తలమడుగు (ఆదిలాబాద్) : తలమడుగు మండలం బరంపూర్ గ్రామపంచాయతీ పరిధి కోలాంగూడకు చెందిన సీడాం కల్పన(20) బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతంతో మృతిచెందింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కల్పన ఇంట్లో తన సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.