సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యా దగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 11గం టలకు చేరుకోనున్న కేసీఆర్.. ముందుగా స్వామివారిని దర్శించుకుంటారు. అనంత రం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. ప్రధానాలయంలో శిల్పి పనుల తుది మెరుగులు, శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులతో పాటు కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. తర్వాత ఆయా శాఖాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానాలయాన్ని దసరా నాటికి ప్రాంభించే అవకాశాలను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment