Talamadugu
-
బీజేపీ విజయానికి కృషి చేయాలి..! పాయల్ శంకర్
పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్: వచ్చే ఎన్నికల్లో విజయం సాఽధించేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవపూర్, కుచులపూర్ గ్రామాల్లో బీజేపీ మహాజన్ సంపర్క్‌లో భాగంగా టిఫిన్ బాక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాఽధించేలా గ్రామాల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. అధికార పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. సమయం తక్కువగా ఉందని, ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, లోక ప్రవీణ్‌రెడ్డి, రఘుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మానాజీ, జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి, బాబారవ్ పటేల్, జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, బోథ్ అసెంబ్లీ కన్వీనర్ సూర్యకాంత్ గిత్తే, తలమడుగు మండల అధ్యక్షులు బోనగిరి స్వామి, ఇచ్చోడ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ పాల్గొన్నారు. -
గిరిజన మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని డోర్లి గ్రామానికి గిరిజన వివాహితపై నలుగురు సామూహిక లైంగిక దాడి చేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గిరిజన మహిళ(30)కు భర్త , పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మహిళ ఇంటికి వచ్చారు, ఒంటరిగా ఉండటం గమనించి ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు. పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు నిలదీశారు, ఆదివారం ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు, బబాధితురాలు పేర్కొన్న నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు, గ్యాంగ్ రేప్ సమాచారం అందుకున ఆదిలాబాద్ రూరల్ సీఐ రఘుపతి గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. -
పాతికేళ్లుగా మద్యం, మాంసానికి దూరం.. అలా ఎలా సాధ్యమంటే..
సాక్షి, తలమడుగు(ఆదిలాబాద్): మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టకుండా.. నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా. గొడవలు లేకుండా.. ఠాణా మెట్లెక్కకుండా ఐక్యతతో మందుకు సాగుతున్నారు ఈ గ్రామస్తులు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఈ పంచాయతీపై ప్రత్యేక కథనం. నాడు (1997లో) తండాలో పలువురు మద్యానికి బానిసయ్యారు. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అప్పుడే తండా పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరూ మద్యం ముట్టవద్దని.. అమ్మవద్దని తీర్మాణం చేశారు. అదే సమయంలో గ్రామానికి నారాయణ బాబా విచ్చేశారు. ఆయన ప్రబోధాలతో మాంసానికి సైతం దూరమయ్యారు. ఆధ్యాత్మికానికి చేరువయ్యారు. ఆధ్యాత్మికం వైపు... గ్రామ జనాభా 800 వరకు ఉంటుంది. నారాయణ బాబా మరణానంతరం గ్రామంలో ఆయన పేరిట 13 ఏళ్ల క్రితం ఆలయం నిర్మించుకున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడం.. అన్నదానాలు చేయడం.. ఏటా దత్తజయంతి ఉత్సవాలను సమష్టిగా ఘనంగా నిర్వహించుకోవడం వీరికి ఆనవాయితీ. సమష్టి నిర్ణయాలతో గ్రామ అభివృద్ధిలోనూ అందరూ భాగస్వాములవుతున్నారు. వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీసద్గురు నా రాయణబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం సైతం నిర్మించి పలువురికి ఆశ్రయం కల్పిస్తున్నారు. సంస్థాన్ అధ్యక్షుడు జాదవ్ కిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నూతన పంచాయతీ... ఇటీవల ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయగా పల్సి తండా అందులో భాగమైంది. సమష్టి నిర్ణయంతో ఏకగ్రీవం బాటపట్టింది. ఎన్నిక లేకుండానే సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకున్నారు ఇక్కడి వారు. మద్యానికి దూరంగా ఉండడంతోనే ఐక్యత నెలకొందని, అంతేకాకుండా గొడవలు లేకుండా శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఏకగ్రీవంగానే.. మా గ్రామంలో సర్పంచ్, వార్డుమెంబర్ల ఎన్నికలు జరుగలే. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నాం. సర్పంచ్‌గా నన్ను ఎన్నుకున్న రు. అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తున్నా. – చౌహన్ ఆంగుర్, సర్పంచ్ ఒకే మాటపై ఉంటాం.. గ్రామ జనాభా 800 దాకా ఉంటది. అందరం ఒకే మాటపై ఉంటాం. దానికి కారణం గ్రామంలో పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టుకోకపోవడమే. పండుగలు, శుభకార్యాలను కలిసిమెలిసి జరుపుకుంటాం. – జాదవ్ కిషన్, నారాయణబాబా సంస్థాన్ అధ్యక్షుడు ఠాణా మెట్లు ఎక్కలే.. మద్యానికి దూరంగా ఉండడంతో ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి గొడవలు జరిగిన సంఘటనలు లేవు. ఠాణా మెట్లు కూడా ఎక్కలే. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. – జాదవ్ విజయ్‌కుమార్, టీచర్ -
కలిసి కట్టుగా కదిలారు.. అక్రమార్కుల భరతం పట్టారు
విత్తనాలతో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన అక్రమార్కులకు సరైన గుణపాఠం చెప్పారు. అన్నదాతలకు అండగా తాము ఉన్నామంటూ భరోసాయిచ్చారు. తలమడుగు: తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించి దాడి చేయడంతో జైపాల్‌రెడ్డి అనే రైతు మనస్తాపం చెందాడు. కొడుకు చరణ్‌రెడ్డితో కలిసి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతు కష్టం చూసి ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. చందాలతో విత్తనాలు కొని ఆ రైతు భూమిని చదును చేసి పత్తి విత్తనాలు వేశారు. భూకబ్జాకు యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగింది. ఒక్కడి కోసం అందరూ..! అదే రోజు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో అదే తరహలో మరో ఘటన జరిగింది. రైతు మీసాల లింగన్న 25 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి తమదని కొంతమంది ఆదిలాబాద్‌కు చెందిన అబ్దుల్ రజాక్, అబ్దుల్ సాజిద్, రజాక్ వచ్చి చేనులో పత్తి విత్తనాలు నాటారు. ఆరోజు లింగన్న గ్రామంలో లేకపోవడంతో విషయం బయటకు రాలేదు. తాజాగా మంగళవారం చేనును పరిశీలించిన రైతు లింగన్న ఆందోళన చెందాడు. విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా బాధిత రైతుకు మద్దతుగా అందరూ ఒక్కటయ్యారు. అరకలు పట్టుకుని లింగన్న చేను వద్దకు వెళ్లి.. ఆక్రమణదారులు నాటిన పత్తి విత్తనాలను చెడగొట్టారు. తర్వాత లింగన్న గ్రామస్తుల సాయంతో తాను పత్తి విత్తనాలు నాటాడు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ తాను 25 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన అబ్దుల్ బాబుసేట్ వద్ద ఎకరాకు రూ.50 వేల చొప్పున నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. తండ్రి అమ్మిన ఇప్పుడు కొడుకులు, బంధువులు వచ్చి భూమి తమదని ఆక్రమించుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. గ్రామస్తులు కూడా మరోమారు ఎవరైనా లింగన్న పొలంలో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత రైతు లింగన్న తలమడుగు పోలీస్ స్టేషన్లో అబ్దుల్ రజాక్, అబ్దుల్ సాజిద్, రజాక్‌పై ఫిర్యాదు చేశాడు. జైపాల్‌రెడ్డి పొలాన్ని పరిశీలించిన ఆర్డీవో తమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో రైతు జైపాల్‌రెడ్డి పొలాన్ని ఆర్డీవో రాథోడ్ రమేశ్ మంగళవారం పరిశీలించారు. జైపాల్‌రెడ్డి పొలం పక్క పొలం రైతుల వివరాలు తెలుసుకున్నారు. ఆసర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది, పక్కన గల రైతు స్వామి పొలాన్ని చుట్టు పక్కల హద్దుల వివరాలను, రెండు రోజుల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, సర్వేయర్ మనోజ్‌ను ఆదేశించారు. రైతు జైపాల్‌రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్డీవో వెంట గ్రామస్తులు కిరణ్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఉన్నారు. -
Photo Feature: సీను మార్చిన సూర్యుడు
వాన చినుకులు ముద్దాడిన వేళ పుడమి తల్లి పచ్చదనాల కోక కట్టింది. పచ్చని పొలాల మధ్య రైలు కోయిలై కూత పెడుతుంటే మనసు పరవశించిపోయింది. పల్లె పల్లెంతా మెరిసిపోయింది. ఇది నిన్నటి కథ. మరి నేడు?.. భానుడి ప్రతాపానికి పల్లె కళ తప్పింది. వాగూవంకా ఎండిపోయింది. చెట్టూచేమా మాడిపోయింది. రైలు పరుగు తీస్తుంటే మది మూగబోయింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి గ్రామంలోనిదీ దృశ్యం. - సాక్షి ఫొటోగ్రాఫర్/ఆదిలాబాద్ -
సెల్‌చార్జింగ్ పెడుతూ యువతి మృతి
తలమడుగు (ఆదిలాబాద్) : తలమడుగు మండలం బరంపూర్ గ్రామపంచాయతీ పరిధి కోలాంగూడకు చెందిన సీడాం కల్పన(20) బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతంతో మృతిచెందింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కల్పన ఇంట్లో తన సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
తలమడుగు : గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లాలో మొదటిసారిగా మన ఊరు-మన ప్రణాళిక* కార్యక్రమాన్ని శనివారం తలమడుగు మండలంలోని రూయ్యాడి గ్రామంలో ఆయన ప్రారంభించారు. మంత్రిగా మొదటిసారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక హుస్సేన్ హుస్సేన్ ఆలయంలో పూజలు చేసి అనంతరం అక్కడి నుంచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. దారిలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉందని, అదనపు తరగతి గదులు నిర్మించాలని, మరుగుదొడ్లు, తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. పాఠశాల భవనం పైనుంచి విద్యుత్ వైర్లు వెళ్తున్నాయని తెలుపగా.. విద్యుత్ శాఖ డీఈ, ఏఈలను సమస్య పరిష్కారాని ఆదేశించాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ చదువుకోవాలని కోరారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనతరం స్థానికంగా మొక్కలు నాటారు. ఎంపీ గెడం నగేశ్, బోథ్, ఖానాపూర్, నిర్మల్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, ఐకే రెడ్డి, జెడ్పీ చైర్మన్ శోభారాణి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఈవో అనితాగ్రేస్, డీఎంహెచ్‌వో బసవేశ్వరి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ రాము, జెడ్పీటీసీ సభ్యులు గంగమ్మ, పద్మ, ఎంపీడీవో సునిత, గ్రామ ప్రత్యేకాధికారి సంజీవ్‌రెడ్డి, గ్రామపెద్దలు, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మి, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.