ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. 25 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌస్‌ల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరలపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి.
1/11
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువులో ఓ జాలరికి 25 కిలోల చేప దొరికింది. చేప విలువ సుమారు రూ.5 వేలు ఉంటుందని జాలరీ గూండ్ల సాయిలు తెలిపారు. – ఎడపల్లి(బోధన్)
2/11
వల విసరడమూ ఓ కళే. సరిగ్గా విసిరితేనే చేపలు చిక్కుతాయి. లేదంటే వల వేయలేక విలవిల్లాడాల్సిందే. శుక్రవారం కురిసిన వర్షానికి మంచిర్యాలలోని రాళ్లవాగులో వరద నీరు చేరింది. శనివారం చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉత్సాహం చూపారు. పోటీపడి వలలు విసురుతూ చేపలు పడుతున్న దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల
3/11
‘అవ్వా అన్నం వండుతున్నవా’.. అంటూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామంలో ఓ వృద్ధురాలితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గరిటె తిప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా శనివారం గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే.. ఆదివారం ఉదయం దళిత కాలనీలో ఇంటింటా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో అక్కడి ఓ పూరిగుడిసెలో వంట చేసుకుంటున్న వృద్ధురాలు సుగుణను పలకరించారు. ఆమెతో కలిసి తానూ కొద్దిసేపు వంట వండారు.
4/11
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. స్వామి ధర్మ దర్శనానికి రెండున్నర నుంచి మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టింది. స్వామివారిని 25 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
5/11
గ్రామాల్లో గతంలో ఇంటికో జత కాడెడ్లు ఉండేవి. రానురాను వాటి పాత్ర కనుమరుగవుతోంది. వాటి స్థానాన్ని ట్రాక్టర్లు, యంత్రాలు ఆక్రమించాయి. చిన్న, సన్నకారు రైతులకు ఇవి వ్యయంతో కూడుకున్న పని. తండ్రి కష్టం చూడలేక పిల్లలు ఓ చిన్నపాటి గుంటుకలాంటి యంత్రం సాయంతో కలుపుతీసి తండ్రికి సాయమయ్యారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి గ్రామానికి చెందిన రైతు కేశబోయిన స్వామి తమ ఎకరం పొలంలో వేసిన మిరప చేనులోని కలుపును పిల్లలు శ్రావణి, కార్తిక్ ఇలా తీస్తూ ఆదివారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు.
6/11
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్కకు సంబంధించి వివరాలతో క్యూఆర్ కోడ్‌లను రూపొందించారు. ప్రతి మొక్క వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌లను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే మొక్క శాస్త్రీయ నామం, స్థానిక నామం తదితర వివరాలు తెలుసుకోవచ్చునని ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్‌సింగ్ తెలిపారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
7/11
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపాన ఆదివారం మిడతల దండు కలకలం రేపింది. ఇవి చిన్నచిన్న మొక్కలను తినేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ అవి స్థానిక మిడతలేనని, వాటివల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులుండవని చెప్పారు.
8/11
పంజాబ్‌లో కరెంటు కోతలను నిరసిస్తూ చండీగఢ్ శివార్లలో ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపై జల ఫిరంగులు ప్రయోగించి చెదరగొడుతున్న పోలీసులు
9/11
ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో శాస్త్రీ భవన్ ఎదుట సిలిండర్లతో నిరసన తెలుపుతున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు
10/11
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంపుహౌస్‌లో నాలుగు మోటార్లతో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఆదివారం పంపుహౌస్‌లోని 17 మోటార్లలో 13, 14, 16, 17 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా, గ్రావిటీ కాల్వ గుండా అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలిపోతున్నాయి.
11/11
ఉక్రెయిన్‌లోని కీవ్ నగరంలో మిలటరీ పరేడ్ సన్నాహాల్లో కాళ్లకు హీల్స్ ధరించి పాల్గొన్న ఉక్రెయిన్ మహిళా సైనికులు. సాధారణంగా సైనికులు బూట్లు ధరించి పరేడ్‌లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment