సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ, పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం.. వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
గోషామహల్‌లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment