విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
సీఎం రాక సందర్భంగా ఏర్పాటు
పొలాలకు సమీపంలో ఉండటంతో తీయబోయిన యువకులు
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన
కొల్చారం (నర్సాపూర్): విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్‌ఐ మహ మ్మద్ గౌస్ కథనం ప్రకా రం.. కిష్టాపూర్ గ్రామా నికి చెందిన ఎక్కెం యాదగిరి కుమారుడు నవీన్ (21), పసుపుల చిన్న వెంకటేశం కుమారుడు పసుపుల ప్రసాద్ (20) వారి వ్యవసాయ పొలంలో నారు మడికి నీరు పెట్టి, అడవి పందులు రాకుండా మంటలు పెట్టడానికి వెళ్లారు. కాగా, బుధవారం మెదక్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా వీరి పొలాలకు సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీలు విద్యుత్ హైటెన్షన్ వైర్‌కు ఆనుకొని ఉండటంతో వాటిని ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ తీయకుండా వదిలేశాడు. అయితే, ప్రసాద్, నవీన్ ఫ్లెక్సీలు తీయడానికి ప్రయతి్నంచగా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని నిర్లక్ష్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెదక్–నర్సాపూర్ జాతీ య రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో శాంతించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుల్లో ఒకరైన ప్రసాద్‌కి ఇటీవలే పెళ్లి కుదిరినట్లు గ్రామస్తులు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి మెదక్ చేరుకొని యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పు న అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment