Minister Amarnath Reddy
-
కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్. తెలంగాణను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌పై కోపం ఉంటే ఆయన్నే హరీష్‌రావు విమర్శించువచ్చు కదా అని చురకలు అంటించారు. టీఆర్ఎస్, కేసీఆర్, హరీష్‌రావును చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైఎస్ఆర్సీపీకీ లేదని స్పష్టం చేశారు. మమ్మల్ని తిడితే మీకు మార్కులు పడతాయా? అని ప్రశ్నించారు. ‘ఏపీ భవన్లో హరీష్‌రావు అధికారిని కాలితో తన్నిన ఘటన జనం మర్చిపోలేదు, హరీష్ రావు.. సీఎం కేసీఆర్ మనిషా లేక రామోజీరావు మనిషా తేల్చుకోవాలి. తెలంగాణను చూసి మేం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మమ్మల్ని విమర్శిస్తే కేసీఆర్‌ను తిడతామని హరీష్‌రావు అనుకుంటున్నారేమో. కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్. మహా వృక్షంగా వైఎస్ఆర్ నాటిన మొక్క.. రేపటి నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు మంత్రి అమర్నాథ్. జనవరి నుంచి ఇన్ఫోసిస్ పూర్తిస్థాయి సేవలు అమలులోకి వస్తాయన్నారు. దీని ద్వారా తొలి దశలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2006లో వైఎస్ఆర్ వేసిన ఐటీ మొక్క నేడు మహా వృక్షంగా మారిందని గుర్తు చేశారు. దలపల్లా భూములపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా మాపై కామెంట్స్ సరికాదు: సజ్జల -
‘చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు’
తిరుమల: విశాఖ, విజయవాడ, తిరుపతికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖకు ఇన్ఫోసిస్ తరహా కంపెనీలు రానున్నాయని తెలిపారు. రాష్ట విభజన అనంతరం అందరూ ఏపీని హైదరాబాద్‌తో పోలుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్న అమర్నాథ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రచారం కోసం మాత్రమే పాకులాడతారని ఎద్దేవా చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆరుగురు మంత్రులు, అధికారులు, ఎస్పీలు, వలంటీర్లు ఉన్నారని తెలిపారు. వరదల కారణంగా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించలేదు అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇదీ చూడండి: వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? -
‘మంత్రి అనుచరులతో మాకు ప్రాణ హాని ఉంది’
సాక్షి, తిరుపతి: మంత్రి అమర్నాథ్రెడ్డి అనుచరులతో ప్రాణ హాని ఉందని నారాయణపురానికి చెందిన పుణ్యవతి అనే మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మంత్రి అల్లుడితోపాటు, ఆయన అనుచరులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారని ఆమె తెలిపింది. తమ రెండెకరాల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు మంత్రి అనుచరులు యత్నిస్తున్నారని మహిళ తెలిపింది. అంతేకాక, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై మంత్రి అమర్నాథ్రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. గత రాత్రి పొలం వద్ద ఉన్న సమయంలో మంత్రి అనుచరులు హతమర్చేందుకు ప్రయత్నాం చేశారని మహిళ చెప్పింది. మాకు ఏమైనా జరిగితే అందుకు మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుచరులే కారణమని పుణ్యవతి, ఆమె సోదరీమణులు ఆరోపించారు. -
తిరుపతిలో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సినీ నిర్మాత అంబికాకృష్ణ ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందేశారు. -
చెప్పినట్టు చేయండంతే..
►అధికారులకు మంత్రి అమరనాథరెడ్డి ఆదేశం ►అధికారపార్టీ సమావేశాన్ని తలపించిన అభివృద్ధి సమీక్ష ►ముందు వరుసలోనే టీడీపీ నాయకులు ►విపక్షాలకు ఆహ్వానం లేదు మీడియాకు మాత్రం నో ఎంట్రీ చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో అధికార పార్టీ నాయకుల పెత్తనం ఎక్కువైపోయింది. ఇప్పటికే జన్మభూమి కమిటీలు పథకాల అమలులో జోక్యం చేసుకుంటున్నాయి. తాము సూచించిన వారికే లబ్ధి చేకూర్చాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వీరి వైఖరితో అధికారులు తల పట్టుకుంటున్నారు. జిల్లా మంత్రి అమరనాథరెడ్డి ఆందోళనకు గురిచేసింది. జన్మభూమి కమిటీల తరహాలోనే.... ప్రజాప్రతినిదుల కనుసన్నల్లోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అమర్నా«థ్‌రెడ్డి అ«ధికారులకు సూచించారు. ఈయన నిర్వహించిన అధికారుల సమీక్ష టీడీపీ పార్టీ సమావేశాన్ని తలపించింది. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు ఒకడుగు ముందుకేసి ఏకంగా అధికారులకు ముందు వరుసలో కూర్చున్నారు. వీరి వెనుకే కూర్చుని అధికారులు మంత్రి చెప్పిన మాటలు వినాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మలతో పాటు పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జిలు లలితకుమారి, వెంకటరమణరాజు, టీడీపీ నాయకురాలు వైవీ రాజేశ్వరిలు ముందువరుసలో కూర్చున్నారు. మరికొందరు టీడీపీ నాయకులు కూడా అధికారులతో సమానంగా సమావేశం ముగిసేంత వరకు కూర్చున్నారు. సమావేశానికి మీడియాను హజరుకానీయకుండా బయటకు పంపివేశారు. అనంతరం గది తలుపులు మూసివేసి దాదాపు మూడు గంటల పాటు సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ఎంపిక, అమల్లో అధికారులు తప్పని సరిగా స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని మంత్రి ఆదేశించినట్లు భోగట్టా. ప్రజాప్రతినిధులు సూచించిన మేరకు సమన్వయం చేసుకుని అధికారులు మెలగాలన్నారు. ఈ విషయాలను విన్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే జన్మభూమి కమిటీల ప్రమేయం వలన ప్రజలకు పథకాల అమల్లో న్యాయం చేయలేక పోతున్నామని, దీనికితోడు ప్రజాప్రతినిదులు కనుసన్నల్లోనే అన్నీ జరగాలంటే ఇక తామెందుకని అధికారులు బాధపడినట్లు తెలిసింది. రహస్య రివ్యూ సమావేశమా..? ఇటీవల అన్ని ప్రభుత్వ విభాగాల హెచ్వోడీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష ఉందని రాష్ట్ర మంత్రి ప్రకటించారు. కారణం చూపకుండానే సమావేశం రద్దు చేశారు. మంత్రి దొంగచాటుగా మంగళవారం అధికారులను పిలిపించుకుని రివ్యూ చేయడం సిగ్గుచేటు. ప్రజాప్రతినిధులు లేకుండా రివ్యూ చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు వస్తే ప్రభుత్వ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయని భయపడుతున్నారు. జిల్లా అభివృద్ధిపై మంత్రికి చిత్తశుద్ది ఉంటే ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో రివ్యూ సమావేశం నిర్వహించాలి. – డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే, చంద్రగిరి -
ఇసుక అక్రమ రవాణాను అరికడతాం
►అధికార పార్టీ పేరు చెప్పుకుని కొందరు ఇసుక రవాణా ►అరెస్ట్ చేస్తాం..మళ్లీ రవాణా చేస్తే పీడీయాక్ట్ ప్రయోగం ►మంత్రి అమరనాథరెడ్డి వెల్లడి ►యుద్ధప్రాతిపదికన టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు : కలెక్టర్ చిత్తూరు, ఎడ్యుకేషన్: జిల్లాలో ఇసుక అక్ర మ రవాణాను అరికడతామని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టరేట్లో రెవె న్యూ, పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ, ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసు, రవాణాశాఖ అధి కారులు సంయుక్తంగా పని చేయాలని కోరారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసు క అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, ఇసుక అక్రమంగా తరలించే వారిని అరెస్టు చేయిస్తామని, తరువాత అదే తప్పు చేస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఎక్కువగా ఇసుక తరలించే ప్రాంతాలను గుర్తించి జాబితా తయారు చేయాలని తహసీల్దార్లకు సూచిం చారు. జేసీ గిరీషా, సబ్కలెక్టర్లు నిషాంత్‌కుమార్, వెట్రిసెల్వి పాల్గొన్నారు. -
ఆర్భాటంగా సైకిళ్ల పంపిణీ
►సైకిల్‌పై సీఎం స్టిక్కర్ వేసేంత వరకు పిల్లలకు ఇవ్వొద్దని హుకుం ►అరకొరగా జిల్లాకు వచ్చిన సైకిళ్లు చిత్తూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో సేవలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బడికొస్తా... అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్ కళాశాల ప్రాంగణంలో అమరనాథరెడ్డి చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పరిధిలో ఉన్న జెడ్పీ, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివిన బాలికలకు బడికొస్తా పథకం కింద సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కటారి హేమలత, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, రాజసింహులు, ఇన్చార్జ్ డీఈవో శామ్యూల్, చిత్తూరు డీవైఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం బొమ్మ వేసేంత వరకు ఇవ్వొద్దు పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కార్యక్రమంలో గొప్పలు చెప్పిన మంత్రి, కార్యక్రమం ముగిశాక సైకిళ్లపై సీఎం బొమ్మ వేసిన తరువాత విద్యార్థినులకు ఇవ్వాలని హుకుం జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. సైకిళ్లపై సీఎం బొమ్మ లేదని తెలిసినప్పటికీ మంత్రి ఎందుకు పంపిణీ కార్యక్రమం చేపట్టారని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 16,722 మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. అయితే ఆ విద్యార్థినులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి జిల్లాకు 16,100 సైకిళ్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 622 సైకిళ్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం సైకిళ్లను సరఫరా చేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కంపెనీ జిల్లాకు మొత్తం సైకిళ్లను ఇచ్చేశామని చెప్పి తప్పించుకున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసింది. పూర్తి స్థాయిలో జిల్లాకు సైకిళ్లు చేరకపోయినా టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజల మెప్పు పొందడానికి పలు చోట్ల ప్రారంభ కార్యక్రమాలు హడావిడిగా చేపట్టారు. మిగిలిన సైకిళ్లను విద్యార్థినులకు ఎలా అందజేయాలో తెలియక విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మంత్రి అమర్నాథ్ రెడ్డి జిల్లా పర్యటన
చిత్తూరు(రూరల్): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7న ఉదయం 9 గంటలకు తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారని తెలిపారు. అనంతరం తిరుపతి నుంచి బయల్దేరి చంద్రగిరి, నేండ్రగుంట మీదుగా చిత్తూరుకు చేరుకుంటారని, పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను కలుస్తారన్నారు. 8న బి.కొత్తకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.