
వాన చినుకులు ముద్దాడిన వేళ పుడమి తల్లి పచ్చదనాల కోక కట్టింది. పచ్చని పొలాల మధ్య రైలు కోయిలై కూత పెడుతుంటే మనసు పరవశించిపోయింది. పల్లె పల్లెంతా మెరిసిపోయింది. ఇది నిన్నటి కథ. మరి నేడు?.. భానుడి ప్రతాపానికి పల్లె కళ తప్పింది. వాగూవంకా ఎండిపోయింది. చెట్టూచేమా మాడిపోయింది. రైలు పరుగు తీస్తుంటే మది మూగబోయింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి గ్రామంలోనిదీ దృశ్యం.
- సాక్షి ఫొటోగ్రాఫర్/ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment