యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలోని ఆళ్వార్ మండపంలో నిర్మించిన ధ్వజస్తంభం బలి పీఠానికి బంగారు తొడుగు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధానాలయంలోని గర్భాలయ ద్వారాలకు చెన్నైలో తయారు చేయించిన బంగారు తొడుగులను బిగించారు. ఇందులో భాగంగానే ధ్వజస్తంభం బలిపీఠానికి వారం రోజుల కిందట బంగారు తొడుగు పనులను ప్రారంభించారు.
బంగారు తొడుగులతో బలిపీఠం, ధ్వజస్తంభం భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయమంతా బంగారు వర్ణంలో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే విద్యుత్ దీపాలను పసిడి వర్ణంలో తీర్చిదిద్దుతుండగా.. ప్రధానాలయంలో అంతటా బంగారు తొడుగుల పనులను చేయిస్తున్నారు. (చదవండి: జూబ్లీహిల్స్వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన)
Comments
Please login to add a commentAdd a comment