
పొగడ నీడ పొదరిల్లో
దిగులు దిగులుగా ఉంది
‘చిన్న తల్లి ఏమంది? నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి’
కొన్ని నేరుగా చెప్పలేము. చెప్పినా అందంగా ఉండదు. ప్రేమించిన భార్యో, భర్తో ఎక్కడో సుదూరాన ఉన్నప్పుడు మన ఒంట్లోని మాత్రమే కాదు, ఇంట్లోని అణువణువూ కూడా వాళ్లను కోరుకుంటుంది. వాళ్ల సమక్షంలోనే చైతన్యం పొందగలిగేవి చాలా ఉంటాయి. ‘బలిపీఠం’ కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఈ పాట ‘కుశలమా నీకు కుశలమేనా?
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే అంతే అంతే
కుశలమా నీకు కుశలమేనా?
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను అంతే అంతే అంతే’ కూడా అదే వ్యక్తం చేసింది.
‘పెరటిలోని పూలపానుపు త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా నీలిమబ్బు పాయలపైనా
అందేనా ఆ ఒకటైనా ఆఆఆ’
దీనికి సంగీతం చక్రవర్తి. పాడినవారు సుశీల, బాలసుబ్రహ్మణ్యం. రంగనాయకమ్మ నవల ఆధారంగా 1975లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణరావు. శారద, శోభన్‌బాబు నటీనటులు.