balipeetam
-
సత్యప్రమాణాలకు నిలయం.. తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయం
గుర్రంకొండ: నిజం పలికించే బలిపీఠం తరిగొండలోని శ్రీలక్ష్మినరసింహ్వామి ఆలయం. సత్యప్రమాణాలకు నిలయంగా అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఆలయంగా శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి ఆలయంలోని సత్యప్రమాణాలు చేసే బలిపీఠం దుర్వాసమహర్షి ప్రతిష్టించాడని పురాణ కథనం. తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణం చేయాలంటే భయపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆధునిక సమాజంలో సత్యప్రమాణాల నిలయంగా తరిగొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం విరాజిల్లుతుండడం విశేషం. దుర్వాస మహర్షి ఇక్కడి ఆలయంలో బలిపీఠం ప్రతిష్టించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఆలయం వెలుపల స్వామివారికి ఎదురుగా ఈ బలిపీఠం ఉంది. అత్యంత శక్తివంతమైన శ్రీచక్రయంత్రం పీఠం కింద ఏర్పాటు చేసి బలిపీఠానికి అత్యంత శక్తిని చేకూర్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ బలిపీఠమే కాలక్రమేణా సత్యప్రమాణాలకు నిలయంగా మారింది. బలిపీఠం ముందరే ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు శ్రీవెంగమాంబ ఆలయం ఉంది. ఉమ్మడి రాయలసీమజిల్లాలో కాణిపాకం తరువాత ఎక్కువగా సత్యప్రమాణాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆచారం ప్రకారమే సత్యప్రమాణాలు: ఇక్కడి ఆచారం ప్రకారమే ఎవరైనా సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేసేవారు ముందుగా ఆలయ ప్రాంగణంలోని బావినీటితో స్నానం ఆచరించాలి. తడిబట్టలతో బలిపీఠం వద్దకు చేరుకొని ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆలయప్రాముఖ్యత, స్వామివారి మహత్యం తెలిసినవారు ఎవ్వరు కూడా తప్పు చేసి ఇక్కడ సత్యప్రమాణం చేసే సాహసం చేయరు. చాలా మంది స్నానాలు చేసి ప్రమాణం చేసే ముందు ఆలయ అర్చకులు చెప్పేమాటలు విని వెనకడగు వేసి నిజం అంగీకరించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. తప్పుడు ప్రమాణాలు చేస్తే వారి వంశం నిర్వీర్యమవుతుందనేది భక్తుల నమ్మకం. ఈ విషయాన్ని దుర్వాస మహాముని ఇక్కడ శాసనం చేసినట్లు ఆలయ అర్చకులు చెబుతుంటారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి సత్యప్రమాణాలు చేసేందుకు వస్తుంటారు. దేవుడిపై నమ్మకం ఎక్కువ తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి మీద భక్తులకు, గ్రామస్తులకు నమ్మకం ఎక్కువ. ఆలయంలోని బలిపీఠం మీద సత్యప్రమాణాలు చేయాలంటే తప్పు చేయలేదనే భావన ఉండాలి. ఆధునికంగా ఎంతో టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడి ఆలయంలో సత్యప్రమాణంపై భక్తులకు సడలని నమ్మకం ఉంది. ఎక్కడెక్కడి నుంచో సత్యప్రమాణాలు చేసేందుకు ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. – ప్రకాష్‌రెడ్డి, గ్రామస్తులు, తరిగొండ సత్యప్రమాణం చేయాలంటే భయం తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణాలు చేయడానికి భయపడతారు. తప్పు చేసి కావాలనే తప్పుగా ప్రమాణం చేస్తే అందుకు తగిన శిక్ష అనుభవిస్తారు. బలిపీఠం గురించి చెప్పే మాటలు విని సాధ్యమైనంత వరకు బలిపీఠం దగ్గరకు వచ్చి చాలా మంది నిజం అంగీకరించి వెనుదిరిగి వెళ్లిపోతుంటారు. ఎలాంటి తప్పు చేయని వాళ్లు మాత్రమే సత్యప్రమాణం చేసేందకు ధైర్యం ఉంటుంది. – గోపాలబట్టర్, ఆలయ అర్చకులు, తరిగొండ -
Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలోని ఆళ్వార్ మండపంలో నిర్మించిన ధ్వజస్తంభం బలి పీఠానికి బంగారు తొడుగు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధానాలయంలోని గర్భాలయ ద్వారాలకు చెన్నైలో తయారు చేయించిన బంగారు తొడుగులను బిగించారు. ఇందులో భాగంగానే ధ్వజస్తంభం బలిపీఠానికి వారం రోజుల కిందట బంగారు తొడుగు పనులను ప్రారంభించారు. బంగారు తొడుగులతో బలిపీఠం, ధ్వజస్తంభం భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయమంతా బంగారు వర్ణంలో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే విద్యుత్ దీపాలను పసిడి వర్ణంలో తీర్చిదిద్దుతుండగా.. ప్రధానాలయంలో అంతటా బంగారు తొడుగుల పనులను చేయిస్తున్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన) -
పరివార ఆలయాలు – దేవతలు
ఆలయానికి దేవాలయం.. దేవస్థానం అనే పేర్లు ప్రచారంలో ఉన్నా ఆగమం అందులో ఓ తేడాను చెప్తుంది. గర్భగుడి.. గుడిలో మూలమూర్తి లేదా శివలింగం.. ఎదురుగా నంది/వాహనం... ధ్వజస్తంభం..బలిపీఠం ఇవి మాత్రమే ఉంటే దాన్ని దేవాలయం అంటారు. అదే వీటితోపాటు దేవి, గణపతి, స్కందుడు, చండేశ్వరుడు, పరివార దేవాలయాలు, అనేక శాలలు, గోపురాలు ఉన్నదాన్ని దేవస్థానం అంటారు. శయనాలయం దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత తప్పనిసరిగా ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలను దర్శించుకోవాలి. వాటిలో ఉన్న దేవతలను పరివార దేవతలు అంటారు. పరివార దేవతలను తప్పక దర్శించాలి అన్నది ఆలయ నియమం. స్వామివారి దేవేరులు.. పిల్లలు...ద్వారదేవతలు... దిక్పాలకులు.. గణనాయకుడు.. సేనాపతి... ఋషులు.. భక్తులు వీళ్లంతా పరివారదేవతలుగానే పరిగణించబడతారు. పరివార దేవతలందరికీ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. రాజు ఒక పనిని తన పరివారం తోడ్పాటుతో పూర్తి చేసినట్లే... ఇక్కడ భగవంతుడు తన భక్తుల కోర్కెలను కూడా ఈ పరివార దేవతల ద్వారా తీరుస్తాడు. ఈ పరివార దేవతలనే ఆవరణ దేవతలు, ఉపదేవతలు అని కూడా అంటారు. వీరిని మూలమూర్తితో పాటు నిత్యం పూజిస్తారు. ఈ పరివారమూర్తులను ప్రతిష్ఠించడం దేవాలయానికి శోభను.. శాంతిని... మరింత పవిత్రతను.. తెచ్చిపెడుతుందని శ్రీ ప్రశ్నసంహిత చెబుతుంది. ఈ పరివార దేవతలు సామాన్యంగా ఎనిమిది మందితో మొదలై గరిష్టంగా అరవైనాలుగుమంది వరకూ ఉంటారు. మొదటి ప్రాకారంలో.. అంటే గర్భగుడి చుట్టూ ఎనిమిదిమంది ... రెండవ ప్రాకారంలో పదహారుమంది... మూడవ ప్రాకారంలో ముప్పైరెండుమంది పరివార దేవతలుండాలని మానసార శిల్పశాస్త్రం చెప్పింది. పన్నెండుమంది పరివారదేవతలుంటే ఉత్తమం అని సనత్కుమారసంహిత చెప్తుంది. వైఖానసాగమంలో ఎనిమిదిమందితో మొదలై.. ఏడుప్రాకారాలు.. నూటపన్నెండుమంది పరివారదేవతల వరకు ఉంది. అలా ఉన్న ఆలయమే ఉత్తమోత్తమమైనది అని చెప్తోంది. శివాలయానికి దేవి, నంది, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అగ్నిదుర్గా, అగస్త్యుడు, బ్రహ్మ, సప్తమాతృకలు, వీరభద్రుడు, విష్ణువు, శివసూర్యుడు, జ్యేష్ఠ పరివారదేవతలుగా ఉంటారు. విష్ణ్వాలయానికి దేవేరులు శ్రీదేవి–భూదేవి, గరుడుడు, విష్వక్సేనుడు, చక్రమూర్తి, దశావతారాలు, పంచమూర్తులు, నవమూర్తులు, ద్వాదశాదిత్యులు పరివారదేవతలు. శక్తి ఆలయానికి జయా, విజయా, అజితా, అపరాజితా, విభక్తా, మంగళా, మోహినీ, స్తంభినీ అనే ఎనిమిదిమంది దేవతలు. పరివారదేవతలను దర్శించి మూలమూర్తి దగ్గర కోరిన కోరికలు మరోమారు తలుచుకుంటే మన కోరికలు తప్పక నెరవేరుతాయన్నది ఆగమ శాస్త్రోక్తి. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
కుశలమా నీకు కుశలమేనా?
పొగడ నీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది ‘చిన్న తల్లి ఏమంది? నాన్న ముద్దు కావాలంది పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి’ కొన్ని నేరుగా చెప్పలేము. చెప్పినా అందంగా ఉండదు. ప్రేమించిన భార్యో, భర్తో ఎక్కడో సుదూరాన ఉన్నప్పుడు మన ఒంట్లోని మాత్రమే కాదు, ఇంట్లోని అణువణువూ కూడా వాళ్లను కోరుకుంటుంది. వాళ్ల సమక్షంలోనే చైతన్యం పొందగలిగేవి చాలా ఉంటాయి. ‘బలిపీఠం’ కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఈ పాట ‘కుశలమా నీకు కుశలమేనా? మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే అంతే అంతే కుశలమా నీకు కుశలమేనా? ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను అంతే అంతే అంతే’ కూడా అదే వ్యక్తం చేసింది. ‘పెరటిలోని పూలపానుపు త్వర త్వరగా రమ్మంది పొగడ నీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో పూలగాలి రెక్కలపైనా నీలిమబ్బు పాయలపైనా అందేనా ఆ ఒకటైనా ఆఆఆ’ దీనికి సంగీతం చక్రవర్తి. పాడినవారు సుశీల, బాలసుబ్రహ్మణ్యం. రంగనాయకమ్మ నవల ఆధారంగా 1975లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణరావు. శారద, శోభన్‌బాబు నటీనటులు. -
బలిపీఠం నుంచి భాగవతం దాకా
1969వ సంవత్సరానికి కాస్త అటో యిటో ‘బలిపీఠం’ చదివాను. రంగనాయకమ్మ రచన. ఒక నవలలోని ఇతివృత్తం ఉదాత్తంగా వుండాలనీ, పాత్రలు సమాజంలోంచి రావాలనీ, సంభాషణలు సహజంగా వుండాలనీ, శిల్ప సంయోజనం కళాత్మకంగా వుండాలనీ... యింకా యిటువంటి పెద్దపెద్ద మాటలు తెలియని వయస్సు నాది. అప్పటికి నాకు పదమూడేళ్ళే! అయితేనేం... భాస్కర్‌ను పెళ్ళి చేసుకోవాలని ఆశించిన తారలోని భంగపాటూ, హరిజనుడూ ఆదర్శ యువకుడూ అయిన భాస్కర్ బ్రాహ్మణ బాల వితంతువైన అరుణను వివాహం చేసుకొని పడిన బాధలూ, నవల చివరలో అరుణ తన అవసాన దశలో పశ్చాత్తాçపపడుతూ భాస్కర్‌తో మాట్లాడిన మాటలూ నన్ను కళ్ళనీళ్ళ పర్యంతం చేశాయి. నా పఠన ప్రస్థానంలో చిన్నతనంలోనే బలంగా నాటుకున్న స్మృతి శకలం అది. 1977 వచ్చేసింది ఎమర్జెన్సీ పీడ తొలగిపోయింది. కరీంనగర్లో కల్లోలంగా ఉంది. అప్పటికి నాకు ఇరవై ఏళ్ళు. ఉడుకు నెత్తురు ఉరకలేస్తున్న ప్రాయం. ‘మహాప్రస్థానం’ కంటబడింది. నేను వెంటపడ్డాను. అది నా ఒంటపట్టింది. మంచి కండపుష్టి కలిగిన ఆ కవిత్వం దాదాపు కంఠతాపాఠమైంది. శ్రీశ్రీ సామాన్యుణ్ణి సాహిత్యంలో మాన్యుణ్ణి చేశాడు. కష్టజీవులు ఇష్టజీవులయ్యారు. కర్మవీరులు ధర్మ ధీరులయ్యారు. ‘కవితా ఓ కవితా’ చదివి కదిలిపోయాను. మా తరాన్ని ఒక ఊపు ఊపి, కొత్త చూపు నిచ్చి, ఓ రకం కైపులో ముంచి, ప్రజల వైపు నిలబెట్టిన మహాప్రస్థాన స్థానం తెలుగు సాహిత్యంలోనే నిరుపమానం. ఆ తర్వాత తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ చదివాను. ఆ రాత్రికి జడవలేదు. అమృతంలో తడిసాను. ఆ అమృతం వల్ల మరణాన్ని జయించామో లేదో కాని అద్భుతమైన కవిత్వ పఠనంతో జీవించనైతే జీవించాము. ‘ఆర్తగీతం’ చదివి నా కార్జాలు కాలిపోయినై. గుండెలు కూలిపోయినై. 1956 నాటి పరిస్థితుల్లో పెద్దగా యిప్పటికీ మార్పులు లేకపోవటం పెద్ద విషాదం. తిలక్ వల్ల కవిత్వం ఒక ఆల్కెమీ అని తెలిసింది. కవితకు అభ్యుదయ కాంక్ష వున్న వస్తువే కాదు, కళాత్మకమైన శైలీ రమ్యత కూడా అవసరం అన్న అవగాహన కలిగింది. 1995 వచ్చింది. పరిస్థితులు మారినై. ప్రపంచీకరణ దుష్ప్రభావం మొదలైంది. అస్తిత్వవాద ఛాయలు సాహిత్యంలో కనిపించినై. సమాజంలో ఆ అస్తిత్వ పరివేదనలో భాగంగా తెలంగాణ ఉద్యమం మొదలవుతున్నది. తెలంగాణ కవుల్ని ఒక ప్రత్యేకమైన అభినివేశంతో చదవాలన్న తపన పెరిగింది. పోతన్న దగ్గరికి పోయాను. అతను బాగవ్రతం చేసి రాసిన భాగవతం ఎనిమిది స్కంధాలూ చదివాను. అతని భక్త్యావేశ పారమ్యానికి పరవశుణ్ణి అయ్యాను. కవిత్వమే కాదు, కవుల వ్యక్తిత్వాలూ ఉన్నతంగా వుండాలన్న నా అభిమతానికి అతి దగ్గరగా పోతన కన్పించాడు. పోతన భావజాలంతో నాకు పూర్తిగా ఏకీభావం లేకున్నా ఆ కవిత్వంలోని నిమగ్నత నన్ను ముగ్ధుణ్ని చేసింది. ఇప్పటికి భాగవతాన్ని మూడుసార్లు చదివాను. మిల్టన్ ‘పారడైజ్ లాస్ట్’లోని ఉదాత్త శైలి పోతన్నలో కనిపించింది. ఇక ఆ తరువాత ‘మట్టి మనిషి’ దగ్గరికి వెళ్ళాను. వాసిరెడ్డి సీతాదేవి నవల. గొప్ప రచన. మట్టిలో మట్టిగా మారి నేలలోంచి రత్నాల రాశులు తీస్తున్న సాంబయ్య కనిపించాడు. అతని కొడుకు కోడలు వరూధిని వల్ల పట్నం వెళ్ళాడు. పట్టణ ప్రలోభంలో మాయలో వరూధిని గల్లంతైంది. చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త వెంకటపతిదీ అదే దుర్గతి. వాళ్లకో కొడుకు. వాడు పల్లెలో వున్న తాతను ఆశ్రయించాడు. ఆద్యంతం మలుపులతో, ఆసక్తికరమైన కథనంతో, దున్నేవాడిదే భూమి అంటూ, తుపాకితోనైనా దాన్ని సాధిస్తానని రవి నోట పలికించిన మాటలు నవలకు మంచి ముక్తాయింపునిచ్చాయి. తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితమై ఆలోచించినప్పుడు ఈ ఐదు పుస్తకాలూ నాకు బాగా నచ్చిన పుస్తకాలు ఆయా సన్నివేశాల్లో. డా‘‘ నలిమెల భాస్కర్ 9704374081