
సాక్షి, ఆదిలాబాద్: ప్రకృతి సోయగాలను చూస్తే పరవశించిపోవాల్సిందే. అందులో అప్పుడప్పుడు మాత్రమే కనిపించే అందాలు మరింత కనువిందు చేస్తుంటాయి. అక్టోబర్ ప్రారంభంలోనే నిర్మల్ జిల్లా కేంద్రాన్ని ఆదివారం తెల్లవారుజామున మంచు దుప్పటి ఇలా కప్పేసింది.. పొగమంచు కమ్మేసింది. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కన్పించలేనంతగా మంచు ఆవరించింది. దీంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడినా.. ప్రజలు మాత్రం అహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్.