలో స్వయంభూ దర్శనం గర్భాలయంలోనే కల్పించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆరేళ్ల నుంచి బాలాలయంలోనే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయం తెరిచిన విషయం తెలిసిందే. ఆలయ పునరుద్ధరణలో భాగంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా గర్భాలయం ద్వారాలను కూడా వెడల్పు చేశారు. దీంతో మరింత సులువుగా స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉన్నా భక్తులను వాకిలి (గర్భాలయం గడప వద్ద ) నుంచే పంపేస్తున్నారు. భక్తులు ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆనందపడుతున్నా.. స్వామి దర్శనం విషయంలో మాత్రం సంతృప్తి చెందడం లేదు. బుధవారం నుంచి ప్రారంభించిన సువర్ణ పుష్పార్చన ముఖ మండపంలోనే ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులు ప్రధానాలయంలోకి వచ్చే వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, బాలింతలు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి మెట్లమార్గాన దిగి దర్శనం అనంతరం పడమర రాజగోపురం వైపు మళ్లీ మెట్లెక్కి వెళ్లడం ఇబ్బందిగా మారింది. అలాగే క్యూలైన్లలో నిలబడేందుకు వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. గర్భగుడిలోకి అనుమతించాలి స్వామివారిని దర్శించుకోవడానికి 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్నా. అలాగే కొత్త గుడి కట్టిన తర్వాత దర్శనానికి వచ్చా. కానీ అధికారులు బయటి నుంచే పంపించారు. భక్తులను గర్భాలయంలోకి పంపించి స్వామి నిజ దర్శనం కల్పించాలి. ఈ విషయంలో సీఎం మరోసారి ఆలోచించాలి. – మహాలక్ష్మి భక్తురాలు, హైదరాబాద్ త్వరలో అనుమతిస్తాం వేలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బంగారు వాకిలి నుంచే దర్శనం కల్పిస్తున్నాం. వీలైనంత త్వరలో గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. – గజ్వెల్లి రమేష్ బాబు, ఆలయ ఏఈఓ -
Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలోని ఆళ్వార్ మండపంలో నిర్మించిన ధ్వజస్తంభం బలి పీఠానికి బంగారు తొడుగు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధానాలయంలోని గర్భాలయ ద్వారాలకు చెన్నైలో తయారు చేయించిన బంగారు తొడుగులను బిగించారు. ఇందులో భాగంగానే ధ్వజస్తంభం బలిపీఠానికి వారం రోజుల కిందట బంగారు తొడుగు పనులను ప్రారంభించారు. బంగారు తొడుగులతో బలిపీఠం, ధ్వజస్తంభం భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయమంతా బంగారు వర్ణంలో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే విద్యుత్ దీపాలను పసిడి వర్ణంలో తీర్చిదిద్దుతుండగా.. ప్రధానాలయంలో అంతటా బంగారు తొడుగుల పనులను చేయిస్తున్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన) -
మరో తిరుమలగా యాదాద్రి !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇలవేల్పుగా భావించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం త్వరలో మరో తిరుమలగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా నిర్మిం చిన ఆలయంలో స్వామి దర్శనం మొదలుకాగానే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. యాదగిరిగుట్టగా ఉన్న దాదాపు వెయ్యేళ్లనాటి ఆలయాన్ని రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రిగా కొత్తరూపుతో పునర్నిర్మించిన విషయం తెలిసిందే. ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ఉత్సవమూర్తిని బాలాలయంలో ప్రతిష్టించి దర్శనాలు కల్పిస్తున్నారు. మార్చిలో సుదర్శనయాగాన్ని నిర్వహించి కొత్త ఆలయంలోకి స్వామి వారిని తరలించి మూలవిరాట్టుతో కలిపి దర్శనభాగ్యం కల్పించనున్నారు. ప్రస్తుతం 25 వేలమంది వరకు భక్తులు ప్రస్తుతం బాలాలయాన్ని నిత్యం 20 వేల నుంచి 25 వేల మంది దర్శించుకుంటున్నారు. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఆ సంఖ్య 40 వేలను మించుతోంది. అతి సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 12 వేల మంది వస్తున్నారు. అయితే కొత్త ఆలయంలో దర్శనాలు ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య 50 వేలకు చేరుకుంటుందని అధికారులు అంచనాకొచ్చారు. ఇక సెలవులు, ప్రత్యేక సందర్భాలు, ఉత్సవాల కాలంలో 70 వేలను మించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తిరుమల వెంకన్నను నిత్యం సగటున 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు దర్శించుకుంటుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య 80 వేలను మించుతుంది. ఈ విధంగా భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే యాదాద్రి రెండో తిరుమలగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పునర్నిర్మాణానికి ముందు 7 వేల వరకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని యావత్తు తెలంగాణ ఇలవేల్పుగా భావిస్తుంటారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో స్వామివారిని ఇలవేల్పుగా భావించే కుటుంబాలు భారీగా ఉన్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకముందు నిత్యం సగటున ఏడు వేల మంది వరకు దర్శించుకునేవారు. ప్రత్యేక సందర్భాల్లో ఆ సంఖ్య 10 వేల వరకు ఉండేది. పునర్నిర్మాణ పనులు మొదలై, నిర్మాణ ప్రత్యేకతలకు ప్రాధాన్యం వచ్చి ప్రచారం జరగటంతో ఒక్కసారిగా ఆలయానికి రద్దీ పెరిగింది. ప్రధాన ఆలయం పనులు కొలిక్కి రానప్పటికీ, బాలాలయంలో ని స్వామిని దర్శించుకునేవారి సంఖ్య రెండు రెట్లకు చేరింది. సాధారణ భక్తులకు కొత్త దేవాలయంలోకి ఇప్పటివరకు అనుమతి లేదు. రాతి నిర్మాణంగా రూపుదిద్దుకుంటున్న ఆలయ పనులపై ఆసక్తి ఉన్నా, పనులకు ఆటంకం కలగవద్దన్న ఉద్దేశం తో భక్తులను అటువైపు అనుమతించటం లేదు. అయినా రద్దీ పెరుగుతూనే వస్తోంది. ఒకేసారి లక్ష మందికి వసతులు ఆలయానికి ఒకేసారి లక్ష మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగని విధంగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది కూడా భక్తుల సంఖ్య పెరిగేందుకు దోహదపడనుంది. దేవాలయం ఉన్న గుట్టకు మరోవైపు ఉన్న పెద్ద గుట్టను ఏకంగా ఆలయ నగరిగా మార్చేస్తున్నారు. దాదాపు వేయి ఎకరాల మేర విస్తరించిన ఒక గుట్టను సాధారణ భక్తుల కాటేజీలు, ఇతర వసతులకు కేటాయించారు. ఇందులో 250 ఎకరాల్లో ఒక్కోటి నాలుగు సూట్లు ఉండే 252 కాటేజీలు నిర్మించారు. ప్రెసిడెన్షియల్ విల్లాతో పాటు వీవీఐపీలకు కాటేజీలను 13 ఎకరాల్లో విస్తరించిన మరో గుట్టపై నిర్మించారు. 3 వేల మంది ఒకేసారి ఉండేలా క్యూలైన్లను నిర్మించారు. పూర్తి రాతి నిర్మాణం రాజుల పాలనలో రాతి నిర్మాణాలుగా దేవాలయాలు రూపుదిద్దుకునేవి. ఆ తర్వాత సిమెంటు నిర్మాణాలే చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తొలిసారి కృష్ణ శిలతో పూర్తి రాతి నిర్మాణంగా యాదాద్రి రుపుదిద్దుకుంది. ఇది భక్తుల్లో ఎనలేని ఆసక్తిని పెంచింది. ఇక భాగ్యనగరానికి యాదాద్రి కేవలం 70 కి.మీ. దూరంలోనే ఉంది. నాలుగు వరసల రోడ్డు అందుబాటులోకి రావటంతో ప్రస్తుత ప్రయాణ సమయం గంటగంటన్నరగానే ఉంటోంది. కోటి జనాభా ఉన్న భాగ్యనగరానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది. యాదాద్రి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి కూడా దీన్ని చూసేందుకు భక్తులు వస్తున్నా రు. నగరానికి వచ్చే పర్యాటకులు పనిలోపనిగా ఆలయానికి వస్తున్నారు. చుట్టూ పర్యాటక ప్రాజెక్టులు కూడా రానుండటం తో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
యాదాద్రిలో యాలీ పిల్లర్లపై వైకుంఠ ద్వారం
యాదగిరిగుట్ట: ప్రపంచస్థాయి పుణ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదం కలిగించే విధంగా వైటీడీఏ అధికారులు, శిల్పులు కృషి చేస్తున్నారు. యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తులు మొదటగా పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద మొక్కులు చెల్లించుకొని మెట్ల మార్గాన, ఘాట్ రోడ్డు గుండా కొండకు చేరుకునేవారు. అయితే రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతన వైకుంఠ ద్వారాన్ని తొలగించిన అధికారులు.. నూతనంగా ఐదు అంతస్తుల గాలిగోపురాన్ని (వైకుంఠద్వారం) అద్భుతంగా నిర్మించారు. ఈ ద్వారానికి రెండు వైపులా మెట్లు నిర్మించి భక్తులు కొండపైకి కాలినడకన వెళ్లేందుకు వీలు కల్పించారు. యాలీ పిల్లర్లపై వైకుంఠ ద్వారాన్ని నిర్మించడం భక్తులను ఆకట్టుకుంటోంది. యాలీ పిల్లర్లపై భాగంలో సింహాలు, పిల్లర్లకు ఐరావతాలు, నృసింహుడి అవతారాలను తీర్చిదిద్దారు. వీటితో పాటు శంకు, చక్ర, నామాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం) ఆకట్టుకుంటున్న యాదాద్రి పచ్చందాలు ఓ వైపు ఆధ్యాత్మిక రూపాలు.. మరోవైపు పచ్చని పచ్చందాలతో యాదాద్రీశుడి సన్నిధి అద్భుతంగా ముస్తాబవుతోంది. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ అధికారులు పూల మొక్కలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయానికి దక్షిణ దిశలో కొండ దిగువ భాగంలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా వివిధ రకాల మొక్కలతో లాన్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులు నడిచే విధంగా స్టోన్ ఫ్లోరింగ్ వేశారు. వీటి మధ్యలో సైతం గ్రీనరీ ఏర్పాటు చేయడంతో అద్భుంతంగా కనిపిస్తుంది. -
యాదాద్రి రింగ్‌రోడ్డు.. అందాలు మెండు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతోపాటు ఆహ్లాద వాతావరణం కలిగేలా వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రి కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్‌రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్‌కు సమీపంలో నిర్మించిన సర్కిల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 60 మీటర్లతో ఏర్పాటు చేసిన ఈ సర్కిల్లో చెన్నై నుంచి తెచ్చిన ఫీనిక్స్ ఫాం జాతి మొక్కలతోపాటు సీజనల్ పూల మొక్కలను నాటారు. దీంతో ఇప్పుడు ఆ సర్కిల్ రంగుల వలయంలా మారి ఆకట్టుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ యాదాద్రి భువనగిరి యూరియా.. రైతుల బాధ ఇదయా! కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్‌కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. –సదాశివనగర్ (ఎల్లారెడ్డి) జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో ధరూరు/దోమలపెంట(అచ్చంపేట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు 1,00,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఉదయం ప్రాజెక్టు 15క్రస్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 10 క్రస్టు గేట్లను ఎత్తి 67,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 1,00,948 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి 1,45,169 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,692 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 64,487క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
యాదాద్రిలో రథశాల చూశారా?
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని భద్రపరిచేందుకు కొండపై చేపట్టిన రథశాల నిర్మాణం పూర్తయింది. ప్రధానాలయానికి పడమర, ఉత్తర రాజగోపురాల మధ్యలో వాయవ్య దిశలో రథశాలను ఆధ్యాత్మిక హంగులతో భక్తులకు కనువిందు చేసేలా తీర్చిదిద్దారు. రథశాలకు దక్షిణం, ఉత్తర దిశల్లో గోపురం మాదిరిగా, కింది భాగంలో చక్రాలను నిర్మించారు. పై భాగంలో పసిడి వర్ణం కలిగిన ఏడు కలశాలతో పాటు మూడు వైపులా స్వామివారి రూపాలతో కూడిన విగ్రహాలను అమర్చారు. వెనుక భాగం పడమటి దిశలో శంకు, చక్ర, తిరునామాలు వీటికి ఇరువైపులా గరుత్మంతుడు నమస్కరిస్తున్నట్లు.. తీర్చిదిద్దారు. లోపలిభాగంలో చిన్నచిన్న పనులు మినహా మొత్తం నిర్మాణం పూర్తయింది. -
Photo Feature: అటు కిటకిట.. ఇటు వ్యతిరేకత
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. 25 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌస్‌ల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరలపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
ప్రపంచంలో మొదటి రాతి దేవాలయం
శ్రీమన్నారాయణుడి నాలుగో అవతారమైన నరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం యాదాద్రి పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. నరసింహుని నాలుగు రూపాలైన లక్ష్మీనరసింహ స్వామి, జ్వాలా నరసింహస్వామి, యోగనరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి ఈ క్షేత్రంలో విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. యాదాద్రి కొండనే ఐదోరూపమైన ఉగ్రనరసింహస్వామిగా భక్తులు తలపోస్తారు. ‘స్వామీ నృసింహః సకలం నృసింహః’ అంటూ సృష్టిసర్వస్వమూ శ్రీమన్నారాయణుడైన నృసింహుని లీలావిలాసంగా భావించి, భక్తిప్రపత్తులతో కొలుస్తారు. ఇంతటి విశిష్టమైన యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కృష్ణశిలతో సంప్రదాయరీతిలో పునర్నిర్మించడం విశేషం. పునర్నిర్మించిన ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంది. త్వరలోనే ఈ ఆలయం భక్తుల దర్శనానికి పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం... శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనకు ప్రతిరూపంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రీశుని ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా, భక్తజనావళికి కనువిందుగొలిపేలా శిల్పులు అత్యద్భుతంగా నిర్మించారు. ప్రధానాలయం పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. పాంచరాత్ర ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం ఆలయ విస్తరణ, అభివృద్ధి చేపట్టారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టారు. ఆధారశిల నుంచి గోపురం పైవరకు పూర్తిగా కృష్ణశిలతో నిర్మించడం ప్రపంచంలోనే తొలిసారి కావడం యాదాద్రి ఆలయ విశేషం. దేవాలయ నిర్మాణ శైలి కోసం దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాలైన తిరుమల, మధురై, పళని, చిదంబరం, శ్రీరంగం, కుంభకోణం, అక్షరధామ్ వంటి ఆలయాలను పరిశీలించారు. గర్భాలయాన్ని తాకకుండా, ప్రధానాలయాన్ని విస్తరించారు. పాత ఆలయం మాదిరిగానే ముఖమండపం రాజప్రాసాదాన్ని తలపిస్తుంది. త్రితల రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళుతుండగా ఐరావతాలు స్వాగతం పలుకుతూ కనిపిస్తాయి. ఇదివరకటిలాగానే స్వామి దర్శనం తర్వాత క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు తూర్పువైపు బయటకు వెళ్లే సమయంలో కొద్దిసేపు కూర్చునేందుకు వీలుగా ఉండే దిమ్మెను నూతన ఆలయంలో కూడా ఏర్పాటు చేశారు. ఆలయంలోకి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ఆలయ దృశ్యాలను తిలకిస్తూ భక్తులు తన్మయత్వం పొందేలా తీర్చిదిద్దారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రెండులక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ రాయిని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ఈ రెండు జిల్లాల మధ్యన 20 కిలోమీటర్ల దూరంలోని భూమిలో ఈ రాయి లభించింది. 2016లో యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. ఐదేళ్లలో ఈ ఆలయాన్ని శిల్పులు పూర్తిస్థాయిలో నిర్మించి భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పించే దిశగా పనులు పూర్తి కావచ్చాయి. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన స్థపతితో పాటు పదకొండుమంది ఉపస్థపతులు, రెండువేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు. తరువాత సంవత్సరంలో పదిహేనువందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఈ శిల్పుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కోసం వైటీడీఏ రూ.200 కోట్లు ఖర్చు చేసింది. కృష్ణశిల ప్రత్యేకత శ్రీరంగం ఆలయం మాదిరిగా నల్లరాతి శిలతో యాదాద్రి ఆలయం నిర్మాణం జరిగింది. కృష్ణ శిలగా ప్రసిద్ధి చెందిన ఈ నల్లరాయి ఎండకాలం చల్లదనాన్ని, చలికాలం వెచ్చదనాన్ని ఇస్తుంది. అత్యంత కఠినమైన శిల కావడం వల్ల ఎక్కువ కాలం ఆలయం పటిష్ఠంగా ఉంటుంది. వేంచేపు మండపం.. యాదాద్రి క్షేత్రంలోని పడమటి రాజగోపురం ముందు భాగంలో నిర్మించిన మండపమే వేంచేపు మండపం. ఈ మండపాన్ని తిరుమలలో గొల్ల మండపం అంటారు. యాదాద్రీశుడి సన్నిధిలో నిర్మించి ఈ మండపంలో శ్రీస్వామి సేవలు, ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసినప్పుడు వేంచేపు మండపంలో భక్తుల కోసం కొద్ది సమయం అధిష్ఠింపజేస్తారు. బ్రహ్మోత్సవ మండపం.. బ్రహ్మోత్సవ మండపాన్ని తూర్పు రాజగోపురం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవ మూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి, ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు. అష్టభుజి ప్రాకార మండపం.. దేవాలయాల్లో అష్టభుజి ప్రాకార మండపాలు నిర్మించడం చాలా అరుదు. అతికొద్ది ఆలయాల్లో మాత్రమే ఈ అష్టభుజి ప్రాకార మండపాలు కనిపిస్తాయి. యాదాద్రీశుడి ఆలయంలో నిర్మించిన ఈ మండపం చాలా అరుదైనది. భక్తులకు కనువిందు చేసేలా ఈ అష్టభుజి ప్రాకార మండపం పై భాగంలో సాలహారం ఏర్పాటు చేశారు. వీటిలో కేశవ మూర్తులు, నవ నారసింహులు, ఆళ్వారులు, అష్టదిక్పాలకులు, అష్టలక్ష్మీ, దశావతారాలు, వైష్ణవ విగ్రహాలను సాలహారాల్లో ప్రతిష్ఠించనున్నారు. ప్రధానాలయం ఇలా.. యాదాద్రీశుడి ప్రధానాలయ పునర్నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, శిల్పులు దేశంలోని పలు దేవాలయాలను సందర్శించి వాటి నిర్మాణ శైలిని పరిశీలించారు. వారు దర్శించిన ఆలయాల్లో శ్రీవిల్లిపుత్తూరు, శ్రీరంగం, తిరుపతి, అహోబిలం, మధురై తదితర ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో విజయనగర, పల్లవ, చోళ, కాకతీయ, హొయసాల శిల్ప శైలిని మిళితం చేసి శిల్ప శాస్త్ర ప్రకారం నిర్మించారు. ఏనుగులు పల్లవ, స్తంభాలు కాకతీయ, చాళుక్య, ఉప పీఠాలు హొయసాల శిల్పరీతులను ప్రతిబింబిస్తాయి. తెలంగాణకు చెందిన కాకతీయ శిల్పకళా రీతులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ప్రధానాలయంలో కాకతీయ స్తంభాలను, పడమర రిటైనింగ్ వాల్లో ఎలిఫెంట్ ప్యానల్‌ను తీర్చి దిద్దారు. పాత ఆలయం మాదిరిగానే వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా రాతి కట్టడాలతో యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగింది. పాత ఆలయం చుట్టూ సిమెంట్ కట్టడాలను విడతలు విడతలుగా చేపట్టారు. ప్రస్తుతం గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ పటిçష్ఠమైన గోడ నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని వెడల్పు చేశారు. గతంలో దేవాలయం చుట్టూ రథం, స్వామి వారి సేవ తిరగడానికి మూడు వైపుల్లో మాత్రమే స్థలం ఉండేది. దక్షిణం దిక్కున 120 అడుగుల రిటైనింగ్ వాల్ నిర్మించి ఆలయానికి దక్షిణ భాగంలో స్థలం పెంచారు. గర్భాలయాన్ని మధ్యగా లెక్కిస్తూ పూర్తి అలయ నిర్మాణం చేపట్టారు. ముఖమండప స్థలం పెంచారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభై వేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. చుట్టూ ప్రాకార, అష్టభుజి మండపాలు నిర్మించారు. ప్రధానాలయంలో గతంలో ఉన్న విధంగానే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాళ్ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఇందులో అదనంగా సేనా మండపం, ఆళ్వార్, రామానుజుల ఉప ఆలయాలను నిర్మించారు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి భక్తులు వచ్చి, పడమటి రాజగోపురం నుంచి భక్తులు వెళ్లే మార్గంలో రాతి మెట్లకు రాతి రెయిలింగ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రథమ ప్రాకారం చుట్టూ.. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్ర«థమ ప్రాకారం చుట్టూ అధిష్ఠం, స్తంభ వర్గం, ప్రస్తరంతో సహా కిటికీలను అందంగా నిర్మించారు. వీటిపై సాలహారాలను ఏర్పాటు చేశారు. 243 సాలహార విగ్రహాలను ఈ సాలహారాల్లో అమర్చారు. ఇక్కడ ప్రత్యేకించి స్లాబ్‌పై నీళ్లు రావడానికి అనువుగా సోమసూత్రంలాగా రాతిని నిర్మించారు. దివ్య విమానం.. విమానం అనగా వివిధ కట్టడములతో నిర్మించిన నిర్మాణాన్ని విమానం అంటారు. వి+మానం విడదీయగా.. ఇందులో వి అనగా విశిష్టమైన, మానం అనగా కొలతలతో చేపట్టిన నిర్మాణం అని అర్థం. ఈ విమానంపైన కేశవ మూర్తుల ఆకారాలు, గరుత్మంతులు, సింహాలు, విమాన శిఖరం, అష్టకోణం ఆకారం ఉంటాయి. నలు దిశల మండపాలు.. ప్రధానాలయ అంతర్ ప్రాకారంలోని నలు దిశల్లోను నాలుగు మండపాలను నిర్మించారు. ఈశాన్యంలో కల్యాణ మండపం, వాయవ్యంలో అద్దాల మండపం, నైరుతిలో యాగశాల, ఆగ్నేయంలో దీపాలంకరణ మండపం ఏర్పాటు చేశారు. ఈశాన్యంలో నిర్మించిన కల్యాణ మండపంలో భక్తులు నిత్య కల్యాణం నిర్వహిస్తారు. ఇక వాయవ్యంలో నిర్మించిన అద్దాల మండపంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవలు, అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. నైరుతిలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తారు. ఆగ్నేయంలో దీపాలంకరణ మండపంలో నిత్యం దీపాలు వెలిగించనున్నారు. ప్రతిచోటా ఆధ్యాత్మిక రూపాలే.. తూర్పు రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లే మార్గంలో శిల్పులు అద్భుతమైన శిల్పాలను చెక్కారు. ఆలయంలో ఇరువైపులా గోడలకు శంఖు చక్ర నామాలు, ఏనుగుల వరుసలు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి, సుదర్శనమూర్తి, యోగ నారసింహుడు, గర్భాలయ గోడకు పంచ నారసింహ రూపాలు, పడమర ద్వారానికి ఇరువైపులా చండ ప్రచండ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ శైలి మార్చలేదు.. పంచనారసింహులతో విరాజిల్లుతున్న యాదాద్రి పాత ఆలయ శైలిని ఏమీ మార్చలేదు. గతంలో మూడు అంతస్తులు ఉండగా, ఇప్పుడు ఐదు అంతస్తులు నిర్మించారు. చిన్నగా ఉన్న ఆలయాన్ని మరింత పెద్దగా విస్తరించారు. నూతనంగా స్వామివారి ఆలయ ద్వారాన్ని విస్తరించడంతో పాటు ప్రధాన గర్భాలయ ద్వారాలకు రాగిపై బంగారు పూత పూసి, బంగారు రేకులను అమర్చారు. గర్భాలయ ముఖ మండపంపై ప్రహ్లాద చరిత్రను తీర్చిదిద్దారు. ప్రహ్లాదుడి జననం నుంచి హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని పట్టాభిషేకం వరకు పది ఘట్టాలను రూపొందించారు. కనువిందు చేస్తున్న గాలిగోపురం యాదాద్రికి విచ్చేసే భక్తులకు కొత్తగా నిర్మించిన గాలి గోపురం కనువిందు చేయనుంది. ప్రస్తుతం గాలి గోపురం పూర్తి అయింది. మరో రెండు నెలల్లో దీనికి మెట్ల దారి నిర్మాణం పూర్తి కానుంది. గతంలో ఇక్కడి నుంచి స్వామివారి పాదాల మెట్ల దారి ఉండేది. రాతి లాకింగ్, డంగు సున్నం జిగట మిశ్రమంతో పురాతన కాలంలో డంగు సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనపనారలను సరైన పాళ్లలో కలిపి జిగట మిశ్రమం తయారు చేసి రాతికట్టడాలలో ఉపయోగించే వారు. నాటి సంప్రదాయశైలిని యాదాద్రి ప్రధానాలయ రాతి కట్టడాల్లో ఉపయోగించారు. రాతి లాకింగ్ విధానానికి అదనంగా జిగట మిశ్రమం ఉపయోగించడంతో వందలాది సంవత్సరాల వరకు ఆలయాలు పటిష్ఠంగా ఉన్నాయని భావించి, నేటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణంలో వీటిని ఉపయోగించారు. నాటి నిర్మాణ శైలిని తలపించేలా నేడు యాదాద్రి ఆలయం రాతి కట్టడాల్లో ఈ జిగట మిశ్రమాన్ని పెట్టారు. భూకంపాలను తట్టుకునేలా ఈ జిగట మిశ్రమం ఎంతో గట్టిగా ఉంటుందని శిల్పులు అంటున్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్, కాంక్రీట్ వాడలేదు. ధ్వజ స్తంభం మానవుడికి వెన్నెముక ఎంత ముఖ్యమో, ఆలయాలకు ధ్వజస్తంభం అంత ముఖ్యం. కల్యాణం జరిగే దేవాలయాల్లో కచ్చితంగా ధ్వజస్తంభం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. పాలు కారుతున్న చెక్కతో ఈ ధ్వజస్తంభం చేయాలని శాస్త్రం చెబుతుందని శిల్పులు అంటున్నారు. యాదాద్రీశుడి ఆలయంలో సుమారు నలభై అడుగుల ఎత్తు ఉన్న ధ్వజస్తంభాన్ని తీసుకువచ్చారు. దీనిని ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రాంతంలోని టేకు వృక్షం నుంచి తీసుకువచ్చారు. త్వరలోనే ధ్వజ స్తంభం ప్రతిష్ఠించిన అనంతరం రాగి, బంగారు తొడుగులు అమరుస్తారు. తిరుమల తరహాలో క్యూకాంప్లెక్స్ భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. ఇండోర్‌లో క్యూకాంప్లెక్స్ డిజైన్ తయారు చేయించారు. జీ ప్లస్ త్రీ భవన సముదాయంలో ఒక్కో అంతస్తులో రెండు విశాలమైన భవనాల్లో ఇరవైవేల మంది ఏకకాలంలో స్వామి దర్శనం కోసం వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అంతకంటే రద్దీ పెరిగితే టోకెన్ విధానం ద్వారా మరుసటి రోజుకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌లో మంచినీరు, గాలి, వెలుతురు ఏర్పాట్లతో పాటు వాష్రూమ్లనూ ఏర్పాటు చేస్తున్నారు. దేవుని పూజాధికాల కోసమే విష్ణు పుష్కరిణి కొండపైన గల విష్ణుపుష్కరిణిలోని పవిత్ర జలాలను స్వామివారి పూజాదికాల కోసమే వాడుతారు. చక్ర తీర్థం, తెప్పోత్సవం, బిందెతీర్థం కోసం వినియోగిస్తారు. గతంలో భక్తులు ఇందులోనే స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకునే వారు. దేవతా వృక్షాలు, నక్షత్ర వృక్షాలు యాదాద్రి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల భక్తులకు కేవలం దేవుడి చుట్టూ మాత్రమే కాకుండా వారి వారి నక్షత్రం వృక్షాల చుట్టూ, దేవతా వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. శివాలయం పూర్తి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంతో పాటు రూపుదిద్దుకుంటున్నది శ్రీపర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రధానాలయంతో పాటు అమ్మవారి ఆలయాలను కృష్ణశిలతో నిర్మించారు. మూడంతస్తుల రాజగోపుర శిఖరం వరకు కృష్ణశిలతో నిర్మించారు. మూలమూర్తులున్న మహా మండపాన్ని పదహారు స్తంభాలతో నిర్మించారు. అంతే కాకుండా నల్లరాతితో ఫ్లోరింగ్ చేశారు. ఇక గణపతి, ఆంజనేయస్వామి ఆలయాలను ఇటుక, సిమెంట్‌తో నిర్మించారు. మహా మండపం ఎదురుగా మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన ఆరడుగుల నంది విగ్రహాన్ని నెలకొల్పారు. ముఖ మండపం మధ్యలో స్ఫటిక లింగం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకతల ప్రాకార మండపం ప్రధానాలయం చుట్టూ ఉన్న రెండో ప్రాకార మండపం ఆలయం వైపు భక్తుల కోసం ప్రత్యేకంగా నిత్యకల్యాణ మండపం, యాగశాల, అద్దాల మండపం, అర్చకులు, స్వామి వారి నివేదన ప్రసాదం తయారీ కోసం రామానుజ కూటమిని తీర్చిదిద్దారు. ఇందులోనే ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించే యాలీ స్తంభాలను మనోహరంగా తీర్చిదిద్దారు. ఇందులో సింహం కింద ఏనుగు శిల్పాలు, యాలి కింద సింహం, తీర్చిదిద్దారు. ఈశాన్యంలో: నిత్యకల్యాణ మండపం, ఆగ్నేయంలో: రామానుజ కూటమి నైరుతిలో: యాగశాల వాయవ్యంలో: అద్దాలమండపం రెండో ప్రాకార మండపం ప్రధానాలయం తర్వాత అత్యంత శిల్ప సంపద కలిగిన రెండో ప్రాకారం భక్తులకు ఆధ్యాత్మిక భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. అప్పటి వరకు స్వామి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడ్డ అలసటను పూర్తిగా మటుమాయం చేసేలా ఈ ప్రాకారాన్ని తీర్చిదిద్దారు. ప్రధానాలయ నిర్మాణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్డిన ఏడు రాజగోపురాలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పూర్తిగా వైష్ణవ సంప్రదాయాలు, దశావతారాలు, పంచనార సింహ అవతారాలు, శంఖు చక్ర నామాలు ఇలా రాతి కట్టడాలపై భక్తి రస భావాన్ని మేళవించారు. ఏడు రాజగోపురాల ఎత్తు వివిధ అడుగుల్లో తీర్చిదిద్దారు. రెండో ప్రాకార మండపంలో తిరుమాడ వీధుల వైపు 58 యాలి స్తంభాలు, మరో వైపు అష్టభుజి ప్రాకార మండపాన్ని ఆధ్యాత్మిక భక్తి భావం పెంపొందించేలా రూపొందించారు. పడమరవైపున గల సప్తతల రాజగోపురం ఎత్తు 85 అడుగులు కాగా, గోపుర నిర్మాణానికి వాడిన కృష్ణశిలల బరువు 7,630 టన్నులు, స్వామివారి గర్భాలయంపై గల దివ్య విమానం ఎత్తు 41.10 అడుగుల ఎత్తు, దీనికి వాడిన కృష్ణశిలల బరువు 25,000 టన్నులు. తూర్పు, ఉత్తరం, దక్షిణ దిశలలోని పంచతల రాజగోపురాల ఎత్తు 57 అడుగులు, ఒక్కో రాజగోపురానికి వాడిన రాతి శిలలు మూడు వేల టన్నులు, కాగా పడమర పంచతల రాజగోపురానికి మాత్రం 3,150 టన్నుల రాయిని వాడారు. స్వామివారు ఊరేగింపు సందర్భంగా కొద్ది సేపు సేద దీరడానికి ఏర్పాటు చేసిన వేంచేపు మండపం ఎత్తు 39 అడుగులు కాగా, బ్రహ్మోత్సవ మండపం ఎత్తు 33 అడుగులు. కొండపైన స్వామివారి విష్ణు పుష్కరిణిని 28.09 అడుగుల్లో తీర్చిదిద్దారు. గర్భగుడిలోకే వేళ్లే తూర్పు ద్వారం వద్ద, ప్రధానాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రెండేసి ఏనుగుల విగ్రహాల ఎత్తు 7.2 అడుగులు కాగా, ద్వారపాలకుల విగ్రహాలను 10.3 అడుగుల ఎత్తులో తయారు చేశారు. యాదాద్రి భువనగిరి సాయంత్రం గర్భగుడిలో సూర్య కిరణాలు పడమర రాజగోపురం వేంచేపు మండపం మీదుగా గర్భాలయం తలుపులకు సూర్యకిరణాలు తాకుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రత్యేక దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది. గిరి ఉగ్రనరసింహ రూపం యాదాద్రి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే నాలుగు దిక్కులనూ స్వామి చూస్తారు. స్వామి ఎటువైపు చూస్తే అటువైపు తూర్పుదిక్కుగా భావించాల్సి ఉంటుంది. పంచనారసింహ క్షేతంలో జ్వాలా నారసింహస్వామి, యోగనారసింహస్వామి, లక్ష్మీనారసింహస్వామి, గండభేరుండ నారసింహస్వామి నాలుగుదిక్కులు చూస్తుండగా, ఐదవ ఉగ్ర నారసింహస్వామి రూపంగా యాదగిరికొండను కొలుస్తారు. బంగారు తాపడం పూర్తి గర్భాలయ ప్రధాన ద్వారాలకు అమర్చనున్న ఇత్తడి రేకులకు బంగారు పూత పూర్తి అయింది. ఈ బంగారు తొడుగులను త్వరలోనే అమర్చనున్నారు. వీటితో పాటు కలశాలను కూడా పూర్తి చేశారు. దివ్య విమానానికి బంగారు తాపడం చేయాల్సి ఉంది. పదహారు కిలోల బంగారంతో తొడుగులు పూర్తి అయ్యాయి. ఉప ఆలయాలకు వెండి తలుపుల కోసం వెయ్యి కిలోల వెండిని పెంబర్తి కళాకారులకు అప్పగించారు. వీటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే రాజగోపుర ద్వారాలకు ఇత్తడి తొడుగులు రానున్నాయి. ప్రపంచంలో మొదటి రాతి దేవాలయం యాదాద్రి ప్రధానాలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించాం. సీఎం కేసీఆర్ బడ్జెట్‌తో సంబంధం లేకుండా తరతరాలకూ చెక్కు చెదరని భవ్య ఆలయం నిర్మించాలని సూచించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులతో సినిమా రంగం నుంచి ఆర్కిటెక్ట్‌గా మారాను. జీయర్ కుటీరంలో శ్రీశ్రీశ్రీ రామానుజ కూటమి మొదటి ప్రాజెక్టుతో ఈ రంగంలోకి వచ్చాను. ఏడాది పాటు ఒడిశాలోని పద్మశ్రీ ఆనంద పాత్రో వద్ద శిష్యరికం చేశాను. వైటీడీఏ యాదాద్రిలో చేపట్టిన నూతన ఆలయ నిర్మాణానికి డిజైన్లు తయారు చేయాలని జీయర్ స్వామి ఆదేశించారు. దీంతో ఒక్కరోజులో ప్లాన్ తయారు చేసి డ్రాయింగ్ వేశాను. సీఎం కేసీఆర్‌కు వాటిని చూపించడంతో ఆయన ఒప్పుకుని పని ప్రారంభించాలని కోరారు. వైష్ణవ సంప్రదాయం, ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం చేపట్టాం. తంజావూర్ దేవాలయం చూసి ప్రేరణ పొందాను. వివిధ దేవాలయాల్లో చూసిన శిల్పరీతుల సమ్మేళనమే ఈ దేవాలయంలో కనిపిస్తుంది. ముఖమండపంలో కాకతీయ సంస్కృతి, బాలపాదం, యాలీ స్తంభాలు ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. బాలపాదం కింద ఏనుగు, యాలి కింద సింహం నోట్లో రాతి గుండు ఉంటాయి. స్థపతులు గణపతి, ముత్తయ్య. సుందర్రాజన్తోపాటు సివిల్ ఆర్కిటెక్ట్‌లు మధుసూదన్, వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ సహకరించారు. దేశంలోనే అతిపెద్ద రిటైనింగ్ వాల్ ఉన్న దేవాలయం. ఇలాంటి దేవాలయ నిర్మాణం మరెక్కడైనా పదేళ్లకు పైగానే పడుతుంది. కానీ ఇక్కడ ప్లాన్ ప్రకారం ఐదేళ్లలో పూర్తి చేశాం. పూర్తి కృష్ణశిలలతో ఈ దేవాలయాన్ని లాకింగ్ విధానం ద్వారా నిర్మించాం. అదనపు గట్టిదనం కోసం డంగు సున్నం జిగట మిశ్రమాన్ని వాడాం. దేవాలయాన్ని వేయి సంవత్సరాల వరకు కదిలించలేరు. చెన్నై శిల్పులు గోపురాన్ని, యాలీ స్తంభాలను ఆళ్లగడ్డ శిల్పులు చెక్కారు. ప్రతిరాతిని స్కానింగ్ చేసి పరిశీలించాం. స్తంభాలలో సుమారు 4,400 వైష్ణవ చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు చూస్తున్న దేవాలయ నిర్మాణం ఐదు సంవత్సరాల క్రితం డిజైన్ చేసిందే. పాత ఆలయంలో మాదిరిగా భక్తుల ప్రవేశం తూర్పు నుంచి మెట్లు దిగి వచ్చేలా ఏర్పాటు చేశాం. మెట్లు దిగేటప్పుడు సుదర్శన చక్రం, శంఖు చక్ర నామాలను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వెళ్తారు. క్యూలైన్లు ఇత్తడితో ఏర్పాటు చేశాం. అంతర్గతంగా సీసీ కెమెరాలు, విద్యుదీకరణ, మురికినీటి పారుదల, మంచినీటి వ్యవస్థ, ఏసీలు రూపొందించాం. స్వామి వారికి నివేదించే ప్రసాదం లిఫ్ట్ ద్వారా ఆలయంలోకి తీసుకు వస్తారు. గర్భాలయ ద్వారం బంగారు తాపడంతోను, ఉపాలయాల ద్వారాలు వెండి తాపడంతోను, మిగతా ద్వారాలను ఇత్తడితో ఏర్పాటు చేస్తున్నాం. దివ్యవిమానం బంగారంతో తాపడం చేయిస్తున్నాం. భక్తులకు దర్శనం కల్పించే లోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. బ్రహ్మోత్సవ ఏరియా పెంచాం. మండపాన్ని పూర్తిగా రాతితో నిర్మించాం. పుష్కరిణి మార్చాం. పార్కింగ్, ఫస్ట్ ఎయిడ్, ఆధునిక సౌండ్సిస్టమ్, ఎస్కలేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ∙ఆనంద్‌సాయి, యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆళ్వార్ మండపం శ్రీ మహావిష్ణువు ప్రియభక్తులైన పన్నిద్దరాళ్వార్ల మండపాన్ని నిర్మించారు. పాత దేవాలయంలో ఆండాళ్ అమ్మవారి ఆలయం పక్కన చిన్న ఉపాలయంలో కూర్చుని ఉన్న ఆళ్వార్లను నూతన ఆలయంలోని స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలుగా చెక్కారు. చినజీయర్ స్వామి సూచనలతో నిలబడి ఉన్న ఆళ్వార్ల మూర్తులను రూపొందించారు. ఏ వైష్ణవ ఆలయంలోనూ లేని విధంగా ఆళ్వార్ల మూర్తులు స్తంభాలపై నిలబడి ఉండడం యాదాద్రి ఆలయం ప్రత్యేకత. స్వయంభువుల దర్శనానికి వచ్చి వెళ్లే భక్తులకు ప్రధానాలయంలో దర్శనమిచ్చే ఆళ్వార్లను రాతి శిల్పాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ శిలలతో ఆళ్వార్ విగ్రహాలు ఆళ్వార్ల విగ్రహాలను తీర్చిదిద్దిన స్తంభాలను కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా కృష్ణశిలలతో తయారు చేశారు. ప్రతి ఆళ్వార్ విగ్రహాన్ని 16.11 అడుగుల ఎత్తులో రూపొందించారు. కాకతీయ స్తంభాలను 12.03 అడుగుల ఎత్తులో నిలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో లభించే కృష్ణశిలల ద్వారా ప్రత్యేకంగా ఆళ్వార్ విగ్రహాలు తయారు చేశారు. నిపుణులైన శిల్పులను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా రప్పించారు. పంచనారసింహ క్షేత్ర స్థల పురాణం మాతా నృసింహశ్చ పితానృసింహః భ్రాతా నృసింహశ్చ, సఖా నృసింహః విద్యనృసింహో ద్రవిణో నృసింహః స్వామీ నృసింహః సకలం నృసింహః యాదాద్రి పుణ్యక్షేత్రం స్థల పురాణం ఎంతో మహిమాన్వితం. హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి శ్రీమహా విష్ణువు స్తంభోద్భవుడుగా అవతరించి ఉగ్రనారసింహుడుగా పలు చోట్ల వెలిశాడని ప్రతీతి. అదే క్రమంలో యాదగిరి కొండపై ఐదు అవతారాలలో పంచ నారసింహునిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడని పురాణాలసారం. ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదమహర్షి శ్రీ నరసింహమూర్తి ఉగ్రరూపం చూడాలనే కోరికతో ఈ గుహలో తపస్సు చేయగా, క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడి సహకారంతో నృసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఇందులో భాగంగా జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్ర నారసింహ, శ్రీలక్ష్మీనారసింహ అవతారాలలో దర్శనమిచ్చాడని చెబుతారు. అలాగే లోక కల్యాణార్థం ఇక్కడే గుహలో వెలసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ముక్తిని ప్రసాదించాలని కోరిన యాదమహర్షి వేడుకోలుకు మెచ్చి, ఈ పంచ రూపాలలో ఇక్కడి గుహలో వెలిశాడని పురాణాలు చెబుతాయి. ఐదు అవతారాలలో జ్వాలా నారసింహుడు, యోగానంద, శ్రీలక్ష్మీ నరసింహుడు కొండ గుహలో వెలసిన మూర్తులు కాగా, గండభేరుండ నరసింహ స్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయానికి తూర్పువైపున వెలిశాడు. ఉగ్ర నారసింహస్వామి రూపం మాత్రం యాదగిరి కొండ చుట్టూ ఆవరించి ఉందని భక్తుల అచంచల విశ్వాసం. క్షేత్ర మహాత్మ్యం పరమ భక్తాగ్రేసరుడైన యాదమహర్షి తపస్సుకు మెచ్చి ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనారసింహుడు మొదట ఉగ్ర రూపంలో వెలిశాడు. అలాగే జ్వాలా, గండభేరుండ, యోగానంద రూపాలతో ఇక్కడ వెలియడంతో పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతోంది. జ్వాలానరసింహ స్వామి రెండు శిలా ఫలకాల మధ్య దీర్ఘమైన శ్రీచూర్ణ రేఖలా భక్తులకు దర్శనమిస్తున్నారు. గ్రహ బాధలు, శారీరక, మానసిక ఈతి బాధలు గలవారు మండల దీక్ష (నలభై రోజులు) ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. దీక్షతో మండల ప్రదక్షిణలు చేసి కొలిచిన వారి బాధలను స్వామి వారు తొలగిస్తారని భక్తుల నమ్మకం. పూర్వజన్మ సుకృతం దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవడం నా పూర్వజన్మ సుకృతం. గడచిన ముప్పయి ఐదేళ్లుగా చేసిన సేవ, ఈ ఐదేళ్ల దేవాలయ పునర్నిర్మాణ సేవతో సమానం. తెలంగాణ ప్రభుత్వం, వైటీడీఏ ఈ కార్యక్రమాన్ని నాకు అప్పగించడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రస్తుతం చేపట్టిన నవీన నిర్మాణంతో యాదాద్రి ప్రపంచస్థాయి దేవాలయంగా చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆశీస్సులతో ఆలయ నిర్మాణానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆర్ట్‌డైరెక్టర్ ఆనంద్‌సాయి, స్థపతి సలహాదారు సుందరరాజన్, దేవస్థానం ఈవో గీతారెడ్డి సహకారం మహోన్నతమైనది. నిర్మాణంలో పాల్గొన్న టీటీడీ శిల్పకళా విద్యార్థులు, శిల్పి కాంట్రాక్టరు అందరూ శ్రమించారు. భక్తులకు ఎలాంటి దేవాలయం కావాలో అలాంటి దేవాలయాన్ని నిర్మించగలిగామనే సంతృప్తితో ఉన్నాం. - డాక్టర్ ఆనందాచారి వేలు, స్థపతి సలహాదారు - యంబ నర్సింహులు, సాక్షి స్టాఫ్‌రిపోర్టర్ - కొల్లోజు శివకుమార్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ఇటు బ్రహ్మోత్సవం.. అటు సీతారాముల కల్యాణోత్సవం
సాక్షి, యాదాద్రి: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయాన్ని పునఃప్రారంభించే దిశగా చర్యలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టుగా ఐదేళ్ల కిందట ప్రారంభమైన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే ఫిబ్రవరిలో ప్రధానాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. వసంత పంచమి అయిన ఫిబ్రవరి 16న లేదా రథ సప్తమి తేదీ అయిన 18న ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ దర్శన భాగ్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు అధ్యయనోత్సవాలు, ఫిబ్రవరి 22 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లోపు స్వామి వారి దర్శనం ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతోంది. అందుకే కొండపైన పనులన్నీ ఈ నెల 30కల్లా పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు జరిగిన సమీక్షలో సీఎం ఆదేశించారు. ఈ పనులను 27న సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. అనంతరం ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం చినజీయర్ స్వామిని కలసి ప్రధానాలయాన్ని పునఃప్రారంభించడంపై అనుమతి కోరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొండ కింద జరుగుతున్న టెంపుల్ సిటీ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.(చదవండి: యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కలల ప్రాజెక్టు) ప్రాణ ప్రతిష్టకు ప్రత్యేక పూజలు... ప్రస్తుతం బాలాలయంలో ఉన్న స్వామి, అమ్మవార్ల ఫొటోలకు స్వామి వారి ఆవాహనం చేశారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2016లో భక్తులకు దర్శనం కోసం ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ప్రధానాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పారాయణాలు, మూలమంత్ర జపాలు, యాగం నిర్వహిం చాల్సి ఉంది. అయితే కరోనాకు ముందు సంవత్సరకాలంపాటు మూలమంత్ర జపాలు చేశారు. కరోనాతో నిలిపివేసిన ఈ జపాలను ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మళ్లీ కొనసాగిస్తారా లేక 11 రోజులపాటు మూలమంత్ర జపాలు నిర్వహించి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఒకట్రెండు రోజులు మినహా మే వరకు మూఢా లు ఉండటంతో ప్రారంభ తేదీపై స్పష్టత రావడం లేదన్న వాదన కూడా ఆలయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి కొండపైన భక్తుల కోసం చేపట్టిన క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రధానాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో క్యూ కాంప్లెక్స్ పనులు తిరుమల తరహాలో పూర్తికాగా ప్రధానాలయంలో మిగతా పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఆలయం వెలుపల మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్ పనులు మరో 15 రోజుల్లో పూర్తి కానున్నాయి. ఆలయం చుట్టూ ఏకశిల సాలహార విగ్రహాలు 150 వరకు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 32 విగ్రహాలు యాదాద్రికి చేరుకున్నాయి. మిగతావి నెలాఖరు వరకు రానున్నాయి. వాటిని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రతిష్టించనున్నారు. దీంతోపాటు ఉత్తరం వైపున రిటైనింగ్ వాల్‌ను 15 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అది పూర్తి అయితే పుష్కరిణి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఆర్చి వరకు పార్కింగ్ వసతి కల్పిస్తారు. కొండ కింద చేపట్టిన పుష్కరిణి, అన్న ప్రసాద వితరణ కేంద్రం, బస్టాండ్, రింగ్ రోడ్డు, గండి చెరువు ఆధునీకరణ, ప్రెసిడెన్షియల్ సూట్, కల్యాణకట్ట పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 21న భద్రాద్రి సీతారాముల కల్యాణం ఏప్రిల్ 13 నుంచి 27 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 21న సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 నుంచి 27 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు వైదిక కమిటీ రూపొందించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను సోమవారం ఆలయ ఈఓ బి.శివాజీ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందించారు. ఏప్రిల్ 13న ప్లవనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మూలమూర్తుల స్నపన తిరుమంజనం, నూతన పంచాంగ శ్రవణం ఉంటుంది. అదే రోజు బ్రహ్మోత్సవాల ప్రారంభం, 17న మృత్సంగ్రహణం, వాస్తు హోమం, అంకురారోపణం, 18న గరుడ ధ్వ జపట లేఖనము, గరుడ ధ్వజ పటావిష్కరణ, గరు డ ధ్వజాధివాసం, 19న ధ్వజారోహణం, దేవతాహ్వానము, బలి సమర్ప ణ, 20న చతుఃస్థానాచర్చనము, ఎదుర్కోలు ఉత్సవం, 21న శ్రీరామనవమి, 22న మహాపట్టాభిషే కం, 23న సదస్యము, 24న చోరోత్సవం, 25న ఊంజల్ ఉత్సవం, 26న వసంతోత్సవం, 27న పూర్ణాహుతి, శేషవాహన సేవ, ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాల పరిసమాప్తి ఉంటాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొ ని ఏప్రిల్ 13 నుంచి 27 వరకు నిత్య కల్యాణోత్సవాలు రద్దు చేశారు. ఏప్రిల్ 17 నుంచి 27 వరకు దర్బార్ సేవలు రద్దు చేశారు. ప్రస్తుతం కోవిడ్–19 నిబంధనలను సడలిం చిన నేపథ్యంలో శ్రీరామనవమిని మిథిలా స్టేడియంలో నిర్వహిస్తారా.. లేదా ఆంతరంగికంగా నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కలల ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా యాదాద్రి ఆలయ వీడియోను పంచుకున్నారు. డ్రోన్ కెమెరా చిత్రీకరణతో కూడిన 1.10 నిమిషాల నిడివి గల ఈ వీడియో దేవాలయ కొత్త నిర్మాణాన్ని అద్భుతంగా చూపింది. చదవండి: (యాదాద్రి క్షేత్రం.. సొబగుల సోయగం) ప్రధాన గోపుర ముఖద్వారాలు తెరుచుకుంటూ స్వామి మందిర సాక్షాత్కారంతో వీడియో ప్రారంభమవుతుంది. కృష్ణ శిలలతో ప్రాణం పోసుకున్న శిల్పాలు, పూర్తి రాతి నిర్మాణంగా మలిచిన తీరు, అడుగడుగునా అద్భుత నగిషీలు, గాలిగోపురం, మిగతా గోపురాలు, గుట్టపై ఆలయం పూర్తి రూపు, చుట్టూ పచ్చదనం.. ఇలా ఆ వీడియో యాదగిరీశుడు కొలువుదీరిన మందిరాన్ని కళ్లకు కట్టింది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు లాంటి ఆధునిక దేవాలయాలు ఒకవైపు.. ప్రపంచ స్థాయి ఆధునిక ఆధ్యాత్మిక దేవాలయం యాదాద్రి పునర్నిర్మాణం మరోవైపు.. ముఖ్యమంత్రి విలక్షణ యోచనకు అభినందనలు అని కేటీఆర్ వెల్లడించారు. Renovated #Yadadri Lakshmi Narsimhaswamy Temple; yet another great initiative of Hon’ble CM #KCR Garu 🙏#Telangana pic.twitter.com/TqI4h3o3gS — KTR (@KTRTRS) December 9, 2019 -
నేడు యాదాద్రికి సీఎం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యా దగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 11గం టలకు చేరుకోనున్న కేసీఆర్.. ముందుగా స్వామివారిని దర్శించుకుంటారు. అనంత రం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. ప్రధానాలయంలో శిల్పి పనుల తుది మెరుగులు, శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులతో పాటు కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. తర్వాత ఆయా శాఖాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానాలయాన్ని దసరా నాటికి ప్రాంభించే అవకాశాలను పరిశీలించనున్నారు. -
ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి వ్యంగ్య్రస్తాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పదేపదే ‘సారు.. కారు.. సర్కార్’అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయిందన్న విజయశాంతి, ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్తూపాల్లో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ బొమ్మను, కారు గుర్తును, టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతోందన్నారు. రాజులు, రాజ్యాలు కను మరుగైన తర్వాత కూడా కేసీఆర్ తన దొర తనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు. ఖండించిన కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి యాదాద్రి దేవాలయ శిలలపై కేసీఆర్ తన ఫొటోతో పాటు కారు గుర్తు చిహ్నాన్ని చెక్కించుకోవడం సిగ్గుచేటని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. తక్షణమే ఆయా చిత్రాలను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వివాదాస్పదంగా మారిన కేసీఆర్ చిత్రాలు కాగా యాదాద్రిలో అష్టభుజి మంటప పిల్లర్లపై సీఎం కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ఎన్నికల చిత్రమైన కారు, కేసీఆర్ కిట్టు, ఓటు వేయడానికి ఉపయోగించే స్వస్తిక్ స్టాంపు ముద్ర చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు కొండపైకి చేరుకుని నిరసనకు దిగారు. కొందరు కార్యకర్తలు ఉత్తర రాజగోపురం పైకి ఎక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని కిందికి దించారు. దేవస్థానంలో జరుగుతున్న పనుల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఇది పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపరచడమే.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్ట భుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాల పై సీఎం కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు, అన్యమత చిహ్నాలను చెక్కించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అది సీఎం కేసీఆర్ ప్రచార కాంక్ష మాత్రమే కాకుండా, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని తెలిపారు. వైభవోపేతమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపర్చడం, తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. సీఎం ఆదేశాల మేరకే శిల్పులు కేసీఆర్ చిత్రాన్ని, టీఆర్ఎస్ గుర్తును చెక్కినట్టు స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్‌తో తమ మైత్రిని చాటుకుంటూ ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూల చిత్రా లు చెక్కించడం, తమ మిత్రుడైన మరో పార్టీని సంతృప్తి పరచడానికి, ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు హిందూయేతర మతానికి చెందిన చార్మినార్‌ను చిత్రించడం దుర్మార్గమన్నారు. -
శివాలయ ప్రాకారాలకు విగ్రహాల కూర్పు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా శివాలయం చుట్టూ ప్రాకారాలకు విగ్రహాల కూర్పు చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఆలయంలోనికి వెళ్లడానికి ద్వార గోపురం పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే రామాలయం పూర్తయింది. శివాలయం రాజగోపురం పనులు సైతం పూర్తి కావొస్తున్నాయి. శివాలయానికి చుట్టూ ప్రాకారం గోడలకు సాలహారం పనులు జరుగుతున్నాయి. అందులో గణపతిలో ఉన్న లక్ష్మీగణపతి, గజముఖ గణపతి, శ్వేతాంబర గణపతి, సిద్ది గణపతి తదితర గణపతి విగ్రహాలు, అదేవిధంగా నవవిధ దుర్గలు, సరస్వతి, కాళీ, మహాలక్ష్మి అమ్మవార్లు, సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, నంది, సింహవాహిని దుర్గ వంటి అనేక దేవతల విగ్రహాలను పొందుపరుస్తున్నారు. వారం రోజుల్లో ఈ విగ్రహాల కూర్పు పూర్తవుతుంది. పూర్తయిన రాజగోపురాలు.. ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా సప్త రాజగోపురాలు పూర్తయ్యాయి. ఇంతకుముందే ఆరు రాజగోపురాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక భక్తులు స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్లే సప్తతల రాజగోపురం పూర్తి కావడంతో సప్త రాజగోపురాల పనులు పూర్తయినట్లే. తిరుమాడ వీధుల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సప్తతల రాజగోపురం ఎత్తు దాదాపు 65 నుంచి 70 అడుగులు ఉంటుంది. -
యాదగిరీశుడి సన్నిధిలో గవర్నర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుటుంబ సమేతంగా ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు చతుర్వేదాలు పఠిస్తూ 30 నిమిషాల పాటు మహాదాశీర్వచనం చేశారు. రాష్ట్ర, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. ఈసారి నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. యాదగిరికొండ (ఆలేరు) : రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో గర్భాలయ ద్వారం వద్ద పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామిఅమ్మవార్లకు సతీసమేతంగా సువర్ణ పుష్పార్చనగావించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితులు చతుర్వేదాల పఠనంతో సుమారు 30 నిమిషాల పాటు మహాదాశీర్వచనం చేశారు. గవర్నర్ పర్యటన సాగిందిలా.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోకి ఆయన సాయంకాలం 5ః50 నిమిషాలకు వచ్చారు.అక్కడి నుంచి 5ః53 గంటలకు ఆయన గర్భాలయంలోకి ప్రవేశించారు.అక్కడ ఆయన సుమారు 20నిమిషాల పాటు గర్భాలయంలోని స్వామివారి చెంత పూజల్లో పాల్గొన్నారు. అనంతరం 6ః08 గంటలకు వెలుపలికి వచ్చారు. అక్కడినుంచి ఆలయ ముఖ మండపంలోని హుండీలో గవర్నర్ సతీమణి సుమారు రూ.5వేలు సమర్పించారు. 6ః15 గంటల నుంచి ఆశీర్వచనం ప్రారంభం చేశారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ మహాదాశీర్వచనం చేశారు. 6ః45 గంటల వరకు వేద పండితులు, ఘనాపాఠీలు, ఆలయ అర్చకులు కలిసి చతుర్వేదాలు, తిరుప్పావై పాశురాల పఠనంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. భారీ బందోబస్తు భువనగిరి అర్భన్ : గవర్నర్ రాక సందర్భంగా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. వసంత పంచమిని పురస్కరించుకుని ఆయన సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి వెళ్లే వరకు రహదారుల వెంట జడ్ ఫ్లస్ కేటగీరితో బందోబస్తును ఏర్పాటు చేశారు. యాదాద్రి నుంచి అవుషాపూర్ వరకు భద్రత కల్పించారు. వాహనాలు అదుపు చేసేందుకు అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు నియమించారు. వివాదాలకు తాగులేకుండా ప్రథమపౌరుడి పర్యటన సాఫీగా ముగియడంతో అధికా రయంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. గవర్నర్ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్ అనితారాంచంద్రన్ , ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఏసీపీలు మనోహర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, డీసీపీ రాంచంద్రారెడ్డి, ఈఓగీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఏఈఓ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రంగులు, సున్నాల జాడేలేదు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధీనంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతోంది. కానీ వాటి ఏర్పాట్ల ఊసే కనిపించడం లేదు. ఆలయంలో ఈనెల 11 నుంచి అధ్యయనోత్సవాలు, 15 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏడాది 10రోజుల ముందు నుంచి రంగులు, సున్నాలు. జాజులు అద్దేవారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేసేవారు. కానీ ఈ సారి ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. గత ఏడాది ఈపాటికే ఆలయంలో హోమగుండాలు నిర్మించి విగ్రహాలకు పాలిషింగ్ చేసి కరపత్రాలను ఊరూరా పంచారు. ప్రతిసారీ అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు కలిపి 15 మంది రుత్వికులకు వారం పది రోజుల ముందే ఆహ్వానాలు పంపేవారు. అయితే ఈసారి ఈ రోజు వరకూ ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని అధికారులు చెబుతున్నారు.« ధ్వజస్తంభం, స్వామి అమ్మవార్ల వాహనాలకు పాలిషింగ్ చేసేవారు. ప్రస్తుతం ఇటువంటి ఆనవాళ్లు కనిపించడంలేదు. యాదాద్రి కొండపైన నిర్మాణ పనుల్లో భాగంగా అన్ని కార్యాలయాలు తొలగిస్తున్న కారణంగా అక్కడి కార్యాలయాలను కొన్నింటిని కొండ కిందికి, మరికొన్నింటిని పాతగుట్టకు మార్చాల్సి ఉంటుంది. దీంతో పాతగుట్ట బ్రహ్మోత్సవాలకు ఎక్కువమంది భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ పాతగుట్టలో అధికారుల జాడే లేకుండా పోయింది. గతంలో వాల్‌పోస్టర్లను అందరి సమక్షంలో ఆవిష్కరించారు. ఈసారి ఎవరికీ తెలియకుండా వాల్ పోస్టర్లను ఆవిష్కరించినట్లు అధికారులే చెబుతున్నారు. మొత్తానికి పాతగుట్ట ఉత్సవాల సందడే లేకుండా పోయింది. -
యాదాద్రి లడ్డూలకు బూజు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి బూజు పట్టింది. భక్తులకు పంపిణీ చేసేందుకు కౌంటర్లో ఉంచిన సుమారు 3 వేల లడ్డూలకు ఫంగస్ రావడంతో దేవస్థానం అధికారులు శనివారం వాటిని పారబోయించారు. ప్రసాద విక్రయశాలకు చెందిన అధికారులు తయారైన లడ్డూలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కౌంటర్లకు పంపుతున్నా కౌంటర్లలో గాలి ఆడక, వేడి వాతావరణంతో పాడవుతున్నాయి. ఒకే సారి పెద్ద మొత్తంలో తయారు చేయించడం, స్టాక్ ఉంచడంతో అవి బూజు పట్టి వృథా అవుతున్నాయని అంటున్నారు. ఎందుకు పాడవుతున్నాయంటే..: తయారు చేసిన లడ్డూలను గాలికి ఆరబెట్టడం, లేదా చల్లని ప్రదేశాల్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ, దేవస్థానం అధికారులు ఇష్టానుసారం లడ్డూలను పంపడం, కౌంటర్లలో వేడివాతావరణం మధ్య అలాగే వదిలేస్తుండటంతో తొందరగా బూజు వచ్చి పాడవుతున్నాయి. ఇనుప రేకుల కౌంటర్ల వల్లే.. యాదాద్రి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల బాలాలయం పక్కన ఉన్న ప్రసాద విక్రయశాలను కూల్చివేశారు. కొత్తగా ఇనుప రేకులతో తయారు చేసిన కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో సరైన గాలి ఆడక, మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రతకు వేడి అధికంగా ఉంటోంది. దీంతో లడ్డూలకు బూజు వచ్చినట్లు కౌంటర్ సిబ్బంది అంటున్నారు. కాగా, కౌంటర్లలోని లడ్డూలకు బూజు పట్టినమాట వాస్తవమేని ప్రసాద విక్రయశాల సూపరింటెండెంట్ విజయకుమార్ అన్నారు. లడ్డూలు పాడుకాకుండా కౌంటర్లలో ఏసీలు అమర్చుతామని వెల్లడించారు. -
వైకుంఠ నారాయణుడిగా లక్ష్మీ నారసింహుడు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని పాతగుట్టలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి అమ్మవార్లు వైకుంఠ నారాయణుడిగా అలంకారం చేసి ఊరేగించారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేసి ప్రత్యేక సేవలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు. ఆలయంలో విశేష పూజలు స్వామి అమ్మవార్ల ప్రధానాలాయం బాలాలయంలో ఉదయం నిత్య కైంకర్యాలను నిర్వహించి ఆరాధన, బాల భోగం, వంటి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్ధం ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆస్థానాచార్యులు రాఘవాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, సురేంద్రాచార్యులు, గట్టు వెంకటాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర శర్మ, మేడి శివకుమార్ పాల్గొన్నారు. భక్తజన క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం భక్తులతో కిటకిట లాడింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, గర్భాలయం తదితర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. కొండపైకి వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో వాహన పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి 5 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
యాదాద్రిలో పనుల నత్తనడక
సాక్షి, యాదాద్రి: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా తయారైంది యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనుల ప్రగతి. యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని ప్రపంచస్థాయి దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం కొండపైన శనివారం ప్రారంభం కావాల్సిన ప్రధానాలయం గోపుర నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి. కూల్చివేతలు పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. పనులను వేగవంతం చేయాలని గత నెల 19న సీఎం యూదాద్రికి వచ్చినప్పుడు అధికారులను ఆదేశించారు. అయినా పనుల్లో వేగం పుంజుకోలేదు. కొం డపై 2.33 ఎకరాల్లో ప్రధానాలయం నిర్మాణాల కోసం చేపట్టిన కూల్చివేతలు ఇంకా పూర్తి కాలేదు. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం నెలరోజుల క్రితమే కూల్చివేతలు మొత్తం పూర్తి కావాలి. గోపురాలు, శిల్పాల పనులను మొదలుపెట్టాలి. ఇందుకోసం తెచ్చిన రాతి స్తంభాలు కొండపై సిద్ధంగా ఉంచారు. కానీ, ఆయూ పనులు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కటీ పూర్తి కాలేదు 4 రాజగోపురాలకుగాను ఒక్కటి కూడా పూర్తి కాలేదు. దక్షిణం వైపు లోతైన ప్రాంతం నుం చి నిర్మించాల్సి ఉంది. మిగతావి కొండపైనే నిర్మిస్తున్నా అవి నత్తనడకనే సాగుతున్నా యి. ముందుగా ప్రారంభించిన రిటైనింగ్ వాల్ పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి. వారం గడువు ఇచ్చిన అధికారులు ప్రధానాలయ మండపం కూల్చివేతలు ఇప్పటికే పూర్తికావాలి. రెండు ప్రాకారాలు, ఆరు గోపురాలు, స్వర్ణతాపడంతో కూడిన విమాన గోపురం నిర్మించాల్సి ఉంది. కొండపైన ఇతర నిర్మాణాల కూల్చివేత పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.