
మంత్రి అమర్‌నాథ్ రెడ్డి జిల్లా పర్యటన
చిత్తూరు(రూరల్): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7న ఉదయం 9 గంటలకు తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారని తెలిపారు.
అనంతరం తిరుపతి నుంచి బయల్దేరి చంద్రగిరి, నేండ్రగుంట మీదుగా చిత్తూరుకు చేరుకుంటారని, పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను కలుస్తారన్నారు. 8న బి.కొత్తకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.