‘చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు’ | AP Minister Gudivada Amarnath Criticizes the Opposition | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు’

Published Fri, Jul 22 2022 11:06 AM | Last Updated on Fri, Jul 22 2022 11:18 AM

AP Minister Gudivada Amarnath Criticizes the Opposition - Sakshi

తిరుమల: విశాఖ, విజయవాడ, తిరుపతికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖకు ఇన్ఫోసిస్‌ తరహా కంపెనీలు రానున్నాయని తెలిపారు. రాష్ట విభజన అనంతరం అందరూ ఏపీని హైదరాబాద్‌తో పోలుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్న అమర్‌నాథ్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రచారం కోసం మాత్రమే పాకులాడతారని ఎద్దేవా చేశారు. 

వరద ముంపు ప్రాంతాల్లో ఆరుగురు మంత్రులు, అధికారులు, ఎస్పీలు, వలంటీర్లు ఉన్నారని తెలిపారు. వరదల కారణంగా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించలేదు అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. 

ఇదీ చూడండి: వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement